బ్రహ్మశ్రీ ఉప్పల వేంకటశాస్త్రి (Uppala Venkata Sastry)

Share
పేరు (ఆంగ్లం)Uppala Venkata Sastry
పేరు (తెలుగు)బ్రహ్మశ్రీ ఉప్పల వేంకటశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుఈశ్వరాంబ
తండ్రి పేరుసింహాద్రి నృసింహికవి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుముడివేముల, మార్కాపురం తాలుకా , కర్నూలు జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఅభినవోదయ కవిమిత్ర, కవిభూషణ, కవికోకిల, కవితా విశారద , శతావధాని
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబ్రహ్మశ్రీ ఉప్పల వేంకటశాస్త్రి
సంగ్రహ నమూనా రచనఅభినవోదయ కవిమిత్ర-కవిభూషణ- కవికోకిల, కవితా విశారద – శతావధాని
బ్రహ్మశ్రీ ఉప్పల వేంకటశాస్త్రి
తల్లి :- శ్రీమతి ఈశ్వరాంబ
తండ్రి – సింహాద్రి నృసింహికవి
జన్మస్థలము – ముడివేముల, మార్కాపురం తాలుకా , కర్నూలు జిల్లా
కులము, మతము – హిందూ-బ్రాహ్మణ. భారద్వాజస గోత్రులు

బ్రహ్మశ్రీ ఉప్పల వేంకటశాస్త్రి

అభినవోదయ కవిమిత్ర-కవిభూషణ- కవికోకిల, కవితా విశారద – శతావధాని
బ్రహ్మశ్రీ ఉప్పల వేంకటశాస్త్రి
తల్లి :- శ్రీమతి ఈశ్వరాంబ
తండ్రి – సింహాద్రి నృసింహికవి
జన్మస్థలము – ముడివేముల, మార్కాపురం తాలుకా , కర్నూలు జిల్లా
కులము, మతము – హిందూ-బ్రాహ్మణ. భారద్వాజస గోత్రులు

విద్వత్కవిచంద్రుల వంశమున జన్మించిన శ్రీ ఉప్పల వేంకట శాస్త్రిగారు శ్రీ బాలాత్రిపురసుందరీ, త్రిపురాంతకేశ్వరుల కరుణా కటాక్షములతో సద్గ్రంధ ముల రచించిరి వీరి తండ్రిగారు శ్రీ సింహాద్రి నృసింహ కవీశ్వరులు , శివపూజా ఘనదీవి తత్పరులు, పితామహులైన శ్రీ కోటయ్యకవి ‘శ్రీ పార్వతీ శంకర పరిణయ కావ్యమును, వీరి పూర్వీకులైన వెంకటేంద్రకవి, శేషకవి, “సత్యభామా విజయం’ ‘ధృవోపాఖ్యానములను రచించిన మహనీయులు, కవిగారి పెద్ద తండ్రి నన్నయ సమస్త శాస్త్రములను నేర్చినవారు. వీరి పెద్దన్న పూర్ణయ్య శాస్త్రీ తమ్మునకు చిన్నప్పడే వసుచరిత్రాది గ్రంధములను పారములుగా బోధించినారు. శ్రీ ఉప్పల పిచ్చయ్య, శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగార్లు, వీరికి విద్యా గురువులైరి,
వీరి శ్రీకృష్ణగీత ఖండ భారతము.ఉత్తర కావ్యములు, మహాభారత కధకు సంబంధించినవి. శ్రీకృష్ణగీత భగవద్గీతకు తెనుగు పద్యసేత . సమాజానుసరణము విషయమున కవి యంతగా నియమము పెట్టుకొనకున్నను, విరుద్దార్ధములు లేవు అని శ్రీ చెళ్ళపిళ్ళవారు దీనిపై అభిప్రాయము వ్యక్తము చేసిరి, అందుకే కవిగారు

