మహీధర నళినీ మోహన్ (Mahidhara Nalini Mohan)

Share
పేరు (ఆంగ్లం)Mahidhara Nalini Mohan
పేరు (తెలుగు)మహీధర నళినీ మోహన్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
మహీధర రామమోహనరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1933
మరణం10/21/2003
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువైజ్ఞానికం, నిప్పు కథ, టెలిగ్రాఫు కథ, టెలిఫోను కథ,
పిడుగు దేవర కథ. రాకెట్టు కథ, గ్రహణాల కథ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

మహీధర నళినీ మోహన్

మహీధర నళినీ మోహన్ ఒక ప్రముఖ రచయిత. ఈయన పాపులర్ సైన్స్ రచనలు రాయడంలో ప్రసిద్ధుడు. తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందికైన పదాల్లో సామాన్యుల భాషలో రాయడంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు మహీధర రామమోహనరావు ఈయన తండ్రి. బహు గ్రంథకర్త అయిన మహీధర జగన్మోహనరావు ఈయన పినతండ్రి. పదిహేనవ ఏటనుండి కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానంలో దరిదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలూ వగైరా 10 పుస్తకాల వరకూ వ్రాశాడు. వివిధ పత్రికలలో ఇతని రచనలు దాదాపు 1,000 పైగానే ప్రచురితం అయి ఉంటాయి. 1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని, 1987లో ఇందిరా గాంధీ విజ్ఞాన బహుమతిని అందుకున్నాడు. కొన్నాళ్ళు ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడి అక్టోబరు 2005లో మరణించాడు.
ఈయన 1933వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జన్మించాడు. భారత స్వతంత్ర సమరంలో ఆయన కుటుంబం నుంచి ముగ్గురు కారాగారానికి వెళ్ళారు. ఆ ఇంట్లో మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలు జరుతుండేవి. పండితుల కుటుంబమే అయినా ఛాందసవాదాన్ని వెలివేసిన సాంప్రదాయం వారిది. 1953లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి బీయస్సీ పూర్తిచేసాడు. 1955లో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి భౌతికశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తిచేసాడు. 1960-63 మధ్య మాస్కో విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు. 1969-71 మధ్య కాలంలో స్వీడన్‌లో అయనోస్ఫెరిక్ (అయనావరణ) అబ్జర్వేటరీలోని రాకెట్ పేలోడ్ నిర్మాణ విభాగంలో పరిశోధనలు చేసాడు. 1974-75 మధ్య కాలంలో బల్గేరియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌కు అతిధిగా వెళ్ళాడు. 1981-82లో ఇంగ్లండులోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్‌లో పరిశోధన చేసాడు. తరువాత ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాలలో అంతరిక్ష పరిశోధనలు చేసాడు.

———–

You may also like...