పేరు (ఆంగ్లం) | Belluri Srinivasamurthy |
పేరు (తెలుగు) | బెళ్లూరి శ్రీనివాసమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసమ్మ |
తండ్రి పేరు | బెళ్లూరి హనుమంతరావు |
జీవిత భాగస్వామి పేరు | తులశమ్మ |
పుట్టినతేదీ | 2/4/1910 |
మరణం | 2/5/1988 |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లాకొత్తచెరువు మండలం తలమర్ల గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తపోవనము (ఖండకావ్యము), కావ్యగంగ (ఖండకావ్యము),అమృతాభిషేకము (ఖండకావ్యము), విశ్వవైణికుడు (ఖండకావ్యము), జాముకోడి (ఖండకావ్యము) శిల్పవాణి (కావ్యము), వివేకానందము (ద్విపద కావ్యం), రెడ్డిరాజ్యమహోదయము జపమాల (స్మృతికావ్యము), కోడికూతేసింది, ప్రేమతపస్విని (ఖండకావ్యము), సాన్నిధ్యం, అపశృతి (ఖండకావ్యము)(1947), కళాజీవి (ఖండకావ్యము)(1948) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మధురకవి, రాయలసీమ కవికోకిల, అభినవకాళిదాసు, కవితా తపస్వి |
ఇతర వివరాలు | శ్రీనివాసమూర్తి పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం ఇతని బాల్యమిత్రులు. ఈ ముగ్గురూ కొన్నాళ్ళు రాయలసీమలో ‘కవిత్రయంగా’ వాసికెక్కారు. ఇతని కవితలు భారతి సాహిత్య మాసపత్రికలో అచ్చయ్యాయి. 30 యేండ్లు అనంతపురం జిల్లా బోర్డు హైస్కూలులో ఆంధ్రపండితునిగా పనిచేసి అనేకమంది విద్యార్థులను సాహితీ ప్రియులుగా తీర్చినాడు. ప్రముఖ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ ఇతని శిష్యుడే. గీతావాణి పత్రికకు గౌరవ సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. ఇతని కావ్యగంగను మైసూరు యూనివర్సిటీ వారు డిగ్రీ పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బెళ్లూరి శ్రీనివాసమూర్తి |
సంగ్రహ నమూనా రచన | రాయలసీమ నెవరో రాళ్లసీమ అన్నారు. ఈ సీమ గత వైభవమెట్టిదియో వారెరుగరు. రత్నములను రాసులుగా పోసి, ఈ సీమలో విక్రయించినారు. వజ్రకరూరు , వజ్రములు దొరికినవి. వర్షాకాలములో ఇప్పటికికూడా, పరదేశీయులిచ్చటికి వచ్చి, ప్రతి శిలను వెదకుచున్నారు. రాయలసీమ మట్టిలో బంగారు గనులు దొరికినవి. రామగిరి ప్రాంతములో బంగారు కొరకు, ఆఖండాన్వేషణము ప్రభుత్వము వారు జరుపుచున్నారు. |
బెళ్లూరి శ్రీనివాసమూర్తి
రాయలసీమ నెవరో రాళ్లసీమ అన్నారు. ఈ సీమ గత వైభవమెట్టిదియో వారెరుగరు. రత్నములను రాసులుగా పోసి, ఈ సీమలో విక్రయించినారు. వజ్రకరూరు , వజ్రములు దొరికినవి. వర్షాకాలములో ఇప్పటికికూడా, పరదేశీయులిచ్చటికి వచ్చి, ప్రతి శిలను వెదకుచున్నారు. రాయలసీమ మట్టిలో బంగారు గనులు దొరికినవి. రామగిరి ప్రాంతములో బంగారు కొరకు, ఆఖండాన్వేషణము ప్రభుత్వము వారు జరుపుచున్నారు.
* రాయలసీమ “లో చక్కని కవిత్వము చెప్పవారున్నారా ? అనునది మరొక ప్రశ్న ? ఈ సీమ పెనుకొండ, కొండలలోనే ” వసుచరిత్ర ‘ కావ్యముద్బవించినది. ఈ సీమ కొండకోనలలో మధుర కవితాగానము వినవచ్చినది. రాయలసీమ “రసజ్ఞత ‘గురించి శ్రీ నండూరి రామకృష్ణాచార్యులిట్లు పల్కిరి.
