దూర్వాసుల కామేశ్వరి (D.Kameshwari)

Share
పేరు (ఆంగ్లం)D.Kameshwari
పేరు (తెలుగు)దూర్వాసుల కామేశ్వరి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుడి.వి.నరసింహం
పుట్టినతేదీ08/22/1935
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునవలలు : కొత్తనీరు, కొత్తమలుపు, కోరికలే గుర్రాలైతే, ఎండమావులు
కథాసంపుటాలు : వానచినుకులు, కాదేదీ కథ కనర్హం, డి కామేశ్వరి కథలు, కాలాన్ని వెనక్కు తిప్పకు, మధుపం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదూర్వాసుల కామేశ్వరి
సంగ్రహ నమూనా రచన

దూర్వాసుల కామేశ్వరి

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల న్యాయం కావాలి సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
ఈమె 1935, ఆగష్టు 22వ తేదీన కాకినాడలో జన్మించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్ళి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
1962లో ఆంధ్రపత్రికలో ‘వనితలు వస్త్రాలు’ అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు – ఆకాకరకాయలు అనే కథ ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. ఈమె కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళభాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులువచ్చాయి.

———–

You may also like...