పేరు (ఆంగ్లం) | Pillarisetty Ranga Brahmarao Naidu |
పేరు (తెలుగు) | పిళ్ళారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | పిళ్ళారిసెట్టి శ్రీ కృష్ణులునాయుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1890 |
మరణం | 1/1/1962 |
పుట్టిన ఊరు | బందరు |
విద్యార్హతలు | – |
వృత్తి | బళ్ళారిలో, తహసిలుదారు పని. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పిళ్ళారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు |
సంగ్రహ నమూనా రచన | 1930 లో ఆదివెలమ శతకము, సీస పద్యములతో వ్రాసి నారు. ఈ శతకములో శ్రీ విలసిలల్లు బృందావనములో, కృష్ణమూర్తి జన్మించిన రీతిగా, ఆదివెలమ కులము పుట్టక స్థలము బృందావనమే అనగా “బందరు” అని సూచించినారు. బందరును వీడి ఉద్యోగ వశమున అప్పటికి రాయలసీమలో నున్న బళ్ళారిజేరి తహసీలుదారు ఉద్యోగము నిర్వహించిరి. స్వయముగా కవులు.సారస్వతాభిమానులు |
పిళ్ళారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు
1930 లో ఆదివెలమ శతకము, సీస పద్యములతో వ్రాసి నారు. ఈ శతకములో శ్రీ విలసిలల్లు బృందావనములో, కృష్ణమూర్తి జన్మించిన రీతిగా, ఆదివెలమ కులము పుట్టక స్థలము బృందావనమే అనగా “బందరు” అని సూచించినారు. బందరును వీడి ఉద్యోగ వశమున అప్పటికి రాయలసీమలో నున్న బళ్ళారిజేరి తహసీలుదారు ఉద్యోగము నిర్వహించిరి. స్వయముగా కవులు.సారస్వతాభిమానులు
1981 లో, బళ్ళారిలో నెలకొల్పబడిన శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల వార్త విని వారా సంస్థ మేనేజింగు ఎడిటరుగారి నింటికి పిలిపించుకొని ఇట్లు చెప్పిరి. ” ఈ యుద్యమ మెంతయు, బళ్ళారి పట్టణంబునకు దగియున్నది. చేసియే తీరవలయును. పట్టుదలచే కృషి జరిగిన ధన సహాయము తప్పక కలుగును ” అని ప్రోత్స హించి మొట్టమొదటనే భూరివిరాళ మొత్తము నిచ్చి, గ్రంథ మాలను ప్రోత్సహించిరి. గ్రంథమాల కార్యక్రమములలో పాల్గొని చేదోడు వాదోడుగా నుండిరి. వీరిని మరచిపోదమన్నను మరపు రాదు, వీరు ఆదివెలమ శతకము వ్రాసిరి.
ఈ శతకములో 178 సీస పద్యములు కలవు.
సీ. సబ్ జడ్డి పనిజేయ సామ్రాజ్యమును లేదు
బంట్రోతు పనికి లోపంబు లేదు
కోటికి పడిగెత్త-గొప్పయేమియలేదు
దారిద్యదశ నున్న-తప్పలేదు.
సరిగ చీరలుగట్ట-సద్గౌరవములేదు.
చవకవి దోడుగ, నీచంబులేదు
పనివాండ్ర నియమింప పరువు హెచ్చుటలేదు.
తానె కష్టము సేయ తగ్గులేదు
గీ. కులమె ముఖ్యము నంతకు గుణమె గొప్ప
గాని, యితరంబు లొకలెక్కగావ సుమ్ము
విమల గుణ ధన్యులగు-నాదివెలమలార!
బంధుజనులార! సత్కృపా సింధులార
(కవిగారి సీతిబోధన)
సీ. కన్న తండ్రికిగూడ-కడు పారబెట్టక
యెండలో పనిఁజేయనిచ్చు వారు
తల్లిపై సరియైన – దాక్షిణ్య ముంచక
పెండ్లాల సేవింపఁ బెట్టువారు
అక్కలన్న లటంచు , నాదరంబులు లేక
రేపుమాపును. యెదురించువారు
వృద్ధ బాంధవులందు-వినయంబు జూపక
చుల్కనగాజూచి సొక్కువారు
గీ. కలరు మనలోన వారల కావరంబు
లణఁగి భక్తి భావలెప్ప డబ్పగలవొ?|విమలII
(ఇట్టివారన్ని కులములలో నున్నారుదా)
ఇప్పటి తప్పలను, కవిగా రెంత చమత్కారముగా జెప్పినారో݂ ݂ ݂
ఈ క్రింది పద్యము చదువండి.
సీ : చీపురు, కసపూడ్చ – చేతబట్టుటతప్పు
ముసురు పాత్రలను దోముటయు తప్పు
నెత్తి పై బిందెతో-నీళ్లకేగుట తప్పు
వంటచేయుట, యంతకంటె తప్పు
బిడ్డకు పాలిచ్చి-పెంచుట యొకతప్పు
వడ్డించు పనికూడా చెడ్డ తప్పు
చేటతో చెరుగుట- చేయగూడని తప్పు
విసరుట దంచుట-యాసలె తప్పు
గీ : ఇట్టు లగుటచే, యిప్పటి యింటిపనులు
నలుప నౌకర్లు, పదిమందిచాల రైరి -|విమలII
(కవిగారు అత్తింటి కాపురమునుగూర్చి ఇట్లు వ్రాసిరి.)
సీ : లోపలనేయుండి-లోలోన బాధించు
మంచంబులోసల్లి-మగనితల్లి
సర్వదా బాధించి-సంకటబడఁజేయు
మగమండ్రగబ్బ యూమగనియబ్బ
అతిక్రూరముగజూచి-యార్బాటములుజేయు
పొగరుబట్టిన కుక్క-మగనియక్క
అందిందు నెందున్న-యాక్షేపణము సేయ!
మదికినాటెడుముల్ల-మగని ఇల్లు
మగని వర్తన మెంతటి-మంచిదైన
యతివ కత్తింటి కాపురం-బార్తి గూర్చు-విమల||
ఈ కవిగారు, మరి యే గ్రంథము వ్రాసినట్లు తెలియదు. సువాసన
గల “గులాబి ” ఒకటి చాలదా ?
రాయలసీమ రచయితల నుండి…
———–