పేరు (ఆంగ్లం) | Iramgamti Venkata Sesha Achutavalli |
పేరు (తెలుగు) | ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి |
కలం పేరు | – |
తల్లిపేరు | అంజమ్మ |
తండ్రి పేరు | వెంకట గోవిందాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | రాఘవాచారి |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, దొంతవరం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నవలలు : ఇదెక్కడిన్యాయం -1977, ప్రేమగండం -1981, కొడిగట్టినదీపాలు – 1970, సీతకలలు – 1978, పుట్టిల్లు -1961 కథాసంపుటాలు : నాగావళి నవ్వింది, మనస్తత్వాలు, మూగపోయిన ప్రకృతి, బాత్ ఏక్ రాత్ కీ, అచ్యుతవల్లి కథలు, అవ్యక్తాలు కథలు : అందని లోతులు, అక్రూరుడు, అగ్ని, అబ్ తరీ, అభిశంస |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | గృహలక్ష్మి స్వర్ణకంకణం – 1970 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అవార్డు (ఉత్తమ కథారచయిత్రి) -1977 సుశీలా నారాయణరెడ్డి అవార్డు – 1995 తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం -1994,2000 వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి |
సంగ్రహ నమూనా రచన | – |
ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి
ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి 1943 మే 1 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, దొంతవరంలో జన్మించింది. తల్లి అంజమ్మ, తండ్రి వెంకటగోవిందాచార్యులు. పుట్టిన ఊరిలో పాఠశాల లేని కారణంగా ఈమె విద్యాభ్యాసం కాకినాడలో మాతామహుల ఇంట్లో కొనసాగింది. పిఠాపురం రాజా హైస్కూల్లోను, కాకినాడ కళాశాలలోను విద్యనభ్యసించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టాపొందింది. దక్షిణభారత హిందీ ప్రచారసభ నిర్వహించే పరీక్షలలో విశారద ఉత్తీర్ణత పొందింది. సంస్కృతంలో దక్షిణ భాషా ప్రచారం వారి సమర్థ విశారద పాస్ (బి.ఎ.) అయ్యింది. కర్ణాటక గాత్ర సంగీతంలో డిప్లమో చేసింది. ఆకాశవాణిలో 1960-62 ప్రాంతాలలో బి.గ్రేడు కళాకారిణిగా లలితగీతాలు పాడింది. ఈమెకు 1964లో తన 21 యేట వివాహం జరిగింది. భర్త ఉద్యోగరీత్యా కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో నివసించి చివరకు పెంటపాడులో స్థిరపడింది. 2010లో మరణించింది.
ఈమె 8 కథాసంకలనాలు, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది. మొదటి రచన ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రమదావనం శీర్షికలో ప్రచురింపబడిన ఇంటి శుభ్రత అనే వ్యాసం. 1958లో జగతి పత్రికలో తొలికథ వంచిత ప్రచురింపబడింది. 1961లో మొట్టమొదటి నవల పుట్టిల్లు ప్రచురితమైనది. వివాహం కాకముందు కె.వి.ఎస్.ఆచ్యుతవల్లి పేరుతోను, రాఘవేంద్ర కలంపేరుతోను రచనలు చేసింది. ఈమె రచనలు పలు భాషలలో తర్జుమా అయ్యాయి. ఇదెక్కడి న్యాయం నవల తెలుగుతో కలిపి 4 భాషలలో సినిమాగా తీయబడింది. జయశ్రీ మాసపత్రికలో ఆజ్ ఔర్ కల్ అనే శీర్షికను, రచన మాసపత్రికలో బాతోఁ మే ఖూనీ అనే శీర్షికను నిర్వహించింది. ఇవి కాకుండా ఎన్నో వ్యాసాలను వ్రాసింది. రేడియో ప్రసంగాలు చేసింది.
———–