పేరు (ఆంగ్లం) | Kota Venkatachalam |
పేరు (తెలుగు) | కోట వేంకటాచలం |
కలం పేరు | – |
తల్లిపేరు | కన్నతల్లి: అన్నపూర్ణమ్మ , దత్తతతల్లి: లక్ష్మీదేవమ్మ |
తండ్రి పేరు | కన్నతండ్రి: చల్లా సుబ్బారాయుడు , దత్తత తండ్రి:కోట నిత్యానందం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1885 |
మరణం | 1/1/1954 |
పుట్టిన ఊరు | నూజివీడు తాలూకాలోని మధునాపురం |
విద్యార్హతలు | – |
వృత్తి | చరిత్ర పరిశోధకులు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు, అభాస క్రైస్తవం, అద్వైత బోధిని, ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు (1955), కలియుగ రాజవంశములు (1950), కలిశక విజ్ఞానం, ధ్రువనివాస ఖండనము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కోట వేంకటాచలం సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు. వీరు సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు; ఖగోళశాస్త్రంలో విశేషకృషి చేసారు. వాని ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు. సృష్టి ఆరంభం మొదలగు విషయాలలో పాశ్చాత్య విద్వాంసుల కాలగణనం, వారు వారు కూర్చిన భారతదేశ చరిత్ర సరైనవి కావని విమర్శించారు. మన పురాణాలలోనే భారతదేశ వాస్తవచరిత్ర దాగివుందని వీరి సిద్ధాంతం. ఆర్య విజ్ఞానం అనే పేరుతో ఒక బృహద్గ్రంథాన్ని వీరు 8 భాగాలుగా రాసి ప్రకటించాలని సంకల్పించారు. దానిలో మొదటి రెండు భాగాలుగా బ్రహ్మాండ సృష్టి విజ్ఞానము, మానవ సృష్టి విజ్ఞానము అనే గ్రంథాలను వీరు ప్రచురించారు. అవి పలువురి ప్రశంసలు పొందాయి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోట వేంకటాచలం ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు |
సంగ్రహ నమూనా రచన | ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు ప్రముఖ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం రచించి 1955 సంవత్సరంలో ప్రచురించిన తెలుగు పుస్తకం. ఆంధ్రులు అన్న పదం ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించిన అంధ్రులు అనే జాతి నుంచి వచ్చిందనీ ఆనాటి అంధ్రులే నేటి ఆంధ్రులనీ పాశ్చాత్య చరిత్రకారుల నిష్కర్ష. విశ్వామిత్రుని సంతతిలో ఆయన ఆజ్ఞ వ్యతిరేకించి సంఘబాహ్యులుగా మిగిలిపోయినవారని వారిని గురించి ఐతిహ్యం. దీనిని సవాలు చేస్తూ సాగింది ఈ గ్రంథం. అంధ్రులు ఆంధ్రులని చెప్పడం కేవల నామసామ్యం బట్టి చేసిన అత్యంత బలహీన ప్రతిపాదన అని శాస్త్రీయంగా దానిని నిరూపించేందుకు తగినంత బలం లేదని వాదించారు. ఆయన ఇతర పురాణేతిహాసాల నుంచి ఆంధ్రుల చరిత్రను స్వీకరించి ప్రతిపాదించారు. |
కోట వేంకటాచలం
ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు
ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు ప్రముఖ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం రచించి 1955 సంవత్సరంలో ప్రచురించిన తెలుగు పుస్తకం.
