గాడేపల్లి వీరరాఘవశాస్త్రి (Gadepalli Veeraraghava Sastry)

Share
పేరు (ఆంగ్లం)Gadepalli Veeraraghava Sastry
పేరు (తెలుగు)గాడేపల్లి వీరరాఘవశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుగాడేపల్లి శివరామదీక్షితులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/30/1891
మరణం3/5/1945
పుట్టిన ఊరు
విద్యార్హతలుఉపనిషత్పంచకము మొదలైనవి అభ్యసించారు. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద కావ్యపఠనము చేశారు. నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశారు.
వృత్తిగద్వాల సంస్థానంలో చాలా కాలం ఆస్థాన పండితుడిగా ఉన్నారు. అంతకు ముందు మార్కాపురంలో ఆంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుత్రిపురాంతక స్థల మహాత్మ్యము (3 ఆశ్వాశముల కావ్యము), సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము (1947), అహోబల మహాత్మ్యము (1919), మార్కండేయ చరిత్రము (హరికథ), రామభూపతి శతకము (1914), దీనకల్పద్రుమ శతకము (1916),
విశ్వేశ్వర శతకము (1916), సోమేశ్వర శతకము (1916), చెన్నకేశవ శతకము (1916)
ఆర్యవిద్యా ప్రబోధిని, ద్విపద భగవద్గీత, ముకుందమాల(ఆంధ్రీకరణం), పింగళ హరికథ, సాంబలక్షణ(శృంగారకావ్యము), హైమవతీ పరిణయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుగాడేపల్లి వీరరాఘవశాస్త్రి గారు గొప్ప కవి. శతావధాని. ఇతడు మొదటిసారి 1913లో తన విద్యాగురువు రాళ్ళభండి నృసింహశాస్త్రి అధ్యక్షతన ఎఱ్ఱగొండపాలెంలో అష్టావధానం నిర్వహించారు. తరువాత 1938 వరకు 25 సంవత్సరాలు సుమారు 200 అవధానాలు చేశారు. ఈయన నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, బళ్లారి, చిత్తూరు జిల్లాలలోను, తెలంగాణా జిల్లాలలోనూ, మైసూరు రాష్ట్రంలోను అష్టావధానాలు, శతావధానాలు ప్రదర్శించారు. ఇతడు ఘంటాశతము అనే అవధానాన్ని అంటే ఒక గంటలో ఒక శతకాన్ని ఆశువుగా చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పేరు గడించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగాడేపల్లి వీరరాఘవశాస్త్రి
చమత్కార కవిత్వములోని కొన్ని పద్యములు
(చాటువులు )
సంగ్రహ నమూనా రచనఉ : తుమ్మపల్లి కామయ సుతుండు , వితంతుల గేశ యుక్తలన్
రమ్మని కౌగిలించి , యధరంబున జుంబన మాచరించి , దో
సమ్మని యెంచ కే రతుల సంతస మందుచు నుండు , నిట్టికా
ర్యమ్ములు వీరి పూర్వు లెవరైన నరెంగిరె ? యెంచి చూడగన్
ఉ : గుప్పున మంచి వాసనలు గుప్పెడి పాటి పొగాకు నిప్పునన్
జొప్పడ గాచి గోఘ్రుతము సున్నము గూర్చి , పురాణ వేళలన్
దప్పక నాశయ మిచ్చు నిరతంబు బుధాళికి ; గాడేపల్లి కో
టప్పకు గల్ప భూజ కలశార్ణవ కర్ణులు సాటి వత్తురే ?

