బేవినహళ్లి కరణము కృష్ణారావు (Bevinahalli Karanamu Krishnarao)

Share
పేరు (ఆంగ్లం)Bevinahalli Karanamu Krishnarao
పేరు (తెలుగు)బేవినహళ్లి కరణము కృష్ణారావు
కలం పేరు
తల్లిపేరునరసమాంబ
తండ్రి పేరుశ్రీ నరసింగరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/9/1894
మరణం
పుట్టిన ఊరుబేవినహళ్లి , హిందూపురం తాలుకా, అనంతపురం జిల్లా
విద్యార్హతలువీధి బడిలో రెండవ తరగతి వరకు చదివారు.
వృత్తిగ్రామ కరణీకము
తెలిసిన ఇతర భాషలుతెలుగు,కన్నడం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగురుదక్షిణ, తమ్మిమొగ్గరము, విహగేంద్రవిజయము, భీష్మ, లోకబాంధవ శతకము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసరసకవి శేఖర
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబేవిన హళ్లి కరణము కృష్ణారావు
కావ్య పరిచయం
సంగ్రహ నమూనా రచనగురుదక్షిణ కవిగారి తొలి ముద్రిత కృతి . దీనిని వీరు 1 9 2 3 లో ప్రచురించిరి . చక్కటి ఆటవెలదులతో కూర్చిన కృతి యిది . ఇందు ఏకలవ్యుడు తన గురువు నెట్లు ఆరాధించెనో చూడుడు .
మట్టి చేత ద్రోణు నట్టె బొమ్మను చేసి
కేలు సందు ధనువు గీలు గొలిపి
వస్త్ర మాల్యములను నరల శోభితుజేసి
భక్తి డాను శిష్య పదము దాల్చె

బేవిన హళ్లి కరణము కృష్ణారావు
కావ్య పరిచయం

గురుదక్షిణ కవిగారి తొలి ముద్రిత కృతి . దీనిని వీరు 1 9 2 3 లో ప్రచురించిరి . చక్కటి ఆటవెలదులతో కూర్చిన కృతి యిది . ఇందు ఏకలవ్యుడు తన గురువు నెట్లు ఆరాధించెనో చూడుడు .
మట్టి చేత ద్రోణు నట్టె బొమ్మను చేసి
కేలు సందు ధనువు గీలు గొలిపి
వస్త్ర మాల్యములను నరల శోభితుజేసి
భక్తి డాను శిష్య పదము దాల్చె

అతడె తండ్రియంచు నాచార్యుడం చును
దైవమంచు దాత త్రాత యంచు
బ్రాణ సఖు డటంచు బ్రాపంచు శుశ్రూష
జిత్త శుద్ధి గలిగి చేయుచుండి .

గురుని ముందు తాను కోదండమునుబూని
బాణ మొండు గూర్చి పైన బోవు
పక్షి గములనేయు ; బడకున్న బొమ్మకు
జుట్టు దిరిగి మ్రొక్కి గోట్టుమరల .

తమ్మి మొగ్గరము వీరి ద్వితీయ కుసుమము . ఇందు బాల వీరాభిమన్యుని పద్మ వ్యూహచ్చేధనము చక్కగా చెప్పబడినది .
వీరాభిమన్యుని వీర విహార మెట్లు రచించిరో చదివి , చవిచూడుడు .
ఆ .వె : మెరుగు మెరసినట్లు గొరవిద్రిప్పినరీతి
పరుల లక్ష్యమునకు బట్టు వడక
తన రధంబు మెరయ సునిశిత విశిఖముల్
బరపి మొగ్గరంబు జెరచి చొచ్చె

కం : శరధిం దిరిగెడి మందర
గిరి యటు వని సంచరించు కీలియు బోలెన్
గిరి భేది పౌత్రుడత్తరి
గురుకుల సాగరము జొచ్చి ఘూర్ణి లజేసెన్

కం : ఎచ్చట జూచిన నాతడె
విచ్చల విడి సంచరించి విమతుల మేనన్
గ్రుచ్చుచు తీవ్రాంబకముల
వ్రచ్చుచు పటుసుభట కోటి వరలుచు నుండెన్

వీరి మూడవ పుష్పము విహగేంద్ర విజయము . 1927 లో దీనిని ప్రచురించిరి . తల్లి దాస్యమును బాపిన గరుత్మంతుని గాధయిది . భారతమున నాది పర్వమున నున్న కథను గైకొని కొంత పెంచి వ్రాసిరి . వినత తన కుమారుని యాశీర్వదించి , అమృత భాండమును దెచ్చుటకై పంపు సందర్భమున మాతృ వాత్సల్యము నతి చక్కగా కవిగారు వ్రాసిరి .
ఉ : ఊరక బల్కి తార్ష్యుడిటులున్నత భక్తి నమస్కరించి . తా
గోరగ నానతిన్ వినత గొబ్బున నక్కు నజేర్చి , యింపు సొం
పారు సుధామయోక్తులను హస్త తలంబున మౌళి దువ్వు చుం
గోరి వచించె బుత్రుపయి గూర్మి బయల్పడ సమ్ముదంబునన్

చ : తలకని చిత్త వృత్తి సురధామము జేరి యరాతి వర్గముం
దలకొని యః వోర్వి బాల దర్ప సమున్న తిగెల్చి , యా సుధం
బలిమి గ్రహించి తెచ్చు నెడ బంకజ నేత్రుడ దెందు నీకునే
సిలుగులు లేక సత్కరుణ శ్రీ విజయంబులు గూర్చి గావుతన్ .

