చందాల కేశవదాసు (Chandala Kesavadas)

Share
పేరు (ఆంగ్లం)Chandala Kesavadas
పేరు (తెలుగు)చందాల కేశవదాసు
కలం పేరు
తల్లిపేరుపాపమ్మ
తండ్రి పేరుచందాల లక్ష్మీనారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/20/1876
మరణం5/14/1956
పుట్టిన ఊరుఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి
విద్యార్హతలువెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవనాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.
వృత్తిగీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://www.navatelangana.com/article/sopathi/44306తెలుగు సినిమా వాచస్పతి చందాల కేశవదాసు
స్వీయ రచనలుకేశవ శతకం, కనకతార – (1926) నాటకం, బలి బంధనం – (1935) ఆరు అంకముల నాటకం, శ్రీరామ నామామృత గేయం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు
జోలపాటలు, సత్యభామా పరిణయం (హరికథ), సీతా కల్యాణం (హరికథ), రుక్మాంగద (హరికథ), నాగదాసు (హరికథ)

సినిమా పాటలు:
భక్త ప్రహ్లాద, కనకతార, రాధాకృష్ణ, తులాభారము, సతీ సక్కుబాయి
ఇతర రచనలుhttp://www.sakshi.com/news/opinion/first-telugu-movie-poet-is-keshavadasu-353449 తొలి తెలుగు సినీ కవి
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్రసూత, కలియుగ దశరథ, నటనా వతంస
ఇతర వివరాలుగేయరచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరారు. కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచారు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థులు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చారు. ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’, అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు గారు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుగారిదే.
“కనక తార”, “లంకాదహనం” వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచారు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలం లో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మర లో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచందాల కేశవ దాసు
కనక్తారా నాటకము
సంగ్రహ నమూనా రచనఉ : శ్రీకరమైన రాజ్యము వి ; శేష సుఖంబుల ఘెర వృత్తి చే
గైకొని క్రూర లెంతటి చి : కాకుల బెట్టిన గాని ధర్మమే
మాకు జయం బటంచు దయ : మాల నిమాన్యుల బ్రోచు నట్టి ను
శ్లోకుడు శ్రీవరుం డిడుత ; శోభనముల్ కృప మీకు నిచ్చలున్
సూత్ర –(నాంద్యంతమున బ్రవేశించి ) ఆహా ! నేడేమి నా నుక్రుత విశేషము ? మహాజన భరితమై , కన్నుల పండువుగ బ్రకాశించు ణీ దివ్య సభను సేవించి యానందింప నోచు కొంటి గదా .

