వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు (Vasili Venkata Lakshmi Narasimharao)

Share
పేరు (ఆంగ్లం)Vasili Venkata Lakshmi Narasimharao
పేరు (తెలుగు)వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుకోటిలింగం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/10/1930
మరణం10/13/2013
పుట్టిన ఊరుగుంటూరు జిల్లాలోని చేబ్రోలు పట్టణం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపద్యకావ్యాలు : ఆనందభిక్షువు – విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతుల ప్రశంసలు పొందిన గ్రంథం, అంతర్వాణి
విమర్శ గ్రంథాలు : నన్నయ కవిత్వం: అక్షరరమ్యత (సిద్ధాంత గ్రంథం), వసుచరిత్ర తత్త్వం, వినరాసుమతి
నవలలు : రాగబంధాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు
సంగ్రహ నమూనా రచన

వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు

వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు ప్రసిద్ధ కవి, పరిశోధకుడు. ఇతడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు పట్టణంలో 1930, జూలై 10వ తేదీన వాసిలి వేంకటసుబ్బమ్మ, కోటిలింగం దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఇతని 9వయేట మరణించగా ఇతని బావ మేడూరి గోవిందాచార్యులు ఇతడిని పెంచి పెద్ద చేశాడు. కొర్నెపాటి శేషగిరిరావు వద్ద ఆంధ్రాంగ్ల విద్యలు నేర్చుకున్నాడు. చేబ్రోలులోని సూర్యదేవర నరసయ్య ఉన్నత పాఠశాలలో 1942-44ల మధ్య మాధ్యమికోన్నత విద్యను, తెనాలిలోని హైస్కూలులో 1944-47ల మధ్య ఉన్నత పాఠశాలావిద్యను కొనసాగించాడు. 1947-49 సంవత్సరాల మధ్య గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం అభిమాన విషయాలుగా ఇంటర్మీడియట్ చదివాడు. 1951-54 మధ్య మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు భాషాసాహిత్యాలు అభిమాన విషయాలుగా బి.ఎ.(ఆనర్స్) చదివాడు. 1956లో ఎం.ఎ. డిగ్రీ పుచ్చుకున్నాడు. 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి జీరెడ్డి చెన్నారెడ్డి పర్యవేక్షణలో నన్నయ కవిత్వం: అక్షర రమ్యత అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించి పి.హెచ్.డి. పట్టాను గైకొన్నాడు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణుడైన తర్వాత ఇతడు 1949లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గుమాస్తాగా చేరాడు. స్వల్పకాలంలోనే ప్రత్యేక రెవెన్యూ అధికారిగా పదోన్నతిని పొందాడు. తరువాత ఉద్యోగాన్ని వదలి మద్రాసులో బి.ఎ. కోర్సులో చేరాడు. ఎం.ఎ ఉత్తీర్ణుడైన తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి, కాకినాడ, రాజమండ్రి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయవాడ ప్రభుత్వ కళాశాలలలో ఉపన్యాసకుడిగాను, తెలుగు శాఖ అధ్యక్షుడిగాను ఉద్యోగం చేశాడు. 1979లో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొంది రాయచోటి, మాచర్లలోపనిచేశాడు. 1981 నుండి 1989 వరకు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజ్యాభిలేఖాగారములో డైరెక్టర్‌గా పనిచేశాడు. 1988 నుండి 1992 వరకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రచురణాధికారిగా పనిచేశాడు. అదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం తలపెట్టిన విజ్ఞానసర్వస్వ ఆంధ్రాంగ్ల సంపుటుల సంకలనకర్తగా వ్యవహరించాడు. 1992-93లో బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్యానెల్ చైర్మన్‌ పదవి నిర్వహించాడు. 1993-94లో తెలుగు అకాడెమీవారి తెలుగు పాఠ్యపుస్తకాలకు, నిఘంటువులు మరియు ఇతర ప్రామాణిక గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు. 1994-1999ల మధ్య కేంద్ర మానవ వనరుల శాఖకు సంబంధించిన జాతీయ సార్వత్రిక విద్యాలయ రీజనల్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ సిబ్బందికి అధికార భాషారచనకు ప్రత్యేక శిక్షకుడిగా కొంతకాలం వ్యవహరించాడు. 1999-2002ల మధ్య అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ భాషానిపుణుడిగా ఉద్యోగించాడు.

———–

You may also like...