పేరు (ఆంగ్లం) | Kuruttalwar Ayyangaar |
పేరు (తెలుగు) | కూరత్తాళ్వారు అయ్యంగారు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1867 |
మరణం | 1/1/1947 |
పుట్టిన ఊరు | తిరుచనాపల్లి జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉపాధ్యాయులు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రాగికంకి (వచనము) ,పోణిమి (ద్విపద). |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | వీరు వ్యవసాయము నందభిరుచిగల వారు. వ్యవసాయాభివృద్ధి. పలు తెలుగుల పంటలు, వివిధ రకములైన ఎరువులను గురించి అనేక వ్యాసములను వ్రాసినారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కూరత్తాళ్వారు అయ్యంగారు |
సంగ్రహ నమూనా రచన | వీరు జాతీయ భావములుగల్లి, విద్యార్ధులలో దేశభక్తిని సంఘ సేవా శక్తిని, పెంపొందించిరి. 1909 నుండి 1912 వరకు అనంతపురము జిల్లా, పెనుకొండలో మిడిలు స్కూలు హెడ్డు మాష్టరుగా పనిచేసిరి. మరల 1912 నుండి ధర్మవరము లండన్ మిషన్ హైయరు ఎలిమెంటరీ స్కూలులో పనిచేసి 1922 లో పదవీ విరమణ చేసినారు. |
కూరత్తాళ్వారు అయ్యంగారు
వీరు జాతీయ భావములుగల్లి, విద్యార్ధులలో దేశభక్తిని
సంఘ సేవా శక్తిని, పెంపొందించిరి. 1909 నుండి 1912 వరకు అనంతపురము జిల్లా, పెనుకొండలో మిడిలు స్కూలు హెడ్డు మాష్టరుగా పనిచేసిరి. మరల 1912 నుండి ధర్మవరము లండన్ మిషన్ హైయరు ఎలిమెంటరీ స్కూలులో పనిచేసి 1922 లో పదవీ విరమణ చేసినారు.
ఈ కవి గారాజానుబాహులు. నిమ్మపండు శరీరచ్చాయ, దరహసితవదనము, కనికరమును వెదజల్లు కన్నులుగల నిండు విగ్రహము వారిది. చక్కగా మూడు తిరునామములు ధరించి, స్వచ్చమైన తెల్లధోవతి పంచెకట్టు ధరించి, తెల్లని నిడుపుకోటు (Long Coat) తల పాగా వేసుకొని, బడికి వెళ్లేడివారు. వీరి సన్నిధిలో, శిష్యులు గురుకులములో వలె చదువుకొనెడి వారు. విద్యార్థులకు సంస్కృతము నేర్పవలయునను యుత్సాహముతో, వీరు వేకువ 4 గంటలకే మేల్కొని ఇంటింటికి దిరిగి తమవెంట విద్యార్థులను పిలుచుకొనివచ్చి వారికి, అమరము, సంస్కృతము నేర్పెడి వారు . వీరి శిష్యులైన , జిల్లా కలెక్టరు పని చేసి కీర్తి శేషులైన భోగిశెట్టి జూగప్ప గారిట్లు వ్రాసియున్నారు .
“శ్రీ కూరత్తాళ్వారు అయ్యంగారు సన్నిధిలో నేను 1909
నుండి 1912 వరకు అనంతపురము జిల్లా పెనుకొండలో చదువు కొంటిని . వారి ధర్మ విధానము , జ్ఞానము , దైవభక్తి , దేశభక్తి , దేశాభ్యుదయ సేవా శక్తి , తెలుగు సంస్కృత హిందీ భాషానురక్తి వర్ణనాతీతము . మా పాఠశాల చుట్టూవున్న బీడు భూములలో , పైరులను నాటించి బావి నుండి నీళ్లను మాతో మోయించి , పైరులకు పోయించు చుండిరి. 1908 వ సంవత్సరమునందే హిందీ దేశభాషగా నుండ వలయుననియు, ప్రతి విద్యార్థియు, ఈక గుఱ్ఱపు స్వారీ , సాము, గరిడీలు నేర్వవలయునని వారి ఆశయము. కుల మత భేదములు నశించవలయునని, వారు భాగవతములోని రంతిదేవుని . చరిత్రమును పలుమాఱు చదివి చెప్పచుండిరి. శివకేశవ భేదము లెంచ కూడదని. దయయే శివపూజయని, సత్యమే హరి కీర్తన మని, తిట్టిన వానిని దీవింపుము, కొట్టిన వానిని పూజింపమని చాలు వారు మాకు ప్రహ్లాదుని చరిత్ర చెప్పచుండిరి. చేనేత బట్టలనే వారు ధరించి . వారిల్లు బీద విద్యార్ధులకు హాస్టలుగా ఉండేది .
ن
నేను (కల్లూరు అహోబలరావు) వారివద్ద 1912 నుండి 1915 వరకు, అనంతపురము ధర్మవరపు లండన్ మిషను హైయరు ఎలిమెంటరీ స్కూలులో చదువుకొన్నాను. వారు “సాధు సంగతి”నిట్లు వర్ణించిరి.