గాడేపల్లి వీరరాఘవశాస్త్రి
చమత్కార కవిత్వములోని కొన్ని పద్యములు
(చాటువులు )

ఉ : తుమ్మపల్లి కామయ సుతుండు , వితంతుల గేశ యుక్తలన్
రమ్మని కౌగిలించి , యధరంబున జుంబన మాచరించి , దో
సమ్మని యెంచ కే రతుల సంతస మందుచు నుండు , నిట్టికా
ర్యమ్ములు వీరి పూర్వు లెవరైన నరెంగిరె ? యెంచి చూడగన్
ఉ : గుప్పున మంచి వాసనలు గుప్పెడి పాటి పొగాకు నిప్పునన్
జొప్పడ గాచి గోఘ్రుతము సున్నము గూర్చి , పురాణ వేళలన్
దప్పక నాశయ మిచ్చు నిరతంబు బుధాళికి ; గాడేపల్లి కో
టప్పకు గల్ప భూజ కలశార్ణవ కర్ణులు సాటి వత్తురే ?
దైవము దిన్నె రామారెడ్డి గారి స్థానములో రాఘవ గారి కోక గొప్ప సమాధానము పద్యములలోనే చెప్పుదురు గనుక , రాఘవ శాస్త్రి గారితో , వినోద కాల క్షేపములు జరుగుచుండును . అక్షయ సంవత్సర , వసంత వచ్చి నవరా త్రోత్సవములకు రెడ్డి గారింటికి , మదరాసు నుండి బంధువులు వచ్చియుండి , రాఘవ శాస్త్రి గారితో పెద్దన తన కవిత్వమును గురించి మాలిక చెప్పి కొని యుండె గదా ! మీ కవిత్వమును గురించి మీరేమైన మాలిక చెప్పగలరా ? యని వినోదముగ నడిగిరట , అపుడు అత్యాశువు వ్రాసి కొనుడని .
చం : సరిదసమాన వేగమున జక్కని చిక్కని ధారతోడ , నీ
సరసులు వహ్వరే ; యన , రస ప్రసార ప్రాచుర ప్రవాహముల్
దారులకు బొంగి పొరల , మిగులన్ గురి యింపవె , పద్య వృష్టినో
పరమదయాప యోనిధి ; సధాజన వశ్యకరీ ; మహేశ్వరీ ;
అని ప్రార్ధించి , 84 చరణములు గల ఉత్పలమాలికను ఆశువుగా చెప్పిరి .
ఉత్పలమాలిక
(84 చరణములలో 16 మాత్రము )
శ్రీ రమణీయులార ; సరసీరుహ నిర్య దమంద మాధురీ
సార వచస్కులార ; విలసత్క మనీయ మశో విలాసినీ
హారి విహారులార ; పర మాదుర మేదుర చిత్తులార ; ఓ
సూరి వరేణ్యులార ; పరిశుద్ధ వచోరచనాచమత్ర్కి యా

సార రాసానుభావ , గుణసార సమంచిత వృత్త రీతి , వి
స్తార మదీయ దివ్య కవితావనితాభి రతి ప్రసక్తి సం
స్కారము లిందు జూపుటకుగా నిదె కోరితి ;రేను బూనితిన్ ;
ధోరణి విన్నచో – గనక తోయజ కాండ వినిన్సర ద్రసా

సారమయ ప్రవాహరుచి సారెకు దోచు ; నల్లి కల్
గూరుచుచో – వసంత నవ కోమల పల్లవ వెళ్ళ దుల్లతా
గార నిరంతరాయ పరికల్పన నుల్లస మాడు -; వ్యంగ్యపు
న్నేరుపు జూప నెంద – రమణీయ మహో జ్జ్వల యౌవన ప్రభా

చారు విలాస సంభరణ సారసపాణి విలాస వాక్చమ
త్కార విశేష వైఖరులు కన్నుల గట్టినయట్ల తోచు -;నో
రూర గ జేయు మత్కవిత నూకొను భాగ్యము గల్గినంత – శృం
గార రసానుభావ పరికల్పిత యౌవన ఘూర్ణ మాన పం
…………… ……………. ……………..
అని గడగడ చెప్పి వేసిరట . ఇట్టి కవితాధార మన సీమ కవులకే కలదని వీర రాఘవ శాస్త్రిగారు చాటి చెప్పిరి . తెనుగు తల్లికి దివ్యాలంకార భూషితమగు ఉత్పలమాలిక నందించిన ఘనత పెద్దన్న తరువాత వీరికే దక్కినది .

———–

You may also like...