పేరు (ఆంగ్లం) | Swamineena Muddunarasimham |
పేరు (తెలుగు) | స్వామినీన ముద్దు నరసింహ్మం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1810 |
మరణం | 1/1/1856 |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా ,,రాజమహేంద్ర వరం . |
విద్యార్హతలు | – |
వృత్తి | రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో సెంకండ్ క్లాసు మునసుబుగా పనిచేసారు . |
తెలిసిన ఇతర భాషలు | ఇంగ్లీష్ , |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | స్వామినీన ముద్దునరసింహం |
సంగ్రహ నమూనా రచన | తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన. |
స్వామినీన ముద్దునరసింహం
తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
తెలుగు వ్యాసప్రస్థానంలో స్వామినీన ముద్దునరసింహనాయని గారి ‘హిత సూచని’ ఒక మైలురాయి. 1862 లో అచ్చయ్యింది. రచన అంతకు ముందెప్పుడో జరిగింది. ఎందుకంటే నరసింహం గారి మరణానంతరం అచ్చుకెక్కిన పుస్తకం అది. వ్యాసం ఇందులో ప్రమేయం అనే పేరుతో ఉంది. అప్పటికింకా వ్యాసానికి వ్యాసం అనే పేరు రాలేదు.
వ్యావహారిక భాషలో వెలువడ్డ వ్యాసాలివి. ఇది తెలుగులో మొదటి వ్యాససంపుటిగా పరిగణింపబడుతోంది. ఆధునిక విద్యా విజ్ఞానాలు కలిగిన మనిషి హేతుపురస్సరంగా విద్య, వైద్యం, మంత్రం, రాక్షసులు, వివాహం మొదలైన విషయాల గురించి చేసిన ఆలోచనలు ఈ వ్యాసాలు. చరిత్ర కారులు ఈ రచనను ఆధునికత ప్రారంభరచనగా గుర్తించారు కాని ఇందులోని సాహిత్య విమర్శాంశను గుర్తించినట్టు లేదు. దీనిని ఆధునిక సాహిత్య విమర్శలో తొలి రచనగా కూడా గుర్తించవలసి ఉంది.
మనుష్యేతర జంతు సంజ్ఞాప్రమేయంలో నరసింహంగారు బంగారు ముంగిస కథను, కేకయ రాజు కథను తీసుకుని వాటిలోని సంఘటనల సాధ్యాసాధ్యాలను విశ్లేషణాత్మకంగా విచారించారు. ఆ కథల మూల లక్ష్యంగా మనం గ్రహించవలసిన విషయాలను, యథార్థాలని భ్రమించకుండా విడిచిపెట్టవలసిన విషయాలను విశదీకరించారు. జంతుజాలం మనుష్యులలాగా ఆలోచించగలదని, మనుష్యులతో మాట్లాడగలదని నమ్ముతున్న జనాన్ని ఉద్దేశించి రాసిన ప్రమేయం ఇది.
భారతంలో కనిపించే బంగారు ముంగిసకథను పరిశీలించిన పద్ధతి ఇలా ఉంది. ముందుగా కథను వివరంగా చెప్పా రు. పేద బ్రాహ్మణుడు అతని కుటుంబం తమకు తినడానికి ఏమీ లేని స్థితిలో చివరకు దొరికిన యవల పిండిని కూడా అతిథి సంతృప్తి కోసం త్యాగం చెయ్యడం, ఆ అతిధికి పాద్యం నిమిత్తం వాడిన నీటిలో తలను, ఒక పక్క శరీరాన్ని తడుపుకున్న ఒక ముంగిసకు ఆ భాగాలు బంగారంగా మారడం, తక్కిన శరీరాన్ని కూడా బంగారంగా మార్చుకోవడం కోసం ఆ ముంగిస వివిధ యాగ ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నించి విఫలం కావడం, ధర్మరాజు చేసిన అశ్వమేధం వద్ద కూడా ఫలితం పొందలేకపోవడం, ఆ ముంగిస అక్కడి విప్రులకు రాజుకు పేదబ్రాహ్మణుడి త్యాగం కన్న ఈ యాగాదులు మిన్నకావని చెప్పడం మొదలైన సంఘటనలన్నిటినీ చెప్పారు. తర్వాత ముంగిసకు మానవ భాష రావడం అసాధ్యమని, దాని శరీరం బంగారంగా మారడం కుదరని విషయమని విశ్లేషించారు ‘న్యాయానుగుణంగా ఆర్జించని సొత్తు ఎంత విస్తారముగా వ్యయము చేసినా న్యాయ కష్టార్జితము తాలూకు స్వల్ప భాగము యొక్క ధర్మముతో సమానము కానేరద’ నేది ఆ కథ నుంచి గ్రహించవలసిన నీతి అని వివరించారు.
