పూతలపట్టు శ్రీరాములురెడ్డి (Putalapattu Sriramulu Reddy)

Share
పేరు (ఆంగ్లం)Putalapattu Sriramulu Reddy
పేరు (తెలుగు)పూతలపట్టు శ్రీరాములురెడ్డి
కలం పేరు
తల్లిపేరులక్ష్మమ్మ
తండ్రి పేరుపెద్దబుచ్చిరెడ్డి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/5/1892
మరణం11/8/1971
పుట్టిన ఊరుచిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామం
విద్యార్హతలువిద్వత్ పరీక్షలోఉత్తీర్ణులైనారు. స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నారు.
వృత్తితెలుగు పండితులు
తెలిసిన ఇతర భాషలుతమిళ, సంస్కృత
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకంబరామాయణం (2 సంపుటాలు) (తమిళం నుండి అనువాదం), నాలడియారు (తమిళం నుండి అనువాదం), పెరియ పురాణము (తమిళం నుండి అనువాదం),
శిలప్పదికారము (అందియకత) (తమిళం నుండి అనువాదం), మణిమేఖల (తమిళం నుండి అనువాదం), సూక్తిసుధ, తెనుగు సందేశము, త్రివర్గము
నీతిగుచ్చము, కుమారసంభవము (సంస్కృతం నుండి అనువాదం),
ప్రశ్నోత్తర రత్నావళి (సంస్కృతం నుండి అనువాదం), సురాభాండేశ్వరము (1953)[4]ఇది చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకాలో కలకడ గ్రామంలో వెలసిన సురాభాండేశ్వరుడు గురించిన స్థలపురాణం, భక్తిమాల (పెద్దపురాణము), మధురకవితా సంహిత, త్రికటుకము, అభిదాన దర్పణము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువిద్వత్కవికులతిలక, సాహిత్య రత్నాకర, కవితాతపస్వి, అభినవ పోతనామాత్య,
మహాకవి, ఆంధ్ర కంబర్
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపూతలపట్టు శ్రీరాములురెడ్డి
సంగ్రహ నమూనా రచనరాయలసీమ జిల్లాలలో కన్నడ, తమిళ, ఉర్దూ, భాషలతో పరిచయమున్న కవులనేకులున్నారు. ఆయా భాషా రాష్ట్రాలనానుకుని వున్న జిల్లాల సరిహద్దు పాంతాలలోని ప్రజానీకానికి తెలుగు కాకుండా తదితర భాషలతోను పరిచయమబ్చి యుండుట సహజ విషయమే. అనంతపురం జిల్లా వారికి కర్ణాటక భాషతో పరిచయం కలదు. చిత్తూరు జిల్లా వారికి తమిళంతో స్నేహం ఏర్పడినది. పూర్వపు నవాబుపరిపాలన ప్రాంతమై, ఆంధ్ర రాష్ట్రమునకు రాజధానిగా వ్యవహరింపబడిన కర్నూలుకు ఉర్దూ భాషతో కొంత సఖ్యముచేకూరినది. అనంతపురం జిల్లా కవులెందరో కర్ణాటక సాహిత్య సౌరభాలను తెనుగువారికి అందివ్వగల్గిరి. అప్లే తెనుగు సాహిత్య కుసుమాలు కన్నడ సాహితీ ప్రాంగణంలో పరిమళిం చినవి కూడా.

పూతలపట్టు శ్రీరాములురెడ్డి

సాహిత్య రత్నాకర-విద్వత్కవి కులతిలక-అభినవపోతనామాత్య,ఆంధ్రకంబర్ శ్రీ పూతలపట్టు శ్రీరాములురెడ్డి.


