ఇచ్ఛాపురపు జగన్నాథరావు (Ichchapurapu Jagannatharao)

Share
పేరు (ఆంగ్లం)Ichchapurapu Jagannatharao
పేరు (తెలుగు)ఇచ్ఛాపురపు జగన్నాథరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1931
మరణం12/13/2017
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆకులురాలేకాలం, ఎదురద్దాలు, చేదుకూడా ఒక రుచే,
ప్రేమించిన మనిషి, వానజల్లు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఇచ్ఛాపురపు జగన్నాథరావు
సంగ్రహ నమూనా రచన

ఇచ్ఛాపురపు జగన్నాథరావు

ఇచ్ఛాపురపు జగన్నాథరావు విశాఖపట్నంలో 1931, అక్టోబరు 19వ తేదీన జన్మించాడు. ఇతడు 1955లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (ఆర్థిక శాస్త్రం)లో ఎంఏ బంగారు పతకం సాధించాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగంలో చేరాడు. విద్యార్థి దశ నుంచే కథలు రాయడం ప్రారంభించాడు. జగన్నాథరావు రచించిన కథానికలు, నవలలు, నాటికలు మొత్తం 13 సంపుటాలుగా వెలువడినాయి. ఆంధ్రజ్యోత్తి, ఆంధ్రభూమి పత్రికల్లో వీక్లీ కాలమ్స్‌ వ్రాశాడు. కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించాడు. సాహిత్య అకాడమీ ముద్రించిన ‘కథాసాగర్‌’ (హిందీ), ‘60 ఏళ్ల కథానికలు’లో ఇతని రచనలు ప్రచురితమయ్యాయి. ఎగువ మధ్య తరగతి కుటుంబాల జీవన చిత్రాలను కథీకరించడంలో అందె వేసిన చెయ్యిగా ఇతడు పేరు సంపాదించాడు. కస్టమ్స్‌, అబ్కారీ శాఖ కలెక్టర్‌గా, కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టిన జగన్నాథరావు 1991లో ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారాన్ని అందుకున్నాడు. జగన్నాథరావు రాసిన కొన్ని కథలతో ‘వానజల్లు’ అనే కథా సంపుటి వెలువడింది.

———–

You may also like...