అలాగే కేకయ రాజు కధావిమర్శ కూడా చేశారు. ఈ కథ వాస్తవంగా జరిగిందని అనేకులు నమ్ముతున్నారని, అప్పటి వాస్తవ ప్రపంచ మర్యాదకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పూర్వయుగాలలో ఇటువంటి సంగతులు జరిగి ఉన్నట్టు చెబుతున్నారని అది తప్పని రాశారు.
అంటే పురాణ కథలు కల్పిత సాహిత్యం అని, ఒక ధ్యేయంతో రచయితలు సాగించిన రచనలని అంటున్నారన్నమాట.
భారతాంతర్గతంగా ఉన్న పరీక్షిదుదంక తక్షకుల కథను మంత్రప్రమేయములో వివరంగా చర్చించారు. పరీక్షిత్తు మహారాజు చేసిన తప్పు, దానికి మునికుమారుడైన శృంగిచేత శాపానికి గురికావడం మొదలుకుని సర్పయాగ విరమణ వరకూ ఉన్న అన్ని ఘట్టాలను సంక్షిప్తంగా తెలియజేశారు. ఆ తర్వాత ఆ ఘట్టాలలోని హేతుబద్ధతను చర్చించారు. చివరగా ఆ కథ ద్వారా నేర్చుకోవలసిన నీతిని ప్రస్తావించారు. వేట ఒక వ్యసనమని అది తప్పు పనులను చేయిస్తుందని, ప్రభువైన వాడు నేరం పూర్తిగా విచారించకుండా శిక్షించడం తప్పని, తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు స్పందించడం న్యాయమని, జాతిలో ఒక్కడు తప్పుచేస్తే అది జాతి మొత్తానికి హానికరంగా పర్యవసించవచ్చునని వివరించారు. అయితే కథ కూర్పులోని అస్తవ్యస్థతలను ఉపేక్షించలేదు.
ఈ భాగంలో స్వామినీన వారు లేవనెత్తిన ప్రశ్నలు అనేకం. మచ్చుకు కొన్ని
1. తండ్రి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా తండ్రిని అవమానించాడన్నకోపంతో రాజును శపించిన శృంగి దుడుకు మనిషి. శాప ఉపసంహరణ చెయ్యమని చెప్పిన తండ్రి న్యాయబద్ధమైనకోర్కెను పాటించలేని వాడు, అటువంటి మనిషి తిట్టు అమోఘంగా ప్రవర్తించడం ఎలా సాధ్యం?
2. అతనికి ఆ సామర్థ్యం ఉన్నట్టయితే తక్షణం చనిపోయేటట్టు ఎందుకు శపించలేదు? వారం రోజుల వ్యవధి ఎందుకు ఉంచాడు?
3. భూలోకంలో అనేక సర్పాలు ఉండగా నాగలోక నివాసి అయిన తక్షకుడే కాటు వేయాలని ఎందుకు శపించాడు?
4. బతికి ఉన్న చెట్టును దానిపై ఉన్న పక్ష్యాదులతో సహా తన విషంతో భస్మం చెయ్యగలిగిన తక్షకుడు పరీక్షిత్తు ఉన్న ఒంటి స్తంభం మేడను దానిలో ఉన్న మనుష్యులందరితో సహా ఎందుకు భస్మం చెయ్యలేకపోయాడు?
5. సర్పయాగంలో ముందుగా తక్షకుడే చనిపోయేటట్టుగా రాజు ఎందుకు సంకల్పించలేదు?
