కాండూరు నరసింహా చార్యులు (Kanduru Narasimhacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Kanduru Narasimhacharyulu
పేరు (తెలుగు)కాండూరు నరసింహా చార్యులు
కలం పేరు
తల్లిపేరుతిరు వెంగడమ్మ
తండ్రి పేరుకాండూరు రాఘవాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/15/1900
మరణం1/21/1972
పుట్టిన ఊరుమహబూబ్ నగర్ జిల్లా – వనపర్తి , కడప జిల్లా జమ్మలమడుగు లో స్థిర నివాసమే ర్పరచుకోనిరి.
విద్యార్హతలు1915 బెంగళూరు కళాశాలలలో సంస్కృతాంధ్రములను నేర్చిరి.
వృత్తిప్రధానాంధ్ర పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅశోక రాజ్యము, రామరాజ్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకాండూరు నరసింహా చార్యులు
సంగ్రహ నమూనా రచనశ్రీ కాండూరు వారు కడుపేద కుటుంబమున పుట్టినవారు. యారవ యేటనే తండ్రిని కోల్పోయి తల్లి సంరక్షలో పెరిగిరి. భిక్షాటనము చేసి ఆమె తన యిరువురు కుమారులను పోషించినది. పెద్ద కుమారునకు విద్య అబ్బలేదు. రెండవ కుమారుడైన నరసింహా చార్యులనైనను విద్యావంతుని జేయ ఆమె సంకల్పించినది. ఆచార్యులవారికి సహితము విద్య నేర్వవలెననెడి కాంక్ష హెచ్చి, 1915 బెంగళూరు కళాశాలలలో సంస్కృతాంధ్రములను నేర్చిరి.

కాండూరు నరసింహా చార్యులు

శ్రీ కాండూరు వారు కడుపేద కుటుంబమున పుట్టినవారు. యారవ యేటనే తండ్రిని కోల్పోయి తల్లి సంరక్షలో పెరిగిరి. భిక్షాటనము చేసి ఆమె తన యిరువురు కుమారులను పోషించినది. పెద్ద కుమారునకు విద్య అబ్బలేదు. రెండవ కుమారుడైన నరసింహా చార్యులనైనను విద్యావంతుని జేయ ఆమె సంకల్పించినది. ఆచార్యులవారికి సహితము విద్య నేర్వవలెననెడి కాంక్ష హెచ్చి, 1915 బెంగళూరు కళాశాలలలో సంస్కృతాంధ్రములను నేర్చిరి.

1926 సం|| నుండి 1955 సం|| వరకు కడప జిల్లా జమ్మల మడుగు పి.ఆర్. బోర్డు హైస్కూలులో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేసిరి. వీరికి సంస్కృతాంధ్రము లందు మంచి ప్రావీణ్యము కలదు . సాధారణముగ వీరు ప్రాపంచిక పరిణామము ను విమర్శించుకొనుట యొక యలవాటు. వీరి రచనలో ఆట్టి విశేషములే గోచరించు చుండుట గమనింప దగినది.

సాంఘిక యితివృత్తమును గై కొని చక్కటి సాంఘిక ప్రబంధమును తీర్చి మెప్పలు బడసిన ఘనత శ్రీ కాండూరు వారికి “ మోహన విజయము “ అను కావ్యముతో దక్కినది . ఇట్టి కావ్యము లప్పటిలో పలు విమర్శలకు గురియైనను . ఆచార్యుల వారు వాటిని గణింపక నా దృష్టి వేరు అను రీతి యేదు రొడ్డి రి . వారి దృష్టిలో సందేశమే ప్రధానము .

ఇందు మోహనుడు ప్రధాన నాయకుడు. అతని తండ్రి విశ్వపతి లోభి. కుమారుని విద్యకు సహితము ధనము వెచ్చింప నుత్సహింపని వాడతడు. మోహనుడు తుదకు ప్రభావితుడై విద్య నభ్యసించుకై దూరదేశముల కేగినాడు. దేశాటనమువలన అతనికి విద్యతోబాటు లోకజ్ఞాన మలవడినది. విద్యావంతుడై తిరిగినచ్చిన కుమారునకు ‘వరకట్నము” విశేషముగా నిచ్చునొ క సంబంధమును తండి కుదిర్చినాడు. మోహనుడు తండ్రికి హితబోధచేసి, తాను ప్రేమించిన సుశీలనే వివాహ మాడినాడు. ప్రతిదినము భార్యాభర్త లిద్దరూ గ్రామసంచారము గావించి ప్రకృత కాల పరిస్థితులను బట్టి దేశ పద్ధతులను, రాజ్య పాలనమును, ప్రజల కిట్ల పదేశించిరి .

ఉII అన్నలు తమ్ములంచు, దమ యస్వయ మందొక గుంపు వారిపై
మన్ననఁ జూపి యెన్నకొన మాన్యపు బౌరత పొడుసేయుటే,
యెన్నికలం బ్రభుత్వమున కెన్నిక సేఁత వివేక సమాన్యులస్
గన్నెల నిచ్చి నీచులకు గాళ్లకు మ్రోక్కుచు దిర్గుటె యగున్ .

చ : ప్రజలె ప్రభుత్వ మంచడరు బాధ్యత పౌరుల దర్మమంచుఁ దా
నిజముగc బౌర ధర్మముల నిశ్చల చిత్తత నాచరించు వాఁ
డు జగమునన్ సునీతిపరు డుజ్జ్వల నిత్యసుఖంబు లొప్పగస్
విజయము లందు చుండుఁ బృధివిన్ నమబావము లుల్ల సిల్లగన్ .

