పేరు (ఆంగ్లం) | Pendyala venkata Subrahmanyasastry |
పేరు (తెలుగు) | పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీతాయారు |
తండ్రి పేరు | సముద్రాల వేంకట శేషాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/5/1877 |
మరణం | 1/7/1950 |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని చోడవరం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | ఆంధ్రోపన్యాసకులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వేదకాలపు వ్యవసాయ చరిత్ర, పరీక్షిత్తు, మాంసభుక్తి, రామోపాఖ్యానము-తద్విమర్శనము, ఉత్తర భారతము, చిత్రరత్న పేటి, సూక్తి సుధాలహరి |
ఇతర రచనలు | – |
– | |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిని ప్రాచీనాంధ్ర గ్రంథ సంపాదనకై నియమించారు. ఆ పనిమీద మైసూరు, మద్రాసు, తంజావూరు వంటి ప్రాంతాలతో పాటుగా పలు తెలుగు ప్రాంతాల్లో తిరిగి విలువైన గ్రంథాలనెన్నిటినో సంపాదించారు. ఆ తర్వాత బందరు నేషనల్ కళాశాలలోను, రాజోలు బోర్డు హైస్కూలులోను కూడా ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | శ్రీ మహా విష్ణునాజ్ఞ చే బ్రవర్తించు నిప్పటి చతుర్ముఖుని ద్వితీయ పరార్ధమున , శ్వేత వరాహకల్పమునం దగు వైవస్వత మన్వంతరంబునందైన నీకలియుగమున బదునారువందల యిరు నదారు సంవత్సరములు గడచి పిమ్మట *శ్రీమంతంబగు నీ భరత ఖండంబున నొక మహా సమరము ప్రవర్తిల్లెను . అది కురు క్షేత్రము కేంద్ర స్థానముగా గలది యగుట చె గురు క్షేత్ర సంగ్రామమనియు గౌరవులకు బాండవులకునైన యుద్ధమగుట చె గురు పాండవ యుద్ధమనియు భరత వంశస్థులే యందు బ్రధాననాయకు లగుటచే భారత యుద్ధమనియు బేరువడసెను. |
పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
పరిక్షిత్తు
ప్రధమప్రపాఠకము
ప్రధమానువాకము
పూర్వ గాధ
శ్రీ మహా విష్ణునాజ్ఞ చే బ్రవర్తించు నిప్పటి చతుర్ముఖుని ద్వితీయ పరార్ధమున , శ్వేత వరాహకల్పమునం దగు వైవస్వత మన్వంతరంబునందైన నీకలియుగమున బదునారువందల యిరు నదారు సంవత్సరములు గడచి పిమ్మట *శ్రీమంతంబగు నీ భరత ఖండంబున నొక మహా సమరము ప్రవర్తిల్లెను . అది కురు క్షేత్రము కేంద్ర స్థానముగా గలది యగుట చె గురు క్షేత్ర సంగ్రామమనియు గౌరవులకు బాండవులకునైన యుద్ధమగుట చె గురు పాండవ యుద్ధమనియు భరత వంశస్థులే యందు బ్రధాననాయకు లగుటచే భారత యుద్ధమనియు బేరువడసెను.
అమ్మహాజన్యమున బెక్కు వేలుగజములు , ననేక లక్షల హయములు , మఱియుటఏ కాక , డెబ్బది రెండు లక్షలకు మించిన దృడాంగులగు మనుష్యులును మృతి నొందిరి . ఆ వీరులలో శతాధిక వయస్కులు మొదలు పదునారేండ్ల ప్రాయము వరకు గలవారుండిరి. భరత ఖండ మిప్పటి వలె నప్పుడు ముప్పది మూడు కోట్ల జన సంఖ్య గలది కాక , స్వల్ప జన సంఖ్యా కలిత మగుటచే నంతటి జన నష్టమును సహింప లేక నతితమముగా సంక్షోభించెను . దేశమునం దేమూల జూచినను , తండ్రులు సోదరులు సుతులు భర్తలు బంధువులు గతించుతచే నవయుననాధలగు సతీ మణుల కన్నీటిచే భారత భూమి పంకిలమై వారి రోదనములచే దిశలు ప్రతి రోదనము జేయు చుండెను . కురుక్షేత్రము యుద్ధమున కెటులు కేంద్ర స్థాన మయ్యెనో ,స్త్రీలరోదనమునకును నటులచే కేంద్ర స్థాన మయ్యెను . అందు హస్తిపురి మఱియు నడిమి బొట్టయ్యెను . ఆ పట్టణమునం దేవక జూచినను , భార్త్రు బంధుసుతాదుల మరణము లచే శోకించువనితల రోదనములే – ఏ వైపు జూచినను బంధు మరణ కారకులగు బాండవుల శపించు వాక్యము లే – ఏ దెస జూచినను యుద్ధములోని భయంకర వార్తా ప్రసంగములే – ఏ ప్రక్క గను గొనినను భర్త్రాది మరణములచేనగు వృత్తి భంగము వలన నైన దరిద్రతకు గాతరులగు స్త్రీల యొక్కయు , బాల బాలికల యొక్కయు , వృద్ధుల యొక్కయు విలాపములే – ఏ డిశం గనినను క్షత గాత్రుల హాహాకారములే ప్రవర్తిల్లెను . హాహాకారములతో గూడిన యుద్ధములోని సైనికుల విషాద మరణముల జూచియు , బురిలోని రోదనముల వినియు బంధుమిత్రపుత్రాదుల మరణములచే విచారనాగరమగ్నుండయ్యు ధర్మరాజు కృపణ తానంతప్త హృదయుండయి విరక్తిచే రాజ్య ము నొల్లననగా , సోదరులు దౌప్రది మొదలగునా రాతని బ్రవృత్తి మార్గమునకు ద్రిప్ప నెంతగా బ్రయత్నించినను నాథ నిమనస్సు తేరుకొనదయ్యెను . పిమ్మట శ్రీకృష్ణ భగవానుడును గర్మ యోగంబునకు ద్రిప్ప నెంతయో యత్నించె . యుద్ధారంభమున అర్జునునిమొహముం బోలె నేడు ధర్మజుని కార్పణ్యదోషోపహిత స్వభావమును శ్రీకృష్ణుడు బో గొట్ట లేడయ్యే . పిమ్మట శ్రీ వ్యాస భగవానుడు తన వాన్నై పుణ్యముచే నాతని కుపదేశించిన ప్రవృత్తి మార్గమే నివృత్తి మార్గము నుండి పెడ మొగము పెట్టించి రాజ్యాభిషేకమునకును , పిమ్మట ద్రోణాదుల హత్యలచే నాగు పాపపరిహారమునకై మూడ శ్వమేధాయాగముల జేయుటకును హేతు వయ్యేను . వ్యాసునానతిని “అహీన “ మనునశ్వమేధము జేయునెంచెను . పాండవులు సంతాననాశానముచే సంతప్తులగుచు , నభిమన్యుకళత్రమగు నుత్తర గర్భవతి గాన తద్గర్భస్థ శిశువు నందే తమ సకల మనో రధముల నాధారము జేసికొని ఊరడిల్లుచుండిరి . అశ్వ మేధయుగమునకు ద్రవ్యమును సంపాదించుటకు బోక తప్పనందున , ధర్మజుడు , ససైన్యుడగుయ యత్సనిబుర రక్షణమునకు నియోగించి , సోదరులను సైన్యమును దోడ్కొని వ్యాసోపదేశముచే , నుత్తరాప్రసవమునకు బూర్వమే హిమాలయోత్తర భాగమునకు బోయెను . ధర్మ రాజాదులు పురము వెలువడిన మరునాడే యశ్వ మేధాయాగ నిర్వహణమునకు ధర్మజునిచే నంతకుమున్నె యాహ్వానితుడగు శ్రీ కృష్ణ భగవానుడు తద్యాగ నిర్వహణ కుతూహలా యత్త చిత్తుండయి ససోదర మిత్ర పరివారముగ హస్తి పురి కేతెంచెను .
ద్వితీయానువాకము
పరిక్షిజ్జజనము
శ్రీ కృష్ణుడు హస్తిపురి బ్రవేశించిన నాడే యుత్తరరకు బ్రస వావేదన మారంభ మయ్యెను . ఆమె సూతి కాగృహ మరి ష్టోచిత పరికర సహిత మయ్యును , అరిష్ట శూన్యమై ననిష్టహై న్యముతో , గదా ధర పరిరక్షితమై యగదంకారసన్నిహితమై , ధవళ కుసుమ యుక్తములు , సిత సర్షప సహితములు , లాజపూర్ణములు నగు కుంభములచే శుభ ప్రదంబై విరాజిల్లుచు , బ్రజ్వ లితాగ్ని చేతను , బ్రదీప్త శస్తా స్త్రముల చేతను , పిచు మంద పల్లవాదుల చేతను , బాల గ్రహాదిభూత పరిహారభూతమై , చికిత్సికలు దక్షలు చతురలు వృద్ధులు హీతలు నగు పుణ్య వనితల చె బరి బరి విధముల బరి శోధింప బడుచు నిర్మలమై యుండెను .
———–