వేదుల సత్యనారాయణ శాస్త్రి (Vedula Satyanarayana Sastry)

Share
పేరు (ఆంగ్లం)Vedula Satyanarayana Sastry
పేరు (తెలుగు)వేదుల సత్యనారాయణ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరుగురమ్మ
తండ్రి పేరుకృష్ణయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/22/1900
మరణం1/7/1976
పుట్టిన ఊరుభద్రాచలము తాలూకా గొల్లగూడెం
విద్యార్హతలుఉభయ భాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులైనారు
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెవేదుల సత్యనారాయణ శాస్త్రి
స్వీయ రచనలుఅపరాధిని (నవల)
ఆరాధన
కాలేజీ గరల్ (నాటకం)
దీపావళి
ధర్మపాలుడు : రాఖాలదాస బంధోపాధ్యాయ బెంగాలీలో రచించిన ఈ చారిత్రిక నవలను తెలుగులోకి అనువదించారు.[1] ఇది రెండు భాగాలుగా 1929లో ప్రచురించబడింది.
నవాన్న (నాటకం) (1977) బిజన భట్టాచార్య బెంగాలీలో రచించిన నాటకానికి తెలుగు అనువాదం.[2] దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.
మాతల్లి
ముక్తఝరి (ఖండకావ్యం)[3] దీనిని గౌతమీ కోకిల గ్రంథమాల 1955లో ప్రచురించింది.
రాణా ప్రతాప (నాటకం)
విముక్తి.
వేసవి మబ్బులు (కథా సంపుటం)
సోనా మహల్ (చిన్న నవల)
హితోక్తి రత్నాకరము (1931) [4]
మరికొన్ని నవలలు, నాటకములు, వ్యాసములు ఇత్యాదులు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుమహాకవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేదుల సత్యనారాయణ శాస్త్రి
దీపావళి
సంగ్రహ నమూనా రచనజయగీతి
కావిముసు గల్లాడ వేకువ
కాంత దివసాంగణము చేరెను
గాలిలో వనపాళిలో సుమ
గంధ మలమికొనెన్‌
తరుణతరణిద్యుతుల రోదోం
తరము రంజిత మయ్యె ద్విజసం
తానగళకాహళుల ప్రాత
స్స్తవము మార్మ్రోగెన్‌
తృణము తృణమున శాంతి విరిసెను
దిక్కు దిక్కుల కాంతి మెరసెను

వేదుల సత్యనారాయణ శాస్త్రి
దీపావళి

1. జయగీతి
కావిముసు గల్లాడ వేకువ
కాంత దివసాంగణము చేరెను
గాలిలో వనపాళిలో సుమ
గంధ మలమికొనెన్‌
తరుణతరణిద్యుతుల రోదోం
తరము రంజిత మయ్యె ద్విజసం
తానగళకాహళుల ప్రాత
స్స్తవము మార్మ్రోగెన్‌
తృణము తృణమున శాంతి విరిసెను
దిక్కు దిక్కుల కాంతి మెరసెను
దేవళమ్ముల మొరసె జయఘం
టావితానమ్ము
అదె త్రివర్ణధ్వజపటాంచల
ముదయపవనోచ్చలిత మయ్యెను
వదలె జయశంఖారవమ్ముల
నిదురమైకమ్ము
వీరశౌర్యము సతులతేజము
పేదభక్తియు సాధుదీక్షయు
వృద్ధపౌరుష మొక్క నూత్నా
వేశమున వెలుగన్‌
కాలధూమోద్గత మహాగ్ని
జ్వాలికామాలికలొ జంఝా
నిలవిఘూర్ణిత నీలవారాం
నిధితరంగములో
వెలువడియె నాసేతుశీతా
చలము నరనారీసమూహము
నీ జయోత్సవ ముహూర్తము
నేడు జనయిత్రీ!
వేదధాత్రివి జ్ఞానదాత్రివి
పేదపాలిటి యన్నపూర్ణవు
వీరరాజ్ఞీ! లేదు నీకిక
పారతంత్ర్యమ్ము
నిన్నె చూతుము నిన్నె కొలుతుము
నీ మహోన్నతి పాడుకొందుము
నీ జయస్వాతంత్ర్యమంగళ
నిలయదేహళికిన్‌
తరతరమ్ముల బంధనముల వి
దల్చి నీస్వేచ్ఛాశుభోదయ
మంగళాశీః కుసుమసురభిళ
మౌళివినతులమై
కోటిగొంతుల పారతంత్ర్యో
చ్చాటజయగీతముల పాడుచు
నాటెదము నీకేతనము నా
నాదిగంతములన్‌
ప్రాణధనమానముల పూజా
ప్రసవములుగా నీమహోజ్జ్వల
పాదపీఠిక నుంతు మమ్మా
భరతజనయిత్రీ!
జయము భారతభాగ్యధాత్రీ!
జయము వినమితపుత్రపుత్రీ!
జయము శాంతిజగత్సవిత్రీ!
జయము జనయిత్రీ!
జయము హిమగిరిమణికిరీటా!
జయము సింహళపాదపీఠా!
జయము విజయాంకితలలాటా!
జయము ప్రియజననీ!

