కల్లూరు వేంకట నారాయణ రావు (Yajamana Kalluru Venkata Narayanarao)

Share
పేరు (ఆంగ్లం)Yajamana Kalluru Venkata Narayanarao
పేరు (తెలుగు)కల్లూరు వేంకట నారాయణ రావు
కలం పేరు
తల్లిపేరులక్ష్మమ్మ
తండ్రి పేరుకల్లూరు యజమాన సుబ్బారావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ3/6/1902
మరణం1/1/1979
పుట్టిన ఊరుఅనంతపురంజిల్లా రాప్తాడు మండలంలోని బండమీదపల్లె
విద్యార్హతలుఇంగ్లీషు, తెలుగు, కన్నడ భాషలలో ఎం.ఎ.చేశారు.
వృత్తి1925లో ఎల్.టి.ఉపాధ్యాయుడిగా అనంతపురం టీచర్ ట్రైనింగ్ స్కూలులో ఉద్యోగం ప్రారంభించారు. జిల్లావిద్యాశాఖాధికారిగా దక్షిణ కన్నడ, బళ్ళారి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా, కడప జిల్లాలలో పనిచేసి 1956లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీషు, కన్నడ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅహల్యాసహస్రాక్షీయము (నాటకం), ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహం (విమర్శ),
పుష్పాంజలి (పద్యకావ్యం), సత్యలీలాలహరి-తులసీవనమాలిక, శ్రీకృష్ణార్జునీయము (నాటకం), శ్రీ విద్యారణ్యచరితము (పద్యకావ్యము), షాజహాన్ (పద్యకావ్యము),
సాధనామృతము, శ్రీమదశోకచరిత్రము(పద్యకావ్యము), శ్రీవీరేశలింగయుగము (19వశతాబ్దపు ఆంధ్రవాజ్మయచరిత్ర), The Message of Past and India
శ్రీగీతోత్తర భాగవతము, శ్రీవేదవ్యాస(ఆధ్యాత్మిక)రామాయణము, విశ్వబోధాంజలి (వచనము), Bodhanjali, శ్రీ ఆంజనేయస్తవకళామాలిక, మానసబోధ మరియు భజనలు, షడ్దర్శనములు(అముద్రితము), ఇస్లాం తత్త్వమంజూష(అముద్రితము)
అవిధేయతనయ చరిత్రము(అముద్రితము), విడభాషామూలము(అముద్రితము)
పంపాభారతము(ఆదిపర్వము), పంపాభారత (ఆదిపర్వ) (కన్నడ పద్యకావ్యము)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఅంతరార్థకళాప్రపూర్ణ, కవితాతపస్వి, కవితానందమనోదధి, కవిత్వవేది
కవిరాజశేఖర, మహాకవి
ఇతర వివరాలుఈయన బాలమేధావిగా పేరొందారు. విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. చిన్నతనంలోనే సత్యనారాయణమహాత్మ్యము,ఆంజనేయ స్తవకళామాలిక,మానసబోధ,కృష్ణార్జునీయము మొదలైన కావ్యాలను రచించారు. అహల్యాసంక్రందనము అనే నాటకాన్ని 19యేళ్ళ వయసులోనే రచించారు. శ్రీరాఘవేంద్రస్త్రోతానికి తెలుగులో వ్యాఖ్యవ్రాశారు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలలో కొన్ని వ్యాసాలు ప్రకటించారు. బి.ఎ.పరీక్షకోసం వ్రాసుకున్న తెలుగు నోట్స్‌ను కొన్ని మార్పులతో ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహముగా రూపొందించి చిలుకూరు నారాయణరావు ప్రోత్సాహముతో వావిళ్ళవారి ద్వారా 1928లో ప్రకటించారు. ఇది సుప్రసిద్ధ విమర్శగ్రంథముగా ఇతనికి పేరు తెచ్చిపెట్టింది. ఈ గ్రంథం 30 సంవత్సరాలపాటు విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇంకా ఈయనపాతికకు పైగా రచనలు చేశారు. ఈయన పద్యంకాని, గద్యంకాని తడుముకోకుండా సహజధారలో అప్పటికప్పుడే చెప్పగల సద్యస్ఫూర్తి కలవారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికయజమాన కల్లూరువేంకటనారాయణరావు
కవి శేఖర-కవిత్వవేది
సంగ్రహ నమూనా రచనవిద్యాభ్యాసము
1) సంస్కృత విద్వాన్ ప్రిలిమినరీ 2) యం. ఎ. (కన్నడ & తెలుగు ) Madras Presidency medalist in B. A. ఆంధ్ర , గీర్వాణ,ఆంగ్ల, కన్నడ భాషలను వీరు బాల్యమునుండియు నేర్చిరి. నాలుగు భాషలయందును వీరికి పాండిత్యముగలదు.
కుటుంబ చరిత్ర :
కవి గారు స్వగ్రామమైన ‘కల్లారు” (హిందూపురం తాII అనంతపురం జిల్లా) బాల్యముననే వదలి, అనంతపురము చేరుకొన్నారు. ముగ్గురన్నదమ్ములలో వీరు జ్యేష్ఠులు. వీరి తండ్రిగారు చాలాకాలము ప్రాధమిక పారశాలలయందు ఉపాధ్యాయులుగాను, పోస్టు మాష్టరుగాను (అనంతపురం తాI జిల్లా) ‘ఆత్మకూరు”నందుండిరి. కవిగారికి ప్రస్తుతము పోయినవారు పోగా ఒకపుత్రుడు, ముగ్గురు పత్రికలు కలరు.

