పేరు (ఆంగ్లం) | Kappagallu Sanjeevamurthy |
పేరు (తెలుగు) | కప్పగల్లు సంజీవమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | మల్లమ్మ |
తండ్రి పేరు | భీమారావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 2/7/1894 |
మరణం | 6/13/1962 |
పుట్టిన ఊరు | కప్పగల్లు గ్రామం, బళ్ళారి, కర్ణాటక రాష్ట్రం |
విద్యార్హతలు | ఎస్.ఎస్.ఎల్.సి |
వృత్తి | బళ్ళారి మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | కన్నడం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మేఘ ప్రతి సందేశము (1937), మయూరధ్వజ చరిత్రము, శ్రీ వరసిద్ధి వినాయకస్తవము (1958), వంశము, గీతాసుధాసారము, నవ్యగాథాలహరి, ఒక శరద్రాత్రి అది, వేణువు, అహల్య (ద్విపద), ద్రౌపదీ మానసంసరక్షణ కీ.శే. కోలాచలం శ్రీనివాసరావు గారి జీవితము (గద్యం), గయోపాఖ్యానము (నాటకం) వేనుడు (నాటకం), రుక్మిణీ కల్యాణము, కృష్ణరాయబారము |
ఇతర రచనలు | http://andhraamrutham.blogspot.in/2015/05/18.html#.V6hWmrh97IV శ్రీ గీతాసుధా సారము |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవిభూషణ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కప్పగల్లు సంజీవమూర్తి మేఘ ప్రతి సందేశము |
సంగ్రహ నమూనా రచన | మహా కవి కాళిదాస కృత మగు మేఘ సందేశ కావ్యమునందు జెప్పబడిన యక్ష సందేశ వచనములకు నతని భార్య యొసగిన యనురూప ప్రతి వచనములే ప్రతి సందేశ కావ్యము . ఈ ప్రతి సందేశ కావ్యమును గీర్వాణ భాష యందు మైసూరు కహా రాజాస్థాన విద్వత్క విరత్నమగు బ్రహ్మ శ్రీ మండికల్ – రామా శాస్త్రి గారిచే రచించబడినది . ఆ శ్లోకములను వృత్తములతో నాంధ్రమున శ్రీ రావాడ వెంకట రామా శాస్త్రి గారు ననువదించిరి . ఆ వృత్తముల నొక్కక్కటిని రెండేసి గీతములుగ శ్రీ కప్పు గల్లు సంజీవమూర్తి గారు నాంద్రీకరించిరి . విపులమగు విషయమును సంగ్రహించు కార్యము రావాడ వారొనర్చగా , సంకుచిత విషయమును వెల్తిగాకుండ విశదీకరించుపని కప్పగల్లు వారొనర్చి ధన్యలైరి . కాళిదాసుని మేఘ సందేశమువలె నిదియు సర్గద్వయాత్మకమే ; మందా క్రాంత వృత్త యుతమే . కవి , విరహ తాపభర పరీతస్వాంతులగు యక్ష దంపతుల నొకచో జేర్చ్జి ధన్యులైరి . |
కప్పగల్లు సంజీవమూర్తి
మేఘ ప్రతి సందేశము
మహా కవి కాళిదాస కృత మగు మేఘ సందేశ కావ్యమునందు జెప్పబడిన యక్ష సందేశ వచనములకు నతని భార్య యొసగిన యనురూప ప్రతి వచనములే ప్రతి సందేశ కావ్యము . ఈ ప్రతి సందేశ కావ్యమును గీర్వాణ భాష యందు మైసూరు కహా రాజాస్థాన విద్వత్క విరత్నమగు బ్రహ్మ శ్రీ మండికల్ – రామా శాస్త్రి గారిచే రచించబడినది . ఆ శ్లోకములను వృత్తములతో నాంధ్రమున శ్రీ రావాడ వెంకట రామా శాస్త్రి గారు ననువదించిరి . ఆ వృత్తముల నొక్కక్కటిని రెండేసి గీతములుగ శ్రీ కప్పు గల్లు సంజీవమూర్తి గారు నాంద్రీకరించిరి . విపులమగు విషయమును సంగ్రహించు కార్యము రావాడ వారొనర్చగా , సంకుచిత విషయమును వెల్తిగాకుండ విశదీకరించుపని కప్పగల్లు వారొనర్చి ధన్యలైరి . కాళిదాసుని మేఘ సందేశమువలె నిదియు సర్గద్వయాత్మకమే ; మందా క్రాంత వృత్త యుతమే . కవి , విరహ తాపభర పరీతస్వాంతులగు యక్ష దంపతుల నొకచో జేర్చ్జి ధన్యులైరి .
ఈ కావ్యము అనంతపురం జిల్లా ఉరవకొండ యందలి మారుతీ గ్రంధమండలి వారిచే ప్రచురించబడినది .
గీ : ఆర్త బాంధవ – యోపయోదా ; యిదేల
ప్రియుని శుభవార్త పలు మారు విని యునిట్లు
మాటి మాటికి నడుగు నీ మగువ యనుచు
విసుగు గొన బొక – కరుణింపవేడుదాన;
గీ : దూర గతుడగు నాదయితుండు సతము
మంద భాగ్యనౌ , నాకయి మమత గూరి
క్లాంత చిత్తు డై కడు ధీన గతి ఘటింప
నడలు చెబ్ఫంగి దినములగడ పు వాడొ ?