రాయలసీమ జిల్లాలలో కన్నడ, తమిళ, ఉర్దూ, భాషలతో పరిచయమున్న కవులనేకులున్నారు. ఆయా భాషా రాష్ట్రాలనానుకుని వున్న జిల్లాల సరిహద్దు పాంతాలలోని ప్రజానీకానికి తెలుగు కాకుండా తదితర భాషలతోను పరిచయమబ్చి యుండుట సహజ విషయమే. అనంతపురం జిల్లా వారికి కర్ణాటక భాషతో పరిచయం కలదు. చిత్తూరు జిల్లా వారికి తమిళంతో స్నేహం ఏర్పడినది. పూర్వపు నవాబుపరిపాలన ప్రాంతమై, ఆంధ్ర రాష్ట్రమునకు రాజధానిగా వ్యవహరింపబడిన కర్నూలుకు ఉర్దూ భాషతో కొంత సఖ్యముచేకూరినది. అనంతపురం జిల్లా కవులెందరో కర్ణాటక సాహిత్య సౌరభాలను తెనుగువారికి అందివ్వగల్గిరి. అప్లే తెనుగు సాహిత్య కుసుమాలు కన్నడ సాహితీ ప్రాంగణంలో పరిమళిం చినవి కూడా.

తమిళ సాహిత్య విశేషాలనుకూడా మన సీమకవులెరిగి వుండుట మన పుణ్యవిశేషమే. చిత్తూరు జిల్లా తమిళ ప్రాంతంతో ముడిపడినది. ఆసరిహద్దు ప్రాంతంలో తెనుగు, తమిళ సాహిత్య మలయమారుతము వీచినది, తమిళ సారస్వత సాగరమందలిరత్నములను సేకరించి సోదరాంధ్రులకు నెఱచూఱలిచ్చిన కవి పుంగవులు చిత్తూరు జిల్లాలో పెక్కుమంది కలరు. అట్టి వారిలోతమిళ కంబ మహా కవి రచించిన కంబ రామాయణము ను తెనుగు వారి కందించిన ‘ ఆంధ్రకంబర్ శ్రీపూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారొకరు.

కవిగారు రెడ్ల వంశమునకు చెందినవారు. వీరి తండ్రిగారికి చాలాకాలమువరకు సంతానము కలుగలేదు. అందుచే కవిగారి తండ్రి శ్రీ పెద్దబుచ్చిరెడ్డి శ్రీ వెంకటేశ్వరస్వామి కోవెల కట్టించి సేవచేసిరి. తరువాత కొన్నినాళ్ళకు ఇద్దరు కుమారైలుదయించిరి. కాని కుమారుడు పట్టలేదను కొరత ఆదంపతులకు పోలేదు. వారు స్వగ్రామమగు పూతలపట్టునందు ” శ్రీరామచంద్రున ఈ దేవాలయము కట్టించిరి. శ్రీరాముని భక్తితో అహర్నిశము ప్రార్ధించిరి. ఆకృపామూర్తి ఆ పుణ్యదంపతులకు శ్రీరామనవమి పుణ్యదినమున ఒక మగబిడ్డను ప్రసాదించెను. వారే శ్రీరాములు రెడ్డిగారు, వీరు జ్యేష్ట పుత్రులు. తరువాత వారికి ఇద్దరు తమ్ములకల్గిరి. ఒకరు విద్వాన్ బాలకృష్ణారెడ్డిగారు, మరియొకరు శ్రీమనిరత్నరెడ్డిగారు.
కవిగారు ప్రాథమిక పాఠశాలలో పఠించినను, స్వయం కృషిచే ఆంధ్ర , తమిళ, సంస్కృత సారస్వతములు, స్వాయత్తము చేసుకొని విశ్వవిద్యాలయ విద్వత్పరీక్షలో నుతీర్ణులై, ఆంధ్ర పండిత పదవిని నిర్వహించిరి. బహుపద్య, గద్యకావ్య ప్రణీతులైరి. అసమానమైన బోధనాపాటవము చేతనే గాక, అప్రతిమాన శీలసంపదచేకూడ శిష్యులను ఆనందోపదేశముల సంతృప్తిపఱచిరి.
