జోస్యం జనార్ధనశాస్త్రి (Josyam Janardhanasastry))

Share
పేరు (ఆంగ్లం)Josyam Janardhanasastry)
పేరు (తెలుగు)జోస్యం జనార్ధనశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుఆన్నపూర్ణమ్మ
తండ్రి పేరువేంకటరామయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుపాణ్యం-కర్నూలు జిల్లా
విద్యార్హతలుమద్రాసు యూనివర్సిటీలో “విద్వాన్ పరీక్ష” పట్టాని పొందారు.
వృత్తిప్రధానాంధ్ర పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకన్నతల్లి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవికోకిలావతంసులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజోస్యం జనార్ధనశాస్త్రి
సంగ్రహ నమూనా రచనపచ్చ కప్పరము నదల్చు వానన పస
వలపఁబారిజాతపటలరుల మృదులత
లింపు సొంపుల నింపు ప్రేమంపు జలువ
వెన్నెలల వెల్లి జాబిల్లి కన్నతల్లి,

 జోస్యం జనార్ధనశాస్త్రి

పచ్చ కప్పరము నదల్చు వానన పస
వలపఁబారిజాతపటలరుల మృదులత
లింపు సొంపుల నింపు ప్రేమంపు జలువ
వెన్నెలల వెల్లి జాబిల్లి కన్నతల్లి,
“కన్నతల్లి” ఆరాధనతో తన తొలి కవితాగానము నారంభించిన కవికోకిలావతంసులు శ్రీ జోస్యం జనార్ధనశాస్త్రిగారు. అది వారి కవితా వ్యాసంగమునకు శుభోదర్కము. “కన్నతల్లి” కావ్యమును రచించి నిజమాతృదేవికి సమర్పించి తల్లి ఋణమును దీర్చు కొని ధన్యులైరి శ్రీ శాస్త్రిగారు.

కడుపు పంటకై తల్లి పడెడి కష్టములు, కన్నతరువాత సంతాన పోషణకు పడెడి కడగండ్లు, కొడుకు నొక యింటివానినిజేసి, కోడలి రాపిళ్ళకుఁగుళ్ళచు, కొడుకును జూచుకొని కొండంత సంతోషముతో కాలము బచ్చు తల్లి గాంభీర్యమును వర్ణించునట్ల శాస్త్రిగారు మిక్కిలి తన్మయత్వముతో, స్వానుభవమును వెల్ల డిలచిరి. బిడ్లలపై మోహము తల్లి కెప్పుడు నొకే రీతి యుండునను టకు శాస్త్రి గారీ పద్యమును చెప్పిరి .

తనయుఁడెంతటి బిడ్డల తండ్రియైన
దనదు పాలికిఁ బసికూన యనియె దలచి
వేళ్ల కన్నము బతిమాలి పిలిచిపెట్టు
కన్న మోహము విడలేక కన్నతల్లి
శ్రీ శాస్త్రిగారు కన్నతల్లితో బాటు “ప్రకృతి కన్నతల్లి”ని కూడ ఆరాధించిరి. వారి దృక్పథములో యిరువురును సమానమే.
ఎలిమి సంజె కొమ్మలు తెరలెత్తి దింప
లీలఁగోయిల కలరాగ మాలపింప
శ్రావ్యముగఁ జిల్క పడఁతి వర్ణములు పల్క
కుల్క పరివిప్పు కొని నెమ్మి గొండ్ల సలుప
హాయి బిడ్డల నొడినిడి యలర జేయు
ఘన వినోద, మోద ప్రకృతి కన్నతల్లి.
ప్రకృతి మాత యొడిలో బిడ్డలు పొందు హాయిని చక్కగా అభివర్ణించిరి . శాస్త్రిగారి తల్లిదండ్రులు ప్రాచీనార్ష సంప్రదాయ మునకు చెందిన సాత్త్వికులు . శ్రీ కవిగారు ప్రాథమిక విద్య 10-12సం:లలో ముగించి తరువాత మేనమామల కడ, పూర్వ పద్దతులలో సంస్కృతాంధ్ర కావ్య నాటకాలంకారములను నేర్చిరి. 1933 లో శాస్త్రిగారు మద్రాసు యూనివర్సిటీలో “విద్వాన్ పరీక్షలో నెగ్గి, అప్పటి నుండి అనంతపురంజిల్లా తాడిపత్రిలో మునిసిపల్ హైస్కూలు నందు ప్రధానాంధ్ర పండితులుగా పనిచేసిరి.
శాస్త్రిగారు తమ ‘కన్నీటి చుక్కలు’ అనుకావ్యములో తండ్రి కొరకు పరితపించు కుమారుని ఆవేదనను వర్ణించిరి. పారశీక యువకుడైన “షాహరాబ్ ” చదువు సాముల దారితేరినవాడు. అతడెంతో కాలము తన తండ్రి నామధేయము తెలియనివాడై , సాటి వారిలో అపహాస్యముల పాలైనాడు. అతడా వేదనకు క్రుంగి పోయినాడు. తండ్రినిగూర్చి తల్లినిట్లని ప్రశ్నించినాడు.
” అమ్మ రుస్తము సరియుద్ధి నైతి నండ్రు
నేఁటి పారసీక యువక కోట యందు
జనకుఁడెవ్వడొ ? నాకు నీ నరికి దెలుప
బూన విదియేమి? యేమి యూ మౌనముద్ర ?
సాటివారల చదువులు సాము లరసి
వారి తండ్రు లానంద సంభరితు లగుచు
మెచ్చుకొని, చీరి , కౌగిట గ్రుచ్చియెత్త
దేరిచూచుచుఁ గుందుదు దేబె పగిది!
అద్బుతావహమైన విద్యాప్రదర్శ
నమ్ము దిలకింప వచ్చు జనమ్ము నన్ను
గూర్మిఁబిలిచి ” నీవెవ్వాని కొడుక “ వన్న
బట్టరాని వేదనఁ దల వంచు కొంటి “
తల్లి కుమారుని ఓదార్చి నీకు సరియుద్ధియైన “రుస్తము” నీ తండ్రి యని సమాధాన పరచెను. రుస్తుము మొగమెఱుగడు షాహరాట్. షాహరాబ్ తన పుత్రుకని రుస్తుముకు తెలియదు. ఈ విషమ పరిస్థితిలో విధి వక్రించి తండ్రి కుమారులకే యుద్ధము జరుగును. తండ్రి చేతనే కుమారుడు హతుడగును. తనయుడని తెలిసిన తరువాత తండ్రి యిట్ల శోకించును.
“ క్రూరుఁడను, మోసగాఁడను, పెూర పాత
కుడను, బాడు పౌరుషమునఁ గొడుకటంచు
దెలియ జాలక నవనవోజ్జ్వల సురూప
శార్యశాలిని జేసేత జంపుకొంటి,

