పేరు (ఆంగ్లం) | Ilapavuluri Pandurangarao |
పేరు (తెలుగు) | ఇలపావులూరి పాండురంగారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 03/15/1930 |
మరణం | 12/25/2011 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అనుదిన రామాయణము, ఆది-అనాది, కామాయని (హిందీ నుండి అనువాదం), చిదంబర (హిందీ నుండి అనువాదం), కన్నీరు (హిందీ కవి జయశంకర ప్రసాద్ రాసిన ఆఁసూ కావ్యానికి అనువాదం), మెట్టుకు పై మెట్టు (తకళి శివశంకరపిళ్ళై మలయాళ నవలకు అనువాదం), సహస్రధార, శ్రీ సహస్రిక ఆత్మానందలహరి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఇలపావులూరి పాండురంగారావు |
సంగ్రహ నమూనా రచన | – |
ఇలపావులూరి పాండురంగారావు
ఇలపావులూరి పాండురంగారావు శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.
ఇతడు ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, ఇలపావులూరు గ్రామంలో 1930, మార్చి 15వ తేదీన సరస్వతి, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. బి.ఇడి చదివాడు. ఇలపావులూరు గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా కొన్ని రోజులు పనిచేశాడు. హిందీ భాషా సాహిత్యాంశాలలో డాక్టరేటు సాధించి రాజమండ్రిలో హిందీ లెక్చరరుగా పనిచేశాడు. భారత భాషా పరిషత్, యు.పి.ఎస్.సి, భారతీయ జ్ఞానపీఠ్కు డైరెక్టరుగా పనిచేశాడు. ఇతనికి సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడు హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు.సంస్కృతం నుండి ఈశ్, కేన, మాండూక్య, ఐతరేయ, కఠోపనిషత్తులను తెలుగులోనికి గేయాలుగా తర్జుమా చేశాడు. త్యాగరాజకీర్తనలను హిందీలో గేయరూపంలో అనువదించాడు. బలివాడ కాంతారావు నవల ఇదే స్వర్గం, ఇదే నరకం రంగనాయకమ్మ నవల పేకమేడలు మొదలైనవాటిని హిందీలోనికి అనువాదం చేశాడు. ఇతడు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతూ తన 81 యేట 2011, డిసెంబర్ 25న మరణించాడు.
———–