“అందరు దీని మెచ్చి సుమ హారము లిచ్చెదరన్న పూన్కి, నా
డెందమునన్ దలంచుచు, గడింది రచించిన వాడగాను, గో
విందుని నమ్మి వ్రాసితి, నవీనుడ
అవి కృష్ణ గీతలో తమ మాటలుగా చెప్పకొన్నారు. ఇదియే వారి తొలి రచనగా తోచుచున్నది. భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగము లోని ఒక శ్లోకము నకు వీరి తెనుగు అనువాద మిట్లన్నది.
గీ: వినుము నిశ్చల చిత్తుడై వెలసియున్న
యోగి ఆత్మను, సంధాన భోగ మహిమ
దెలియగా గోరి , గాడుపు మెలగ నత్తి
కడల నుండిన , దీపము కరణి నుండు

మహా భారతములోని ఒక ఘట్టమే “ ఖండ భారతము , కురుక్షేత్ర యుద్ధముతో భీష్మాచార్యుల వారి యుద్ధ విజ్రుంభణ పాండవులతో బాటు మాధవుడు కూడా అదరి నాడు, ఇక ఓర్వలేని మాధవుడు,
కూల్చెద, నిన్సుయోధనుని, గూల్చెద, గూల్చెద వానిమ్మలన్
గూర్చెద, సౌబణ నిదప, గూర్చెద కద్దని, మాటలేటికిన్ –

అంటూ కనులెర్ర జేసి, సుదర్శనముతో అరదము డిగ్గినాడు. అప్పడు కురు పితామహ డీ రీతి మాధవుని ప్రార్షించినాడు

రారమ్మబ్జవాండ భూతనిచయారాధ్యా రమానాయకా
రారమ్మాగమవెద్య భిక్తసులభా రాజీవ పత్రాక్ష రా
రారమ్మచ్యుత! చక్రధారకు శరీరంబిచ్చెద న్నిన్ననే
జేరన్వచ్చెద పూర్వపుణ్య ఫల సంసిద్ధిన్ బ్రహ్మర్షించెదన్

ఈ ఖండ భారతమందు ఎక్కువగా నాటకీయత కన్పించును. ఇదొక పద్ధతి శ్రీ చెళ్ళపిళ్ళవారి శిష్యుడగుటచే కవిగారి కవితాధార అనర్గళముగా సాగినదని వేరుగా చెప్పపనిలేదు. అందుకే కవిగారి బావగారైన శ్రీ మేడవరం రామబ్రహ్మ శాస్త్రిగారు ” మా వెంకన్న నన్ను చిన్నప్పటి నుండీ “బావా” అని భక్తితో, బాంధవంతో పిలిచి, తలచిన తలంప మొలచిన కైత తెల్పక మానడు. వాని వాగ్వై భవమో, నా మైమర పోగాని, వినినప్పడెల్లవాని కావ్యముల తప్పదారాడ దారిలేదో వున్నను మారాడ నోరులేదో అన్నట్ల, మిన్నక విన్నదే కాని ఇది తప్పన్న దెన్న డును లేదు . . . . తన కృతిలో ప్రతిచోట జీవితమైన రసానికి, తదనుగుణమైన భావానికి వాని కనుపు చెట్టకయే మొలతెంచి నట్లు విలసిల్లె అలంకారాదులకు అద్దుగాక, ఛందో నియమముల కడ్డంకి లెక, బెందడి పదంబుల సందడి గాక ఒకానొక అపూర్వ మధుధారాపూర్వము కళావిదుల కర్ణపూరంబగుట , గణ నీయము” అంటూ కవిగారి కవిత్వ ధారాశక్తిని బాహాటముగా చాటిరి .
భారతాంతర్గత కధావస్తుపగల రెండవ కావ్యము “ఉత్తర’ ఇందు ఉత్తర పాత్రపోషణ అత్యద్భుతముగా స్త్రీ లక్షణములకు దర్పణము పట్టి నట్లన్నది. ఒక్కొక్క సంఘటనము నందామె పలికిన పలుకులెంతో సత్యములుగా తోచును. ఆమె మనోభావములే వేరు అభిమన్యుని మరణమునకు కారకునై తనకు కడుపు చిచ్చు తెచ్చి పెట్టిన వీరులందరినీ యామె దుయ్య బట్టినది . తుదకు ద్రోణుని కూడా వదల లేదామే . ఆడుదాని కడుపు మంట ముందాత డెంత ఆ విధాత ఎంత దుర్భు ద్ధితో అధర్మములకు పాల్పడిన వారినందరిని నిర్భయముగా దిట్టినది,

