గడియారం వేంకట శేషశాస్త్రి (Gadiyaram Venkata Seshasastry)

Share
పేరు (ఆంగ్లం)Gadiyaram Venkata Seshasastry
పేరు (తెలుగు)గడియారం వేంకట శేషశాస్త్రి
కలం పేరు
తల్లిపేరునరసమ్మ
తండ్రి పేరురామయ్య
జీవిత భాగస్వామి పేరువెంకటసుబ్బమ్మ
పుట్టినతేదీ4/7/1894
మరణం
పుట్టిన ఊరుపెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామం
విద్యార్హతలు
వృత్తితెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిన తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవితావసంత, కవిసింహ, అవధానిపంచానన
ఇతర వివరాలుగడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు.

ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు. గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారు.
1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.
1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
1967లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం,
1974లో మరాఠా మందిర్‌ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.
1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించారు.
1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ,
1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగడియారం వేంకట శేషశాస్త్రి
సంగ్రహ నమూనా రచనకవిగారు తమ పదమూడవయేటనే ప్రొద్దటూరు చేరి అక్కడి బ్రహ్మ శ్రీ రూపావతారము శేషశాస్త్రుల వారివద్ద కావ్యనాటకార లంకార సాహిత్యమును, తర్క- వ్యాకరణ శాస్త్రములను అభ్యసించిరి. శ్రీ షడ్డర్శనము వాసుదేవావధానులవారి వద్ద జాతక, ముహూర్త వాస్తు శాస్త్రముల నభ్యయనముచేసిరి. జ్యోతిశ్శాస్త్ర మున స్వయముగా వ్యాసంగము చేసిరి.

గడియారం వేంకట శేషశాస్త్రి

కవిగారు తమ పదమూడవయేటనే ప్రొద్దటూరు చేరి అక్కడి బ్రహ్మ శ్రీ రూపావతారము శేషశాస్త్రుల వారివద్ద కావ్యనాటకార లంకార సాహిత్యమును, తర్క- వ్యాకరణ శాస్త్రములను అభ్యసించిరి. శ్రీ షడ్డర్శనము వాసుదేవావధానులవారి వద్ద జాతక, ముహూర్త వాస్తు శాస్త్రముల నభ్యయనముచేసిరి. జ్యోతిశ్శాస్త్ర మున స్వయముగా వ్యాసంగము చేసిరి.
ఉద్యోగము –పదవులు :-
1930 లో ప్రొద్దుటూరునందలి శ్రీకన్యకాపరమేశ్వరి సంస్కృత పాఠశాలలో అధ్యాపకులుగా చేరిరి. ఆ సమయమున “బ్రహ్మనందినీ ” అను పత్రికకు సంపాదకత్వమును వహించిరి” తరువాత ప్రొద్దుటూరు నందలి పురపారకోన్నత పాఠశాలలో పెక్కేండ్లు ప్రధానాంధోపాధ్యాయులుగ పనిచేసి పదవీ విరమణ పొందిరి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థకు వీరు సామాన్య సభ్యులుగాచేరి ఉపాధ్యక్షులై విశిష్టసభ్యులుగా గౌరవింపబడిరి. ఆంద్ర ప్రభుత్వము వారిని శాసనమండలి సభ్యులుగ ఎన్నుకొని, గౌరవించినది. 80 ఏండ్లకు పై బడిన వృద్ధాప్యమునందు సహితము వీరు సాహిత్య రచనా వ్యాసంగము వదలలేదు. ప్రస్తుతము వారు వాల్మీకి రామాయణమును ఏడువేల పద్యములందు తెనుగించి అచ్చునకు సిద్ధపరచిరి.

