తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharmarao Naidu)

Share
పేరు (ఆంగ్లం)Tapi Dharmarao Naidu
పేరు (తెలుగు)తాపీ ధర్మారావు నాయుడు
కలం పేరు
తల్లిపేరునరసమ్మ
తండ్రి పేరుఅప్పన్న
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/19/1887
మరణం5/8/1973
పుట్టిన ఊరుఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు
విద్యార్హతలుఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరారు.
వృత్తికల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936, పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960, ఇనుపకచ్చడాలు, సాహిత్య మొర్మొరాలు,
రాలూ రప్పలూ, మబ్బు తెరలు, పాతపాళీ, కొత్తపాళీ, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, విజయవిలాసం వ్యాఖ్య
ఇతర రచనలుhttp://ishtapadi.blogspot.com/2014/09/by_22.html
http://nemalikannu.blogspot.com/2014/09/blog-post.html
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుశృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు.
చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
మరెన్నో సాహిత్య పురస్కారములు.
ఇతర వివరాలు1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు.. ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.
తాపీని గౌరవంగా ‘తాతాజీ’ అని పిలిచేవారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతాపీ ధర్మారావు
పెళ్లి
సంగ్రహ నమూనా రచనపెళ్ళంటే సందడి; పెళ్ళంటే సంతోషం. ఒక మగవాడు ఒక ఆడది (ముకహ్యమైనవాళ్ళు) కొంత తంతు, కొంత వేడుక, కొంత విచారం…. పెళ్ళంటే తెలియని వాడెవ్వడు?
అయిన, పెళ్ళి సంగతి తెలిసినవారు చాల తక్కువ అవి అంటే సాహసంలాగ కనబడుతుంది. సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో—దేవతల పెళ్ళిళ్ళ సంగతి వదిలిపెతినా—కొన్ని కోటానుకోట్లు జరిగివుండాలి. ప్రతిరోజు-ఇప్పటికి-వందలు వేలు పెళ్ళిళ్ళు పర్పంచం అంతటా జరుగుతునాయి. పెళ్ళిళ్ళు చేసుకుని జీవిస్తున్నవారు వుండన్నే వున్నారు. పెళ్ళి చేసుకుని వియోగంలో పడ్డవారు మళ్ళి పెళ్లిళ్లకు తలపడుతున్నారు. పెల్లికానివాళ్ళు పెళ్ళిళ్ళ కోసం తొందరపడుతునారు. అందుకు చాలనివాళ్ళు బొమ్మల పెళ్ళిళ్ళతో తరిఫిదవుతున్నారు. చూడగా చూడగా ప్రపంచం అంతా పెళ్ళి కోసమే భాతుకుతున్నట్టు కనిపిస్తుంది.