చందాల కేశవ దాసు
కనక్తారా నాటకము

నాంది

ఉ : శ్రీకరమైన రాజ్యము వి ; శేష సుఖంబుల ఘెర వృత్తి చే
గైకొని క్రూర లెంతటి చి : కాకుల బెట్టిన గాని ధర్మమే
మాకు జయం బటంచు దయ : మాల నిమాన్యుల బ్రోచు నట్టి ను
శ్లోకుడు శ్రీవరుం డిడుత ; శోభనముల్ కృప మీకు నిచ్చలున్
సూత్ర –(నాంద్యంతమున బ్రవేశించి ) ఆహా ! నేడేమి నా నుక్రుత విశేషము ? మహాజన భరితమై , కన్నుల పండువుగ బ్రకాశించు ణీ దివ్య సభను సేవించి యానందింప నోచు కొంటి గదా .
కం : కవులుం గాయకులుం ద
త్త్వవిధి జ్ఞులు ద్విజులు నృపులు : వైశ్యులు పాదో
ద్భ వులు న్నిండిన యీ సభ
నవురా ! కను టెంత పున్నె : మణి వచియింతున్
సర్వజ్ఞు లగు ణీ సదస్యుల నే నేతెరంగున సంతసింప జేయ నేర్తుతో తోపకున్నది .(యోచించి ) తోపక చింతిల్లిన నేమి ఫలము ?
తే : భారహుడవై నే నిప్డు : బహు విధముల
యోచనలు సేయ గార్య మె :ట్లోడ్డు కెక్కు ?
రోట దలనిది రోకటి : పోటులకును
జంకినన్ ఫల మేమి ? యీ : శంక లేమి ?
ఇట్లు శంకించి వెనుకంజ వేయుటకు వీలు లేదు కదా ? గుణ గ్రహణ ధురీణులు లోపముల గణింపరనుట నాకును నమ్మకమే . (తెర వంక జూచి ) ఏమి నటీ , నెల్ల బోయి నిలిచియున్నావు ? విలోకన తత్పరు లగు సదశ్యు లీ కాలహరణము కోర్తురా ?
నటి :- (ప్రవేశించి ) ఇదిగో వచ్చితిని , ఏమి సెలవు ?
సూత్ర :- శృంగార ముగీసేనా ?
నటి :- సరే ! శృంగారము వలెనే యున్నది .
సూత్ర :- ఏమి ! అట్లను చున్నావు ?
నటి :- కొంచెము తాళుడు , నాకింకను భయము పోలేదు .
సూత్ర :- అటు లది ద వేమి ! నే నుండగ నీ కేమి భయము ?
నటి :- ఈ కాలమున నొకరి యెడ దయ దలచువా రుండుట యరుదు గదా ?
సూత్ర :- అంత దయా శూర్యుడనా ?
నటి :- ఎవరి పాట్లు వారివే గాక , యోకరినొకరు విచారించు కాలమాయిది !
సూత్ర :- నీ కిప్పు డేమి మూడినది ? యెందులకు భయపడు చున్నావు ?
నటి :- నాకిష్టమేగాని యొకరి గోడు దళ పెట్టవలదా ?
సూత్ర :- ఒకరితో నీమేమి యవసరము ?
నటి :-ఇక దయాశూన్య లనుట కేమి సందేహము ?
సూత్ర :- ముభావ ప్రసంగముననే కాలము ముగియుచున్నది . సంగతి ఏదో త్వరగా దేల్చరా ?
నటి :- ఇంకను దేల్చెడి దేమి ! నేడు మన వీధి జరిగిన సంగతి దలచుకొనిన , నా గుండె లవియుచున్నవి .
సూత్ర :- (ఆతురతతో ) ఏమీ జరిగినది ?
నటి :- ఇంతకు ముం దొక త్రాగుబోతు యొడ లెరుగని మత్తతచే మన వీధిం జనుచు నొక యింట జొచ్చి సుకుమారి యగు యబల నోర్తు జెర బట్టె , నట్టి వైపరీత్యమున కామె కళవళ పడి కంపించుచు నెలుగెత్తి రోదన మొనర్ప నట్టి సమయమం దాయమ బిడ్డలు వానిం జూచి భయంపడి తల్లిపై బడి గగ్గోలుగ నేడ్చుచు నడువుమని పరిపరి గతుల బళ్ల టిల్లు చుండ నాక్రూ రాధము దాకుర్రల భూమి పై బడ వైచి తలలు గోయుట కొర కాయుధము నాయత్తము జేసి కొవునంతలో నా డింభకు లెటు వారటు చెదరి పారిపోయిరి . ఇట్టి కల్లోలనిమ యముననే సమీపమున నున్న జలముల నాయ బలయు బడియె .