ఆంధ్రులు అన్న పదం ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించిన అంధ్రులు అనే జాతి నుంచి వచ్చిందనీ ఆనాటి అంధ్రులే నేటి ఆంధ్రులనీ పాశ్చాత్య చరిత్రకారుల నిష్కర్ష. విశ్వామిత్రుని సంతతిలో ఆయన ఆజ్ఞ వ్యతిరేకించి సంఘబాహ్యులుగా మిగిలిపోయినవారని వారిని గురించి ఐతిహ్యం. దీనిని సవాలు చేస్తూ సాగింది ఈ గ్రంథం. అంధ్రులు ఆంధ్రులని చెప్పడం కేవల నామసామ్యం బట్టి చేసిన అత్యంత బలహీన ప్రతిపాదన అని శాస్త్రీయంగా దానిని నిరూపించేందుకు తగినంత బలం లేదని వాదించారు. ఆయన ఇతర పురాణేతిహాసాల నుంచి ఆంధ్రుల చరిత్రను స్వీకరించి ప్రతిపాదించారు.
విషయసూచిక
1. ఆంధ్రదేశ స్తుతి (అప్పయ్య దీక్షితవాక్యము)
2. ఆంధ్రులు
3. చరిత్ర శాస్త్రము కాదు
4. ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరములు
5. సృష్టి క్రమము
6. బ్రహ్మావర్త దేశము
7. బ్రహ్మర్షి దేశము (ప్రథమవలస)
8. మధ్య దేశము (ద్వితీయవలస)
9. ఆర్యావర్తము (తృతీయవలస)
10. నాల్గవ, ఐదవ వలసలు
11. దక్షిణాపథము (ఆరవవలస
12. యక్షీయ దేశము
13. దస్యులు
14. భారత వర్షము
15. ప్రాచీన భారత వర్షము
16. అనులోమ, విలోమ శాఖలు
17. శక, యవనాది శాఖలు
18. మ్లేచ్ఛార్యుల ప్రపంచ వ్యాప్తి
19. ఆర్యుల భరత ఖండ వ్యాప్తి
20 ఆంధ్ర దేశము
21. రాజ నామముచే పిలువబడిన దేశములు
22. ఆర్యుల కురువర్ష నివాసము
23. ఆంధ్రరాజు కాలము
24. ఆర్యాంధ్రులు
25. మగధ రాజ వంశములు
26. శాతవాహనులు
27. ఆంధ్ర చక్రవర్తులు
28. కదంబవంశపు రాజులు ఆంధ్రులు
29. శైవ మత వ్యాపకులు
30. వీర శైవ మతము
31. రాజ పుత్రులు
32. కాణ్వశాఖవా రాంధ్రులు
33. ఆర్య శాఖలు
34. మ్లేచ్ఛులుగా పరిగణింపబడిన శాఖలు
35. విశ్వామిత్రుని – అతని కుమారుల గాధ
36. ప్రవరాంతరము
37. భార్గవ గోత్రజు డైన శుద్రశ్శేషుడు
38. ఆంధ్రోత్పత్తిని గురించిన అపవాద నిరాసము
39. అంధకులే ఆంధ్రు లనెడి వాద నిరాసము
40. అంధక వంశము
41. ఆశ్మక మూలకులు
42. ఆశ్మక, మూలకుల వృత్తాంతము
43. ఆంధ్రము, తెలుగు వేరు కావు
44. సారాంశము
45. జంబూద్వీపము-దాని విభాగములు
46. భూగోళ స్థిత జంబూద్వీపము
47. జంబూద్వీప నవవర్ష విభాగము
48. ప్రాచీన వర్ష విభాగములో చేరిన ప్రదేశములు
49. అమెరికాలో రాక్షసుల అస్థిపంజరములు
50. గ్రంథ సమాప్తి
ఆంధ్రులు
సృష్ట్యాదియందు “ ఆర్య జాతి “ తప్ప వేరు జాతి లేదు . ఆర్యులు భారత వర్ష మంతటను వ్యాపించి నివసించి యుండిన కాలములో నాయా దేశ భాగములను పరిపాలించిన రాజుల పేరున ఆయా దేశములు పిలువబడినవి . అట్టి దేశములలో నివసించిన ప్రజా లాయా దేశ నామములచే పిలువబడ జొచ్చిరి . అట్లు పిలువబడిన పేర్లతో వారే వేరు వేరు జాతులుగా గుర్తింపు బడి యుండిరి.