మంత్రాలు లేవని వాదిస్తూ రాసిన ఈ వ్యాసం మూఢనమ్మకాలకు సంబంధించినదేగాని ఇందులో సాహిత్య విమర్శ కూడా ఉంది. నరసింహంగారి లక్ష్యం అది కావడం కాకపోవడంతో నిమిత్తం లేకుండానే ఇక్కడ సాహిత్య వస్తువిమర్శ జరిగింది. ఒక సాహిత్య రచనను ఏ విధంగా చదవాలి ఏమి స్వీకరించాలి అన్న వివేచన ఉంది.
శిల్పం, అలంకారం, రసం, వస్తువు, పాత్రలు, సంఘటనలు మొదలైనవన్నీ కలిసి సాహిత్యం తయారవుతుంది. వాటిలో ఏ అంశాన్ని విశ్లేషించినా అది సాహిత్య విమర్శ అవుతుంది. స్వామినీన వారు చేసింది పురాణ సాహిత్య వివేచన. ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’ వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యా ల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
– రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో-)
హిత సూచని
విద్యా ప్రమేయము
విద్యలు సమస్త ప్రయోజనములకు ఆవశ్యకములైయున్నవి ,అవి గ్రంధ స్వరూపములై యున్నవి . గ్రంధములు సత్వ రజస్తమో గుణాత్మకలై యున్నవి , ఈ గుణములలో సత్వ గుణమే ముఖ్యముగా గ్రహించ తగ్గదైయున్నది గ్రంధములయుందుందే యుక్తిన్ని నీతిన్ని సత్వ గుణోద్భావములైయున్నవి . మిగిలిన యంశములు రజస్త మోగుణాత్మకములుగా నెంచ తగియున్నవి , విద్యార్ధులు యుక్తినిన్ని నీతినిన్ని గ్రహించేటటు వంటిన్ని , జ్ఞాపకము ఉంచుకునేటటు వంటిన్ని , అభ్యాసమును చేయు చునుండే వారికి విద్యలు సులభముగా స్వాధీనపడగలవు , గనుక , చదువు చెప్పే వారు ప్రతి సంగతి యందున్న నీతి యుక్తులను ఏర్పరచి విద్యార్ధులకు కనుపరుస్తూ నుండవలసినది .
(శ్లోకము )
అనంత శాస్త్రంబహు వేదితవ్య మల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నః
యత్సార భూతంతదు పాసితవ్యం హంసో యధాక్షీణమి వాంబు మిశ్రం .
అభిప్రాయము : అనంత శాస్త్రం – శాస్త్రములు అనంతముగానున్న బహు వేదితవ్యం – మిక్కిలీ మెహనతు చేసి గ్రహించ తగ్గవిగానున్ను ఉన్నవి . కాలః మనుష్యని యొక్క జీవిత కాలము , అల్పశ్చ – అల్ప మైనదిగానున్న , విఘ్నా :- విద్యా విఘ్నములు , బహవశ్చ – అనేకములుగానున్న ఉన్నవి గనుక యత్ – ఏది , సారభూత సారాంశమైనదో , తత్ – అది , అంబుమిశ్రం – ఉదకముతో కూడియున్న , యధా క్షీరం – శుద్ధ క్షీరమునకును , హంస ఇవ హంసము ఏ ప్రకారము విడతీసి గ్రహిస్తుందో ఆ ప్రకారమే , ఉపాసితవ్యం బుద్ధి మంతుని చేత గ్రహించ తగ్గ దైయున్నది , అని చెప్పబడ్డది గనుక ఏ గ్రంధమం దైనా సార భూతమైన నీతినిన్ని యుక్తి నిన్ని విద్యార్ధులు ముఖ్యముగా గ్రహించవలసినది , ఇందు వల్ల వారు క్రమముగా పండితులౌతారు వారి వాక్యములు లోకమునకు శ్రేయః ప్రదములౌతవి , యే భాషయందైనా విద్యార్ధి యెంత చదివినా గ్రంధములు రచించ నేర్చినా యుక్తా యుక్త ములను వాస్తవమును a వాస్తవమును నిదానించడమునకు ఉపయోగమైన యోగ్యత కూడా కలిగిన మీదట గాని పండితుడని యెంచ బడడు .
