కోవెల సంపత్కుమారాచార్య (Kovela Sampatkumaaracharya)

Share
పేరు (ఆంగ్లం)Kovela Sampatkumaracharya
పేరు (తెలుగు)కోవెల సంపత్కుమారాచార్య
కలం పేరు
తల్లిపేరుచూడమ్మ
తండ్రి పేరుకోవెల రంగాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ06/26/1933
మరణం08/10/2010
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుహృద్గీత (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి), ఆనందలహరి (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి), అపర్ణ (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి), లక్షణదీపిక (సులభ వ్యాకరణ గ్రంథం), ఛందోవికాసము, మధురగాథలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకోవెల సంపత్కుమారాచార్య
సంగ్రహ నమూనా రచన

కోవెల సంపత్కుమారాచార్య

కోవెల సంపత్కుమారాచార్య 1933, జూన్ 26వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.
బాల్యంలోనే ఇతడు తండ్రి దగ్గర వైష్ణవాగమాలను నేర్చుకుంటూనే వరంగల్లులోని సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా వరంగల్లులో జరిగింది. 1949-53 సంవత్సరాల మధ్య బందరు చిట్టిగూడూరు నారసింహ సాంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.
ఇతడు తన పదమూడవ యేటే సోదరుని కుమారుడు ఇంచుమించు సమవయస్కుడు అయిన కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించాడు. 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. ఇతడు వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను, నాటికలను ఎన్నో వ్రాశాడు. ‘మరుగునపడిన మన పండితులు’ పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశాడు.

———–

You may also like...