పేరు (ఆంగ్లం) | Kalugodu Aswathrao |
పేరు (తెలుగు) | కలుగోడు అశ్వత్థ రావు |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మాంబ |
తండ్రి పేరు | వెంకోబరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/25/1901 |
మరణం | 7/19/1972 |
పుట్టిన ఊరు | కలుగోడు-రాయదుర్గము తాలూకా , అనంతపురం జిల్లా. |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | కన్నడము, సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | గదాయుద్ధము కంద పద్య రామాయణ, శ్రీ కృష్ణలీలె(బై లునాటక), సుభద్రాపరి ణయ నాటకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కలుగోడు అశ్వత్థ రావు |
సంగ్రహ నమూనా రచన | కర్ణాటకాంధ్ర భాషలకు గల మైత్రి ఈనాటిది కాదు, విజయ నగర సామ్రాజ్య పాలకుల ఏలుబడిలో నుండిన మన సీమ కర్ణాటకాంద్ర కవిశేఖరుల నిరువురిని, ఆ ప్రభువులొకేతులలో తూచి, ఇరువురిని సమానముగా పోషించినారు. ఆనాడు తెలుగు కన్నడ కపుల సరస్పర మైత్రి వాత్సల్యములు పెంపొందెను. భాషా వైషమ్యములకు తావులేదు. ఏనాడో, ఆ రెండు భాషల మధ్య ధృడమైన సేతువు నిర్మించబడినది. |
కలుగోడు అశ్వత్థ రావు
కర్ణాటకాంధ్ర భాషలకు గల మైత్రి ఈనాటిది కాదు, విజయ నగర సామ్రాజ్య పాలకుల ఏలుబడిలో నుండిన మన సీమ కర్ణాటకాంద్ర కవిశేఖరుల నిరువురిని, ఆ ప్రభువులొకేతులలో తూచి, ఇరువురిని సమానముగా పోషించినారు. ఆనాడు తెలుగు కన్నడ కపుల సరస్పర మైత్రి వాత్సల్యములు పెంపొందెను. భాషా వైషమ్యములకు తావులేదు. ఏనాడో, ఆ రెండు భాషల మధ్య ధృడమైన సేతువు నిర్మించబడినది.
ఈ ఇరుపదవ శతాబ్దమున ఆంద్ర కర్ణాటక భాషలకొ కే లిపి నిర్మాణ మొనర్చ ప్రయత్నములు జరుగుచుండుట ముదావహము. అనంతపురము జిల్లా పొలిమేరలు మైసూరు రాష్ట్రమునకు చేరియండుట వల్లను, కర్ణాటకాంధ్రులలో, వివాహ సంబంధములు జరిగి యుండుటవల్లను, ఇరువురి ఆచార వ్యవహార సంప్రదాయము లించుమించుగా కలిసిపోయినవి. కాన, అనంతపురము జిల్లా కొన్ని తాలూకాలలో, కర్ణాటకాంధ్ర కవి సవ్యసాచులు పెక్కుమంది వెలసిరి. వారెంతో కృషిసల్పి ఇరుభాషా సాహిత్య కుసుమము లందుగల పరిమళములను వెదజల్లిరి. అట్టి ధృడతర సేవజేసి ధన్యులై నా వారిలో శ్రీ కలుగోడు అశ్వత్తరాపుగారొకరు.
కన్నడ సాహిత్యములో వీరికి చిన్ననాటినుండి మక్కువ కుదిరినది. కన్నడ కస్తూరి పరిమళమును బాగుగా ఆఘ్రాయాణించి. తెలుగు తీపిని చక్కగా గ్రహించిరి.
కన్నడజైన కవులైన, పంప, రన్న , పొన్న కవులు కర్ణాటక సాహిత్యమును వెలుగులోనికి దెచ్చిరి. వారు ‘రత్నత్రయ”మని ప్రసిద్ధి పొందిరి. ” సర్వజ్ఞానివచనము ” లను పేర ఆంద్రీకరించిరి. తెనుగున వాడుకలోలేని, ‘కన్నడ త్రిపది ఛందస్సు” నే వాడినారు. మచ్చునకు గమనించుడు.
- పచ్చి మాంసపు బీడు – పాడు బొమికల గూడు
హెబురో త – తనువున నుండి – కులపెంచ
వచ్చునేరీతి సర్వజ్ఞ !