కం : శ్రీ నొసగు, యశము బెంచు, న
మాన ప్రమదంబు సేయు – నురు దోషములన్
బొనడచును ; ప్రవిమల , వి
జానము వెలయించు సాధు సంతతి తలపన్
ఒకసారి వారు విద్యార్ధులను సమీపము నందున్న దిగుడుబావి దగ్గరకు పిలుచుకొని పోయి , అచ్చట భూమిని త్రవ్వించి , ఏవో పైర్లను పెట్టించి . మాతో నీరు పోయించెడి వారు . ఆ పైర్ల చుట్టూ ముళ్ళ కంపలు నాటించు వారు . చూచిన రైతులు “ తేరు తావ గాలి యీస్తే – రైలు కమ్ములు దాటి పోతాయి .” అని చెప్పుకొనుచు పోవుచుండగా , మా గురువుగారు చూచితిరా ! ఆ రైతు ఎటువంటి ఉపమానము చెప్పినాడో ‘ అని తెల్పుచు , ముసి ముసి నవ్వులు నవ్వు వారు . కంచెకు తూర్పున ఒక మైలు దూరములో తేరు , కంచెకు పడమర ఫర్లాంగు దూరములో రైలు కమ్ములుండెను .
వీరు సహజకపులు. వీరు వ్రాసిని చిట్టిపొత్తములు ప్రకటించినవి రెండే. 1 రాగికంకి (వచనము) 2 పోణిమి (ద్విపద). వీరు వ్యవసాయము నందభిరుచిగల వారు. వ్యవసాయాభివృద్ధి. పలు తెలుగుల పంటలు, వివిధ రకములైన ఎరువులను గురించి అనే వ్యాసములను వ్రాసినారు (అవి దొరకపు)
“రాగికంకి “ లో అనంతపురము జిల్లాలో విశేషముగా రైతులు పండించు రాగి ధాన్యమును గుణించి వ్రాయుచు, రాగి పిండిలో చేయు పలువిధములైన వంటకములను వర్ణించిరి. ఆ వంటకములను తమ ఇంటిలో వాడుచుండిరి.
“పోణిమి ‘ ద్విపదలో వారెన్ని విషయములనో వృద్ధించిరి. మచ్చునకు కొన్ని
ద్విపద : ఇంటి పెరళ్లలో – నిడి ప్రతిచెట్లు
కుంటక, నేకుల – గూర్చి దారముల
నూలి పోగుల దీసి – నుసుల ద్రిప్పి
పాలుమాలక స్త్రీలు – పట్టి కండెలను
గుడ్డల కరువును – గూటి పేదరిమి
గడ్డికౌ కడగండ్లు – కడపడు మనకు
కల్లను దగవైచి – కావలి యుంచి
పుల్లను బోనీక – బ్రోదిగా బెంచి
చలిగాలి వానల – సన్నముల్ గాక
కలజీవ ధనముల – గట్టి కొట్టముల
పిడుదలు చీమలు – పెను దోమగములు
కడిది పేడ గదురు – గంజను లేక
శుద్ధిగా బశువుల – జూచుట మేలు
……… ……..
పదియేండ్ల బిడ్డకు – బాడియావొకటి
కుదిరిన నేలను – గూర్చగావలయు
బాలురకు వ్యాయామము ముఖ్యముగా తోడ్పడుననియు, వారిలో ఇద్దతేజస్సు. బుద్ధిబలము, పొదుపరితనము. దేశభక్తి, దేవతాప్రీతి పెంపొంద వలెననెడి. ఉదాత్త భావముగల వారాచార్య వర్యులు.
1914 వ సంవత్సరమునకు సరియైన ఆనంద సంవత్సర ఉగాది కానుక శుభాకాంక్షల నిట్ల ప్రకటించిరి.
సీ. ఆనంద నంవత్సరాది, కుశల వార్త
యూనంద దాయక – మందటకును
వృద్ధ్ది యౌ నన్యజ – వృక్షజ జంతుజ
ఖనిజాండ జమ్బులు – జనము లలర
భూచర జలచరంబులు, నుభయ చరంబు
లును, తమ తమ పనులొనర నలువ
ఆంగిక వస్తువు -లనువుగా నేలలో
జేరుట బంటలు జెలుపు మించు
గీ : నుభయ మూలల వానలు నూర్జీతముగ
జరుగు చుండంగ సవ్యాప సవ్యములుగ
శిల్ప యంత్రకల్పనములఁ జేతి పనుల
భారతీయుల భాగ్యంబు ప్రబలి వెలుగు
“పోణిమి”లోని ద్విపద
‘కూరేశ శర్మ’ యోగుణిపట్టి జనుల
కూరిమి నేర్పును -గొనజేయు నెపుడు
అంకితం బియ్యది – యాంధ్ర నాయకుని
లెంకల కిది నిత్య – లీలగా వెలయు
శ్రీరస్తు – శుభమస్తు – శివభూతిరస్తు
ఆరోగ్యమస్తు – దీర్ఘాయుష్యమస్తు
పశువృద్ధిరస్తు – సద్బాంధవ్యమస్తు
శిశువృద్ధిరస్తు – సత్ స్త్రీ వృద్ధిరస్తు
ఋతుకాల వర్ణాభివృద్ధి స్పదాస్తు
హితమతి కర్షక స్మృతి కార్యరస్తు
తృణకాష్ట జలవృద్ధి దినదినమస్తు
ఫణిరాజ తల్ప కృపా మహిమాస్తు
ఇందులో తమపేరు “కూరేశ శర్మ’ అని వ్రాసుకొన్నారు.
సర్వేజనాః సుఖినో భవంతు అని అందరిని దీవించి మహాభావులు వీరు.
వీరి శిష్యురెందరో గొప్ప పదవుల నలంకరించియున్నారు. ఆదర్శ గురువులు. చెప్పినది చేసి చూపు వారు. వ్యర్ధ ప్రసంగములు వీరికి పనికిరావు, కార్యదక్షత, నీతి నిజాయితీ కలవారు. ఇట్టి వారి స్మరణ మాత్రము చేతనే. మనయందు కార్య దీక్షత జనించు ననుటలో ఏ సందియము లేదు.
రాయలసీమ రచయితల నుండి….
———–