గబ్బిట వెంకటరావు (Gabbita Venkatarao)

Share
పేరు (ఆంగ్లం)Gabbita Venkatarao
పేరు (తెలుగు)గబ్బిట వెంకటరావు
కలం పేరు
తల్లిపేరులక్ష్మీ నరసమ్మ
తండ్రి పేరుదక్షిణామూర్తి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/15/1928
మరణం10/11/1997
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగబ్బిట వెంకటరావు
సంగ్రహ నమూనా రచన

గబ్బిట వెంకటరావు

గబ్బిట వెంకటరావు ప్రముఖ రంగస్థల, సినిమా రచయిత. ఈయన దక్షిణామూర్తి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1928, మార్చి 15 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి.
సీనియర్ సముద్రాల, జగ్గయ్య ల ప్రేరణతో సినీ రంగప్రవేశం చేసి బాపు గారి కోరికపై శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రానికి కథామాటలు పాటలు పద్యాలు స్క్రీన్ ప్లే రాశారు. ఎన్.టి.రామారావు నటించిన బొబ్బిలి యుద్ధం, మాయా మశ్చీంద్ర చిత్రాలకు స్క్రీన్ ప్లే కథ మాటలు రాశారు. బి.ఏ. సుబ్బారావు దర్శకత్వం చేసిన మోహినీ భస్మాసురకూ సంభాషణలు రాశారు. శ్రీమద్భగవద్గీత లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిచే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కథా, పాటలు, సంభాషణలు, పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .
ఒరియా భాషలో సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు. మలయాళ చిత్రాన్ని కొండవీటి మొనగాడుగా అనువాదం చేశారు, భక్త అంబరీష మాటలు సమకూర్చారు.
వెంకటరావు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే హనుమద్రామ సంగ్రామం అనే నాటకం రాశారు. అల్లూరి సీతారామ రాజు, మనోహర, వరూధిని వంటి ప్రసిద్ధ నాటకాలు రాశారు.

———–

You may also like...