2. కాగడా
వెలిగించు కాగడా వెలిగించవోయి!
ప్రళయరుద్రుని ఫాలభాగమ్మునందు
అతని నిశాతశూలాగ్రమ్మునందు
అతని నేత్రగోళాంతమ్ములందు
జ్వలియించు శిఖిశిఖాజాలమ్ముతోడ
వేడిగా వాడిగా వెరపుగొల్పేదిగా
వెలిగించు కాగడా వెలిగించవోయి!
రేయి విప్పిన నీలిరెక్కల నీడ
అవనీనభోంతరం బార గ్రమ్మినది
పులుగుగొంతుక మూగవోయిన వేళ
గూట నుంచిన దివ్వె కొండెక్కు వేళ
విడిన పూవులు రాలి పడిపోవు వేళ
ప్రాత దన్నది యెల్ల పైకి తోడుచును
వెలిగించు కాగడా వెలిగించవోయి!
నెమరు వేయుట పశుత్వముపాడి, గాని
సప్తసామ్రాజ్యముల్‌ స్థాపించుకొన్న
పరరాజ్యముల పారుపత్తెమ్ము గొన్న
పౌరుషమ్మున కది పరిపాటి గాదు
ఎన్నెన్ని కల్పమ్ము లేగిన గాని
ఆరని మారని యా ధ్రువజ్యోతి
వెలిగించు కాగడా వెలిగించవోయి!
అధికారదృప్తుల కర్థమత్తులకు
భోగదాసిగ నున్న భూదేవికొరకు,
చెక్కిన నెలరాల చెరసాల నడుమ
వధ్యశిలావైభవం బిచ్చగించి
దేవులాడుచునున్న దేవునికొరకు
దారి తప్పిన బాటసారులకొరకు
దారి గానని పేదవారలకొరకు
వెలిగించు కాగడా వెలిగించవోయి!
తొడిమవీడినపూవుత్రోవ చూడదు తీవ
ధూళిరాలినపండుతో పోదు పాదపము
గాలి గలసిన పాటకై పక్షి వెత పడదు
తరగ విరిగిన మహోదధి తీసిపోవదు
పశ్చిమాశామేఘపటలాంచలముల
ముదిప్రొద్దు రేపటి యుదయమ్ముకొరకు
దాచుకొన్న ప్రతాపరోచిర్లవాల
వెలిగించు కాగడా వెలిగించవోయి!
పూవు వీడినగాని పుట్టదు ఫలము
ఫలము రాలక జనింపదు నవాంకురము
దగ్ధదినైకచితాభస్మరాశి
సుప్తి వీడెడి యుషస్సునకు పునాది
ముదిశిశిర మ్మాకు చిదిమినపట్లు
పూలకారుచివుళ్ళ పురిటిపొత్తిళ్ళు
గతముకై తలపేల, క్షతి కేల వగపు
అరణి మథించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి!
మంటికి మింటి కన్నింటికి మంటగా
వెలిగించు కాగడా వెలిగించవోయి!

రచన : వేదుల సత్యనారాయణ శాస్త్రి .
సేకరణ :దీపావళి

———–

You may also like...