కవిగారికి ” కట్టమంచి ” రెడ్ల తోను, పొలకలరెడ్డి వంశమువారితోను రక్తసంబంధముకలదు. శ్రీరాములు రెడ్డిగారికి నలుగురు కుమార్తెలు. మగసంతతి వీరికి లేదు.
రెడ్డిగారి తండ్రిగారు హరికథలను చెప్పెడివారగుటచే ఆ పాండిత్య ప్రకర్షకుమారునకు సహితము అబ్పుటకు వీలైనది. పెక్కుకావ్యకర్తలైన వీరు ‘ కంబరామాయణము తో ఆంధ్ర దేశమున గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకొనిరి. ఎన్నియో ఘనసన్మానములుపొుదిరి. వీరిని ‘విద్వత్కవికులతిలక ‘ ‘సాహిత్య రత్నాకర’ కవితాతపస్వి-అభినవపొతనామాత్య-మహాకవి-ఆంధ్ర కంబర్ అను బిరుద సత్కారములతో తెనుగు దేశము నీరాజనము పట్టినది. పూతలపట్టు గ్రామములో పల్లకి ఊరేగింపు జరుపుకొనిరి. ఆంధ్ర నలంద ‘ గుడివాడ వారిచే బంగారు పతకముపొందిరి. తమిళనాడు ‘ కారక్కుడి’లో జరిగిన కంబకవి వార్షికోత్సవములో కనకాభిషేకము పొందిరి.
1958లో కళాపరిషత్తుకు కవిగారు అధ్యక్షలుగా వ్యవ హరించిరి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమువారు వీరిని సెనేట్ సభ్యులుగా గౌరవించిరి. హైదరాబాదు ఆంధ్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా వ్యవహరించిరి.
రాష్ట్రపతిచే మంజూరు చేయబడిన గౌరవ వేతనమును వీరు జీవితాంతము అందుకొన్నారు.
సాహిత్య విశేషములు: కృతులు:
కవిగారు అరవమునుండి ఈకింది ప్రసిద్ధ కావ్యములను వదించిరి. 1) కంబరామాయణము ( సంపుటాలు), 2) నాలడియారు 3 ) పెరియ పురాణము 4) శిలప్పదికారము 5) మణి మేఖల 6 ) సూక్తి సుధ 7 ) తెనుగు సందేశము ) త్రివర్గము 9) నీతిగుచ్చము.
సంస్కృతమునుండి తెలుగులోనికి 1) కుమారసంభవము 2) ప్రశ్నోత్తర రత్నావళి, గ్రంథములనువదించిరి. ఇవియేకాక పదునై దుకు పై బడిన గద్య గ్రంథములు వీరు రచించిరి.
‘శిలప్పదికారం” ను తెనుగులో ‘అందియకత”గా కవిగారు తెనుగించిరి. దీనిని 1957వ సం||లో తిరుమల తిరుపితి దేవస్థానము వారు ప్రకటించిరి.
తమిళము నందలి పసిద్ధ గ్రంథములైన మణిమేఖల శిలప్ప దికారములను తెనుగింపవలసినదిగా కవివరేణ్యులకు శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారు సూచించి, అందందు అనుసరింపదలచిన విధానములను కూడా సెలవిచ్చి ప్రోత్సహించిరి. వారి యాజ్ఞను శిరసావహించి రెండు ప్రకరణములు ముగించిరి. మూడవ ప్రకరణము వ్రాయుచన్నతరి , కట్టమంచివారు దివంగతులైరి. అంతటితో 7 , 8 నెలలు ఆకార్యము ఆగినది. తరువాత వారి యాత్మక తృప్తిని కలిగించుటకై ఆ కార్యమును కవిగారు ముగించిరి.
