పేరు (ఆంగ్లం) | Kuntimaddi Sesha Sarma |
పేరు (తెలుగు) | కుంటి మద్ది శేషశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | శేషమ్మ |
తండ్రి పేరు | వెంకట రంగాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 2/2/1913 |
మరణం | – |
పుట్టిన ఊరు | అనంతపురము |
విద్యార్హతలు | తెలుగు విద్వాన్ |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలుగు రచనలు : సుధా బిందువులు , తెలుగు తల్లి , రామిరెడ్డి ,శ్రీ కేశవ ప్రపత్తి ,శ్రీయతి రాజీయము , శాంతి విలాసము ,రామానుజులు షడర్ధములు , అలంకార విచారము , గీతా మృతము , మేలి నోము . సంస్కృత కావ్యములు : శ్రీ కేశవ సుప్రభాతము , బాష్పబిందవః , సుమతి శతకము మనుసంభవః , ముకుంద విలాసః |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కుంటి మద్ది శేషశర్మ |
సంగ్రహ నమూనా రచన | శ్రీ శర్మగారు కుంటిమద్ది ప్రాథమిక పాఠశాలలో, 4 తరగతులు ముగించి, బళ్ళారిలో హైస్కూలు చదుపును ముగించిరి. పండిత ప్రకాండులు, పితామహులునగు, కుంటిమద్ది శ్రీనివాసా చార్యుల వద్ద 8 సంవత్సరములు, సంస్కృత కావ్యాలంకార, వ్యాకర ణముల నధ్యయన మొనర్చిరి. మరల 8 సంవత్సరములు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి యందుతీర్ణులై, 1988 లో, తెలుగు విద్వాన్ పరీక్షలో కూడ కృతార్దులైరి . |
కుంటి మద్ది శేషశర్మ
శ్రీ శర్మగారు కుంటిమద్ది ప్రాథమిక పాఠశాలలో, 4 తరగతులు ముగించి, బళ్ళారిలో హైస్కూలు చదుపును ముగించిరి. పండిత ప్రకాండులు, పితామహులునగు, కుంటిమద్ది శ్రీనివాసా చార్యుల వద్ద 8 సంవత్సరములు, సంస్కృత కావ్యాలంకార, వ్యాకర ణముల నధ్యయన మొనర్చిరి. మరల 8 సంవత్సరములు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి యందుతీర్ణులై, 1988 లో, తెలుగు విద్వాన్ పరీక్షలో కూడ కృతార్దులైరి .
1943 నుండి , అనంతపురము జిల్లా ఉన్నత పాఠశాలల యందు సంస్కృతాంధ్ర పండిత పదవుల నిర్వరించుచు, 1959 నుండి 1971 వరకు , జూనియర్ కాలేజీలో పని చేయుచు , రిటైరై , ప్రస్తుతము అనంతపురములో ఉన్నారు .
శర్మ గారు వ్రాసిన తెలుగు రచనలు 1) సుధా బిందువులు , 2) తెలుగు తల్లి , 3) రామిరెడ్డి ,4)శ్రీ కేశవ ప్రపత్తి ,5)శ్రీయతి రాజీయము ,6) శాంతి విలాసము , 7)రామానుజులు షడర్ధములు ,8) అలంకార విచారము , 9) గీతా మృతము , 10 ) మేలి నోము .
సంస్కృత కావ్యములు : 1) శ్రీ కేశవ సుప్రభాతము 2) బాష్పబిందవః 3) సుమతి శతకము 4) మనుసంభవః 5) ముకుంద విలాసః . ‘సుధా బిందువులు” ఈ చిన్నకావ్యములో శర్మగారు శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో, భక్తి భావముప్పొంగ నిట్ల ప్రార్ధించిరి.
ఆ . నిలువ దోప లిత్తు – నీరాజనము లిత్తు
ముడుపు లిత్తు – కురుల ముడుల నిత్తు
ఆర్తి , బాపు మనగ – నారోగ్య మిమ్మన
లంచ గొండి వని – తలంచలేదు.
ఆ. కానుకలను జూపి – కైమోడ్పులర్పించి
కావు మనెడి వారి – కామితముల
దీర్చి, యన్యజనుల – ధిక్కార మొనరించు
నాశ పాతకుండ – వని తలంప
ఆ: కోరి కొందుగాని – కొమ్మన నేరను
నీకు నిచ్చుటకును – నేనెవండ?
ఇచ్చి పుచ్చుకొనుట – కీవు, విక్రేతవు
గావు, బేరగాడ – గాను నేను.
” ఆంగ్ల విద్యాభ్యాసమును. తమ “తెనుగుతల్లి”లో ఇట్లు నిరసించిరి.
ఆనూ గూసులతో (Ass- Goose) కమెన్సయిన, యీ ఆంగ్లంపు
మర్యాద, నభ్యాసంబే – గణనీయ మంచు నుడువన్ “, పాశ్చాత్య
విద్యానిధుల్- శాసింపజాదొరలట్ల నన్యగతికుల్ , సాగించి
రధ్యాపకుల్-గ్రాసావాస విలోపలోల ధిషణాక్రాంతుల్ యథోక్షక్రముల్,
“రామిరెడ్డి’ అను లలిత కావ్యములో శృంగార రసమును వెళ్ళబోయుచు, కోమటి కోడల నిట్ల వర్ణించిరి.