౨ .విశ్వ శ్రేయః కావ్యం అనే న్యాయము చేతను లోకుల యొక్క శ్రేయస్సు కొరకు గ్రంధముల నేర్పరచడము అవశ్యకమైయున్నది బుద్ధిమంతులు విద్యావంతులు ఐయుండి ఉపకార బుద్ధి చేత గ్రంధములు చేసేవారు సదరు నిమిత్తమును కనిపెట్టి వాస్తవమును అవాస్తవమును యుక్తాయుక్తములను తెలియడమునకు అనుకూలముగా నుండేలాగు గ్రంధములు రచించడము న్యాయమైయున్నది – యుక్తాయుక్త కార్యములను తెలియ చేసే గ్రంధముగాని వచనముగాని ఎంత ఖ్యాతి గలవారు రచించనదై నప్పటికిన్ని యుక్తి యుక్తముగా నుంటేగాని అంగీకరించతగ్గది కాదు .
(శ్లోకము )
యుక్తి యుక్తంవ చో గ్రాహ్యం | బాలాదపి సుభాషితం
వచ నంతుత్తున గ్రాహ్య మయుక్తంతు బృహస్పతేః .
అభిప్రాయము : సుభాషితం సుష్టుగా పలుకబడ్డటు వంటిన్ని యుక్తి యుక్తం – యుక్తితో గూడుకున్నటువంటిన్ని , వచః వాక్యము , బాలాదపి బాలుని వల్ల నైనా , గ్రాహ్యం గ్రహించ తగ్గది , అయుక్తం – సుష్టుగా పలుకబడనటువంటిన్ని యుక్తీ హీన మైనటువంటిన్ని , వచః – వాక్యము , బృహస్పతేస్తూ బృహస్పతి వల్ల నైనా , నగ్రాహ్యం అంగీకరించ తగ్గది కాదు , అటువంటి ఏ వచనమైనా ఏ గ్రంథమైనా రచించే మనిషి అందలి వాస్తవము తనకు తెలిసి యుండి అందువల్ల లోకులకు శ్రేయస్సు కలుగుతుందని తనకు రూడిగా తోచిన పక్షమందు అది వాస్తవమైనదిగా కనుపడేలాగురచించవచ్చును ఒక వేళ వాస్తవముకాని సంగతియైనా నీతిని యుక్తిని కనుపరచే కొరకు కల్పించి రచించే పక్షమందు అది అటువంటిదిగా నే కనుపడేలాగు రచించవచ్చు నుగాని తనకు తెలియనటు వంటిన్ని వాస్తవము కానటువంటిన్ని లోకుల కిఫాయతు కొరకు ఉపయోగము కానటువంటిన్ని అసందర్భమైనటు వంటిన్ని వచనమునైనా వాస్తవము లైనవిగా నున్న కిఫాయతు గలవిగానున్న కనుపడేలాగు రచించకూడదు . అట్లా రచించడము చేత లోకులు ఆ అభిప్రాయములను నమ్మి తప్పితములు జరిగించి చెడిపోవడమునకున్ను అటువంటి అభిప్రాయముల నేర్పచిన వారికి పాపము రావడమునకున్నుహేతువులు కలుగుచున్నవి .