తాపీ ధర్మారావు
పెళ్లి

పెళ్ళంటే సందడి; పెళ్ళంటే సంతోషం. ఒక మగవాడు ఒక ఆడది (ముకహ్యమైనవాళ్ళు) కొంత తంతు, కొంత వేడుక, కొంత విచారం…. పెళ్ళంటే తెలియని వాడెవ్వడు?
అయిన, పెళ్ళి సంగతి తెలిసినవారు చాల తక్కువ అవి అంటే సాహసంలాగ కనబడుతుంది. సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో—దేవతల పెళ్ళిళ్ళ సంగతి వదిలిపెతినా—కొన్ని కోటానుకోట్లు జరిగివుండాలి. ప్రతిరోజు-ఇప్పటికి-వందలు వేలు పెళ్ళిళ్ళు పర్పంచం అంతటా జరుగుతునాయి. పెళ్ళిళ్ళు చేసుకుని జీవిస్తున్నవారు వుండన్నే వున్నారు. పెళ్ళి చేసుకుని వియోగంలో పడ్డవారు మళ్ళి పెళ్లిళ్లకు తలపడుతున్నారు. పెల్లికానివాళ్ళు పెళ్ళిళ్ళ కోసం తొందరపడుతునారు. అందుకు చాలనివాళ్ళు బొమ్మల పెళ్ళిళ్ళతో తరిఫిదవుతున్నారు. చూడగా చూడగా ప్రపంచం అంతా పెళ్ళి కోసమే భాతుకుతున్నట్టు కనిపిస్తుంది.అలాంటపుడు పెళ్ళంటే తెలిసినవాళ్లు చాల తకువంటే సాహసం కదా?
అవును సాహసం కావాలి. అలా సాహసించి అడిగేవారు వుండాలి. అడుగుతెనేగని, అసలు సంగతి బయటపడదు. అడగడం అగ్యనం లక్షణం అన్న రోజులు పోయాయి. అటూ ఇటూ తొణకకుండా ఉంటే అంతా తెలిసిన మహామహుడు అని అనుకునే దినాలు గడిచిపోయాయి. అడిగినవాడే గ్న్యనానికి ఆధారపు చేపగాలిగినవాడే గొప్పవాడు తక్కిన గొప్పతనం అంతా విగ్రహపుష్టే.
అలా అడగడానికే పూనుకుంటే ప్రశ్నలు సరపరంపలు. దీనిని పెళ్ళి అని ఎందుకన్నారు? పెళ్ళంటే ఏమిటి? ఎందుకు ఆ పెళ్ళి చేసుకోవాలి? పెల్లంట్టు ఒకటి లేకపోతే కాదా? దానికిన్ని లాంచనాలు; ఆచారాలు ఎందుకోచాయి?………ఇలాగ వందలు వేలు అడగవచ్చును వీటిలో అనుభావంమీద చెప్పవలసిన కొన్ని; ఆలోచనచేసి విప్పవలసినవి కొన్ని; శాస్త్రాలు చూదవల్సినవి కొన్ని; చరిత్రలు తడవవలసిన కొన్ని; అంతా బీరకయపేచు. అంతేకాని సులభంగా తేలేది ఏది కనబడదు.
దీనికి పెళ్ళి అన్న పేరెందుకు వచ్చింది – కాకపొతే వివాహం, పరిణయం, కళ్యాణం ఏదైనాసరే – అన్న ప్రశ్న సభాసస్త్రజ్నులు చెప్పవలసింది – చెప్పుతారు గూడును; అతికినా అతకపోయిన “కుంతి పుత్రో వినాయకః” అని . ఆ వ్యుత్పతులు వాటి సంగతి, ముందు ముందు మనమూ చూదాం.
తరువాతి ప్రశ్న పెళ్ళంటే ఏమిటి? అంటే చదువుకున్నవారి భాషలో పెళ్ళికి నిర్వచనం చెప్పాలన్నమాట. నిర్వచనం చెప్పడం అన్నది చాల కష్టమైనా పని. మనిషి అంటే ఏమిటి అని అడిగి, నిర్వచనం చెప్పలేక చచ్చారు, మహా మహా పండితులు.
ఒక మహాజ్ఞాని చెప్పిన నిర్వచనం ఇంకొక సర్వజ్ఞుడు ఖండించేవాడు ఒక పండితుడు యిచ్చిన నిర్వచనం మరొక విద్వాంసుడు ఎగాతాల్లి చేసేవాడు రాత్రింబగల్లు మహాగ్నయనులంతా ఆలోచనలు చేసారు విమర్శకు తాల్లగాలిన నిర్వచనం ఏది చిక్కలేదు. మహారాజు నిరుత్సాహం ప్రకటించారు. అంతలో ఒక మహావిద్వంసుడు లేచి “మహారాజా! శ్రుస్టిలో వెండ్రుకలు లేని రెండు కాళ్ళ జంతువు మనిషీ అని నిర్వచనం చేయవచ్చునన్నుకుంటాను” అన్నాడు.
మరున్నాడు ఒక కొంటేకోనంగి విదంసుడు ‘ ఈకలు దూసిన’ ఒక కోతిని తేచి నిండు సభలో “ఇదిగో మహారాజా, మన మహా పండితుడు నిర్వచించిన మనిషీ” అని ఆ కోతిని చుపించాడు. సభావారాడరు నవ్వి గోలచేసారు.
అలాంటప్పుడు పెళ్ళి అంటే ఏమిటి అన్న ప్రశ్నకు నిర్వచనం అంత సులభంగా దొరుకుతుందా? ఫ్రాన్స్ పండితులు, జర్మన్ విద్వాంసులు, ఇంకా చాలామంది పెళ్ళంటే ఏమిటో చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత చేసినా గురికి బారెడు దూరంలోనే వుంది సమాధానం. ఎందుచేతనంటే- ఈ పెళ్ళి అన్నది ప్రపంచంలో ఒక దారినా, ఒక తెన్నునా వున్నట్టు కనబడదు.