యజమాన కల్లూరువేంకటనారాయణరావు
కవి శేఖర-కవిత్వవేది
B. A., L. T., M. A. కన్నడ & తెలుగు

విద్యాభ్యాసము
1) సంస్కృత విద్వాన్ ప్రిలిమినరీ 2) యం. ఎ. (కన్నడ & తెలుగు ) Madras Presidency medalist in B. A. ఆంధ్ర , గీర్వాణ,ఆంగ్ల, కన్నడ భాషలను వీరు బాల్యమునుండియు నేర్చిరి. నాలుగు భాషలయందును వీరికి పాండిత్యముగలదు.
కుటుంబ చరిత్ర :
కవి గారు స్వగ్రామమైన ‘కల్లారు” (హిందూపురం తాII అనంతపురం జిల్లా) బాల్యముననే వదలి, అనంతపురము చేరుకొన్నారు. ముగ్గురన్నదమ్ములలో వీరు జ్యేష్ఠులు. వీరి తండ్రిగారు చాలాకాలము ప్రాధమిక పారశాలలయందు ఉపాధ్యాయులుగాను, పోస్టు మాష్టరుగాను (అనంతపురం తాI జిల్లా) ‘ఆత్మకూరు”నందుండిరి. కవిగారికి ప్రస్తుతము పోయినవారు పోగా ఒకపుత్రుడు, ముగ్గురు పత్రికలు కలరు.
ఆధ్యాత్మికోపానన:
వీరు గాయత్రీ, ఆంజనేయోపాసకులు. చిన్నతనమునుండియు, ఆధ్యాతిక చింతన గలవారు. వీరికి జ్యోతిశ్శాస్త్రమునందును, మంత్ర శాస్త్రమునందును, నమితమగు చొరవగలదు. ఓ ష ధీ విజ్ఞులు. బాల్యము నుండియు వీరు భవిష్యద్విజ్ఞాన వాణిని కలిగి యున్నారు. వీరు గాయత్రీ మంత్ర తత్పరులై, కలరామున్నగు వ్యాధులచే, గాసిలు వారిని ధ్యానముచే బాగు చేసిరనియు, వీరి సలహాననుసరించి గుడ్డివారికిచూపు వచ్చెననియు, అనేకులకు సంతానమును. ఋణ విముక్తి మార్గమును, సుఖజీవితయోగమను, గ్రహవాధితులు వీరి దృష్టిపాతముచేత నిరామయులైరనియు, పెద్దలు చెప్పదురు. దేవాలయ పునరుద్దరణమునందును, నూతనాశ్రమ నిర్మాణమునందును, వీరి కాసక్తి మెండు. ఉద్యోగము చేయునప్పడే వీరు విసరరాళ్ళపల్లె (గుత్తి తా) రైల్వే కొండాపురము (కడప జిల్లా) ఆనంతపురము వద్ద గుత్తి రోడ్డులో, తడకలేరు గట్టున శ్రీ రాఘవేంద్రస్వామి బృందావనాశ్రమముల స్థాపించిరి. వీరు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చరిత్రను, శ్రీ రాఘవేంద్రస్వామి విజయమను పేర రచించిరి వీరి “గీతోత్తర భాగవతము నందు దీనిని చేర్చిముద్రించిరి.