సూత్ర :- (వేగిరపాటు తో ) ఏమేమీ ! ప్రాణములు విడిచెనా !
నటి :-ఎన్నియో కడగండ్లు వడి ప్రానా వశిష్టయై తుదకే పుణ్యాత్ముని కృప చేతనో తన బిడ్డల మరల గలసి కొన్నదట .
సూత్ర :- ఆట మాత్రమే కాని , నీవు చూడలేదా ?
నటి :- చూడకేమి ! సాంగముగ జూచినచో జచ్చియే యుందును . నేనననేమి , వీధి వార లెల్లరుం దలుపులు మూసి కొని ప్రాణము లర చేత నిడుకొని దాగి యుండిరి .
సూత్ర :- సరే ! ఇట్టి ఘోర మా పె భర్త చూచి యూర కున్నాడా ?
నటి :- బాగున నున్నది ! భర్తయే యున్నచో నిటు లేల జరుగును ?
సూత్ర :- అనాధయా ?
నటి :- ఏ క్రూరుడో యనాధగా నొనరించినాడు .
సూత్ర :- అదుష్టుడు దండితుడు కాలేదా ?
నటి :- ఏది ఎటులగుno కాని ఇప్పటికి గ్రామమునుండి పలా యితుడయ్యె .
సూత్ర :- సరే ! ఇక నీ ప్రసంగ మాపుము .
నటి :- నన్నేల పిలిచినారు ?
సూత్ర :- ఈస భాసదుల సంతసింపజేయు కే మార్గము దోపక నిన్ను బిలిచితి .
నటి :- మీచిత్తము ననుసరించి మెలగుటకు సిద్ధముగ నున్నను .
సూత్ర :- ఇపుడొక సహాయ మొనర్పవలయు .
నటి :- ఏ విషయమున ?
సూత్ర :- ఏదో నొక నాటకము .
నటి :- ఏ నాటకము ?
సూత్ర :- ఏమో యుదో చుటలేదు . ణీ కేమైనదోచిన జెప్పుము .
నటి :- సరే ! బాగుగా నేయున్నది . అప్పటినుంచి యొక నాటహమునలెనే చూచి వచ్చినాను . దాని ప్రభావ మింత వరకు నామనంబు నే యోచనకు బోనీయకున్నది .
సూత్ర : ఆహా ! ఆడువా రెంత భీరువులు . స్మృతి నభినయించి బలే బలే ! ఇప్పుడొకటి జ్ఞప్తికి వచ్చినది . దాని చేనీ సదస్యుల నిరాటంకముగా సంతసింపజేయు నేర్తునని ధైర్యము వచ్చినది .
నటి :- ఏ నాటకము ?
సూత్ర :- నీవిపుడు చూచి వచ్చిన నాటకమును బోలినదే .
నటి :- పేరు లేదా ?
సూత్ర :- లేకేమి ! యిటు వినుము —-
సీ : నైజాము దేశము ; సక్త నిశ్చల చిత్తు
పురవర వాసుండు ; పుణ్యమూర్తి
సద్ధర్మ వర్తనా ; సక్త నిశ్చల చిత్తు
డమితయశుండు జ ; యాధికుండు
ద్వివిధ సాద్వి ద్యాప్ర ; వీణుండు న్యాయవా
దులసమూహమున ని ; స్తులడు ఘనుడు
దానసత్య దయాని ; దానుం డహం భావ
రహితుండు ధైర్యవి ; రాజమాను
తే .గీ : డైన రామసింహ ప్రభు ;నభిమతమున
వ్రాసె జందాల కేశవ ; దాసు డఖిల
సుజన మోద ప్రదంబు భా ; సుర పదం బ
నగగలదు కనక్తా రాఖ్య ; నాటకంబు
నటి : – ఆ నాటక మీసదస్యుల సంతసింప జేయుననుట నిస్సం దేహమే కాని రచనా చాతుర్యముం గూర్చి యేనాకు గొప్ప సందేహము .
సూత్ర :- రాజహంసోపమానులగు ణీ సదస్యులు లోకంబు లెన్ను దరి నుకొంటివా ! అటు లెన్న డు దలంపకుము కాని యీ రాసికవారుల హృదయ రంజనమునకు బ్రధమమున నేదే నొక ఋతువుం గూర్చి గానము సేయుము .
నటి :- ఏ ఋతువును ?
సూత్ర :- ఏ ఋతు వేల ? యీ వసంతమునే
నటి :- చిత్తము .
రచన : చందాల కేశవ దాసు .

———–

You may also like...