ఆర్యులు దేశ వ్యాప్తము నొంది నివసించియుండిన పిమ్మట ఒకానొక కాలమున తూర్పు భారత వర్షము “ప్రాచ్యక దేశ “ మణి పేరు గలిగి “ బలి “ యనెడి రాజుచే పరిపాలింప బడుచుండినది . అతని కుమారులా దేశమును విభాగించుకొని తమ పేర్లతో నా దేశ భాగమునకు పేరులు పెట్టి యేలిరి . వారిలో “ ఆంద్ర రాజు “ పరిపాలించిన భాగమునకు “ఆంద్ర దేశ “ మణి పేరు పెట్టబడినది . ఆ దేశమున నివసించుచుండిన చాతుర్వర్య ఆర్య ప్రజలు నా దేశము పేరున “ ఆంధ్రులు “ అని బిలువబదిరి . ఆర్య జాతియే ఆంద్ర జాతి యని పిలువబడినది . అది వేరు జాతి కాదు , ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరములలో సృష్ట్యాది నుండి “ ఆంధ్రు “లను పేరు వచ్చునరకు ఆంధ్రుల చరిత్ర ఆర్యులు చరిత్రయే గాని వేరు కాదు . అందువలన సృష్ట్యాది లగాయతు గల ఆంధ్రుల చరిత్ర ఆర్యుల పేరు మీదనే చెప్పబడును . దానిని ఆంధ్రుల చరిత్ర గానే తీసుకోనవలసియునుగని , అది ఆంధ్రుల కంటే వేరుగా గల ఆర్యుల చరిత్ర యని భ్రమ పడకూడదు . “ ఆంధ్రులు ‘ ఆర్యులేగాని యితరులు కారు . ఒకే జాతి వారు ప్రారంభములో “ఆర్యు “లనియు , కొంత కాలమునకు వారే దేశ నామముచే “ ఆంధ్రులనియు “ పిలువబడిరి . వారు రెండు జాతుల వారు కారు . ఏక జాతీయ లైయున్నారు . ఇదే ప్రకారము భారత వర్షములోని వివిధ రాష్ట్ర ములందు
నివసించెడి ఆర్యులును ఆయా దేశ నామములచే వివిధ శాఖలునైన వివిధ జాతులుగా పరిగణింపబడుచుండిరి . కని ఆసేతు హిమాచలముగా గల ఆర్యులందరూ ఏక జాతీయులైన ఆర్యులే యున్నారు . ఈ విషయము మనసునందుంచుకొని ఈ గ్రంధమును చదివిన “ ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరము “ లేనియో వివరముగా సృష్ట్యాది నుండియు తెలియగలవు .
“చరిత్ర “ శాస్త్రము (Science ) కాదు .
చరిత్ర యనున డొక శాస్త్రము కాదు . అది యొక కళ . నియమితమైన కొన్ని సూత్రములోఅచే బద్ధమై పఠన పాఠనము లచే అధ్యయనము చేయలసినదై యుండునది “శాస్త్రము “ ఇతరులు చేయుచుండిన పనులను చూచి వానిననుకరించి చేయుచు నేర్వ దగిన డానికి “కళ “ యని పేరు . కాల ప్రభావముచే సంభవించుచు ప్రత్యక్ష మగుచుండిన విషయములను , చూచినది చూచినట్టు గ్రంథస్థము చేయదగిన “కళకు “ “చరిత్ర “ యని పేరు . ప్రత్యక్ష , అనుమాన , ఉపమాన , శబ్ద ప్రమాణములచే నిరూపింబడుచునట్టిది “శాస్త్రము “ జరుగుచుండిన విషయములను చూచి తెలిసికొనదగినది “కళ “. “ చరిత్ర “ కళ యనిపించుకొనును గాని “శాస్త్రము “ కానేరదు . అందు వలన భారతీయుల శట్చాస్త్రములలో చరిత్రకు స్థాన ముచ్చుట కవకాశము లేకపోయినది . అది కళలలో చేర్చబడినది . “కళాహ్యసంతాః “ అను వచనమును బట్టి అది యనంతమగు కళలలో నొకటిగా పరిగణింపబడుతుంది .
