ఒద్దిరాజు రాఘవ రంగారావు (Oddiraju Raghava Rangarao)

Share
పేరు (ఆంగ్లం)Oddiraju Raghava Rangarao
పేరు (తెలుగు)ఒద్దిరాజు రాఘవ రంగారావు
కలం పేరు
తల్లిపేరురంగనాయకమ్మ
తండ్రి పేరువేంకటరామారావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/4/1894
మరణం1/1/1973
పుట్టిన ఊరుమానుకోట తాలూకా ఇనుగుర్తి
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://www.visalaandhra.com/literature/article-132325సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు
స్వీయ రచనలువీరావేశము, వరాహముద్ర, పంచకూళ కషాయం, విషములు – తచ్చికిత్సలు,
సప్తపది, ఉత్తర గురు పరంపర, ఆర్త ప్రబంధం, సప్తగాథ, గురుపరంపరా ప్రభావం
ముదలయిరం, వణ్ణమా డంగల్, మత్కుణోపాఖ్యానం, తపతీ సంవరణోపాఖ్యానం,
లండన్ విద్యార్థి (కథ)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఒద్దిరాజు సోదరులు విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి వందకు పైగా తెలుగు పుస్తకాలను ప్రచురించారు. ఈయన తెలంగాణా ప్రాంతంలో మొట్టమొదటి పత్రిక ‘తెనుగు పత్రిక’ను 1922లో ప్రారంభించిన ఒద్దిరాజు సోదరులలో ఒకరు. పత్రిక ద్వారా జనసామాన్యంలో విజ్ఞానవ్యాప్తికి, దేశభక్తి పెంపొందించడానికి ఎంతో కృషి చేసారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఒద్దిరాజు సోదరుల
నీవేనా
సంగ్రహ నమూనా రచనరామారావు రామనాధపురం జమీందారు . గోలకొండ వేపారి , విద్యా వైదుష్యములు తక్కువ యున్నాను పోఖ్తంగా సంసారము జరుపుకొనుచు పది కాసులు సంపాదించి యుంచెను . ప్రస్తుతపు కొందరు జమీందారుల వలె ఏ హైదరాబాదు లోనో , యెవ్ మదరాసులోనో కాపురముండి తమ జమీందారీ గ్రామములు నల్లగా నుండునో తెల్లగా నుండునో తెలియక సమస్తము దివాను మీద కట్టి పెట్టి నిరంతరం డబ్బు జరిపించుమని వ్రాయుచు , మోటార్లుకు , సాని మేళములకు , తోట విందులకు , సినిమే టోగ్రాపులకు , కంపెనీ డ్రామాలకు , కాఫీ హోటళ్లకు ధారవోసీ దివాను తన రైతుల నెట్ల పీడించుచున్నది