౩ . ఏ గ్రంథమైనా చదువుకునే వారికి సులభముగానున్ను త్వరితము గానున్ను సందేహములు లేకుండానున్ను బోధపడేలాగున నుండవలసినది ఆవశ్యమైయున్నది, గనుక గ్రంధములు పండిత పామర సాధారణముగా నుండేలాగు రచించవలసినదిన్ని ఛాపా వేయించవలసినదిన్ని న్యాయమై యున్నది .విశేషించిన్ని హిందూలలో గానమున కావశ్యములైన గ్రంధములు తప్ప తతిమ్మావి సులభముగా తెలియ తగినట్లు ఆక్య గ్రంధములుగా దేశ భాషలలో నుండడము యుక్తమని నాకు తోస్తున్నది , ఎందుచేత నంటే ఛందో బద్ధమైన ఛందస్సును కుదుర్చు కోవడమందు కూడా సక్త మైయుంటుది గనుక ఆమనిషి తన అభిప్రాయమును సులభముగా బోధపడేలాగు రచించడమునకు వల్ల యుండదు ఛందో రూపకమైన గ్రంధము సులభముగానున్న త్వరితముగా నున్న సందేహములు లేకుండానున్ను బోధ కాదు , హిందూ దేశములలో గ్రంధములు చాలా మట్టుకు ఛందో బద్ధముగా నుండడము చేతనున్ను కొన్ని శాస్త్రములు వాక్య గ్రంములు గానున్నా సంస్కృత భాషలో నుండడము చేతనున్ను మిక్కిలీ కఠినముగా నుండడము చేతనున్ను పండిత పామర సాధారణముగా నుండే వాక్య గ్రంధములు లేకపోవడము చేతనున్ను హిందూ దేశముల వారికి విద్యలు రావడము కఠినమైయున్నది , విశేములైనటు వంటిన్ని ఆవశ్యకములై నటువంటిన్ని అనేక శాస్త్రముల యొక్క జ్ఞానము వారికి కలుగకనే పోతూ వచ్చినది . ఇది వరకు ఉండే ఛందో బద్ధములైన గ్రంధములు వాటి అర్ధము బాగా తెలియని వారిచేత బాలురకు చెప్పించే మర్యాద తరుచై యున్నది . a గ్రంధముల యొక్క అర్ధము చెప్పే వారికే స్పష్టముగా పోతూ నుండగా చదువుకునే వారికి బోధ పడుతుందని ఎంచే వల్ల లేదు బాలురు విద్యా భ్యాసమును చేయడమునకు లాయభై యుండే కాలమంతా సదరు పద్ధతి చేత వ్యర్ధముగా విని యోగమైపోతున్నది , వారు అభ్యసించే అంశముల యొక్క అభిప్రాయమే తెలియకొండా చదువుకోవడము వల్ల అధికమైన శ్రమను పొందిన్ని విద్యనూ సాధించ లేకుండానుంటున్నారు .
౪ . శాస్త్రముల యొక్క గ్రంధములున్న ఇతరాంశములను గురించిన గ్రంధములున్న సులభముగా బోధపడేలాగు దెస భాష లలో వాక్య గ్రంధములుగా వ్రాయించి ప్రింటు వేయించి అవే బాలురకు చెప్పించే పక్షమందు బాల్య కాలములోనే శాస్త్రముల యొక్క ఇతరములైన అంశముల యొక్క జ్ఞానము వారికి త్వరగా కలుగడమునకు సందేహ యేమియుంలేదు గనుక విద్యాభ్యాసము చెయించుటకు ఆరంభించి వానికి ఒత్తుడు తగలకుండా వాణి బుద్ధి ప్రవేశింప చేయ వలసినది , బాలురకు అక్షరముల యొక్క జ్ఞానమిన్ను వాటిని కూల్చే శక్తిని సలక్షణముగా వచ్చే కొరకు అచ్చులు హల్లులు మొదలైన వాటి వివరముతో ఒక పత్రిక వ్రాయించి అదిన్ని శబ్ద శబ్దార్ధముల యొక్క జ్ఞానము వారికి కలుగడమునకు ఏయే దేశ భాషలయందు వాదికలో నుండే పదములలో వారు చ్చారించడమునకు అనుకూలముగా నున్ను అర్దావగాహన చేసుకోవడమునకు జురూరుగానున్ను ఉండే పదములు ఏర్పచి వర్గులు గానున్ను లక్షణ క్రమముగాను (అనగా )నామ వాచకాది భేదముల వరుసనున్ను సులభముగా బోదకా తగిన ప్రతి పదములతో జాబితా వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన హద్దులు వివరముగా తెలియడమునకు తగిన పత్రిక యొకటి