ఉప్పలపాటి వేంకటనరసయ్య (Uppalapati Venkatanarasyya)

Share
పేరు (ఆంగ్లం)Uppalapati Venkatanarasyya
పేరు (తెలుగు)ఉప్పలపాటి వేంకటనరసయ్య
కలం పేరు
తల్లిపేరురంగమ్మ
తండ్రి పేరుఉప్పలపాటి గంగయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1891
మరణం2/25/1973
పుట్టిన ఊరుకదిరి-అనంతపురం జిల్లా
విద్యార్హతలుప్రైమరీ విద్యవరకు చదివిరి.
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగ్రామాభిరామము, పిచ్చుక పిన్ని , మళ్లికార్జున విలాసములు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఉప్పలపాటి వేంకటనరసయ్య
సంగ్రహ నమూనా రచనమ: నట దీశాన జటాటవీ లుతిత తుంగా భంగ గంగాపగో
దృట ధారా ప్రసరత్సమాన కవితా ప్రావీణ్య మొంగల్గి, య
ప్పటపన్ రైతుల నిత్య జీవిత మిటుల్ వాయంగ నేర్పున్న నీ
కిట జోహారు లొనర్తు సారకవితా హిరాళ పారంగతా!

ఉప్పలపాటి వేంకటనరసయ్య

మ: నట దీశాన జటాటవీ లుతిత తుంగా భంగ గంగాపగో
దృట ధారా ప్రసరత్సమాన కవితా ప్రావీణ్య మొంగల్గి, య
ప్పటపన్ రైతుల నిత్య జీవిత మిటుల్ వాయంగ నేర్పున్న నీ
కిట జోహారు లొనర్తు సారకవితా హిరాళ పారంగతా!

నేటి ఆంధ్ర విద్వల్లోకమున నెంతటి కవి ప్రకాండులనయినను సంపాదింప వచ్చును గాని, శ్రీ ఉప్పలపాటి వేంకటనరసయ్య గారంతటి “ఉత్తమ కవి’ ని గుర్తించుట ప్రయాసతో కూడుకొన్న పని” యని శ్రీ నారునాగనార్యగారు తమ యభిపాయమును ‘గ్రామాభిరామ” మనుకావ్యముపై దెల్పినారు.
పల్లెపట్టులందు గుట్టుగా కాలమునెట్టు కొనుచు, పల్లెవాసుల జీవన విధానముల జక్కగానెఱిగి. తన మనోభావములను గ్రంథ రూపమున ఆంధ్రలోకమున కందించిన కర్మయోగులు వేంకట నరసయ్యగారు. స్వబిరుద ప్రతిష్టాపన కుబలాట, వాదోపవాదము లకు దిగుట, నీకవికి సరిపడవు. జీవితమంతయూ నుపాధ్యాయ వృత్తినిగావించి,తనకున్న కవితాధారతో మాతృభాష సేవకే జీవితము నంకితము చేసిన ధన్యజీవులువారు.
వేంకటనరసయ్యగారు ఏడవయేట పల్లెటూరి బడిలో అమరము. ఆంధ్ర పచ్యనిఘంటువులను శ్రద్దగా నేర్చుకొనిరి. “చిట్వేలి” బోర్డు పాఠశాలలో ప్రైమరీ విద్యవరకు చదివిరి. ఆ రోజులలో పేదలకు ఉన్నత విద్య అందుబాటులో నుండెడిది కాదు. ఆ కారణమున పై చదువులు వారు చదువలేకపోయిరి. జీవనోపాధి కొఱకు 1911లో కొమ్మనవారి పల్లెలో ఒక గ్రాంటు బడి పెట్టి పిల్లలకు చదువులు చెప్పనారంభించిరి.
పల్లెవాతావరణములోని రాత్రి భజన సంకీర్తనలు, నాటకాలు వీరి రచనా వ్యాసంగమునకు దోహదమైనవి. “గుండాలరెడ్డి నాటక సమాజము వారి చిత్ర నళీయము, పాదుకా పట్టాభిషేకము మొదలగు నాటకములు చూచుట ద్వారా కవిగారికి ఒక విధమగు సంగీతా పేక్ష పుట్టి పాటలు, పద్యములు వ్రాయవలెననెడి కుతూహలమధి కముకాజొచ్చినది. దానికితోడు సజ్జన సాంగత్యమల్చినది. పూవుల తోబాటు నారకు తావి యబ్బినట్లు శ్రీ వైద్య విద్వాన్ పండిత నారు నాగనార్యగారి సాహచర్యముతో సాహిత్యాభిరుచి యినుమడించినది. అప్పటిలో నారునాగ నార్యగారు సత్యాగ్రహ ప్రచారకులుగా నుండిరి. ఇరుపురు కలిసి దేశ సేవ, సాహిత్యసేవ సమముగా నొనర్చిరి. పెక్క శిలాశాసనముల ప్రతులు వ్రాసివుంచిరి.
1917–19 సంn నందు రాచవీటిలో టీచర్ ట్రయినింగ్ పొందునప్పడు శ్రీ వేంకటనరసయ్యగారికి శ్రీ రూపనగుడి నారా యణరావుగారితో సాహచర్య మేర్పడినది. రూపనగుడి వారికి నరసయ్యగారిపై అవ్యాజానురాగ మేర్పడి, అతనికి తెనుగు వ్యాక రణము, ఛందో లక్షణము నేర్పిరి. అట్లే శ్రీ వెల్లాల వేంకటాద్రి శర్మగారి వద్ద మూడు సర్గలవరకు రఘువంశము నేర్చుకొనిరి.
1950 వరకు వీరు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిరి. వీరు పల్లె ప్రజల చిత్తప్రవృత్తిని చక్కగా ఆకళించుకొనిరి. ఆ తీయతీయని స్మృతుల రూపమునే ఒక చక్కటి మూసల్లో పోసి, తీర్చిది మన ముందు కావ్యరూపమున నుంచిరి. ప్రాచీన భారతదేళ మనను గ్రామ సౌభాగ్య విశేషముల దెలుపుచు, సహజోక్తులతో సాగిన సాహితీఖండమే గామాభిరామము”.
గ్రామాభిరామ మందు రైతు
కుటుంబీకుల యాదరాభిమా నములు, ప్రకృతి సహజ సంపదలు. వారి నిరాడంబర జీవన విధానములు. వారి అమాయక
బ్రవృత్తి, వారిపాడిపంటలు
మున్నగునవి యన్నియు బహుచక్కగా అద్దము పట్టినట్లు చూపిరి. పద్యములన్ని లలిత పదములతో
గూడి అనేక గామ నానుడులతో అతి మనో హరములుగానున్నవి. కొన్ని భావములు పాఠకుల హృదయ
పీఠము లలో తిష్ఠవేయక మానవనుచు శ్రీ రాచమల్ల భైరవ కొండారెడ్డి గారిట్లనిరి.

