పేరు (ఆంగ్లం) | Sunkara Satyanarayana |
పేరు (తెలుగు) | సుంకర సత్యనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 6/23/1909 |
మరణం | 9/5/1975 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మాభూమి నాటిక నమ్మిన బంటు, పరివర్తన, ఏదినిజం, పల్లెటూరు సినిమా డైలాగ్స్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సుంకర సత్యనారాయణ బందగీ సమాధి |
సంగ్రహ నమూనా రచన | భాయిూ, బందగీ, నీ జీవితమే జీవితము భాయిూ బందగీ వీర యోధుడా హారతు లివిగో క్రూర నిరంకుశ దేశముఖుల ఈ దారుణ హింసల రూపుమాపగా పోరాటంబున పాణాలొసగిన నీవే అమర జీవి వోయీ మార్గదర్శి వోయీ Iభాయీ II విప్లవజ్యోతిని వెలిగించితిని తెలగాణను నీవే ఇంటింటను నీవే మా హృదిలో నీవే |
ప్రచురణ తేదీ : సెప్టెంబరు 9, 2016
రచయిత పేజీని సమర్పించిన వారు: శ్రీ లెనిన్ అన్నే
సుంకర సత్యనారాయణ
బందగీ సమాధి
[ సబ్జా మొక్కలు , సన్న జాజులు వగైరా రకరకాల పూల మొక్కలతో లతో సమాధి అలంకరింది ఉంటుంది . వీరారెడ్డి, దాదే సాహెబ్ ఒక ప్రక్కన , సుభాన్ , రామిరెడ్డి మరోప్రక్క నుంచుని ఉంటారు. వీరారెడ్డి భార్య సీతమ్మ , చెల్లెలు కమల సమాధి పై అగరవత్తులు వెలిగిస్తూ ఉంటారు . తెర లేస్తుంది . అందరూ కలిసి పాడుతూ ఉంటారు.
భాయిూ, బందగీ,
నీ జీవితమే జీవితము
భాయిూ బందగీ
వీర యోధుడా హారతు లివిగో
క్రూర నిరంకుశ దేశముఖుల ఈ
దారుణ హింసల రూపుమాపగా
పోరాటంబున పాణాలొసగిన
నీవే అమర జీవి వోయీ
మార్గదర్శి వోయీ Iభాయీ II
విప్లవజ్యోతిని వెలిగించితిని
తెలగాణను నీవే
ఇంటింటను నీవే
మా హృదిలో నీవే
[కమల , సీతమ్మ , వీరారెడ్డి ప్రక్కకువచ్చి నుంచుంటారు. పాట
ఆయిపోయిన తర్వాత అందరూ తమ చేతుల్లో ఉన్న పువ్వులు సమాధిపై చల్లుతారు .],
సుభాన్ : (నాలుగువైపులా తేరిపారజూచి) ఏం జనం తెంపు లేదు.
రామి :ఒహ్ ! జనమేంటి ? ఇనుకేస్తే రాలేటట్టుందా ?
దాదా : వచ్చే బండికి దిగేబండికి అంతులేదు ! ఏ చెట్టకింద చూచినా బండే ; నిరుడే అనుకుంటే అంతకు రెట్టింపు జనం వచ్చింది ఈ యేడు !
వీరా : అవును,ఏ యేడు కాయేడు పెరిగిపోతూ ఉంది, ముందు ముందు ఇంకా వస్తారు.
దాదా : ఎనకటి రోజుల్లో రేపాల తిరణాలకి , సోమప్ప తిరణాలకి ఇట్టాగే వచ్చేవాళ్ళు,
రామి : ఆ , ఏం వచ్చే వాళ్ళో , కొరివి తిరణాల మా గొప్ప తిరణాలని నిరుడు పనిమాల బండి గట్టకెల్లా, తీరా చూడబోతే కుచ్చీ కాయలేరు.
దాదా : అక్కడ ఒక చోటే ఏంటి ? ఇప్పుడే తిరుణాల కెల్లినా అంతే.
సుభాన్ : నిజమే దాదా .
రామి: అయితే మన బందగీ ఉర్సుకి జనం ఇట్టా పొర్లి వస్తం దేమిటి?
.దాదా :ఏమో బాబు , ఈ సిత్రమంతా అల్లాకే తెలవాలి .