గుణగణములు:
ముఖస్తుతి, ఆత్మవంచన వీరికి గిట్టవు. క్షణకోపులు; ఖండిత వాదులు. ఎంతటి వారినైన నిర్ధాక్షిణ్యముగ మాటలాదగల స్వ భావము వీరిది. అంతర్ముఖులు. వీరు పద్యమునుగాని, గద్వమును గాని తడవకొనక సహజధారలో, యప్పటికప్పుడు జెప్పగల సద్వ స్పూర్తిగవారు. చెప్పినది, వ్రాసినది సాధారణముగ సవరించుట కిష్టపడరు. అందొక సహజమగు బిగియుండుసు. ఇది వీరి కవితాగుణ సంపద .
వీరు రచించిన గంథములు. ముద్రితములు.
1) పుష్పాంజలి (1929లో ప్రకటించిరి) 2) అహల్యా సంక్రందనము (నాటకము-1921) ) శ్రీ కృష్ణార్జ నీ యము 4) శ్రీ రాఘవేంద్ర స్తోత్రము 5) ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్ర హము. 1926 . 6 ) శ్రీ శాంతిసమ్రాట్టు – అశోకచరిత్రము-శ్రీ శ్రీ కల్లూరు సుబ్బారాయ షష్ట్యుత్సవసత్కృతి 1958లో ముద్రణము. 7 ) శ్రీ వీరేశలింగయుగము 1965లో ముద్రణము. (19వ శతాబ్దపు ఆంధ్ర వాజ్మయ చరిత్రము) 8)శ్రీ విద్యారణ్య చరిత్రము(1969) , 9) శ్రీ గీతోత్తర భాగవతము VOL I. (కలియుగాది చరిత్ర కవీరు నానక్ గాథలు, మఱియు శ్రీ రాఘవేంద్రస్వామి విజయము 1974) 10) సాధనామృతము 12) షాజహాను 1980 12) The Message of the Past And India 1964 (English) 13) పంపాభారత సంస్కృతి (Kannada-1971)
ఆముద్రితగ్రంథములు
1) షడ్దర్శనములు 2) ఇస్లాము తత్త్వమంజూష 8) ఆవిధేయ
తనయ చరిత్రము, 4) ద్రావిడభాషామూలము 5) ఆధ్యాత్మిక రామాయణము.
“ప్రతి దిన ము మనమాచరించు సంధ్యావందన సంస్కృత శ్లోకములను ఆంద్రీకరించి, “సంధ్యోపాసన’ యని పేరిడిరి. అందలి గాయత్రీ మంత్రమునకు తెనుగుసేత