ఇట్టి సాంఘిక విషయముల పెక్కింటిని వారచ్చటచ్చట తమ కావ్యములందు తడిమిరి. “వినోద – బహిష్కరణము” లన బడు ఖండ కావ్యమునందు సహితము ప్రేయసి ప్రియల మనో భావములు దేశ సేవ సలుపుటయందు నిమగ్నము కావలెనని ప్రబోధించిరి. ” బహిష్కరణ” ము నందు శ్రీ యామనా చార్యుల వారు గావించిన హరిజనోద్ధరణ విధానమును సూచించిరి.
”మారన” యను మాలవాడెట్ల రంగశాయి భక్తుడయ్యెనో
యిందు వివరింపబడినది. చక్కటి శైలిలో సరళముగా పద్యములు సాగినవి. మారన కొక యతిపతి యుపదేశము లభించినది. దానితో అతడు శ్రీరంగని సేవించుటకై శ్రీ రంగ పట్టణమునకు బయలు దేరినాడు . శ్రీరంగ పట్టణము నిట్లు కవి గారు వర్ణించిరి .

సీ|| రంగ తరంగ నిర్మల వారిపూర్ణమై
యభయ కావేరు లింపానఁగు చుండ
భక్తులు బ్రోవ నిర్బంధించి నట్టుల
నేడు ప్రాకారంబు లెనఁగు చుండ
శ్రీ వైష్ణవుల గోష్టిసేవింపఁ దలకొని
దివ్య పబంధ గీతికలు పాడ
సంభృతానంద సంస్తవన మోహన లీలఁ
గొబ్బరి తోపులు గులకు చుండ
తే|| హాయి శ్రీశేషశాయి యై యలరు చుండు
రంగపతి సేవ సేయు శ్రీరంగ పురికిఁ
దరలె “మారడు “?, దివ్యబోధంబు గలుగ
దైహికా పేక్షc గుమిలెడు ననద గలఁడా ?

వీరి మరియొక ఖండకావ్యము ‘ పూలతోట “. ఇందెన్నో ధ కవితా కుసుమములు విరబూచిసవి. తోటలోని వివిధ స్పెములవలె పెక్కు- విషయములిందు ప్రస్తాపించ బడినవి. ఆప్ప చేయుట యెంతటి తప్పో, అదెంతటి ముప్పనుగొని తెచ్చునో ఈ కింది పద్యమున మనకు విదితమగును.
ఇంద్రుని యంత వారు నిను నెమ్మెయి నమ్మినఁ గొంపఁ గూల్లు, రా
జేంద్రులనేని బొంక వలపిచెందు. నీయెడ నీతి సున్న, ని
స్తంద్రులనైన నీవలపు తంత్రమునం బడద్రోతువా హరి
శ్చంద్రుఁడె నిన్ను నమ్మి యుగచాట్లకు లోనయికుంది క్రుంగడెI
కాయ కష్టమునను గలియేని గంజియే
గుడిచి తృప్తినందుఁ కోవిదుండు
చేత కాని కుమతి చేసిన యుప్పలఁ
దీర్చలేక సతము దిగులు చెందు.

పేద రైతుకు కష్టముమెండు. దానికితోడు దురదృష్ట మెదురైనచో యతని దీనావస్థ జెప్పనలవికాదు. ఒక పేదరైతు అదృష్ట మెట్లన్నదో సహజముగా నిరూపించిరి. చూడుడు.
ఎద్దులఁ గొన్నబాకి పరికింపగ దీరక మొన్నెరోగ మా
యొద్దుల బొట్టబెట్టుకొని యేచగ దానికిదోడు నిత్యమున్
చద్దుల మోసి మోసి బహు సంకట పాటున కోర్చు భార్యయున్
ముద్దుల బిడ్డలా కటికి బొక్కుచు నుండగ జింత యుండదే.

అశోక రాజ్యము, రామరాజ్యమనునవి వీరి మహా ప్రబంధములు. రామరాజ్యము నందు రామాయణ గాధను వ్రాసిరి.

‘మన దేశమున రామాయణము వ్రాయని కవి లేదు. ఎందఱు వ్రాసినను విసుగు జనింపని లోకోత్తర గుణ విశేషములను, ధీరో దాత్త నాయకుడందుండుట ముఖ్య కారణమునైనవి. స్వతంత్ర భారత దేశమును రామరాజ్యముగా భావించు కొనుచున్నాము. అందెంత వరకు సత్యమున్నది ? రాముని యవతారము డెదుర్కొనిన కష్టపరంపరలు, సాధించిన ఘనకార్యములు, అతని పరిపాలనా పద్ధతి మొదలగు నంశములను గ్రహించి, ఆ విధముగా నడచుకొన్నప్పడే మన రాజ్యము ‘రామరాజ్యము” కాగలదు. ఈ విషయములెల్లరు గ్రహింపవలెనని నేను రామకథను సులభముగ సంగ్రహముగా లోకమునకు వెల్లడించుటయే నా పరమోద్దేశ్యము.” ఆని కవిగారు తెలుపు కొన్నారు.

రామలక్ష్మణు లెట్లు తమ భోగములు విడిచి యరణ్యవాసము నకు యోగులై వెళ్లిలో నీ క్రింది సీసపద్యమున రమ్యముగా జెప్పబడినది.

సీ|| పట్టు పుట్టంబుల పసమించు మొలలపై
నార చీరల జిగి నాణే మొనగ;
నునుపరి కుసుమ వాసనల నింప దలిర్చు
సిగలు బడబ్ధాల్ప మొుగము లలర;
గస్తూరి కాంగ రాగములు పిసాళించు
మేన నంతట బూది మెరుగు లీన;
రంగు మిరెడు పాదరక్షలఁ బొలుపొందు
నడుగులు పాపల నంద గింప;

రాయలసీమ రచయితలనుండి….

———–

You may also like...