చెందొవ నిగ్గుతో- జిలుగు- చేలపు టంచులు జిందులాడ-సం
దందు బదంబు లందు; సరిగంచుల గుత్తపు నీలరైక-క
న్విం దొనరింప నుజ్జ్వల మణిమయ భూషలు దాల్చి, దేవతా
మందిర మేగుచున్నది సుమా-అది కోమటి కోడలంటరా!
ఒంటికి నంటు కొన్న, తెలియొుల్లియ ప్రాయపుమేని పాంకమున్
కంటికి విందుసేయ, కరకంజములన్ ధరియించి, పంచ పా
ళింటికి నింటికిన్ వరుస -నిందు నిభానన గేస్తు రాండ్ర, పే
రంటము బిల్వ బోయెడినిరా- అది కోమటి కోడలంటరా!
శ్రీ తిరుమల రామచంద్ర గారిట్ల వ్రాసిరి. “శేష శర్మ విద్వత్క- వివర్యుడు . అలంకార శాస్త్ర పారంగతుడు. రసగంగాధర ఫక్కీలో ఈయన రచించిన “ఆలంకార విచారము” విద్వాంసుల తలలూపేటట్టు చేసింది. ఈయన సుధాబిందువుల సహృదయ సుధాబిందుపులు. తెనుగుతల్లి లోక వృత్తము పుణికి పుచ్చుకొన్ని కవితామతల్లి.”
“శ్రీ కేశవప్రపత్తి”లో శ్రీ శర్మగారు కేశపు నిట్ల వర్ణించిరి.
నిన్నే -నే శరణంటి -నా యవనమున్ – నీభారమే యుంటి; య
న్యున్నేవేడను, నీకె సేవకుడ, నన్నున్ బాలలో మంచినా
మున్నీటిన్ బడద్రోసినా ఆది యశమ్మో, నిందయో, నీకె– ఆ
పన్నానీక శరణ్య-కీర్తికి దగన్ వర్తింపుమో- కేశవా!
శ్రీ ‘యతిరాజీయము”లో, రామానుజాచార్యుల చరిత్రను పది గుచ్చములలో వ్రాసినారు. 7 గుచ్చములు ప్రకటించినారు. మిగత 8 గుచ్చము లచ్చునకు సిద్దముగా నున్నవి. అన్నియు పద్యములే. వీరు విశిష్టాద్వైత మతస్థులైనను, శివకేశవులను సమానముగా అర్చించిరి.
కాళహస్తీశ్వరు నిట్ల వర్ణించిరి.
శంకర! చంద్రశేఖర! వృషధ్వజ కృత్తివరాసి! మృత్యు నా
శంకర! పార్వతీ రమణ! సర్పవిభూషణ ! భూషణాయితై
ణంక కపాలమాల ! నయనాయిత పావక ! నీలకంఠ! నీ
కింకరి లెంక దాసిఁ దిలకింపుము దీనిదయన్ మహేశ్వరా!
వ్యకో క్తికి వాసిగన్న మహాకవి నీలకంఠ దీక్షితుని, “ధర్మ ప్రబోధ కృతికి “శాంతి విలాసము” అను పేర శ్రీ శర్మగారు అనువాదము వ్రాసినారు. తామే దీనికి తాత్పర్యము వ్రాసి, అనంతపురము నుండి వెలువడుచున్న సాధన పత్రిక” యందు వరుసగ ప్రకిటించిరి. అందులో ఒకపద్యము.
ఎన్నిభవంబు లెత్తితినొ ? ఎందఱు తల్లుల బిడ్డ నైతినో ?
ఎన్నిటి నీతి వాక్యముల – నెందరు పెద్దలు సెప్పవింటినో ?
ఎన్నిటి దుఃఖముల్ సుఖము లెన్నిటి గంటినొ ? నైననేమి ? య
న్నన్న! విరక్తి పట్టదుగదా ! విషయంబుల నించుకేనియున్
ఈ శర్మగారు, గోదాదేవి తమిళమున రచించిన “తిరుప్పావై ” అను కావ్యమును తెలుగులో పద్య కావ్యముగా రచించిరి. భగవద్గీతను, “గీతామృతము” అను పేర, వ్యావహారి కకాంధ్ర భాషలో కథగా రచించిరి.
విశ్రాంతి కాలము, వృథాబోనీయక శర్మగారు పలు తావులకు వెడలుచు, పురాణ కాలక్షేపము జేయుచున్నారు. ధర్మబోధ, భక్తి బోధ పురాణముల వినుట యందాసక్తి , నాస్తికత వ్యాపించుచున్న, నవీన కాలములో ప్రజలకుద్పోధ గావింప వలసియున్నది గదా! శుభం భూయా త్ !
రాయలసీమ రఛయితల నుండి……
———–