భారతీయ వాజ్మయమున చరిత్రను స్థానము లేదనుట పొరబాటు లోకములో జరిగిన విషయములను చూచిన వాటిని చూచినట్లు వివరించుట యనెడి అల్ప విషయ మొక గొప్ప శాస్త్రముగా పరిగణింపబడుట అజ్ఞ లక్షణము . భారతీయుల పురాణేతిహాసాము లన్నియు వివిధ కాలములలో జరిగిన చరిత్రలనే చెప్పుచున్నది .జరిగిన చరిత్రను జరిగినట్లు , చూచిన దానిని చూచినట్లు , తాను వినిన దానిని వినినట్లు , తాను పూర్వ చరిత్రల వలన తెలిసికొనిన దానిని తెలిసికొనట్లు లిఖించుటకు తన ఊహాపోహాలతో నిమిత్తము లేదు . లోకమున సంభవించు సంభవము లోక నిర్ణీత పద్ధతి ననుసరించి కాని , కొన్ని సూత్రములకు బద్ధమై కాని జరగవు . అందు చరిత్రకారుని కెట్టి సంబంధము లేదు . చరిత్రకారుని ఊహాలు గాని , సిద్ధాంతములు గాని జరుగుచుండిన లేక జరిగిపోయిన సంభవముల మీద పని చేయ నేరవు .
చూచినది చూచినట్లు , వినినది విన్నట్లు , ప్రాచీన చరిత్రలలో తాను చదివినది చదివినట్లు నిబంధించటయే చరిత్రకారుని ధర్మము . తనకు తెలియనిది తెలియనట్లు , సందిగ్ధ విషయములు తనకు సందేహము లున్నట్లు స్పష్టపరచి చెప్పుటయే ఉత్తమ చరిత్రకారుని లక్షణము . అట్లుగాక ముందుగా తానొక నిర్ణయము చేసికొని తన నిర్ణయమును సమర్ధించుకొనుట కనుకూలంగా నుండు లాగున అసత్య కల్పనలు చేసి యతికించుటయు , తన ఊహా పోహలతో గూడిన సందేహ వాక్యములతో చారిత్రక కాలమున , విషయములను ఒక నిర్ణయమునకు దెచ్చి అదియే సత్య చరిత్ర యని ప్రచారించుటయు మొదలగునవి చరిత్ర కారులకు ప్రతిష్ఠ నీయజాలవు . కాల క్రమమున అట్టి వారి వ్రాతలు లోకము వలన నిరసింపబడి విసర్జిం పబడగలవు.
ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరములు
ఒక దేశము యొక్క గాని , జాతి యొక్క గాని చరిత్ర వ్రాయుటకు ప్రాచీన కాలము నుండి వచ్చు చుండిన సంప్రదాయముగాని లేక వ్రాత మూలకమైన పూర్వ చరిత్ర గాని ఆధారముగా నుండవలెను . అట్టి దేమియు లేక కేవల మొక మనుష్యని యొక్క ఊహలు , కల్పనలు , నమ్మకములు , సంభావ్యతలు మొదలగు వానితో వ్రాయబడినవి సత్యమైన చరిత్రలు కాజాలవు . అవి కల్పనా కథ లనిపించుకొనును .
ఏదియో యొక వార్తను విని దానిని తన యూహలతోను , కల్పనలతోడను పెంచి ప్రస్తుతము తన యనుభవము లోగల యొక విషయమున కాదుకు పెట్టి తాను మొదట వినిన వార్త యొక్క యాధార్ధ చరిత్ర యిదియేయని గ్రంధములల్లి లోకములో
రచన: కోట వేంకటాచలం
———–