గాయత్రీ ధ్యానము.
సీ; ఏడేవి తేజమహీన కాంతలఁదుల
దూగు సన్మౌక్తిక ద్యుతులతోడ
ఏధవళాస్యనేతీందీవరములు, వి
ద్రుమనీలహాటక రుచులఁజల్లు
ఏమూర్తి యభయాంకు శేద్ధగదాచక్ర
ముల, దయా వర దానములనుఁగురియు
ఏశక్తిమకుటంబు నెల్లెడ .రత్నాంత
రనిబద్దవిధునితో రమణ సూపు
గీI ఏమనీషిణికకముల నెపుడు దాల్చ
సుందరారవిందంబుల, సౌబగుమిగుల
అట్టియవ్యక్త వ్యక్తిని నాత్మనరసి
కలిత తత్త్వార్ధ వర్డ్లనుఁగొలుత భక్తి

కావ్యపరిచయము:
శ్రీ శాంతి సామ్రాట్టు – అశోకచరిత్రము. ప్రచురణ: 1958 అశోక చరిత్రము పరమాద్భుతమైనది. ఇంతవర కశోకుని గురించి వచన గ్రంథములును వచ్చినవి. పద్య ప్రబంధములును వచ్చి నవి. అశోకజీవిక కథాఘట్టములను గైకొని రచియింపబడిన నాటి కలును నాటకములను గలవు. కాని ఈయశోక చరిత్ర ప్రబంధ మనేక విధముల విశిష్టమైనది. వివిధ వాజ్మయముల వలన దెలియ నగు గాథలేవియు అశోకుని సమగ్ర జీవితమును విశద పరుపవు. సరికదా.పరస్పర విరుద్ధములగుట వానికైక్యములేదు.వానినన్నిటిని ఆ మహారాజు ఘనతకు దగినట్లు, కార్య కారణ సంబంధమును గల్పించి, తెగి వేనికవియే విడివడి చెదరిపోయిన హారములోని వివిధవర్ణముల మణులవంటి వాని సన్నిటిని కలియ జేర్చి కూర్చి, శ్రీ వేంకటనారాయణరావుగారు ఈ య శోక చరిత్ర మ ను రత్న హార మును రమణీయమగురీతిని. కడు నై పుణి తో, ప్రబంధించి, పాఠక లోకమునకందిచ్చినారు. అశోకచరిత్రమును నిబంధించునది యొక దివ్యప్రబంధము. శ్రీ వేంకటనారాయణరావు తమకావ్యకళానైపుణిని, వట్టి పేలపిండివలె నీరసమైన చరిత్రకు , జీవముపోసి, షట్కాండాంచిత రసవన్మధుర ప్రొడ నిర్వదన కావ్య ముగ వెలయించినారు. ప్రతికాండమును ధారోప విభాగ శోభితము ఏతత్కావ్యావతారికయే ఒక విచిత్ర పారంభము.-(శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ.)
స్వతంత్రభారతమునకు ఏకైక ధ్యేయము, శ్రేయోరాజ్య సంస్థాపనము, ప్రపంచచరిత్రలో శ్రేయోరాజ్య సంస్థాపకులలో ప్రాతఃస్మరణీయుడు అశోకుఁడు. అందుచేతనే ఈ యితీవృత్తము స్వీకరింపుమని ప్రోత్సహించిన వ్యక్తి, గాంధీయుగమునందలి, అతిరథ మహారథ శ్రేష్ఠులలో నొకరగు పద్మశ్రీ కల్లారు సుచ్చా రావు గారగుట వింతగాదు. శ్రీ కల్లూరు సుబ్బారావుగారి షష్టిపూ ర్త్యంకముగ నీ కృతి వెలువడుట ముదావహమైన విషయము: నవయుగ నిర్మాతలలో నౌకరైన ఆ కల్లారు వారికల, ఈ కల్లారు వారి కలము వలన ಇట్లు అక్షరరూపమున, కలరూపు ధరించుట యెంతయు సముచితము.