వీరా : ఇందులో పెద్దచిత్ర మేముంది దాదా ? బందగీ పేరు రోజురోజుకి ప్రజల్లో పాకిపోతూ ఉంది . అందుకనే దూరదూరాన్నుంచి ఈ తిరుణాల చూడ్డానికి జనం వస్తున్నారు, గాల, అప్పడే అతన్ని గురించి అనేక ఊళ్ళల్లో వింత వింతగా చెప్పకుంటున్నారు,.
వీరా : ఆప్పడే ఏమయింది ? ముందు మందింకా చెప్పుకుంటారు .
రామి : ఏం ! ఎందుకని ?
వీరా : అవును, అతను చేసిన త్యాగమలాంటిది. ఆరోజుల్లో ఒక్కడే దేశాముఖుతో ఎదిరించి పోట్లాడాడంటే మాటలా ?
సుభాన్ : అందులో విసునూరు దేశముఖు అంతవాడితో !
రామి ; మూన్నాళ్ళు బతికినా అట్టా బతకాలి .
సుభాన్ : ఆయనకుతోడు ఆట్లంటోళ్లు ఇంకా పదిమంది ఉంటె కనపడేది ఈ దేశముఖు తడాఖా .
దాదా : ఏదో మనం అట్టా అనుకొవడమేగాని, ఎంతమంది అయితే మాత్రం ఏం జేస్తా రా మహారాజుని ?
రామి : ఏo, అంతలావు మొగోడా ? ఎంత మందిని చంపుతాడు ?
సుభాన్ : ఎందుకు జంపడు, ఇట్టాంటి మన దాదా లంతా చేతులు ముడుచుక కూచుంటే ఏంచెయ్యకుండా ?
దాదా : చేశామో , చేయలేదో , మా కాలం ఏదో గడచి పోయింది , ఇక మీ పడుచోళ్ళు చేసే తలకిందు లేమిటో చేయండి . అదీ చూద్దాం.
సీత : అసలీ తగాదాకు మూల మేంటో ?
సుభాన్ : ఏముంది , పదిమందిలో ఔననిపించుకోవడమే :
సీత : పదిమందిలో మంచి అనిపించుకుంటే ఆయన సొమ్మేం పోతుంది .
వీరా : ఎందుకుబోదు ? పదిమందీ బందగీ చుట్టే చేరితే, ఇక దేశముఖు మొఖం చూసే దేవడు ?
కమల : అతను పైకివస్తే ఇంకా వీడిపెత్తనం ఎలా సాగుతుంది వదినా ? “
దాదా : మన సుభాన్ యీడు కె ఆ ఉరోళ్ళందరితో షేబాస్ అనిపించుకున్నాడు.
కమల : అంత చిన్న వయస్సులోనే ఆ ఊళ్లో ఏ తగాదా వచ్చినా ఈయనే తీర్పు జెప్పేవాడటగా దాదా ?
దాదా : ఊళ్లో తగాదా లేమిటమ్మా , చివరకు మొగుడూ పెండ్లాం మధ్య కీసులాడుకున్నా అతని దగ్గరకే వచ్చి చెప్పకునేవాళ్ళు, అదేం పుటకో ! ఎవళ్ళకీ నొప్పి తగలకుండా తీర్మానం చేసి పంపించేవాడు. అట్టాంటోన్ని వాళ్ళ పొట్టన బెట్టుకున్నారు,
సీత : అంత బుద్ధిమంతుణ్ణి చంపడానికి ఎవడి చేతులాడినియ్యో!
సుభాన్ : (కోపంగా) తాగుబోతు, డబ్బుకు గడ్డిదిని ఖూనీ జేశాడు.
సీత: ఎవడు అంత పాపాని కొడిగట్టింది ?
కమల : ఎవడో గాదు , వాళ్ల అన్నే వదినా !
సీత : చాల్లే పిచ్చిపిల్లా, తమ్ముణ్ణి ఎక్కడన్నా అన్న చంపుతాడూ ? ఏమిటా మాటలు ?
దాదా : నిజమేనమ్మా, అమ్మాయి జెప్పింది నిజమే. కసాయి ముండా కొడుకు వాళ్ళ అన్నే చంపించాడు.
రామి: అట్టాంటి దుర్మార్గుణ్ణి పగల కొసినా పాపం లేదు.
వీరా : వాడి పనిబట్టడం ఎంతసేపు , అసలీ తగాదా బెట్టిన దేశముఖుకి బుద్ధిజెప్పేలి గాని.
సీత: వాడి కడుపుగాల , అన్న చేతనే తమ్ముణ్ణి చంపించాడంటే వాడెంత మాయముండా కొడుకో ? అసలీ తగాదా బాగాల దగ్గిరొచ్చిందా ?
