ఆలూరు భుజంగరావు (Aluru Bhujangarao)

Share
పేరు (ఆంగ్లం)Aluru Bhujangarao
పేరు (తెలుగు)ఆలూరు భుజంగరావు
కలం పేరు
తల్లిపేరుసీతారామమ్మ
తండ్రి పేరువెంకటప్పయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1928
మరణం
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర కొండముది
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీ యశ్ పాల్ గారు రచించిన – అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాథ ‘సింహావలోకన్’నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆలూరు భుజంగరావు
సంగ్రహ నమూనా రచన

ఆలూరు భుజంగరావు

ఆలూరు భుజంగ రావు విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత మరియు అనువాదకుడు.
ఆయన 1928లో గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర కొండముది గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి సీతారామమ్మ తండ్రి వెంకటప్పయ్య. ఆయన జీవితం ఎక్కువగా తెనాలి, గుడివాడలలోసాగింది. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పనిచేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన – అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాథ ‘సింహావలోకన్’నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు రాహుల్ సాహిత్య సదనమును స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, సుఖదేవ్ వంటి మరెంతమందో దేశభక్తులతో కలసి పనిచేసినటువంటి యశ్ పాల్ రచించిన – అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాథ ‘సింహావలోకన్’నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు. శ్రీ యశ్ పాల్ గారు రాసిన స్వతంత్ర పోరాటంలోని అనుభవాల సంపుటి. వీరు భగత్ సింగ్ అరెస్ట్ కాబడిన తరువాత, ఆజాద్ ను పోలీసులు పార్కులో కాల్చి చంపిన తరువాత, వీరు అరెస్ట్ అయ్యేంతవరకు హి.స.ప్ర.సకు అధ్యక్షులిగా పనిచేసారు.విడుదల అయ్యాక కూడా స్వతంత్ర భారతంలో రాజకీయల్లో ఉన్నారు. పోరాటంలో వీరి అనుభవాల, సిధ్ధాంతాల సంపుటే సింహావలోకన్.
వీరు గాంధీ వాదం – శవపరీక్ష అనే పుస్తకం కూడా రాశారు. ఇది కమ్యూనిస్టు కోణంలో ఇమడని గాంధేయవాదంపై విమర్శనాత్మక పుస్తకంఆయన పారదర్శి, పెద్దన్న, చక్రధర్‌, జనార్దన్‌ కలం పేర్లతో పలు రచనలు చేసారు.20 కి పైగా కథలు రాసారు. ఆయన కథలు అరణ్యపర్వం పేరిట కథా సంకలనంగా వచ్చాయి.కొండవాగు, ప్రజలు అజేయులు, నైనా, గమనాగమనం, దిక్కుమొక్కులేని జనం తదితర నవలలు రాసారు. సాహిత్యబాటసారి పేర శారద జీవిత చరిత్రను రాశారు.
రాహుల్‌ సాంకృత్యాయన్‌ ( విస్మృత యాత్రికుడు, ప్రక్పశ్చిమ దర్శనాలు, దర్శన్‌ దిగ్‌ దర్శన్‌, దివోదాసు, వైజ్ఞానిక గతితార్కిక భౌతిక వాదం ), ప్రేమ్‌ చంద్‌ ( రంగ భూమి, గబన్‌ ), కిషన్‌ చందర్‌ (వాయు గుండం, పరాజయం ) రచనలను, సరోజ్‌ దత్తా, యశ్‌ పాల్‌ రచనలను హిందీ నుంచి తెలుగు లోకి అనువదించారు.తెలుగు నుంచి హిందీ లోకి రాగో, అతడు, నేలతల్లి విముక్తి కోసం, బొగ్గు పొరల్లో, దండకారణ్య అమరవీరులు తదితర నవలలు, పుస్తకాలను అనువదించారు.
ప్రభాత్‌ అనే హిందీ పత్రికను 6 సంవత్సరాలు నిర్వహించారు. జూన్ 20, 2013 న కన్ను మూశారు.

———–

You may also like...