ఈ కృతిని శ్రీ ఏడుకొండల వేంకపేశ్వరస్వామి వారి కంకిత మొనర్చుచు రాయలసీమ గ్రామజీవితమును వర్ణించిన తీరు రమ్య ముగానున్నది,
సీ ; మా తుమ్మకొమ్మల-మారేగుకంపల
మూ రాలచేల సంసారపౌళవు
మా కుందు వరదలో-మాకుంజరార్భాటి
మా పెన్నధాటిలోఁజేపు(చలువ
మా తరీకయ్యల-మా నల్లరేనాట
మాచౌడు నేలలో_నేఁచుకలిమి
మాగండ శిలలపై-మాగండుగుండెల
కాఁపులలోని విక్రమపు బలిమి
గీ ; మా తనకలాట, కపిలెల మాఱుమ్రోగు
గీతములలోని వేదాంత-మూఁతనీకు!
ఎసఁగె దెప్పడు సీపుమా-కేడుగడగ:
సుంకమంకితంబిదియె: శ్రీ వేంకపేళ:
కళింగయుద్ధము :
గీ : కసిమసంగుచు వీరులు గ్రాహవమున
విలయ రుద్రులై. పరులను మీకదాకి
తుండుపడనేయఁదత్తను హిండనముల
దండధరుపోలుఁగనె మృత్యు తాండవములు
గీ : ఎగిరిపోవు ప్రాణముల లెక్కిడగగాదు
క్రుళ్ళు పలలంబు ప్రోవులకొలతలేదు
ధనికులు. దరిదులెవరు? కన్గొనగరాదు
మొనగలంచుటంతయు మృత్యుపునకెపాదు
పాజహన్ (ప్రచురణ:1980-చంద్రసందేశము) (ఈ కావ్యము హిందూపురం శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల వారిచే ప్రచురింపబడినది.) “షాజహాన్ తన చరమావస్థలో శ్రీ కృష్ణ జన్మస్థాన క్లేశము ననుభవింపవలసివచ్చెను. తనకన్న ముందు పరమపదించిన తనభార్య’ముంతాజ్” జ్ఞాపకార్ధమై,ఆగ్రాలో లోకసుందరమైన “తాజ్ మహల్” కట్టించెను. ఒకనాటి రాత్రిజరిగి పోయిన కాలకథలన్నియు స్మరించు చుండగా, తనభార్య జ్ఞాపకము నకు వచ్చెను. పరలోకమందున్న ప్రియను స్మరించి ఆకాశము నందున్న చలువల తేఁనిగాంచి తన భావతరంగముల నతనితో చెప్పకొని ప్రియురాలితో, తాననుభవించిన శృంగారచేష్టను స్మరించెను. తాననుభవించువియోగ దుఃఖమును ప్రియురాలికెఱింగింప చంద్రుని ప్రార్లించెను. తానుకూడ త్వరలోనే ప్రియ జేరవాంచిం చెను. ఇది ఇదలి సంగ్రహకథ.

గీ . భోగిచెంగట భోగులు పౌలుపు మెలపు
నలవడుటయ నిసర్గమై యమరు రమణి:
కొడుకులకుగూడ తండ్రి దుర్గుణములొలనె
నంతె దోసంబు నీదియొక్కింత లేదు.
కుమారులు జెడిపోవుటకు తానే కారకుడని షాజహాన్ మదిలో కుంది. తానును భార్యదరిజేరనిట్లు పరితపించెను.
ఉ , చూచితి జూచితిన్ మనసు చొక్కిన ఘట్టములిట్టి వెన్నియో
నొచితి నిర్వరైక్యతననూన సుఖాంబుధి నీఁదులాడుటల్
ప్రోచితి వోసుశీల:ననుబూర్తిగ గొల్చియు,ముదువోయినీ
వేచరితార్థమైతివిఁక నేనునునీదరి జేరవచ్చెదన్ .

రాయలసీమ రచయితల నుండి…..

———–

You may also like...