వీరా : భాగాల దగ్గిర తగాదా ఏముంది ? అయిదుగు రన్నదమ్ములూ తలా నాలుగెకరాలూ పంచుకున్నారు, ఇంటికి పెద్దోడని అబ్బాసలీకి జ్యేష్ట భాగంకింద ఇంకో నాలుగెకరాలు ఎక్కువకూడా ఇచ్చారు.
దాదా : ఏం ఇస్తే ఏం ఫాయిదా ? వాళ్ళ పరువెక్కడ దక్కనిచ్చాడు ? తాగి తందనాలాడి తనకిచ్చిన ఎనిమిదెకరాల గడ్డా పాడు జేసుకున్నాడు .
వీరా : వాడు తాగితేం , తలకుబోసుకుంటేం ? ఆదేవడికి గావాలి ? మళ్ళీ వచ్చి నాకు భాగం పెడ్తారా, చస్తారా అని తయారయ్యాడుగా.
రామి: మళ్ళీ ఏ మొకంలో వచ్చాడు సిగ్గులేక, బాగం అంత అడ్డగోలుగా ఉందా ఏమిటి ?
సుభాన్ : ఎందుకుండదు ? వెనక మాల దేశముఖు బుజం చేసుకుంటే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు,
దాదా : నాబాటోడైతే అప్పడే గుడ్ల తేలేసేవాడు , కాని ఆదికదేం దైర్యమో ; పన్నెండేళ్ళు , డీ అంటే డీ అని దేశాముఖుకు ఎదురు తిరిగి పోట్టాడాడు.
సీత : ఒక్కడే అన్నిరోజులు ఎట్టా పోట్టాడాడో !
వీరా : ఏముంది ? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది. చుట్టుపట్ల మన నాలుగూళ్ళ జనం (సమాధివైపు చూపి) ఈయన మీద ఈగ వాలనిచ్చారా ?
దాదా: సద్దెన్నం మూట బుజానేసుకొని కాళ్ళ కండెలు కట్టేట్టు పన్నెండేళ్ళ కచేరీ చుట్టూ తిరిగాడు .
సీత: వన్నెండేళ్ళే !
కమల : ఎన్నాళ్ళు తిరిగితే ఏం వదినా, చివరకి బందగీయే గెల్చాడుగా,
రామి ; గెల్చాడూ? ఇవన్నీ పెద్దొళ్ళకి ! మాకే తెలియవ్ , నీ కెట్టా తెలిసినయ్ అమ్మాయ్.
సీత: (చిరునవ్వుతో ) దానికెందుకు తెలియనవ్ . ఇంట్లో అన్న ఉన్నాడుగా నూరిపోయడానికి, (కమలతో) కానియ్ , తర్వాత సంగతి కూడా నీవే చెప్పు .
కమల : (ముసిముసి నవ్వలతో) నేను చెప్పడమెందుకు అన్నయ్యనే అడగరాదూ ? నాకు చెప్పినట్టే నీక్కూడా చెప్తాడుగా.
కమల : (సిగ్గుతో) నేర్చావులే మాటలు నోరుముయ్ !
(అందరూ నవ్వుతారు)
రామి : ఇంతకీ తర్వాత ఏమి జరిగింది దాదా !
దాదా : బందగీ గెల్చాడని కబురు తెలియగానే చుట్టూ పక్కల నాలుగూళ్ళల్లో పండగ జేసుకున్నారనుకో .
సుభాన్ : ఏం పండగ జేసుకుంటే ఏం లాభం
సీత : ఏం ?
వీరా : ఏముంది ? బందగీ గెల్చాడంటే దేశముఖుకి నిద్రబట్ట లేదు . ఇక తన పచ్చిదోపిడీ- సాగదనుకున్నాడు, కుట్రలు బన్నాడు. మిసల్ (రికార్డు ) తెచ్చుకోడానికి పాపం ఒకరోజు బందగీ ప్రొద్దున్నే కచేరీకి బయల్దేరాడు . సరిగ్గా ఇక్కడికే మనం ఇప్పుడు నుంచున్న చోటికే వచ్చాడు. కంచెలో దాక్కొనున్న దేశముఖు రౌడీలు అమాంతంగా ఒక్కసారి కత్తులతో బందగీ విూద పడ్డారు. బందగీ తల తెగిపోయి నేలవిూద పడింది. నెత్తరు కాలవ గట్టింది .
సీత : రాం రామ , కటికి చచ్చినోళ్ళెంతపని జేశారు !
———–