గీ : జలధరా ; నా యొనర్చు విజ్ఞాపనంబు
నాధునకు దెల్పి నీ సుజనత్వ గరిమ
చాటుమని మాటి మాతికంజలి ఘటించి
దీననై , మనసార బ్రార్థించు దాన .
…………….. …………………….. ……….
గీ : విరహతా పోష్ణ , ముపశాంతి బొరయు కొఱకు
నరవిరుల సెజ్జ , లేత తామర ల సెజ్జ
జలువ రా సెజ్జ గాయంబు జాఱవిడితి
జందనాదిక సకల చర్చలను గొనితి ;
గీ : అయిన హృదయ మొక్కటను జల్లారదయ్యో ;
నరసి చూడ , నీ విరహ సూర్యా తపంబు
వసుధ యందలి శీతలత్వంబు నెల్ల
నొక్కసారియె హరియించి యుండ బోలు
శ్రీ వరసిద్ధి వినాయకస్తవము
ఉ : పొట్టిగ నున్ననేమి ?కడుపున్ గను డుబ్బిన దెల్ల విద్యలున్
గుట్టుగ , సందెడా గె , నవిగో ; వినలేదొకొ ? పొట్టి వానికిన్
పుట్టెడు బుద్దు లన్ననుడి మున్నను కొంచును భక్తి బాలురే
దిట్టనివద్య కై , కడునుతింతురె , యాతడు , మమ్ము బ్రోచుతన్
ఉ : తెల్లనిగట్టు కాపురము , తెల్లని గిత్తసి డంబు , తానునున్
దెల్లనిసామి , యౌదలకు దెల్లని గంగ , రుమాలు , సోమ్ములున్
దెల్లని పాపపెరులును – దెల్లని క్రొన్నెల ; యట్టి శూలికిన్
నల్లని , కాళి , యాలనుచు , నవ్వు వినాయకు డేల మమ్ములన్
ఉ : పొంగెడు భక్తి తోడధనువుల్ పులకింప , ముద శ్రులూర , సా
ష్టాంగ నమ స్క్రుతుల్ వెలయ బ్రార్ధన సల్పెడు , మామనంబు ,లు
ప్పొంగ గ , సర్వ మంగళకు బుత్రుడ వౌటది , సార్ధకంబు గా
మంగళమూర్తి మా కెపుడు , మంగళముల్ , సమ కూర్చుచుండుమా .
కవి గారీ కృతిని శ్రీయుతులు అప్పకాయ సూర్య నారాయణ శాస్త్రుల గారి ప్రోత్సాహమున తెనిగించిరి . కవి గారె రింగి నంత వరకు దాదాపు వారు అర్ధ శతమాన నుండి ప్రతి సంవత్సరము శ్రీ విఘ్నేశ్వర పూజా మహోత్సవమును బరభక్తి పురస్సర ముగను , మిగుల విజ్రుంభణముగను జరుపుచుండిరి . ఆ సందర్భములందు శ్రీ గణాధి పుని మీద శ్లోక ములనో , పద్యములనో రచింప జేసి , యచ్చు వేయించి వాటిని భక్తులకు బంచి పెట్టుచుండిరి . ఆ అవకాశము శ్రీ సంజీవ మూర్తి గారికి ప్రతి ఏడు లభించినది . ఆ కృషియే యిట్లు శతక రూపమున వెలసినది . దీనిని ప్రోత్సహించిన శ్రీ శాస్త్రుల వారే ముద్రించిరి . కవి గారి మిత్రులైన శ్రీరావాడ వెంకట రామ శాస్త్రి గారీ పోత్తముపై చక్కని యభిప్రాయమును వ్రాసిరి .
కరి “నభవుండు “ ద్రుంప , ‘హరి ‘ కాచుట తెల్పి భవాని నవ్వుచున్ “గరి వదనుండు “వీవిట నికన్ వసియింపకు ; శౌరి పజ్జకున్ దరలు “ మటన్న “ బుట్టని యతండు విధించునె ? సింగ మోమునే కరి “ నని మారు పల్కి నగు గౌరితనుభవుడేలు మమ్ములన్ .
ఈ పద్యములో నగు గణేశుని గాంచి లోక సామాన్య రీతిగ “ నాయనా , నీ విట్టి వాడు , నీ తండ్రి యట్టివాడు , మీమామ యెద్ద కుబొమ్ము ‘ అనుట యందరి తల్లులు తమ బిడ్డలతో ముచ్చటగ నను కొనుచుండు సామాన్యోక్తి , దీనిని కవి ఎంత ముచ్చట గ జిత్రించి నాడో ఆయా వ్యక్తుల పూర్వ గాధల నాకళించుకొన్న , దెల్ల మగును .
చం. మెలికలుదీఱి నిట్టనగు మీసము సౌరు, గభీరముద్రతో
నలరు మొగంబు, జానువులునంటెడు బాహులు, వామభాగమం
దొలయు సుధీర్ఘ ఖడ్గము, మహోన్నత వక్షము గల్గు కృష్ణరా
యల శుభమూర్తి మా కనుల కబ్బెడుగా తలంచు మాత్రలోన్.
చం. అలఘపరాక్రమంబు, కరుణాంచితదృష్టి, అఖండపాండితీ
కలిత కవిత్వ వైభవము, కావ్యరమావరణంబు, నిత్య ని
స్తుల సుకవి ప్రకాండ పరితోషణముల్ గల్ కృష్ణదేవరా
యలను స్మరింపనేర్చుటే కృతార్థత యాంధ్ర కవీంద్రకోటికిన్.
———–