ధనకనకములు గలుగ – దినకరుని వలె చెలుగు
. ధనకనక మరుగ – మరునాడు – పొడూరు
శునకమగు నరుడు సర్వజ్ఞ
3 రాతిపై – నొకమ్రాను – రాయుచుండుట గంటి
చేతులాపైన – గనుగొంటి – సౌరభము
రాతియును గంటి (సాసరాయి)
- మీను ముట్లనివారి – దానవుల పగదారి
మానవుల కగును – ఫలకారి – తెలిపెదరె?
జాణులిదారి? (టెంకాయ)
ఇట్లే వేమన పద్యములను కన్నడభాషలోని కనువదించిరి, ఈ ‘వేమన రత్నగళు” కర్ణాటక దేశములో బహుళ పచారమై నవి. మణియు, కన్నడములో, ‘మహాలింగరంగ” అనుకవిచే వ్రాయబడిన ‘ అనుభవామృత మనబడు అద్వైత వేదాంత గ్రంథమును తెలుగులో “అనుభవామృత సారము”గా రచించిరి, అట్లే పాల్కురికి సోమనాథ కవిగారి సోమేశ్వర శతకమును, కనక దాసుగారి హరిభక్త సారమును తెలుగులో అనువదించిరి.
పోతన్నగారి మహాభాగవతమందలి ప్రశస్త ఘట్టములైన , గజేంద్ర మోక్షము, రుక్మిణీ కల్యాణము, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్రములను కన్నడ దేశము వారికి “భాగవత గీతిగళు అనుపేర నందించిరి.
పెద్దన్నగారి మనుచరిత్రను ” శృంగార వరూధిని ” గా కన్నడమున రచించిరి. స్వతంత్రముగా కన్నడమున, 1) కంద పద్య రామాయణ 2) శ్రీ కృష్ణలీలె(బై లునాటక) 3) సుభద్రాపరి ణయ నాటక, అనునవి. వ్రాసినామని కవిగారు తమ గ్రంథములలో వ్రాసికొన్నారుగాని, ఆ వ్రాత ప్రతులు చేదాటిపోయిన వన్నారు.
కన్నడ రన్నకవిచే వ్రాయబడిన “సాహస భీమవిజయ ” అను కర్ణాటక కావ్యమును, మన కవిగారు “గదాయుద్ధము” అను పేర ఆంద్రీకరించినారు అందులో మచ్చునకు మూడు పద్యములు చూడుడు.
- కం. మానధనుడన నెగడి, యుభి
మానము దిగనాడి, నీటమయిచాచుటే? యెం
లైసన్ గప్పలు నేండ్రులు
మీనులు, జలములనిలు; నిలమేలే మగలున్ “?
- కం. ఎందెందు నీవు మృతినే
పొందనటులఁదలఁచి, మిగులఁ బొంగితి; నీవొం
డుందలఁచు టెరుంగవో? జడుండ వగుదువో ?
- కం. మాగాడ్పు పట్టితో, నీ
మాగవు; మరినాకు నీకునైన దగి యెడిన్
నాగాండీవము నిశితము
నీ గళపఁబటుత్వమరయ-నీవిటురమ్మా!
భాషాంతరీ కరణము సామాన్యులచే సాధ్యము కాని పని పరస్పర భాషలకు సౌందర్య సాహిత్యములను , అనువాదము ప్రసాదించవలెను. అనువాదకున కుభయ భాషా పాండిత్యము, ప్రత్యేకపు పలుకుబళ్లు, దేశ్యపదజాలములు, నానుడులు, ఏతద్భాషా స్వరూప స్వభావ సౌందర్య వికాసములు తెలిసి యులచవలయును, వీటి నేరింగిన దిట్ట మనకవిగారు.
