పేరు (ఆంగ్లం) | Velcheru Narayanarao |
పేరు (తెలుగు) | వెల్చేరు నారాయణరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నారాయణ రావు కథలు: 1965, చిన్న కథలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వెల్చేరు నారాయణరావు |
సంగ్రహ నమూనా రచన | – |
నమూనా రచన లంకె | – |
వెల్చేరు నారాయణరావు
వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటిషు యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు.
వెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని పొందాడు.ఆయన తొలి విమర్శా గ్రంథమైన “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం”లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించాడు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తాడు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి అనేవి ఈ గ్రంథంలోని అంశాలకు స్థూలమైన సారాంశం. ఈ గ్రంథంలోని విషయ విస్తరణ 20వ శతాబ్దిలోని కవిత్వ విప్లవాలపై ఎక్కువ ఆధారపడిందన్న ప్రముఖ విమర్శకులు కె.వి.ఎస్.రామారావు తదనంతర పరిశోధనల్లో ఆ లోపం పూరిస్తూ పూర్వసాహిత్యాన్ని నారాయణరావు కొత్త కోణంలో పరామర్శించాడు అన్నాడు. ఈ కోణంలో నారాయణరావు గ్రంథాలను విశ్లేషిస్తూ కె.వి.ఎస్.రామారావు శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం మీద జరిగిన పరిశోధనలు బహుశా ప్రబంధ విప్లవానికి ఒక ముఖ్య కారణం అప్పటి సమాజంలో ఊపిరిపోసుకుంటున్న “ఆధునికతా” భావనలు కావొచ్చునని ప్రతిపాదిస్తాయి. నాయకరాజుల కాలంనాటి కవిత్వం గురించిన శోధనలు ప్రబంధ సాహిత్యం అంతా ఒకే మూస లోది కాదని, దానిలోనూ అనేక “చిరువిప్లవాలు” ఉండొచ్చునని చూపే ప్రయత్నంగా చూడొచ్చు. ఇలా, స్థూల వర్గీకరణతో ప్రారంభమైన నారా సుదీర్ఘ ప్రయాణం ఒక్కో స్థూలాంశాన్ని దాని సూక్ష్మ విభాగాలుగా విడదీసి ఒక్కో సూక్ష్మాంశానికున్న ప్రత్యేకతల్ని గుర్తిస్తూ, అది దాని స్థూల మాతృకలోని ఇతర సూక్ష్మాంశాలతో ఎలా సంబంధితమైందో వివరించే నిరంతరాయ ప్రయత్నాల సముదాయంగా నారాయణరావు సాహిత్యాన్ని అభివర్ణిస్తాడు. ప్రతీ రచనకు నిర్దుష్టమైన రచయిత, ఒకే శుద్ధమైన పాఠం ఉంటుందని భావిస్తూ చేస్తున్న పరిశోధనల మూలాలను నారాయణరావు ప్రశ్నిస్తాడు. అటువంటి పరిశోధనలు, వాటికి మూలమైన అవగాహన వలసవాద భావజాలంలో భాగమే తప్ప నిజానికి అవి భారతీయ సాహిత్య క్రమానికి ఉపయోగపడవని ఆయన సిద్ధాంతీకరించాడు. ఈ క్రమంలో వలసవాద భావజాల ప్రభావిత విమర్శకులకు కొరుకుడు పడని చాటువులను ఎంచుకుని ప్రామాణిక పరిశోధన వ్యాసాలు, పుస్తకాలు రచించాడు. ముఖ్యంగా “పొయెం ఎట్ ద రైట్ మూముంట్” గ్రంథంలో చాటు సాహిత్యంలోని వివిధ అంశాలను సవివరంగా చర్చించాడు.