సాహిత్యసేవ:-
శ్రీ దుర్బాకరాజశేఖర శతావధానితో కలిసి వీరు “రాజశేఖర వేంకటేశ కవుల”ను జంటకవుల పేర అష్టావధానములను పలుచోట్ల గావించిరి. విశేష సన్మానములనందిరి. వీరి అవధాన జైత్ర యాత్రా విశేషములన్నియు “అవధానసారమను” గంథమున విపులముగా చెప్పబడినది. బాల్యమునందు వీరు “శరన్నవరాత్ర పద్యావళి “ని తెనిగించిరి. తరువాతి కావ్యమే వీరి ‘ శివభారతము”
శ్రీ శాస్త్రిగారి ముద్రితికృతులు
(1) శరన్నవరాత్ర పద్యావళి (2) అష్టావధాన సారము (3) శ్రీ ఛత్రపతి శివాజీ (4) విశ్వనాథ నాయకుడు (5) శివభారతి ము (6 ) శ్రీనాథునికవితా విమర్శనము (7) గోవర్ధన సప్తశతి (8) రఘునాధీయము.
అముద్రితములు :- (1 ) ఉత్తర రామాయణ కావ్యశిల్పము (విమర్శనము) (2)రామాయణము- పద్యకావ్యము.
కావ్యపరిచయము
శివభారతరచనకు పూర్వమీకవిగారినిగూర్చి, వీరి కవిత్వమును గూర్చి తామెలుఁగక పోయిన విస్మయమునుగొందఱు పెద్దలు ప్రకటించుట యప్పటిలో జరిగినది. రాయలసీమ ఖనినుండి వెలువడిన రత్నములన్నియూ సానబెట్టిన తరువాతనే జాతిరత్నము లుగా, దేదీప్యమానమలై ప్రకాశించి పేరెన్నికగన్నవి. ఈ గ్రంథ రచనా కాలమున కవిగారు చేసినదొక కవితా తపస్సు. ఆ ఫలితమే శివభారతావతరణ. అది తెనుగువారల కడుపులు నిండించు రాయలసీమ పంట.

“శివభారత మొక సుందర కళాసృష్టి. ఆంధ్రభారతి ముంజేతి చిలుక ముద్దుల మూటగట్టు తెలుగుపలుకులను మురిపముతో ముచ్చటిస్తున్నది. ఆమె ముఖము నిగమసూక్తుల గానముచేస్తూ ధర్మోపన్యానము కావిస్తున్నది. ఆమె చేతియందలి అక్షరమాల భారత ధర్మమనన ధ్యానాదుల జేయవలెనని భారతీయుల నుద్బోధిస్తున్నది. ఆమె యొయ్యారముగా గ్రహించిన వీణ నుండి ముద్ర, మధ్యమ, తార భేదములతో “సరిగమ పదనిస’స్వరములు భావపూరితములై బయలు వెడలుతూ లోకమును సమ్మోహితము జేస్తున్నది. ఆమె మరియొక చేతి యందు ధరించిన ఆ పుస్తకమే “శ్రీ శివభారతము ‘ …….
పై పలుకులు శ్రీడాక్టర్ చిలుకూరి నారాయణరావు M.A.L.T. PhD. గారివి. వారు వ్రాసిన వాక్కులందతిశయోక్తులు లేవు. అవిస్తుతి వాక్యములకావు , ముఖస్తుతిచేయు నగత్యము వారికి లేదు. వీరి పద్య రచన ఒక తేనె కాలువ. వీరికవిత బంగరు తీగవలెసాగినది.
భారతదేశమున సనాతన ధర్మపునరుద్ధరణకై కంకణము కట్టిన మహావీరుడు శివాజీ, మొగలుల నెదిర్చి హైందవ ధర్మ పతాకము నెగురవేసిన వీరకేసరి ఈ కావ్యకథానాయకుడు. అష్టమూర్తి భక్తుడు శివాజి. కావుననే యీ ప్రబంధము ఎనిమిదా శ్వాసములు గలిగి యున్నది శ్రీ శివభారత మీనాటి కవితోద్యానమునకు నవ్య వసంతా గమనము. శివాజీ నిజముగా హిందూ ధర్మమును నిలుపుటకు దాని విశిష్టతను చాటుటకు, యవనరాజ్య నిర్మూలనకు అవతరించిన శివుడే. కాకున్న యిట్టి ఘనకార్య మితరులచేతకాదు.

చం. శివునవతార మేయని వచింపఁగనొప్పు శివాజి, ప్రాగ్భవో
దృవమగు భక్తి సంపదయుఁ,దల్లియొసంగు మతాభిమానమున్
బువ వెచలించు తావివలెఁ బొంగిన సాహస దైర్యశార్యగౌ
రవము లెలర్పఁగాఁజిరుత ప్రాయపు టాటల మేలిమిన్ గనెన్

చిఱుత ప్రాయమునుండియే, తల్లియిచ్చిన మతాభిమానము తోను, ఆమె చెప్పిన పురాణకథలతోను, శివాజీ సాహసము పొంగి నది, ఒకనాడు తల్లి యాతనికి చిన్ననాట జరిగిన యొక సంఘటన నిట్ల జెప్పినది.