క్రిందతికి ఒక రాజకుమారుడు ఎనుగుమిద అమ్బరీలొ కూర్చొని ఛత్రాచామరాలతోను, బాజాభాజంత్రిలతోను, బానాసంచులతోను, బోగోమేలతోను, దండు రాన్నువతోను “డెభ్భై నిఘలా” పెళ్ళి హడావుడిలో ఊరేగింపు చేసుకుంటూ వస్తునాడు. ఒక సందులో ఒకొఅ గుడిసెలో దగ్గర రెండు ధివితీలథొను, రెండు దప్పుల బదబదలథొనూ, నలుగురు మనుషులతోను కొంచెం సందడి కనిపించిందంట రాజు కోడుకి. అదేమిటి? అని ప్రక్కన్నున ఉద్యోగ్ని అడిగాడు. పోలిగాడి పెళ్ళి మహారాజా అని ఉద్యోగి జవాబు చేపాదట. రాజకుమారుడికి పెద్ద నవ్వు వచ్చింది. “హ హ్హ హ్హ! అదిగూడ ఒక పెల్లెనా?” అన్నాడట.
పాపం! రాజు కొడుకును ఏమి అనకూడదు. పెళ్ళి అంటే, తన అనుభవం వేరు: తానూ విన్నదీ చూచింది వేరు. పోలిగాడి పెళ్ళి అలాగా లేదు. దాన్ని పెళ్ళాని ఎలా అనుకుంటాడు? ఇంగ్లీషువారి పెళ్ళి మన చైనిలుగారి పెల్లిగాని కనబడుతుంది? యగ్య్నోపతి పటుకుని చెప్పమనండి? కడుపు అది పెళ్ళే అని. ససెమిరా౧ అన్గికించాడు. రష్యాలోని పెళ్ళి ఇంగ్లీష్ స్త్రీకి ఎలాగుంతుంది? పెళ్ళి అన్నటే కనిపిస్తుందా? మన పెళ్ళిళ్ళు చూచి నవ్వలేక చాచ్చినవరెంతమంది?
ఇవన్ని నాగారకులం అని అనుకుంటున మన సంగతులు. ఇంకా నాగరకత చాలనివి ఎన్ని జాతులు, ఎన్ని తెగలు, ఎన్ని దేశాలు ఉనాయి? వాళ్ళకు గూడా పెల్లిల్లునాయి. ఆ పెళ్ళిళ్ళు చూస్తే ఏమంటారు? వింటే ఏమనుకుంటారు?
ఇంత ఎందుకు? శ్రీ రామచంద్రుడి కాలంలోనూ, శ్రీ కృష్నుడున్డిన కాలంలోనూ పెళ్ళిళ్ళు చేఇంచిన మహామహులు పెద్ద పెద్ద పురోహితులు ఒక్కసారి పిలిచి, ఇప్పుడు జరుగుతున్నా మన పెళ్ళిళ్ళు చూడమనండి? కడుపు చేక్కలినట్లు నవ్వనినా నవ్వుతారు; కళ్ళు, చెవ్వులు మూసుకుని ఎకాఎకిని తిరుగు ప్రయన్ననికి బండి కట్టించానైనా కట్టిస్తారు. “ఇదిగూడా పెల్లెనా” అన్నమాటే వాళ్ళ హృదయాలలో మారుమ్రోగుతూ ఉంటుంది.
అని వ్యత్యాసాలను ఉన్నప్పుడు పెళ్ళంటే ఏమిటో చెప్పమంటే ఎవడి తరం? మనం చెప్పలగలమా? పెళ్ళి చేసుకుని గౌరవంగా బతుకుతూ ఉన్నట్టు కనబదేవల్లని ఒక్క పదిమందిని రహస్యంగా అడగండి- “పెళ్ళంటే ఏమిటండి?” అని. పదిమంది పదిరకాలుగా బదులు చెప్పకపోతే, ఇది ప్రపంచామేకాదు. ఒకడి దారి ఒకదిది కాదు. ఒకతే అనుభవం ఇంకొకతె కాదు.
చేతులారా మెడకు ఒక బండ కట్టుకోవడమే పెళ్ళి అంటాడు ఒకడు. కామ భోగాలకు-ఇతరులకు ఎలాంటి హక్కులూ లేకున్దాగుత్త తీసుకోవడం అంటుంది ఒకర్తే. ఇష్టం ఉన్నా లేకపోఇనా ఇల్లు గడుపుకోవడం అంటుంది ఒకర్తే. పగలంతా పరమ చాకిరి, రాత్రంతా రాద్ధాంతం రణరణలు పెళ్ళి అంటాడు ఒకడు. ఇంటిపేరు నిలబెట్టుకోవడానికి ఇదొక సాధన అంటా డొకడు. సంప్రదాయం అంతుం దోకర్తే. అదొక సందడి అంటుంది ఒకర్తే…..
ప్రశ్న కటినమిందే. ఇంతే వేగం ఆ ప్రశ్న అడగడం ధర్మం కాదు. ముందు అడగక తప్పదు; పెద్దలు పె ప్పె పె, మెమ్మెమె అనక తప్పదు. ఇప్పటికి మాత్రం తక్కిన ప్రశ్నలను గురించి ఆలోచిచావచ్చును. ఒక్క్కమాట మాత్రం మరిచిపోకూడదు. ప్రపంచం విశాలం. ఒకచోట ఉనట్లే మరొకచోట ఉండదు. కాలం నిరవధి. దీనికి అది అంతము లేదు. మొన్ననున్న మోస్తరు ఈవెళ్ళ లేదు; ఈవేల్లది రేపుండదు. సత్యం తెలుసుకోవాలి అంటే పుర్వనిస్చయలూ దురభిమానాలు కొంచెందూరంగా ఉంచాలి. నిష్కల్మంగా సంగతులు వినాలి. ఆపయిని విమర్శించాలి.

వినదగు నెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్
కానీ కల్లనిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

———–

You may also like...