ఆసక్తికరమైన కొన్ని పరిశోధనాంశాలు
- నాయకరాజుల కాలాన్ని ఆనాటి శృంగార కావ్యాల కారణంగా తెలుగు సాహిత్య విమర్శకులు “క్షీణయుగం”గా ముద్రవేశాడు. బ్రిటీష్ కాలంలో ఆనాటి కావ్యాలపై నిషేధం కూడా విధించాడు. ఈ నేపథ్యంలో నారాయణరావు “సింబల్స్ ఆఫ్ సబ్స్టెన్స్” గ్రంథంలో అటువంటి కాలాన్ని ఎంచుకుని చేసిన పరిశోధనల్లో ఆనాటి సాహిత్యం భూ కేంద్రక వ్యవస్థ నుంచి ధన కేంద్రక వ్యవస్థగా మారుతున్న క్రమంలో తయారైన కొత్త విలువల ఫలితంగా నిరూపిస్తాడు.
- గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని ప్రధానస్రవంతిలోని సాహిత్య విమర్శకులు కుళ్లిపోయిన సమాజాన్ని, సమాజాన్ని బాగుజేయడానికి వచ్చిన సంస్కరణల్నీ చిత్రించినట్టుగా విశ్లేషించాడు. నారాయణరావు ఈ ధోరణికి పూర్తి భిన్నంగా నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం అప్పారావు గారి దృష్టి భిన్నమైంది. ఆయన ఈ నాటకంలో చిత్రించిన సమాజం కుళ్లిపోయింది కాదు, చక్కగా హాయిగా వున్నది. అంతేకాదు, ‘ఆధునిక’మైంది కూడ. ఈ ఆధునికత వలససంస్కృతి వల్ల కలిగిన ఆధునికత కాదు, అంతకుముందు ఎప్పటినుంచో వస్తూ వున్న ఆధునికత. ఇందులో మనుషులు సంప్రదాయాల భారంతో కుంగిపోతున్నవారు కారు, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా, తమకు ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఆచరిస్తున్న వాళ్లు. అప్పారావు గారు చిత్రించిన ‘కన్యాశుల్కం’లో ఈ రెండురకాల ఆధునికతల మధ్య సంఘర్షణని చూస్తాం. వలససంస్కృతి ఆధునికతకి ప్రతినిథిగా సౌజన్యారావు పంతులు నిలబడితే, పరిణామ ఆధునికతని మధురవాణిలో స్పష్టంగా చూస్తాం. అవసరాన్ని బట్టి అటూ ఇటూ దూకే గోడమీది పిల్లిగా గిరీశం నిలబడతాడు. దాదాపుగా మిగిలిన అన్ని పాత్రలు కూడ ఆ సంధికాలానికి అనుగుణంగా పరిణమిస్తున్నవే, జీవనప్రయాణం చేస్తున్నవే. వలససంస్కృతి మీద ఇలాటి ఎదురుదాడి చేసిన రచయితలు ఆ కాలంలో అప్పారావు గారు తప్ప మరొకరు లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచసాహిత్యంలో ఎక్కడా ఇలా జరగలేదని నారాయణ రావు గారి సిద్ధాంతం.
- పింగళి సూరన సొంతంగా అల్లి, కావ్యజగత్తుకూ వాస్తవ జగత్తుకూ అద్భుతమైన సంబంధాన్ని ప్రతిపాదించిన కావ్యం “కళాపూర్ణోదయం”. నారాయణరావు “ద సౌండ్ ఆఫ్ ద కిస్”గా కళాపూర్ణోదయం అనువదించి మిగిలిన రచనలమల్లేనే దీన్లో కూడ లోతైన విశ్లేషణలతో, అనిదంపూర్వమైన ఆలోచనల్తో కూడిన ఒక పరిశోధనా వ్యాసాన్ని జతచేశాడు. కూలంకషంగా పరిశోధించిన నారాయణ రావు, షుల్మన్ గార్లు కళాపూర్ణోదయాన్ని దక్షిణాసియాలో వచ్చిన తొలి నవలగా నిరూపిస్తారీ The sound of the kiss అన్న గ్రంథంలో. ఒక నవలకుండవలసిన లక్షణాలు స్పష్టంగా ఇందులో ఉన్నట్టు చూపిస్తాడు.
———–