”చింత చిగురంచు ముట్టి చూచితినిగాని
వలపు లూనుచు కపురంపు తళుకు లిను
వింత చిగురిద్ది; యిందులో గొంత విసి
తలపు పెట్టియ, డాతు నేస్తమ! నిజంబు’

నిజముగా నిందు మును నా కటుకొను దృశ వర్ణనలు , సహజోక్తులు, సామ్యములు, మనోజ్ఞభావములు పెక్కులు , మచ్చునకు చూతము.
కాకులు చేలపైబడి పంటను పాడు జేయుట సహజము. కాని కవి దృష్టిలో ఆ కాకులదాడి ఎట్లున్నదో గమనార్త ము
యవనుల్ పూర్వము దాడిబెట్టి మన యార్యావర్త దేశంబునన్
బవరఫ్రీ జనమండలిం గమిచి దౌర్జన్యంబుఁ గావించి న
ట్లవిగో, కాకులు జేని మీఁదఁబడి బిట్టల్లాడు లేఁగజ్జలన్
భువికికా వ్రాలఁగఁడ్రొక్కి చంచువల వెన్నుల్ ద్రుంచుటం గాంచుమా !
చేను కాపలాకు వచ్చిన చెల్లెల నిట్లు, ఆ కాపు దండించుచున్నాడు

చెల్లి యెచ్చటికేగినావో కనవే! చేనంత పాడాయె; నీ
పిల్లాటల్ మోదులార వేగముగ రావే ! యొక్కవే మంచెపై
రాళ్ళస్ మొత్తము మొండి కాకులవి రా-రాపింతలే కెట్టులన్
వెళ్ళుస్ దేవునికేని దెబ్బ గురు t విశ్వంబునకా లేమ్మిఁకన్
ఆ కాపుచెల్లి చేతిలో వడిసలపట్టుకొని త్రిప్ప దృశ్యమునిట్లుచెప్పిరి.

ఆలిరుక్రమ దృశ్యమాన పదవిన్యాసైక భంగ్యంతర
వ్యాలోలంబగు చూడ్కితో నడుము జవ్వాడంగ వేణీభర
శ్రీలావణ్యము క్రొణిఁజింద వడిసెల్” చేద్రిప్పునిమూర్తి యౌ
రా! లక్షింపఁగ ఝాన్సిరాణివియొ సత్యాదేనివో యూదుపా!

ఇట్టి నయనానందకర దృశ్యములెన్నో యిందు కడురమ్యముగా పొందు పరచబడినవి. ప్రాతః కాలముననే కూయు కోడి కూతతో మానవాళి నీత డెట్లు ప్రబోధించెనో చూడుడు.

మత విద్వేష నృపాల శృంఖలములన్ మానంబుఁగోల్పోవు, దు
స్థితికింజాబీన దేశమాత చెఱ విచ్ఛేదంబు గావింపగా
బ్రతుకుల్ బ్రాణము లప్పగించిన, మహా ప్రఖ్యాత వీరాంధ్ర సం
స్కృతులంచెడి కోడికూత వినిపించెస్ నిద్రఁజాలింపుమా!