క్షామము దాపురించి పలుసారులు చచ్చెను జంతు సంతతుల్
వేమరు చచ్చినారు ప్రజ వేనకుచేలు చరిత్ర లోపలన్ ,
క్షామము లెన్ని వచ్చిన – రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞా
నామృత వృష్టికిస్ కొరతనందని రాయలసీమ లోపలన్ .
ఈ పెన్నేటిగడ్డపై పట్టిన అచ్చపు రాయలసీమ కవి కుమారుడు, ప్రకృతి దేవత నువాసించి ” మధురకవి ” యై యిట్లు గీతమును బాడుచున్నాడు.
చాల చిన్నదిరా !
నాయిల్లు – చాల చిన్నదిరా !
నామీది ప్రేమతో – నావాకిటను ನಿల్చి
నన్నుబిల్తువు గాని – అతిథ్యమెటుసేతురా !
నా బ్రదుకు అంతటికి – నోచదయ్యెనురా !
కారు ముబ్బల లోన – కటిక చీకటిలోన
నా స్వామివగు నీవు – నా కొరతనే తీర్ప
నా వాకిటను నిల్చి – నన్నుబిల్తువు గాని
చిన్ని దివ్వెయు లేదురా
నీ రాక చిత్తమున ! వెతగూర్చరా !
మిత్రమై నాతోడ – మెలగి ముచ్చటలాడ
ఆరుదెంతువే గాని – చిరు చాపయును లేదురా
కూర్చుండ, శిథిల భూభాగంబురా !
కనుల నిండుగ నీరు – గ్రమ్ముకొన నీ చెంత
పాటలే వినిపింతురా – నా బ్రతుకు
పాటతో పయనించురా !(అమృతాభిషేకము )
శ్రీ బళ్లూరి శ్రీనివాసమూరి పేరెరుగని వారు లేరు. వీరి కవితలు తెలుగు దేశపు నలుమూలల వ్యాపించినవి. ఇతనిని రాయల సీమలో, ఒక అగ్రశ్రేణి కవిగా నిలబెట్టినది “భారతి” (మాసపత్రిక) ” అవ్యాజ వాత్సల్యములో భారతి భిక్ష పెట్టక యున్నచో ” నా జీవి తము’లో ఏనాడో, కవితానన్యాసము స్వీకరింపయుండవలసిన వాడనే” యని కవిగారు చెప్పకొన్నారు.
ప్రకృతి కన్య, ‘శ్రీ బళ్లూరి “వారిని లేబ్రాయముననే వరించినది, శుకపిక శారికలు, కర్షకులు, కాపు కన్యలు పచ్చని పైరులు, పూ దీగలు వారి కవితా సొత్తులు. అతనికి వాటితో పొత్తు వీడరాని బంధమైనది. అవి ప్రసాదించిన సుఖము కవిగారికి
మరెచ్చట దొరకలేదు. అందుకే అతడిట్లు చెప్పకొన్నాడు.
పరిమళింపని దొక్క పుష్పంబు లేదు
నేను విహరింపఁజనిన వనీతలాల
సుకృత వశమునఁ గలిగిన సుఖము లందు
నోలలాడితి యారౌవనోస్మిలనమున.
ప్రకృతి యొడిలోన సుఖసుప్తివడయు చుందు
కోయిలలు లేప నిదుర మేల్కొనుచు నుందు
అడవి కోనల సెలయేటి పడుచుఁ గాంచి
పరమ సంతోష భరమున బలుకరింతు.
మొగ్గనై, యాకు మరుగున బొలుతు నేమొ ?
పూవుగాఁ బూచి పరిమళ మొులుకఁబోతు
నో విహంగమై పరతునో ? భావగీత
మగుదునో ? నేను భావిజన్మములయందు
కాంక్షలేవేరు , నా మనోగతులె వేరు.
పూరి గుడిసెలలోనైనఁ బుత్తుగాని
గీత మల్లక బ్రదుకు సాగింపలేను;
భావగానంటె నాదు సర్వస్వమవని! (తపో వనము )
శ్రీ బళ్లూరి శ్రీనివాసమూర్తి గారి జనకులు శ్రీ బెళ్లూరి హనుమంతిరావు గారు కూడ సాహిత్య పిపాసకులే. వారెన్నో పద్య ములల్లిరి. వారు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదాది సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తులు. శ్రీ బెళ్లూరివారు శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులకడ శిష్యరికమొనర్చిరి. అప్పటి నుండి వీరు గురు కుమారులైన శ్రీపుట్టపర్తి నారాయణాచార్యుల వారికి ప్రియ మిత్రులైరి శ్రీ విద్వాన్ విశ్వంగారు వీరి బాల్య స్నేహితులు. ఈ ముగ్గురు కొన్నినాళ్ళు రాయలసీమలో “కవిత్రయముగా” వాసి కెక్కిరి.
