పేరు (ఆంగ్లం) | Akkiraju Umakantham |
పేరు (తెలుగు) | అక్కిరాజు ఉమాకాంతం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1889 |
మరణం | 1/1/1942 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | వీరు వంగదేశం (బెంగాల్) లో నవద్వీప సంప్రదాయాన్ని అనుసరించి భాష్యాంతంగా సంస్కృత వ్యాకరణం, తర్కశాస్త్రం అభ్యసించారు. |
వృత్తి | మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | టిప్పూ సుల్తాన్ జీవత చరిత్ర , షేక్స్పియర్ నాటక కథలు, రసమీమాంస, ఆంధ్ర చంద్రాలోక వివరణం, సంస్కృత వ్యాకరణ ప్రదీపానికి ఆంధ్ర వరణం, పాణినీయం, నైషధ తత్త్వ జిజ్ఞాస, తెలుగు దేశమందలి చండాలురు, నేటి కాలపు కవిత్వం |
ఇతర రచనలు | నా స్మరణములు |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | 1916లో వావిలికొలను సుబ్బారావు ప్రారంభించిన త్రిలింగ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. తెలుగు సాహితీ విమర్శను చాలా ప్రభావితము చేసిన రచయిత. అక్కిరాజు ఉమాకాంతం తన విమర్శతో అభిమానులకంటే వ్యతిరేకుల్నే పెంచుకొన్నాడు. కవిజన వ్యతిరేకి అన్న అపఖ్యాతిని తెచ్చుకున్నాడు. అయితే ఈయన చేసిన విమర్శలకు ఇంతవరకు ఎవ్వరూ సరైన ప్రతివిమర్శను చెయ్యకపోవటం గమనించదగినది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అక్కిరాజు ఉమాకాంతం గద్య వాజ్మయ ప్రశంస |
సంగ్రహ నమూనా రచన | ( జ్ఞాన విశిష్టమైన యాత్మ చర ప్రపంచమునాకంటె నుత్కష్టమైన దగుట మానుష్య మునకు జరిత్ర వలన గలుగని సంస్కారము కల్పనచే సమకూరుచున్నది . బుద్ధికి వాస్తవానుభవము లేనప్పుడు కొంత మట్టుకు దరాభాసమునైన గల్పన తృప్తి పరచుచున్నది ) అని యొక యాం యతత్వజ్ఞుడు వచించినట్లు కల్పన యొక్క ప్రాధాన్యము వాజ్మయమునందు గణ నీయముగ నున్నది . |
అక్కిరాజు ఉమాకాంతం
గద్య వాజ్మయ ప్రశంస
బ్రహ్మే వరస , రసో :” శ్రుతి
“బ్రహ్మయే రసము రసమే బ్రహ్మ )
As the active world is inferior to the rational soul, so fiction gives to mankind history denies and in some measure satisfieth the mind with shadows when it cannot enjoy the substance ; Bacon ( జ్ఞాన విశిష్టమైన యాత్మ చర ప్రపంచమునాకంటె నుత్కష్టమైన దగుట మానుష్య మునకు జరిత్ర వలన గలుగని సంస్కారము కల్పనచే సమకూరుచున్నది . బుద్ధికి వాస్తవానుభవము లేనప్పుడు కొంత మట్టుకు దరాభాసమునైన గల్పన తృప్తి పరచుచున్నది ) అని యొక యాం యతత్వజ్ఞుడు వచించినట్లు కల్పన యొక్క ప్రాధాన్యము వాజ్మయమునందు గణ నీయముగ నున్నది . మన యాంధ్ర వాజ్మయమునందు గావ్యములు గద్య పద్యాత్మకములుగ నున్నవి . కేవల పద్యాత్మకములును గేవల గద్యాత్మకములును గూడ గలవు . ఏ దేశము యొక్క వాజ్మయ చారిత్రము నవలోచించినాను