పేరు (ఆంగ్లం) | Yammanuru Subrahmanya Sharma |
పేరు (తెలుగు) | యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమ్మ |
తండ్రి పేరు | శేషశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/25/1886 |
మరణం | – |
పుట్టిన ఊరు | అనంతపురంజిల్లా హిందూపురం తాలూకా కొండాపురం గ్రామం |
విద్యార్హతలు | శంకరావధాని గారి వద్ద వేద విద్య చదువుకున్నారు. కుందలగురికి వేంకటనారాయణకవి గారు ఇతనికి ఛందో వ్యాకరణాలు నేర్పించారు. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ పులివెందల రంగనాయకశతకము, శ్రీరుక్మిణీ కళ్యాణము, వామన చరితము, అనసూయ, సావిత్రోపాఖ్యానము, కర్ణాభ్యుదయము, శ్రీ భక్తజన మనోభిరామము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవిచంద్ర |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ శ్రీ కర్ణాభ్యుదయములోని కొన్ని రసవంతమైన పద్యములు |
సంగ్రహ నమూనా రచన | ఉ : కన్నెరికమ్ము గాచుకొన ; గాదిలి పట్టిని నొప్పిగించెదన్ బన్నగశాయిపాదభావ ; పాప విభంగ ; కృపాంతరంగ ;యో సన్నుత దివ్య గంగ ;నవ ; సారస భ్రుంగ తరంగ రంగ ; నా చిన్న కుమారునిన్ విజిత ; చిత్త రూపుని గావ వేడెదన్ . క : అనుచున్గొని యాడుచునా జన నాధుని పుత్రి ; మంజసన్బెను వరదన్ వనరుచు విడువగ నదియునున్ జనె నా పై నేమి సెప్ప ; జాలదు నధిపా ; |
యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ
శ్రీ కర్ణాభ్యుదయములోని కొన్ని రసవంతమైన పద్యములు
కుంతిదేవి యశ్వనీ నదిలో పేటికను విడుచుట ————
ఉ : కన్నెరికమ్ము గాచుకొన ; గాదిలి పట్టిని నొప్పిగించెదన్
బన్నగశాయిపాదభావ ; పాప విభంగ ; కృపాంతరంగ ;యో
సన్నుత దివ్య గంగ ;నవ ; సారస భ్రుంగ తరంగ రంగ ; నా
చిన్న కుమారునిన్ విజిత ; చిత్త రూపుని గావ వేడెదన్ .
క : అనుచున్గొని యాడుచునా
జన నాధుని పుత్రి ; మంజసన్బెను వరదన్
వనరుచు విడువగ నదియునున్
జనె నా పై నేమి సెప్ప ; జాలదు నధిపా ;
క : పెన్నేరో మున్నీరో
కన్నీరో తెలుపరాదు ; కాంతా మణికిన్
గన్నుల గారెడు సశ్రువు
లన్నన్నా ; జూడ నగునె ; యా ; యలమటయున్ .
——————పుత్రునికై కుంతీ దేవి దుఃఖించుట .————
ఉ : హా !యను ; ముద్దు గుల్కు తన , యా ;యను నిర్జిత సుందరాస్య చం
ద్రా ; యను దాపదుఃఖ రహి ,తా ; యను నిందిత శంబరారియా
పా ; యను దివ్య ధామ డిన , పా ; యను బంధుర భర్మ వర్మ దీ
ప్తా , యను గార్య మింక గలదా ; యను దానె నలేని వండచేన్
వ : తదనంతరంబ నలు దెసలంబరికించి ,
సి ; పుత్రుడా ; జిత కాంతి ; మిత్రుడా ; సౌవర్ణ
గాత్రుడా ; నీకునే ; శత్రు నైతిన్
జూతునా ; నిన్నింక ; నే తీరుగా నైన
బ్రీతిచే గనులార ; భూతలమున
నందనా ; నిను బాసి ; యుందునా ; మహి యందు
మందునా ,నేనింక ; గుందు వదలి
కొమరుడా ; నాపాలి ‘ యమరుడా ; మా ముద్దు
కొమరుడా ; యనదగు , కొమరువాద ;
గీ : చేతులారంగ జేసితి , పాతకంబు
నీతి దప్పితి నే పుత్ర , ఘాతి నైతి
భూతలంబున సత్కీర్తి ‘ వొంద నైతి
వేయు నేటికి నీకునే , దయ నైతి .
శ్రీ భక్త జన మనోభిరామము
సీ : మోకులంబిగగట్టి , మోకరించుచులాగి
వీక తో గేకలు , వేయువారు ,
గోవింద , గోవింద , గోవింద , యనుచును
తేరీడ్చుటకు , ముందు దెరలు వారు ,
తేరు చక్కియందు , జేరి బారులుదీరి
బూర గొమ్ములనూది, పొనరువారు ,
జయ వెంకటాద్రీశ ; జయ శేష శై లేక ;
జయదేవ సర్వేశ , జయతు యనుచు,
గీ : సొరిది కరతాళముల దట్టి , తిరుగు వారు
చెలగి హరినామకీర్తనల్ . సేయువారు
గ్రక్కునను శౌరినట గాంచి , మ్రొక్కు వారు
మొట్ట మొదలున ముడుపులు , గట్టు వారు ;
సీ : నేత్ర హస్తుల పంక్తి , వేంకటేశుని మ్రోల
వ్రాలి మున్నడి బరా , బరులు సలువ
భూమీ సరోత్తముల్ , వేమరు స్వామికి
వింజా మరమ్ములు , వేయుచుండ
సాధ్వీమణులు గూడి , సాగు , యరదముపై
మల్లియల్ , మొల్లలు , జల్లువారు
వేల్పు బానిస లెల్ల , చాల్పుగా నిలుచుండి
నతు లొనర్చుచు , నర్తనములు సలుప
గీ : వేద నాదంబుచే , ద్విజుల్ , విల్లసిలగ
తూర్య నిసదంబులమితసం , తోష మొసగ
హారతులనెత్తి రహిజెంది , యబల లలర
వేంకటేశుండు రధమున , వెలుగు చుండె
———–