ఇది ద్రవిడ వాజ్మయమున శిరోరత్నమగు మహాకావ్యము. ఇందు కథ కంటే ఆకాలమందలి సంగీతమునకు, జైత్ర జాతీయ నటనములకు ప్రాముఖ్య మివ్వబడినది. అందలి కథావస్తువు సంక్షిప్తముగానిది.
చోళరాజ్య రాజధాని “సంగమ పట్టణము. అందు ‘కోవలుడు’ ఒక వణిజుడు. అతడు మాధవి’ యను వేశ్యాంగనకు వశుడైనాడు. దానితో సమస్త సంపదలు కోల్పోయి ధర్మపత్ని ‘ కన్నగి’ తో కూడి దేశాంతరముల కేగినాడు. తిరిగి తిరిగి పాండ్యరాజు ముఖ్య పట్టణమైన మధుర లో ప్రవేశించిరి. జీవయాత్ర సాగుట దుర్లభమైన స్థితిలో భార్య పైడి కాలియంది యను ఒక కంసాలివానికి కోవలుడు అమ్ముటకు ప్రయత్నించెను. కంసాలి దానిని చూచి అనుమానించి, విషయమును ప్రభువుకు నివేదించెను. మున్నహృతమైన, మహామూల్యమౌ పాదకటక మొక్క ఆన్యుని చెంత యుండుట ఆరాజు సహించలేక వెనుకముందాలోచించక కోవలుని శిర చ్చేద మొనర్చి, అందియ నొసపరచుకొనెను.
కోవలని భార్య కన్నగి తన భర్తృ కళెబరము చూచి తల్లడిల్లి కన్నీరు మున్నీరుగానేడ్చి భీకరాకృతిధాల్చి రో షా గ్ను లు వెడ జల్లుచూ యిట్లు ఘోరవాక్కులు, పలికినది .
* రాజుతో నీ ముదు – రా నగరమ్మ
బూచిగా వింతునో – పాలతిరో! నీవు
నరయుదుగాకని – యూరాచనగరు
వీడి, వెలికివచ్చి – వీటఁగలట్టి
మానవులార! యమవరులార !
మునులార! నాపంతమును వినుఁడీరు
నామనోహరుజంప – భూమీశుపురము
పైగిన్కఁబూనితి – బాపమ్మగాదు
కాంచుఁడీయని – కుడికరమున నెడమ
స్తనమును వడివైచి – చలమున లాగి
కేలెత్తిపరిఁ బ్రదక్షిణముగాదిరిగి
విసరివైచుడు,నది – విలయాగ్నికరణి
విచ్చలవిడిరేగి – విన్నంటఁబెరిగె
– – – – – – మున్నర్జునుండు
ఖాండవమ్మనుగాల్చ – కాలాన బోలె
గలతనొందగ, ధార్మికులును, విద్వరులు
గల కడకేగక – చలపట్టి నట్లు
పాపులు, నీచులు – పరగు వీథులను
జ్వాలలు, చెలరేగ, బనులును వాని
దూడలు, ధర్మబుద్ధులుగల గొల్ల
వాడలఁజేరెను; . ………………..
దన భర్తcగాంచఁ జాలని చింతచేత
మగువ మండి, కొలిమిమాడ్కి, నిట్టూర్పు
వడినూర్చి వీదుల – సుడివడి తిరుగుఁ
దిరిగి, సంతా పించుఁ దిరిగి తపించి
వేదన నొందుచు – వెగచుచుఁగోప
మూఱక కుందు – నయ్యతివకు నెదుట
నుజ్ఞ్యల జ్ఞ్వాలల – నుడికి తపించి
సైపఁజాలక, మధురాపుర దేవి
కనులకు నయ్యెడ – గానంగవచ్చె.
మధురాపురి కరుణా కటాక్షముచే కన్నగి విభుని అమర రూపమున గాంచెను. ఇంద్రుడు ఆ పుణ్యదంపతుల కింద్ర లోక ప్రాప్తి గావించెను.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...