మ: అయిదాటేఁడులవాఁడవీ వెఱుఁగ,వన్నా; మొన్న మోగల్ చమూ
చయముల్ గత్తి గటారిదూసి కసిమించన్ డాసి, మీయయ్యనే
బయలన్ నిల్వఁగనీకతోలె, నటుపై బంతంబు సాధింపనా
పయికి న్ దూకె , ని కేమి వల్కుదు దలంపన్ మేనుగంపిం చెడిన్.

సీ. ఉదరమ్మనంటనిన్ బొదివి, మర్కటి వోలెఁ
బ్రతిదుర్గమున కెగఁబ్రాకలేక,
బావురు గానియాపదఁబాప, రాచిల్క
వలె బంజరమున నిన్నిలుపలేక,
కంసు కటారిసోఁకఁగనీక. వసుదేవు
వలె గోకులముఁ జేర్చువాఁడు లేక,
పులివాతఁబడు గోపువలె, లేఁగదర్ఁజేరి
దిక్కులేనితనంబు దెలుపలేక,
తే: యలసిపోయితిఁ: “దోరు నైతి” ననుచుఁ
గుమిలిపోయికి: మొగలు కక్కురితి నెదిరి
ధిక్కరించితి; నీతికై తెంపసేయ
నొకఁడు లేఁడయ్యెనే” యంచు నుడికిపోతి.

దానితో శివాజీ యుద్రేకము మరింత మించినది. తల్లి యిట్లు వీరరసమును నూరిపోసినది. తరువాత శివాజీకి రామదాసు దర్శన భాగ్యమబ్చినది. ఆతడు హైందవ మతమును, హైందవ భూమిని రక్షించు భారమును పూర్తిగా శివాజీ పై మోపెను. అతడిట్లు ధర్మోప దేశమును గావించెను.
ఉ: కాపరి లేని గోగణము కై వడి హైందవభూమి ధర్మర
క్షాపరురైన క్షత్రియలఁగానక, ముష్కర తస్కరాళిచే
నేపరి , నీపయిన్ బరువులెత్తెడు నాసలవేచియుండె;బా
హాపరిణాహ ధూర్వహుడవై శివరాజ: భరింపుమీ ధరన్ !
చ : మును కాలు వెట్టు దేశమతముల్ దరి జేర్ప గ ధీరుడెవ్వడా
యని నిసు గంటి , గంటి భావదాశయ; మీనిను బ్రోత్స హింపగా
బని గొని ధర్మ గీతములు వ్రాసితి ; నా తలపున్ వచించి నె
మ్మనమున నూర డిల్లితి; గుమార ; సమీహిత మీవ చూడుమీ

రామదాసు వచనామృతమును మనసార్చ గ్రోలిన శివాజీ తనువు నిలువెల్ల పొంగినది. నాటి నుండియు కాషాయ పతాక మెర్తి “భగవాజండా” ను ప్రతిష్టించెను. కవిగారు పోషించిన వీరరసమునకీ పద్యమొక మచ్చుతునక.
సి : కొరవి ద్రిప్పి నయట్లు మెరుగు లేచినయట్లు
కరవాలుమిస మిసల్ గమ్ముకొనఁగ.
మును మెత్తి రిపమధ్యమును జిల్చి చొర దారి
నలువై పుసేనలు నరకులాడి-
పెనుగాలి తాటిపండ్లనురాల్చు చందానఁ
గొడ వండ్ల బై రులు గోసినట్లు,
చెరుకు గడల్ నిల్వనరికి వై చెడురీతిఁ,
జిగురాకు దూసిపోసిన విధాన
తే : దలలు ప్రేవులు పాణి పాదములకండ
లింతలింతలు తునియలై, యిందునందుఁ
బ్రోవులై , రాసులై, రణభూమిమిత్తి
వంటయిల్లనఁ బీనుఁగు పెంటచేసె

———–

You may also like...