ఆణి ముత్యములవంటి నిట్టి పద్యములలో నివి మంచివని ఏరుట దుస్సాధ్యము. అన్నియూ రత్నములే. అన్నియూ సుగంధ కవితా కుసుమములే. వారి రచనాశైలి అట్టిది గ్రామాభిరామ మందునటనట కొంత గ్రామీణ కథయు నడిపిరి. దానిని ముచ్చటగా కూర్చిరి.
రమ్యముగా వ్రాయు కవికి ఎట్టి చిన్నభావన కలిగినను దానిని దివ్యముగానే చెప్పను. నేర్పరియైన శిల్పి ఎంతటి బండణాయినైనను తన ప్రతిభచే చక్కటి బొమ్మగా తీర్చ గలడు. వాల్మీకి జూచిన విషాద సంఘటన గొప్ప కావ్యముగా నవతరించినది. కవిదృష్టి కేది యును అల్పముకాదు. ఒకరెడ్డిగారి పశుపుల కొట్టములో కాపుర మున్న ‘పిచ్చుక జంటల కథనొక కావ్యవస్తుపగా యెన్నుకొని మనోరంజకముగా ‘పిచ్చుకపిన్ని ‘ యను పేరుతో కావ్యమును వేంకట నరసయ్యగారు వ్రాసిరి. అందలి కథ సూక్ష్మముగా నిది.
“ఒక పశువుల కొట్టములోని పిచ్చుక జంటకు చాలకాలము వరకు సంతానము గలుగలేదు. అవి సంతానముకొఱకై తీర్ధములు సేవించినవి. తుదకు ఫలమబ్బినది. పసికందులు మాతము కొట్టములోని ఒక నాగుదాము నోటబడినవి. పిట్టలు గోడుగోడున నేడ్చి నవి. ఉడుత వాటిని ఓదార్చినది. ఒకసారి పాము రెడ్డి కంటబడినది. రెడ్డి పాములు బట్టు వానిని పిలిపించి దానిని పట్టించెను . పిట్టలకు భయము తీరినది. మరల కొట్టములో కాపురముంచి, గ్రుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కన్నదా పిచ్చుక యిల్లాలు. కానీ ఆ పిచ్చుకకు బిడ్డలను పోషించు నదృష్టములేదేమో! పాపము పిచ్చుక బాలెంత నంజునబడి మరణించినది. రెక్కలురాని పిల్లలను పెంచుటకు ఆ మగ పిచ్చుక మరల పెండ్లాడినది. ఆ సవతి పిచ్చుక పిల్లల పాలిటి మృగ్యువైనది. ఆ పిచ్చుకపిన్ని చేతిలో పలుకష్టములు పొందినవా పసికందులు.

కవిగారిట్టి కావ్యవస్తుపనెంత హృద్యముగా వర్ణించిరో ‘గ్రామాభిరామము” ను పఠించిన పాఠకులూహించి యుందురు. ఈ కావ్యమును రాయలసీమ సాహిత్య పరిషత్తు వారు ఆంధ్ర లోకమున కందించి ధన్యులైరి. ఈ కృతి నభినందించుచు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు పలికిన పలుకులివి.
” … ఇంత చక్కని కవి యిన్నాళ్ళేమూల దాగి యున్నాడో తెలియచు. పద్యరచన నిస్సందేహముగా దివ్యముగా నున్నది. చక్కిని భాషా జ్ఞానము, రమణీయమైన కూర్పు, పద్య రచనలో నెక్కడను కొంకులేకుండట, మఱియు కొన్నిచోట్ల గడుసుదనము, ఒండు రెండుచోట్ల ప్రౌఢకవులు పోవు లక్షణము, కొన్ని సీస పద్యములు వ్యర్ధపదము లేకుండ దేశీయములైన పదములలో నింపి యెంతో మణీయముగ వ్రాయుట చూచినకొలది మద్ధు ముచ్చటలను సమకూర్చు చున్నది.’
పలు బ్రశంసల నందుకొన్న నీకవి వందల కొలది కావ్యములు వ్రాయలేదు. వ్రాసిన వాటిలో ) గ్రామాభిరామము 2) పిచ్చుక పిన్ని ) మళ్లికార్జున విలాసములు మాత్రమే ముద్రితములు. మరికొన్ని అద్భుత ఖండ కావ్యములైన ఊర్వశి, కోకిలమ్మ, చీమల బారు, వేంకటేశ్వర శతకములు. అముద్రితములుగనే నున్నవి. ‘మీనాక్షి’ యను నవల కూడా అముద్రితమే. చిన్నతనమున వ్రాసిన “ఒంటిమిట్ట జానకీవల్లభ శతకము” ‘దుర్మోహపరిభవ నాటకము, సంపాదించి వుండిని మహావిష్ణు పురాణమును తాటియాకుల పౌత్తము గృహదహనము సంభవించి కాలిపోయినవని కవిగారే స్వయముగా తెల్పుకొన్నారు.

రాయసీమ రచయితల నుండి….

———–

You may also like...