సజ్జా జయదేవ్ బాబు (Sajja Jayadev Babu)

Share
పేరు (ఆంగ్లం)Sajja Jayadev Babu
పేరు (తెలుగు)సజ్జా జయదేవ్ బాబు
కలం పేరుజయదేవ్
తల్లిపేరుసజ్జా నవనీతమ్మ
తండ్రి పేరుసజ్జా ముత్యాలు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/13/1940
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“గ్లాచ్చూ మీచ్యూ”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1991: ఊర్కహోన్డె ఛార్టర్, న్నొకి-హైస్ట్, బెల్జియం-గౌరవ ప్రస్తావన
1992: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి
1993: భారత ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ అవగాహన పోటీలో ప్రథమ బహుమతి
1994: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసజ్జా జయదేవ్ బాబు
సంగ్రహ నమూనా రచన

సజ్జా జయదేవ్ బాబు

జయదేవ్ ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యంలో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఆచార్యుడిగా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీలో 1997 వరకు బోధించాడు.
ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. వారినందరిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. కార్టూన్ల సంకలనాలు, “గ్లాచ్చూ మీచ్యూ” అనే ఆత్మకథ రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. ‘నేపాళం’, ‘భూపాళం’, ‘(తాగుబోతు) బ్రహ్మం’, ‘మిస్టర్ నో’, ‘బాబాయ్-అబ్బాయ్’ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు. అంతర్జాలంలో వ్యంగ్యచిత్రాల వెబ్సైట్ లను నిర్వహించాడు. తోటి కార్టూనిస్టులను కూడా అంతర్జాలాన్ని అధునికి సాంకేతికతలను వాడటానికి ప్రోత్సహించాడు.
జయదేవ్ చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు బొమ్మల ఉపాధ్యాయుడు దగ్గర పెన్సిల్తోబొమ్మలు గీయటం నేర్చుకున్నాడు. 9వ తరగతిలో తరగతి పత్రికకు ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాయించాడు. 1957లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, జీవశాస్త్ర ఆచార్యుడు వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, ఇండియన్ ఇంక్ తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నాడు. డ్రాయింగ్ మాష్టారి
జయదేవ్ మొదటి కార్టూన్
జయదేవ్ మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక 1959లో ప్రచురితమైంది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటాడు జయదేవ్.


పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే వచ్చింది. కాని, బహిరంగ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. 1960-1970 దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే ఆటలకు (అప్పట్లో సౌకర్యవంతమైన చల్లని వాతావరణం కలిగివుండే హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్థులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్థుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ (పక్కన కనబడుతున్న కార్టూన్) సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సంఘం వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడా వాడుకుంటున్నారట. భారత వాణిజ్య ప్రదర్శన సంస్థ వారు జయదేవ్‌ను ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించారు.

———–

You may also like...