సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya)

Share
పేరు (ఆంగ్లం)Samudrala Raghavacharya
పేరు (తెలుగు)సముద్రాల రాఘవాచార్య
కలం పేరుసముద్రాల సీనియర్
తల్లిపేరులక్ష్మీతాయారు
తండ్రి పేరుసముద్రాల వేంకట శేషాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/19/1902
మరణం3/16/1968
పుట్టిన ఊరురేపల్లె, గుంటూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తిరచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకనకతార (1937) (మాటలు మరియు పాటలు) (మొదటి సినిమా), గృహలక్ష్మి (1938) (కథ, మాటలు మరియు పాటలు), వందేమాతరం (1939) (మాటలు మరియు పాటలు), సుమంగళి (1940) (మాటలు మరియు పాటలు), దేవత (1941) (మాటలు మరియు పాటలు), భక్త పోతన (1942) (కథ, మాటలు మరియు పాటలు), జీవన్ముక్తి (1942) (పాటలు), గరుడ గర్వభంగం (1943) (మాటలు), భాగ్యలక్ష్మి (1943 (మాటలు మరియు పాటలు), చెంచులక్ష్మి (1943) (కథ, మాటలు మరియు పాటలు), పంతులమ్మ (1943) (మాటలు మరియు పాటలు), స్వర్గసీమ (1945) (మాటలు మరియు కొన్ని పాటలు), త్యాగయ్య (1946) (మాటలు మరియు కొన్ని పాటలు),
పల్నాటి యుద్ధం (1947) (మాటలు మరియు పాటలు), యోగి వేమన (1947) (మాటలు మరియు పాటలు)
దర్శకత్వం: వినాయక చవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964)
నిర్మాత: దేవదాసు (1953) , శాంతి (1952) , స్త్రీసాహసం (1951)
నేపధ్య గాయకుడు: భక్త రఘునాథ్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుసముద్రాల రాఘవాచార్య పాటలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుతెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశారు. అనేక పాటలు కూడా వ్రాశారు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసముద్రాల రాఘవాచార్య
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963) సినిమా కొసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం.
సంగ్రహ నమూనా రచనపల్లవి :
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా …..
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ….. ||| శ్రీరాముని |||

చరణం :
చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో ||| శ్రీరాముని |||

సముద్రాల రాఘవాచార్య

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963) సినిమా కొసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం.
పల్లవి :
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా …..
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ….. ||| శ్రీరాముని |||

చరణం :
చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో ||| శ్రీరాముని |||

చరణం :
రాము గని ప్రేమ గొనె రావణు చెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని ||| శ్రీరాముని |||

చరణం :
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా ||| శ్రీరాముని |||

చరణం :
ఆ ఆ ఆ ….. నాథా ….. ఆ ….. రఘునాథా ….. ఆ ….. పాహి పాహి …..

పాహి అని అశోకవనిని శోకించే సీతా …..
పాహి అని అశోకవనిని శోకించే సీతా
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని …..

ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని ||| శ్రీరాముని |||

చరణం :
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి …..
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికె

చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా …..
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష

పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత …..
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి శ్లాఘించేను మాత…..
కుతవాహుడు చల్లబడి శ్లాఘించేను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా …..
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా ….. వినుడోయమ్మా

చరణం :
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా ఒక సంగీతభరితమైన పాట. ఇది అనార్కలి (1955) చిత్రంలోనిది.

పాటలో కొంతభాగం
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి అనార్కలి

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా

మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా || మనసు నిలువ నీదురా ||
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ || రాజశేఖరా ||

కానిదాన కాదురా కనులనైన కానరా || కానిదాన కాదురా ||
జాగుసేయనేలరా వేగ రావదేలరా || జాగుసేయ నేలరా ||
వేగరార వేగరార వేగరార

———–

You may also like...