ܝܸܖ
ఈ కవిగారు, రాయదుర్గము తాల్లూకా-“కలుగోడు”లోను మైసూరు సీమలోని “తళుకు గ్రామములోను కరణము పనిచేసిరి. ఈ రెండు గ్రామములందును. కవిగారికి చాలినన్ని భూములుగలవు గాన జీవితమును సుఖముగా గడపిరి. అయితే వీరికి సంతానములేదు. అన్న కొమారునే, తన పుత్రునిగా వాత్సల్యమున పెంచిరి. ఈ కవి విలాస పురుషుడు. చేతివేళ్ల కై దింటికి రాళ్ళ చెక్కిన కనకపు టుంగరములు ధరించి, సరిగంచు వస్త్రములను సింగారమగా ధరించువారు. తన ఇంటికి వచ్చిన అతిథి, అభ్యాగతుల నాదరించి మృష్టాన్నమనిడి, వారిని సంతోష పెట్టవారు. తాము వ్రాసిన కావ్య ముద్రణము కొరకు నితర ముద్రాశాలల శరణుజొచ్చక, స్వంత ముద్రాక్షర శాలను, రాయదుర్గములో నెలకొల్పి, తగుకావ్య ముల నందే ముద్రించుకొనిరి. ముద్రణ సౌందర్యము నాశింపక, తగు గ్రంథముల నెట్లో యొకరీతి తమ ‘ కవిరాజ ” ముద్రాక్షర శాలయందే ముద్రించిరి. తమ అవసాన కాలమునందా ముద్రాక్షర శాలను రాయల పరిషత్తున కుచితముగా సమర్పించిరి. వారి దాతృత్వ మెట్టిదియో గమనింపుడు. ఇంతక ముందు పేర్కోన్న అనువాద గంథములే కాక, ఈ కవిగారీ గ్రంథములు కూడ రచించిరి. 1) దండక రామాయణము 2) అశ్వత్థ భారతము (పద్యకావ్యము ఆది చతుష్కము మాత్రము) 3) అశ్వత్తే శత్రిశతి (కందములు) , 4) మూడు శతకములు, 5 ) రెండు నాటకములు 6) అక్క మహా దేవి వచనములు 7) బ్రాహ్మణుడు 8) గురుదక్షిణ.
గురుదక్షిణ 196 6 లో వ్రాసిరి . ఇందులో కవి గారు తమ మనస్సు విప్పి , కవితా కన్య తన్నెట్లు వారించెనో చెప్పుకొన్నాడు .
ఉ. భార్యకు మున్న నాకరము – బట్టెను; బాయదు నిద్రలోను, నే
కార్యముఁగొన్న నీడవలిఁగాచును; జూచును నా మనంబులో
బౌర్యము; వేరు ధ్వాసఁగొస- సైపదు; శాంతిసుఖం బొసంగు, నౌ
దార్యము మీ, లోక సుఖ ధర్మమ శాంతికరంబు! కాల్పనే?
రామాయణము నెందరో , మహానుభావులు వ్రాసి యున్నారు కాని , దండకరూపమున , ‘దండక రామాయణము ‘ ను వ్రాసిన వారీ కవి గారొక్కరే . కైకేయి తన వాక్చాతుర్యముతో , దశరధునిట్లు మరులు గొల్పినది . “
‘హా నాథ! మత్ప్రేమనాథా! ధరా నేతృనేతా ! ప్రతాపాధినాథున్ నిన్ను భర్తగా బొందియున్ నే నథా కృతిన్ గుంటేదన్ మోహనాంగా! మదీ యెప్పి
తార్ధంబు దీర్పంగ నే నుంటినం చంటివే ? అంతి భాగ్యంబు నాకున్నదే ? సత్యమున్ బల్కుదే ? బాళి నీ వంతగా నాయెడన్ జుల్కుదే ? పల్కవే ! . యన్న భూనాథుడోమానినీ ! నాయెడన్ నీకు సందేహ మిట్లుండ నే హేతువో ? నాతిరో ! మున్నుకన్నావటే నా యుదాసీన భావంబు నీపట్ల ? నీకై చితిన్ దూకగా వచ్చినన్ దూకెదన్ గోర్కెనే దీర్తు , నీడేర్తు నొకామినీ ! కోరుమంచన్న , నా జాణ వేలేచి, ముద్దారగా గౌగిటన్ గుచ్చి; యూ వృద్ధ మాయా వియోహంబులన్ ” గుప్పి, తిపౌచమత్కారపున్ భాషణల్ చెప్పి, యిట్టాడు. ఇట్లే క ధారగా వీరి కవితా ప్రవాహము సాగిపోయినది.
రాయలసీమ రచయితల నుండి…
———–