పేరు (ఆంగ్లం) | Kiri Kera Bhimareddy |
పేరు (తెలుగు) | కిరి కెర భీమారెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకట లక్ష్మమ్మ |
తండ్రి పేరు | రెడ్డి అప్పూ రావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 6/6/1896 |
మరణం | 3/9/1964 |
పుట్టిన ఊరు | కిరి కెర గ్రామము, హిందూపురం తాలుకా |
విద్యార్హతలు | మెట్రిక్యులేషన్ |
వృత్తి | గ్రామ మునసబు |
తెలిసిన ఇతర భాషలు | కన్నడం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వాయునందన శతకము, భీష్మ శతకము నాటకములు: మహేంద్ర విజయము, చంద్ర మౌళి హరికథలు: గరుడ గర్వ భంగము, సీతా కళ్యాణం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | బాలకవి, ఆంధ్ర కర్ణాటక కవికేసరి,మహాకవి, సవ్యసాచి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శ్రీ కిరికెర రెడ్డి భీమ రావు జ్ఞాన వాశిష్ఠ రత్నములు |
సంగ్రహ నమూనా రచన | శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల వారు, ఈ కృతిని 13వ పుష్పముగా 1957లో ప్రకటించిరి. ఈ పౌత్తములోని వచన రచనలు శ్రీ డి. బాబన్నగారివి. ఇయ్యది సంగ్రహ కావ్యము గనుక, పూర్వాపర కథాసందర్భముల, నా వచన రచన లతికించుచు పాఠకుల మనముల నాకర్షించును. |
శ్రీ కిరికెర రెడ్డి భీమ రావు
జ్ఞాన వాశిష్ఠ రత్నములు
శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల వారు, ఈ కృతిని 13వ పుష్పముగా 1957లో ప్రకటించిరి. ఈ పౌత్తములోని వచన రచనలు శ్రీ డి. బాబన్నగారివి. ఇయ్యది సంగ్రహ కావ్యము గనుక, పూర్వాపర కథాసందర్భముల, నా వచన రచన లతికించుచు పాఠకుల మనముల నాకర్షించును.
కం. ఎక్కడి సంసారంబిది?
యెక్కడి ఘోరంబపీడ ? యెక్కడిదోనా
కొక్కటియు దోపకున్నది
నిక్కెడి కామాదిరిపులు-నిఖిలేంద్రియముల్
కం : మీరెఱిఁగిన, సుజ్ఞానము
వారక యుపదేశమేుసఁగి వాత్సల్యంబిం
పార, ననుఁ జూ డవేడుదు
సార తపోబలవిశాల; సన్మునీ చంద్రా;
చం : విరహిత గర్వియై , వరవివేకియు, భోగవిదూర చిత్తు డై
సరసత నిస్పృహుండునయి, శాంతిని గల్గి, విజృంభణంబుగా
బరగు, నహంకృతోక్తుల, వివాదములన్ దరిఁజేరనీయ, కా
దరమతి గాంచ వలయు – దాశరధీ పరమంబు జెందగన్ .
సి. ఎలుకలు కొఱికిన-వలరీతి నశియించు
సంసార వాసన-సక్రమముగ
తెగును. మనో గ్రంధి-తెప్పున దరువాయి
ప్రవిమల జ్ఞాన, స్వభావమంత
సజ్జుగా, నిత్యప్రసన్నమై-నెగడుచు
నలరు బ్రత్యక్ష మీ-యనుభవంబు
గల్లి, యోగ ఋనే-గడన సర్పెడు వాని
కరుణకుకా బహ్మాది సురలు పాత్రు
గీ : లగుదు రట్టి, యోగాభ్యాసుఁడగణితుఁడయి
దిగ్వితానంబులెల్లను-దెల్లముగను
గనులు నైజంబుగా జూచు-కరణి జిత్త
గతియె లేకుండ, దాఁజేయు కర్మలెల్ల.
విజయనగర కళావిలాసము(లేపాక్షి ) ప్రచురణ 1957
ఈ కృతి ” పద్మశ్రీ ” కల్లారు సుబ్బరావు గారికంకిత మివ్వబడినది.
చం. అది, విరుపన్న నిర్మితము నై యెసలారెడు, దేవమందిరం
బది, యొక : శిల్పరత్నమన నై , మనరాయలసీమ కీర్తి ,కా
స్పదమయి,శిల్పనైపుణి, సభఁగుర భంగిని, జాటుచుండు; వే
రెది, సరిరాదటంచు, మది కెంతయు మోదముఁ గూర్చు చుండెడిన్ .
దుర్గా దేవి
ఉ : అది ! దుర్గ ! నాడు మహిషాసుర మర్దనివైన మీద నీ
వొద్దిక నా మహేశ్వరు, మహోన్నత పీఠముజేరి కందురా
సుద్ది హుళక్కి; యిందె నిజసూనుని బాయఁగ లేక నిల్చి, యీ ముద్దులపట్టి, భద్రు నగుమోమును గాంచెదు; స్తంభ మందున న్ “.
సీ. రాజాను మతిరేక- రాష్ట్ర ధనంబెల్ల
ఆలయంబునకు, వ్యయంబొనర్చి
ద్రోహమొనర్చిన – దుర్మ తి విరుపణ్ణ
బట్టి తెండని, నృపవర్యుఁడలిగి
ముదల నిడిన, నంత, మదిఁబొక్కి, యావార్త
నాలకించుచు, విరుపాఖ్యుఁడపుడు
కనుగుడ్లఁబెకలించి – కడుకొని, శిల పై న
గొట్టె నటందురు క్రూర గతిని
గీ . నమ్మఁశాలమిద్ది; నలువారఁగళరెల్ల
వృద్ధిసల్పి శిల్పి విజ్ఞతలకు
దగిన గౌరవంబు దైవాఱఁగూర్చిన
రసికుఁడిటు లొనర్ప బొసగు నెట్లు?
ఉ : ఈ రతనాల బొమ్మలను-నెవ్వరు పాడొనరించిరో నిరా
ధారము కారణంబు; మతదర్ప సమన్వితులై_-మహోగ్రులై
క్రూరులు చెక్కివై చిరొ విరోధము నూనుచు,లేక యిట్టి శృం
గారము పాడుచేయుదురె? కన్నులపండువుఁ గూర్చు చుండగన్ .
———–