శ్రీ బెళ్లూరి వారి కవితాధార తేనెకంటెను తీయనిది. ఆయన గారి రచనలు చదువు చున్నప్పడు పాఠకుడు తాను సెలయేటి జలత రంగాలలో నీదులాడి నట్లానందించును. ఆ పద్యములందరి రమ్యమైన భావములు హృదయ ఫలకములపై ముద్ర వేయును.
కవికి కావలసిన ప్రతిభ వ్యుత్పన్నత వీరికి కలదు. “పద్యమ చదువగనే కవికి అర్థవగుణమెంత యుండునదియు కావ్యానుభవ రసికులకు స్పష్టముగా తెలిసిపోవును. ఈ యార్జవ గుణము నిండి యుండుటను శ్రీనివాసమూర్తి గారి కవనమందు ప్రతి పద్యము నందును మనము చూడవచ్చును. ఈ గుణముచే వీరి సుందరవస్తు ప్రపంచము విశాలమైనది’ (శ్రీరాళ్లపల్లి)
శ్రీ బెళ్లూరి వారు తమ ‘కావ్యగంగ”లో తమ కవితాంగనను తెనుగు ప్రాంగణములోని కాహ్వానించిరి. ఆమెకు కవి, తమ తెనుగు ప్రాంగణములోని విశేషముల నిట్ల నుగ్గడించును.
తరుణి తప్పకపోయి చూడదగు నందంబైన “లేపాక్షి? యె
వ్వరు నిర్మించిరొ దేవతాయతన మబ్బా, యేమి శిల్పంబు, మ
త్సరమున్ గాంతురు భిన్నదేశ జనులా సౌందర్యమున్ జూచి, ఆ
శిరసుల్ విప్పిన నర్పమో, వృషభమో, స్త్రీ మూర్తులో యచ్చటన్ .
“కావ్యగంగ”ను మైసూరు విశ్వవిద్యాలయమువారు బి.ఎ. బి. యన్. సి. పరీక్షలకు పాఠ్య పు స్తకముగా నుంచిరి
వీరి ‘శిల్ప వాణి’ కావ్యమందు శిల్పవిలాసిని యొక్క తె తన స్వీయానుభవమును నివేదించుకొనును. అందు విజయనగరపు రాజైన కృష్ణదేవరాయల రాజ్యాంగము, సాహితీ సమరాధన. నాటి సంస్కృతి సంగ్రహముగా నిక్షీప్తమైయున్నది. రా యల సాహితీ కొలుపుకూట మిట్లు అలంకరింపబడినదని శిల్పవాణి తన హృదయవీణను మీటి పలుకుచున్నది.
రూపగొన్న కవిత్వ రోచిస్సువలె పెద్ద
నామాత్యుడొక్కచో నధివసించె,
అమృత గంగాప్రవాహము వోలె నంది తి
మ్మన వచ్చి నిజపీఠమున వసించె,
పదగుంభన ప్రౌడి పాటించు రామ కృ
ష్ణ కవీంద్రుడుచితాసనమున జేరె,
గాంధర్వ కలనేర్చి కవితాకుమారిని
కై సేయు భూషణ కవియు వచ్చె
సాహితీ పుత్రుడల్ల ధూర్జటి కవీశు
డపర తిక్కన పింగళి యరుగుదేర
వచ్చెనయ్యలరాజు, సభాస్థలంబు
మల్లనయు జేరి సభ్యుల యుల్ల మలర.
కవి హృదయమెల్లప్పడు ఒకే రీతిగా నుండదు. అతనికి సుఖ దుఃఖములు కలవు. అతడొక్కపరి ఆనంద రఘురులందోల లారును. ఒకొక్కపరి విషాదసాగరమున మునుగును. విషాద మావరించినపుడు భగపంతుని ముందతడు కుమిలి కుమిలి ఏడ్చును. బెళ్లారి వారికి పుత్రికావియోగము సంభవించినప్పడు తమ యా వేదనను పద్యరూపమున నుంచిరి. ఆ విషాద జనకమగు ఆగాధకు, ఆ బాధకు మనగుండెలు కరుగును.
రాయలసీమ రచయితల నుండి..
———–