పేరు (ఆంగ్లం) | C.V. Sarveshwara Sharma |
పేరు (తెలుగు) | సి.వి.సర్వేశ్వరశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సైన్స్ గ్రిప్ (శాస్త్రీయ విజ్ఞానం పై పట్టు సాధించేందుకు), సైన్స్ సైట్ (ఆసక్తిదాయకమైన సైన్సు విశేషాలు), స్కై సైన్స్ (అకాశశాస్త్ర విజ్ఞానం), కొత్తశక్తి జనకాలు, శాస్త్రీయ విజ్ఞానంతో వ్యవసాయం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మెట్ కాఫ్ బంగారుపతకం, సి.బి.శర్మ నేషనల్ అవార్డు ఫర్ సైన్సు కమ్యూనికేషన్ అవార్డు, కోనసీమ సైన్సు పరిషత్ ద్వారా ప్రజల్లోకి సైన్సు తీసుకువెడుతున్నందుకు గుర్తింపుగా ప్రకటించిన ప్రజ్ఞా అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం -2012, గురుబ్రహ్మ పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సి.వి.సర్వేశ్వరశర్మ |
సంగ్రహ నమూనా రచన | – |
సి.వి.సర్వేశ్వరశర్మ
సి.వి.సర్వేశ్వరశర్మ (చావలి వెంకట సర్వేశ్వరశర్మ) పాపులర్ సైన్స్ రచయితగా పేరుపొందాడు. సి.వి.సర్వేశ్వరశర్మ తొలిరచన ‘అదృష్టం’ 1958 మే 16 న ప్రచురితమైంది. 1976 నుండి పాపులర్ సైన్సు రచనలపై దృష్టి సారించిన సర్వేశ్వరశర్మ వివిధ పత్రికలలో ఇప్పటికి ఆరువేల సైన్సు వ్యాసాలు మించి వ్రాశాడు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మొత్తం 101 పుస్తకాలు ఈయన రచించాడు. 1984 ఫిబ్రవరి 25న కోనసీమ సైన్సు పరిషత్‌ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా 1880 కోనసీమ సైన్సు పరిషత్ మహాసభలు నిర్వహించాడు. ఇతనికి సైన్స్ చక్రవర్తి అనే బిరుదు ఉంది. బాలల కోసం ఎన్నో సైన్సు నాటికలు, సైన్సుపాటలు, సైన్సు బుర్రకథలు, సంగీత నృత్యకథలు రచించాడు.
ఇతడు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో సుబ్బలక్ష్మి, సూర్యనారాయణ సోమయాజులు దంపతులకు సెప్టెంబరు 7, 1942 న జన్మించాడు. ఎమ్మెస్సీ (గోల్డ్ మెడలిస్టు), బి.యిడి చదివాడు. దాదాపు 40 సంవత్సరాలు కళాశాల అద్యాపకుడిగా పనిచేసి, 2000, సెప్టెంబరు 30 న అమలాపురం లోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల నుండి ఫిజిక్స్ రీడర్ (అసోసియేట్ ప్రాఫెసర్) గా పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం అమలాపురం లోనే స్థిరపడ్డాడు.
———–