పేరు (ఆంగ్లం) | Narishetty Innayya |
పేరు (తెలుగు) | నరిశెట్టి ఇన్నయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1937, అక్టోబరు 31 |
మరణం | – |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా చేబ్రోలు |
విద్యార్హతలు | – |
వృత్తి | సంపాదకులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | www.http://innaiahn@tripod.com |
స్వీయ రచనలు | రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973 ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985 వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నరిశెట్టి ఇన్నయ్య |
సంగ్రహ నమూనా రచన | – |
నరిశెట్టి ఇన్నయ్య
నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31 న గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించాడు. తెలుగులో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు మరియు కొన్ని అనువాదాలు చేశాడు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్ రచనలు అనువదించాడు. తెలుగు అకాడమీవీటిని ప్రచురించింది. ఇతడు హేతువాది. తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.
ఇన్నయ్య ఉన్నత పాఠశాలలో చదువుతుండగా, వారి నాన్న రాజయ్య ఆంధ్రప్రభ, భారతి తెప్పించేవాడు. మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళు. అప్పట్లో అన్నా ప్రగడకామేశ్వరరావు గారి అంకుశం, బండి బుచ్చయ్య గారి ములుకోల, సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి తెలుగుదేశం, వాహిని చదువుతుండే వాడు. రాజకీయ హడావుడి ఎక్కువగా ఉండేది. తెనాలినుండి జ్యోతి పక్షపత్రిక, రేరాణి, అభిసారిక వచ్చేవి. ధనికొండ హనుమంతరావు సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకున్నది. మద్రాసు నుండి తెలుగు స్వతంత్ర వచ్చేది. ఆ విధంగా ఉన్నత పాఠశాలలోనే వివిధ పత్రికలు చదువుతుండడం వలన, ఆయన ప్రజావాణిలో వ్రాయడానికి అలవాటుపడ్డాడు.
ఇన్నయ్య విద్యాభ్యాసం చేస్తున్నపుడు అనగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రజావాణిలో ఉద్యోగంలో చేరాడు.1954 నుండి పదేళ్ళ పాటు “ప్రజావాణి”కి రాశాడు. అనేక అనువాదాలు కూడా చేశాడు. ఇన్నయ్య సోదరుడు విజయరాజకుమార్ కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా 1954లో కాలేజీ చదువు ఒక సంవత్సరం వాయిదా వేసుకుని ఇంటి పోషణకు ప్రజావాణిలో ఉద్యోగం చెయ్యవలసి వచ్చింది. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మధ్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగం చేశాడు. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళు. ఇన్నయ్య తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. ఇన్నయ్య ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాడు. అయినా వారి అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ ప్రజావాణిలో ఉద్యోగం చేశాడు. అప్పుడు రచయితలతో, రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో ఉండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. మద్దుకూరి చంద్రశేఖరరావు వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.[1]
ఆయన అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో ఉండడం వలన, ఆయనకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై ఆయన అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాడు. అయినా రచనలు మానలేదు. ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాడు. 1964 వరకూ రాశారు. తరువాత ప్రజావాణికి మానేశాడు. వట్టి కొండ రంగయ్య కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశాడు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే ఎం.ఎన్.రాయ్ వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాడు. ఆయన రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య ప్రచురించి ఆయన్ని ప్రోత్సహించాడు.
తస్లిమా నస్రీన్ పై హైదరాబాదు మజ్లిస్ పార్టీకి చెందిన వారు చేసిన దాడిలో ఈయన కూడా గాయపడ్డాడు.
———–