బ్రధమమున గద్య కావ్యములుత్పన్నమైనట్లు కన్పించదు . లిపి యేర్పడి లేఖి వ్యాది సాధనము లలవడిన తరవాత , విజ్ఞానము హెచ్చిన కొలది , గద్య కావ్యముల వ్రాయ నారంభించి , మొదట మొదట గవులు మాత్రము వచనమునకు గౌరవను నొసగిన వారు కారు ; పద్యమే తమ వాక్కులకు దివ్యారంభమని తలచిరి . కాని కవితా ప్రవాహములు సాగి సాగి యనేక భంగుల విజ్రుంభించిన కాలమున కొందఱు వచనముననే తమ కవితా ఝరిని బ్రవహింపజేసిరి . పద్యము వ్తాయు నతడా ? గద్యము వ్రాయు నతడా ? కవియని విచారింప వలసియున్నది . కవి లక్షణము లేవి ! ఎవ్వరి మమో దర్పణంబున బ్రకృతి ప్రతిబింబించి యుండునో , ఎవ్వరు ప్రకృతి గూడ నతీతులై యుండునో , యెవ్వరి లేఖిని ధర్మో ద్ఘోణుబునందును దుర్నీతి ఖండంబునందు నమోఘ శక్తి మంతంబై యుండునో యెవ్వరి జ్ఞానేంద్రియములకు సామాన్య మానవులకజ్ఞేయంబులగు తత్వరహస్యం బులు లీలా మాత్ర గోచరములై నెగడుమో యెవ్వరి యశ్రుకణంబులు సర్వ ప్రపంచ దుఃఖ నిశ్శ్వా స కారణంబులో యెవ్వరి సంతోష పారవశ్యంబులు నిఖిల మానవ పరమానంద సంబరంబులో యామానుష్య ప్రతి నిధులు కవులని చెప్పినచో లక్షణ మసగ్రముగనే యుండును . కవులను గురించి షెల్లీ యను పండితుడు డిట్లు నుడివి యున్నాడు :-
“ A Poet , as he is author to other of the bighest wisdom , plensure , virtue and glory, so be ought personally to be the happiest , the wisest and the most illustrious of men ……. The greatest poets have been men of the most spotless virtue ,of the most consummate prudence and if we would look into the interior lives, the most fortunate of men .”
(ఇతరుల కత్యుత్క ష్టమైన యానందమును , జ్ఞానమును నీతిని ..గీర్తిని నెసగుగాన గని స్వయముగ సామాన్య మనుజులందర కంటే నధికుడను గీర్త నీయుడును జ్ఞాన సంపన్నుడు నై యుండును . ఉత్తమ కవులందరును నిష్కళంకమైన ప్రవర్తన గలిగి సంపూర్ణమైన వివేకము గల మనుజులుగా నుండిరి . వారి జీవితములను బరీక్షించో నందర కంటే నెక్కువగా ధన్యులై యుండిరి తెలియ గలదు . మరి కొందఱు , కవులు మనుష్యులకును భగవంతునికిని మధ్య వర్తులని చెప్పి యున్నారు . పాశ్చత్యవిద్వాంసులే గాక “ కవి తైవవిద్యా “ యనియు “ కవితా యద్య స్తిరాజ్యేవ కి” మ్మనియు వచించిన మన పూర్వ పండితులు గూడ గవుల యసాధారణ మహిమను గ్రహించియే యుండిరి . మఱియు
కావ్య ప్రకాశములో మమ్ముటుడు
“ నియతికృతని యావ రహితాం హ్లాదైకవయీ మనస్య పరతంత్రాం
నవరస రుచి రామావధతీ భారతీ కవేర్జ యతి “
(నియతి చె చేయబడిన నియమములేనిదియు వానందైక యమైనదియు ననన్య పరతంత్రమైన మరియు నవరస మనోజ్ఞా మైనదియు నగు నిర్మాణము సల్పు కవి యొక్క వాక్కు సర్వోత్కర్షము వర్ధిల్లుతున్న అని ప్రధమ ప్రస్తుతించు యున్నాడు . విశ్వ గుణా దర్శనము .