వ్రాయించి అదిన్ని వాక్య రచనా సార్ధ్యము సలక్షణముగా కలుగడమునకు కర్త ప్రయోగము మొదలైన వాటి వివరముతో ఒక పత్రిక వ్రాయించి అదిన్ని శబ్ద శబ్దార్ధముల యొక్క జ్ఞానము వారికి కలుగడమునకు ఏయే దేశ భాషలయందు వాడికలో నుండే పదములలో వారు చ్చరించడమునకు అనుకూలముగా నున్ను అర్దావగాహన చేసుకోవడమునకు జురూరుగానున్ను ఉండే పదములు ఏర్పచి వర్గులుగానున్ను లక్షణ క్రమముగాను (అనగా ) నామ వాచకాదిభేధముల వరుస నున్ను సులభముగా బోధకాతగిన ప్రతి పదములతో జాబితా వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన హద్దులు వివరముగా తెలియడమునకు తగిన ప్రతి యొకటి వ్రాయించి అదిన్ని వాక్య రచనా సార్ధ్యము సలక్షణముగా కలుగడమునకు కర్త ప్రయోగము మొదలైన వాటి వివరము గల పత్రిక యొకటి వ్రాయించి అదిన్ని యొక పుస్తకముగా చేర్చి అచ్చు వేయించి వారికి క్రమముగా చెప్పించవలసినది , సాధారణముగా నుండే లెక్కలు కూడా వారికి క్రమముగా చెప్పించవలసినది , ఆ మీదట వైద్యము తాలూకా కొన్ని అంశములు ప్రతి విద్యార్ధికిన్ని చెప్పించడము ఆవశ్యక మైయు న్నట్టు నేను ఎంచుకుంటున్నాను . కొన్ని అంశములనగా మనుష్యునకు ముఖ్యముగా ఉపయోగించే వస్తువుల పేర్లు వాటి యెదుటను వాటి గుణములు వైనముతో వ్రాయబడ్డ జాబితా నున్ను వైసర్గిక విశావస్తుల పేర్లు వాటి యెదుటను ప్రతి విషముల వైనము తో వ్రాయబడ్డ జాబితానున్ను . మనుష్య ప్రవర్తనతో చేరిన స్నానపానాది కార్యముల వైనమున్ను వాటి యెదుటను వాటి యందు సంభవించే గుణ దోషముల వివరమున్ను గల జాబితానున్ను ఏయే రోగముల పేర్లు వాటి ఎదుట వాటి చిహ్నముల వైనముతో వ్రాయ బడ్డ యొక జాబితానున్ను వస్తు కూట భక్షణము మొదలయిన వాటి వల్ల నున్ను ఏయే జంతువుల కాట్లు మొదలయిన వాటి వల్ల నున్ను కలిగే విష చిహముల వైనమున్ను వాటి యెదుటను ఆ విషముల చికిత్సల యొక్క అనేక నిమిత్తల యందు కిఫాయతు కలుగు తున్నది . గనుక సదరు ఐదు అంశముల సంగతులున్ను , స్వదేశ భాష తాలూక గ్రంధముల యందున్న మట్టుకున్న భాషాంతర గ్రంధముల వల్ల సాధ్యమైనంత మట్టుకున్న సంగ్రహించి సులభముగా బోధ పడడమునకు తగినట్లు స్వదేశా భాషను అనుకూలమైనంత ముక్తసారుగా వ్రాయించి అచ్చు వేయించి చిన్న వాండ్లకు చెప్పించవలసినది . అందు మీద నీతిని చక్కగా విశదపరచే యొక గ్రంధము వాక్య రూపముగా నేర్పరచ బడినది (చదివించ వలసినది , యిది నీతిని గురించిన గ్రంధముల వల్ల నేర్పరచబడవలసియున్నది ) మరిన్ని యీ హిత సూచని అప్పుడే కాని ముందు చెప్పబడే గ్రంధములు కొన్ని చదివిన మీదట గాని చెప్పించ వచ్చును . తదనంతరము భూగోళ శాస్త్రము యొక్క గణిత శాస్త్రము తాలుకా క్షేత్రము యొక్క లెక్క యొక్క సిద్ధాంత భాగము యొక్క మరిన్ని న్యాయ శాస్త్రము యొక్క శరీర శాస్త్రము యొక్క వాక్య రూపములైన సంగ్రహములను ఏయే దేశ భాషల చేత సంగ్రహించి అచ్చు వేయించి చిన్న వాండ్ల చెప్పించ వలశినది , ఐతే సంస్కృతము వగైరా భాషలయందు శారీర శాస్త్రము మొదలైనవి రచించబడి యున్నవి .
రచన : స్వామినీన ముద్దునరసింహం
సేకరణ : హిత సూచని
———–