చ: వల గొని మ్రొక్కి యవ్విహగవల్లభుడిట్ల ను దల్లి గూర్చి , నే
బలపరిపంథి తోడ సుధ బల్మి గ్రహించెడులావు గల్గగా ,
వలసిన భోజనం బిడుము ; వామవిలోచన ; క్షుత్పి పాసలం,దొలం
చి , విరోధులంగడిమి దూటి జయంబును గాంచి వచ్చెదన్ .

నాల్గవది వీరి భీష్మ నాకటము (ప్ర – 1973)
భీష్మ నాకతమున సంభాణ ములు గద్య పద్యాత్మకములై సులభ గ్రాంధిక భాషలో నుండుటచే సంగీత సాహిత్యములకు వియ్య మేర్పడినది . తేట తెలుగు పదములతో చిన్న చిన్న వాక్యము లలో నీ కవి పద్యములు తిక్కన్న గారి సంభాషణ శైలిని పుణికి పుచ్చుకొన్నటుల నుండుటచే నాటకోచితములైనవి . ముఖ్యముగా ఉపాలంభనములు , వాదోపవాదములు , వీరా లాపములు మొదలగు భావముల ప్రకటనమున వీరి లోకోక్తులతో పలుకు బడులతో నిండిన శైలి చక్కగ రాణించినది . సరళ శైలికి తగినట్లుగా స్పష్టములగు నలంకారములు కుదిరినవి .

కర్ణుని నమ్మి యుద్ధమునకు దిగిన దుర్యోధనునకు భీష్మాచార్యు లెట్లు పదేశము గావించిరో జూడుడు .
దుర్యో :- పితామహా ! యేటి మాటలు ? ఈ యుద్ధమున జయముమనకే లభ్యమగును .

గీ. కెఱలి భీష్మాగ్ని మునుముందు పఱవ, వెనక
ఘటజ కర్ణాది యోధులన్ గాలివీవఁ
బాండు సుతులను నెండిన వనము గినము
మాడి మసికాడె యొు. త్రుటి మాతలోన .
పాండవులను గూల్పనొక్క కర్ణుండెచాలును.
భీష్మ:- దుర్యోధనా ఎంతపసివాఁడవైతివి?
సీ. గురునాజ్ఞ ద్రుపదుని గొని తేరఁజనవేళ
దెగివెంటరాఁడె యూ మగలమగదు ?
తిమియంత్ర ఛేదనోద్యమము నిర్వర్తింప
నఱ్ఱాసరాఁడె ఈ వెఱ్ఱి తరటు?
గంధర్వపతినిన్ను బంధించి నప్పడు
తలనమ్ము కౌనెనె రాధాసుతుండు ?
పట్టిన పసిఁదలపాగయుఁగ్రీ డికి
గోలిచ్చిరాఁడె ఈ బాలిశుండు?
గీ, క్రొత్తలేముండె వెనుకటి పొత్తెకాక
కలదు వారికి గృష్ణునిబల మతండు
చురిక గొనకున్న – రణ భూమి కురక
గన్నుదెఱచిన లోకమ్ము కాలికూలు.
చం: నలుపురుమంతనంబుఁ గొని నాలిపనుల్ దెగియెన్నియేనియున్
జలిపితి; రేయొకండయిన సంకట పెట్టె నెవారి దానికిన్
గల బలమొక్కధర్మ; మదికన్గొనుఁ గృష్ణునిరూప;మాతడే
కలిగిన వారివంకఁ ద్రిజగంబులు జూడఁగనోప వేపునన్.
శకుని సాయంబున జూదమున గెల్చితిననియ, నట్లే కర్ణు సాయమున యుద్ధనున గూడ వారి నిర్జింతుననియు, నుప్పొంగ వలదు పాండవులు :కృష్ణుడను వజ్రకవచమును ధరించిరి. అది అభేద్యము
పేరు ప్రతిష్టలను ఆశించుటగాని అన్వేషించుటగాని యెరుగని ఈ వృద్ధ విని (86 ఏండ్లు) ఆంధ్రభాషాభిమానులందరు ఆదరించి కృతి కర్తకు సారస్వతప్రపంచమున సముచితస్థానము నందించగలరని మా ఆ కాంక్ష.

———–

You may also like...