“ అతరధ్వాంతహరయః కవయస్త్వ యానాధ క్షేప్యా :”
(మనస్సు యొక్క యజ్ఞానమను చీకటిని బోగొట్ట సూర్యులగు కవులు నీచేవధి క్షేపింబడదగిన వారు కాదు )అని విశ్వాసము కృశానువుల సంవాదములో వేంకటాధ్వరి కవుల విశ్వాతి శాయిత్వమును గొని యాది నాడు . ఆనందవర్ధనాచార్యుడు ధ్వన్యాలోకము నందు దృతీయోధ్యోతములో …
“ శృంగారీ చేత్ కవి కావ్యే జాతం రసమయం జగత్
సచేత్ కవిర్వీతరాగో నీరసం వ్యక్త మేవతత్ “
(కవి శృంగారి మాయ నేని గావ్యము నందు జగత్తంత రసమయమగును . అతడు వీత రాగుడయిచో జగత్తత నీ రసముగ వ్యక్తమగును ) అని కవుల శక్తిని వర్ణించియున్నాడు . సుబంధుడు వాసవ దత్తయండదు ……………………………………………………..
ఉత్తర రామచారిత్రములో ద్వితీయంకమున బ్రహ్మ వాల్మీకిని శ్లాఘించినట్లు
“ఋషే ప్రబుద్దోసి నాగాత్మని తద్భ్రూ హిరామ చరితం
అవ్యాహతంతో జ్యోతి రార్షం తే బక్షు ప్రతి భాతి ఆద్య కవిరసి “
(ఓ ఋషీ శబ్ద బ్రహ్మ మునందు బ్రకృష్ణ జ్ఞాన వంతుడవైతివి . కావున రామ చరిత్రము చెప్పుచు ). ఋషి సంబంధి యోగజమైన నీ నేత్రమ ప్రతి హత ప్రకాశమై విలసిల్లును . ఆదిమకవి వగుచున్నావు .” అని భవభూతివచించి కవుల యొక్క జ్ఞాన నేత్రమునకు దెలియని విషయ ముందడను తన అభిప్రాయమును వెలి పుచ్చెను . చూడుడు విష్ణు పురాణము నందు …
“కావ్య లాపశ్చ ఏ కేచి ద్గీత కావ్యఖిలానిచ
శబ్ద మూర్తి దాని స్యేతే విష్ణో రంశా మాహత్మవః “
(కావ్యాలాపములు నఖిలగీతకములు శబ్ద మూర్తి ధరుడైన విష్ణువు యొక్క అంశములు ) అని కవి వాక్కులు కీర్తింపబడినవి . వేయేల ?” నా వృషి కురుతే కావ్యం “ (ఋషి కానివాడు కావ్యమును జేయుడు ) అని మహా కవులందరు మహర్షులేయను అభిప్రాయామును పూర్వులు కలిగియున్నారు . ఆగ్నేయ పురాణమున దీ కవులగా కనిపించి, జెప్పబడి యున్నది కాని విస్తూ భీతిచే నా వాక్యములుదాహరింప దలుచుకున్నడను సంస్కృత విద్వాంసులే గాక యాంధ్ర పండితులు గూడ గవుల ప్రభావము గార్రుచ్చియే యుండిరి …
కం : “ కమనీయ సమస్త కళా
గమములక్షను జనన భూమి కావ్యము కావ్యా
గమవిడులు సర్వ విదులని
సమయ చతుష్ట ము నందు జదివిరి మొదలన్ “
అని కవిజనాశ్రయకారుడు కవుల యౌత్క్రుష్ట్యు మును గొనియాడి నాడు .” తళు కుటద్దంబు సత్క వులమనకు “(సరస్వతీదేవికి గవులమనుకు తళు కుటద్దము )అని శ్రీనాధుడు కవుల యతిశయమును దెలియ జేసెను .