ఒద్దిరాజు సోదరుల
నీవేనా

రామారావు రామనాధపురం జమీందారు . గోలకొండ వేపారి , విద్యా వైదుష్యములు తక్కువ యున్నాను పోఖ్తంగా సంసారము జరుపుకొనుచు పది కాసులు సంపాదించి యుంచెను . ప్రస్తుతపు కొందరు జమీందారుల వలె ఏ హైదరాబాదు లోనో , యెవ్ మదరాసులోనో కాపురముండి తమ జమీందారీ గ్రామములు నల్లగా నుండునో తెల్లగా నుండునో తెలియక సమస్తము దివాను మీద కట్టి పెట్టి నిరంతరం డబ్బు జరిపించుమని వ్రాయుచు , మోటార్లుకు , సాని మేళములకు , తోట విందులకు , సినిమే టోగ్రాపులకు , కంపెనీ డ్రామాలకు , కాఫీ హోటళ్లకు ధారవోసీ దివాను తన రైతుల నెట్ల పీడించుచున్నది గ్రహింపక ఎక్కువ డబ్బు పంపించెడి దివానులకు ప్రమోషను నిచ్చుచుండెడి వారి వలె గాక రామానాద పురములోనే యుండుచు రైతుల కష్టనిష్టురములు స్వయముగా విచారించుచు తాను బాగుపడుచు రైతులు మంచి స్థితి యందుంచు చుండెను .
రామారావునకు రాజారావను వొక కుమారుడు గలడు . తలిదండ్రులకు కొంచెమీడు బోయిన పిమ్మట కలుగట వలన కడుగారాబము గావించు చుండెను . నానా విధములయిన యుడువులు ధరించుట యందును గుఱ్ఱము సవారి చేయుట యందును నాతనికి గల శ్రద్ధ చదువునందు లేదు . శ్రీకారము పర్వతాకారము . కొడుకునకు శ్రద్ధ లేకున్నను చదువుకొనుమని తండ్రియైనను ప్రోత్సహించుట లేదు . ఎవరయిన మీ కుమారుని చదువు విషయమయి మీరు పట్టించుకొనుట లేదేమని యడిగిన “ మాకట్టి చదువుతో నేమివని , భగవంతుని కృప వలన మాకంతో యింతో మిరాసి గలదు . ఏమి ఆధారములేని వారికి చదువుగాని మాయట్టి వారి కెట్లైనా సరే “ యని యనును . అందువలన రాజారావు చదువును గురించి యాత్ర తంబయయ్యెను .
రాజారావుకు పదమూడు సంవత్సరములు వయస్సు వచ్చెను . జమీందారుల యిండ్లలో యీ యీడు వరునకు వివాహమై తీరవలయును . అందు బాపని దొరల యిండ్లలో యీ యీడునకు పెండ్లి కాకపోవడ ఎంత యైనను నా మోషి , మూడు వేల వరదక్షణతో కల్పనూరు దేశముఖు కూతురు లలిత కోడలుగా వచ్చి చేరును .. పెండ్లి కూతురు కొడుకు బాణ సంచా , బ్యాండు వాయిద్యము మొదలగు వినోదములు గని సంతసించిరి . తమ యావజ్జీవ కాలమండీ లాగున సంతోషమే జరుగునని యనుకొను చుండిరి కాబోలు .
2
ఆరు సంవత్సరముల కాలమున గడచిపోయెను . లలితకు యౌవన దశ వచ్చెను . కల్పనూరు దేశముఖు వెంకటరావు తన వియ్యపునకు శుభకార్యము జరుపుకొనపోవు టకు జాబు వ్రాసెను . రామారావు అయిన భార్య మిక్కిలి సంతసించిరి . రాజారావునకు గూడ కుతూహలముగానే యుండెను . ఒక దినము నిర్ణయింప బడినది . తలిదండ్రులు కుమారుడు కతిమయ బంధుభట వర్గముతో కల్ప నూరికి చేరిరి . కార్యము జరిగెను . వారము దినముల పాటందరు కలసి మెలసి యుండిరి . రామారావు ఇంటికి జనుటకు తన కోరికను వియ్యంపునకు తెలిపెను . ఆయన అల్లుని పది దినముల పాటుంచుకొని తోలెదనని వియ్యంపుని వేడుకొనెను . రామరవందులకు సమ్మతించి కుమారుని అత్తవారింట విడచి తానొంతరిగా పయనమయ్యెను . తక్కిన బంధువులందరెక్కడి వారక్కడ జనిరి .
3
సంపదలు చెప్పిరానట్లే ఆపదలును చెప్పిరావు . అవి వాని యంతయని వచ్చును పోవుచునే యుండును . ఆనాడు ….. దేశ ముఖు పదవి వెంకటరావు జ్ఞాతులు …..యభి యోగము వలన ఆటనకు లేకుండ నయ్యెను . అనగా విచారణ ముగియు వరకు వెంకటరావు గ్రామమందు దేశముఖాగిరి పదవి చెల్లించుకొన గూడదు . వెనుకటి కాలమున అన్ని విషయములకును సర్కారు వారికి సాయపడుచుండుల కతంబున దేశమందు కొందర ముఖ్యులకు దేశముఖు పదవి యెసంగి కంత ద్రవ్య ముపకార వేతనముగా ప్రభుత్వము వారిచ్చు చుండిరి . మన కథ నాటికి దేశముఖులు సర్కారు వారికెట్టి సాయము చేయవలసిన యవసరము లేకున్నను ద్రవ్యము మాత్రము బొందుచు గ్రామమందు ప్రభుత్వము చేయుచునే యుండిరి . సర్కారు వారి పని చేయుటకు నియ మింపబడిన సేతు బందీ వెట్టి వాండ్రు తప్ప తక్కిన వేళలయందు దేశముఖు నౌకరి చేయవలసి యుండెడిది . అందువలన వెంకటరావు జీతగాండ్లుకు స్వంతమునకై పెట్టుకొనలేదు , పదవి పోయినంతనే పనివాండ్రు …. వెంకటరావు యింటికి వచ్చుట మానివేసిరి . ఇతరుల కొలువులుండ కూడా చేసిరి . పూలు అమ్మిన యూరిలో కట్టెలమ్మినట్లు పదవి పోవుట , బజారు సామాను తెచ్చుటకు సైతము పనివాడు లేకుండ బోవుట యీ యవమానముల వలన వెంకటరావు గుండె బగిలి మంచమెక్కెను . యీచట యేడెనిమిది తరముల నుండి వచ్చుచున్న దాన వంశమందలి యొక ముసలి సేవకుడు తప్ప మరెవ్వరును లేరు . క్రమక్రమముగా వ్యాధి బలిష్టమగు చుండెను . మందు లేదు . వైద్యుడు లేడు . వీనికి వెళ్లు వారులేరు . అల్లుడ భిమాన ధనుడు . ఆపత్కాలమందు మామకు సాయపడుత తన పరువును కెంతయో నష్టము . మామగారింటి సేవక బలము చూచుకొని తన చెంత నొక సేవకునియు రాజారావుంచలేదు . తాను పోను లేదు . అత్తయైనను పోవుటకు నాల్గు తెరల చాటున ఘోషాయందున్న దిగుట కతంబున యామెయు పోయి మందు తెచ్చుటకు వీలు గలుగ కుండెను . ఒకంటి రెండు సారులు ఘోషా వదలి కూడా తెరచాటు నుండి అల్లుని మామకు మందు తెచ్చి సాయపడుమని ప్రార్ధించెను . కాని ఆమె ప్రార్ధన అల్లునకు విపరేతముగా తోచినది . తన తండ్రికి యెరుక లేక యీ సంబంధము కుదరించినాడు కాని మాతౌరున కు తగిన సంబంధము కాదు . అల్లుండంటే వీండ్లు సేవకుడని అనుకొంటూ వున్నారు . ఎవరికే పనులు చెప్పవలెనో వీరికి తెలియనే తెలియదు అని ఆక్షేపించెను . ఆ యదిక్షేపణము రోహి యగు మామ విని “ అయ్యో వారికెందుకు పని చెప్పుచున్నారు . ఈ స్థితిలో దిక్కులేక చావవలసిన వ్రాత నాకు వ్రాసి యుండగా యెవరు సాయపడెదరు . అల్లుడే నాకుండేది యాతడయిన నాకీయవస్థ యే ప్రాప్తిందు “ అని తనలో తాను గొణుగు కొనెను .

రచన :ఒద్దిరాజు సోదరులు

———–

You may also like...