నా వరాలమూట ! నావంశ రత్నమ !
నా కుమార ! తెలివి లేక తన్ను
దానె చంపుకొన్న దౌర్భాగ్య రుస్తుము
ఏఁడె పుత్ర హంత ! వీడె ఖలుఁడు !
కవి గారింద వీర కరుణా రసముల రెండింటిని సమపాళ్ళలో మేళవించి, చదువరుల కంట కన్నీటి చుక్కలు రాల్పిం తురు. వీరి “కృతిపతి “ కావ్యము గ్రామ్య భాషలో, శిష్ట వ్యావహారిక ఫక్కిలో, తెలుగు జాతీయ పలుకు బదులతో సాగిన ఖండకావ్యము. భారత స్త్రీ జీవితమును చిత్రించు “సీతమ్మ’ యను కావ్య ఖండము గూడ యిందు చేర్చబడినది.
రాయల కాలమునాటి ప్రజానీకము కూడ కవితాభిరుచిగల వారనియు, ప్రజలు, ప్రభుత్వము, ఆనాడు కవులను, కావ్యము లను గారవించెడి వారనియు కృతిపతి కావ్యము ద్వారా మనకు జోస్యము వారు తెల్పిరి. అందు కనువగు నొక కథను కూడా అందు జోడించిరి. గువ్వల చెన్నుడు రాయలను మించిన రసజ్ఞడు. వాడు పెద్దన్న కవిత్వమును మెచ్చుకొని స్వర్ణకంకణమును బహుమాన ముగా పొందినాడు. ఒకసారి ఒక పరదేశి విప9డు రాయల కొలు వుకు వచ్చి భంగపడినాడు. అతనిని ఆదరించిన వారు లేరు. అతడు ప్రచ్చన్న రూసమున నున్న, తెనాలి రామకృష్ణుని కలిసినాడు. రామ కృష్ణుడతనికి ఒక పద్యమునేర్పి, చెన్నడి వద్దకు పిలుచుకొని వచ్చినాడు. ఆ సమయములో చెన్నుడు అతని భార్యమధ్య జరిగిన సంభాషణ నిట్ల కవిగారు వ్రాసిరి.
భార్య:మామా ! యేంతిక్కోనివి?
ఆ మారాజే అడక్క అకడె మిస్తే
నీ మన్సెంబడి తుంటా
నే మోజుగ అడుగు తుంటె యూరా దేమే?

చెన్నుడు:- పిల్లా ! దాని గ్గాదే
యిల్లాలికి సొమ్ములేంటికే ! యెరి మొగమా !
యిల్లూ , వాకిలి, మొగుడూ,
సల్లగ తిననీకీ వుంటె సాల్లే దేమే?
నాపాలి పున్నె మాయని,
ఆ పెద్దయ్యకు దయొచ్చి ఆయన కాయ్నే
ఆ పద్యాల్మూలాన్నే
నా పేర్మి ల బెట్టు నంతు నాక్క లిగించెన్ .
పోయే ! అయియేకము దా
నా ! యేపాటి నుగాలుగాని యేం సాన్వత మౌ
తాయా ? యివన్ని యెంటో
స్తాయా ? పేరొగటి తప్ప తతిమా వల్లా !

చెన్నడి వద్దకు వచ్చిన ఆ విప్రుడు ‘కులవిద్యకు సాటిలేదు గువ్వలచెన్నా’ అని పద్యము వల్లించును. చెన్నుడు పొంగిపోలు బంగారు కంకణ మతనికి బహూకరించుతాడు. తరువాత మరొక బ్రాహ్మణుడు వచ్చి అదే పద్యమును మరింత కమ్మగా పాడి వినిపించును. అతనికి చెన్నుడు తన జీవనాధారమైన గొడ్డలిని సమర్పిస్తాడు. దీనినంతటిని మారువేషమున నున్న రాయలు గుర్తించి చెన్ను నీ విధంగా సత్కరించును.

ధనమేల ? రాజ్యమేలా ?
వినయ వివేకముల తోడి వితరణ గలుగన్
అనుమాన మేల ? నాకం
టెను గువ్వల చెన్నఁడొక్కడే కృతిపతియనౌ !
అని కృష్ణదేవ రాయలు
తన కంఠమునం దమూల్య తర హారంబున్
గొనుమోయి! ‘సత్కృతిపతీ !
యని చెన్నుని కంఠసీమ యందు నమర్చెన్ .
ال”
రాయలసీమ రఛయితల నుండి……

———–

You may also like...