:చ : మనమున గొన్న నెవ్వగలు మాన్పి ఘటింతు ర కాండ సమ్ముదం
బనఘక థాముఖంబున హితాహిత బోధ మొనర్తు రింపు గా
గను గొనుకంటే నద్భుతముగా నెరిగింతు రతీంద్రియార్ధముల్
ఘనమతు లెల్లవారికి నకారణ బంధులు గారె సత్కవుల్ “
అని సంకుసాల నృసింహ కవులను బ్రశంసించియున్నాడు . ఇంక నిట్టి వాక్యము లనేకములు గలవు . కవులన నీ దృశానన్య సామాన్య గుణగణవి విరాజమానులైన మహా పురుషులై యుండ నిక్కాలమున బగతి వేషములు వేసికొని కవి హంసలమని , కవి చక్రవర్తులమని , మిట్టి పడుచు గవి శేఖరు లమని యుప్పొంగుచు , గవి ఘాతా పంచాననులమణి , బాల రస్వతులమని , మాకుసమానులు లేవని , మీసములు దువ్వుచు , రైలు బండి కంటె వేగముగ గవిత్వము చెప్పుదుమని , చేయి యాపక కవిత వ్రాయుదుమని విర్రవీగు చుదనును దామే వేనోళ్ల బొగడు కొనుచు గర్వ సంస్తభులై జలప ములాడు వారి చేష్టల నేమనవలయుమో చదువరులే యూహించి కొనగలరు . కాళిదాసు యంతిటి వాడు ,
: మంద కవియకః ప్రార్ధీ గమిష్యామ్యసహాస్య తాం “
( మాడుడనై కవియ శస్సు లాభిలషించుచున్న నే నపహాస్యతను బొందుడును )
అని వినయమును గానబరచెను . కవి చక్రవర్తి కవి ఘటా పంచాననే త్యాద్య నేక దంభ బిరుదముల దాల్చి ఇప్పుడు గర్వోక్తులాడువా రీ కాళిదాసుని కంటే ఘనులా ! ఘనులే యనుకొందుము . ఘనత్వము హెచ్చి న కొలది వినయాది సద్గుణము లతిశయింపవలెను గదా . ఈ కాలమునం దొకరిమెకరు తిట్టు కొనుతయే కవిత్వమైనది . అతిట్లే యామ్నా యములైరి . భారతామ్నాయముతో దుల్య ములట ! మూర్ఖులు వానినే యాసక్తితో బకిన్చుచున్నారు! అక్కటా ! జనులయాజ్ఞానముగు , గావితా దుర్దశయు, నింత కంటే హెచ్చ గలవా ? చివరకు “ కందము చెప్పిన వాడు కవి , పందిని చంపిన వాడు బంటు “ అను సామెత నిజమైనది .
మన తెలుగు దేశమునం దిప్పుడును వినయాది గుణ హీతులైన సత్కవు కొందఱు “ ప్రభాత కాలమందలివి చేయ తారకవలె “ నరుదుగా నైన గలరని మాత్రము తెలిసికొనుటకు సంతసిల్లుచుమ్మాము . ప్రకరణముకు దగిన సందేము కిచ్చట దిజ్మాత్రము కవులను గురించి వ్రాసితిని . ఈ మహనీయుల భావమే కవిత . శబ్దమును బట్టి కవితయను పదమున కర్ధ మిదియే యైనప్పటికి నింకను విస్తృతార్ధమునందు గ్రహింప బడ వలయును . కావ్య ములందు మాత్రమే కవిత యుండునని భావింపరాదు . క్రోంబసిమినీ నుండు చివురుంజోంప ములయండు గవిత గలదు , వక్రగతిం బ్రవహించు సెలయేళ్ల నిర్మల జలశీ కరములయందు గవిత గలదు . సరోవరస్ఫః కొదకంబు పై దాండవ మాడు సాధ్య రాగంబు నందు గవిత గలదు .
———–