శా: ఆ వేశన్ వనసీమ సాధ్వియగు మా యత్తయ్య బాంచారి గొం
పోషంగా నినుముట్టి పట్టుకొని నొప్పల్ బట్టగా దన్ని , దు
ర్భావా చంపక వీడు పాండవుల నేరంబింతకున్ దెచ్చె రా
డా వివ్వచ్చుఁడు; రేపు నిన్ను దునుమాడన్ దిక్కు మొక్కున్నదే

ఆమె సైంధవుని గూర్చిపై మాటలన్నది. అందులో సత్యము లేకపోలేదు. తన మామ అర్జునుడు లేని సమయము పొంచి, ద్రోణాచార్యుడు పద్మవ్యూహము పన్ని తన భర్త మరణమనకు హేతువైనందు కామె మిగుల వగచి,

‘ ….. విప్రోత్తముడంచు నీ కిడడు వాడే చిల్లిగవ్వేనియన్
భావండో ఘటజన్మ: మార్చికొని చాపంబున్ విసర్జింపమా”
అంటూ అతన్ని నిండిస్తుంది.
చక్కటి శైలితో, సహజ సుందరమైన భావములతో,చక్కనీ తెనుగు నుడి కారములతో, స్త్రీ ల చిత్త ప్రవృత్తిని వ్యక్త పరచినారు కవిగారు “ఇట్టి రసవత్తర పద్యకావ్యములను పారశాల, కళాశాల విద్యార్ధులకు పాఠ్య గ్రంధములుగా వుంచ దగినవి’ అని శ్రీ దివాకర్లవారు తమ అభిప్రాయమును తెలిపిరి.

తదుపరి వీరి కావ్యములలో ఎన్నదగినది శ్రీ జయదేవ చరిత్రము ఇది గీత గోవింది కర్త , జయదేవ మహాకవి చరిత్ర, కలలో ఒకసారి కృష్ణుడు జయదేవునకు ܚ
కన్పించినాడు కన్నులు తెరిచిచూడ అతని జాడలేదు వెఱ్ఱిగా నాలుగు మూలల
వెదకి వెదకిట్లు వాపోయినాడు.
సీ: కంబనూ కానవా కాయఫణి ఫణి
నాట్య రంగస్థల నటవతంసు
కుడ్యమా చూపవా, గోగోవ గోపికా
పాలకుడైన కుచేల వరదు
వేదికా: కంటివా విమలేంద్ర నీల మ
ణిచ్చాయఁ దేరెడు నిర్మలాంగు
ద్వారమా ! తిలకింపవా! వేణుగానక
లా విశారదుని విలాసమూర్తి
గీ: యరయవా! దర్పణంబు లీలాపతార
ధారి ముర వైరి కలుషవిదారి శారీ
చిత్తరుపు బొమ్మ నీవు వీక్షింపలేదె:
లోకనాయకు మా యశోదా కుమారు

పై పద్యమున కొంత ప్రాచీన కావ్యరీతి ద్యోతకమగుచున్నది జయదేవుని కథకు మాత్రమే యిందు ప్రాధాన్యత కలదు. అతని అష్టపదుల విషయమంతిగా పట్టించు కొనలేదు ఎందులకో,
వైదర్భి ‘ వీరి మరొక కావ్యము దమమయంతీ స్వయంవర, కల్యాణ ఘట్టములిందు ప్రధానములు. కలిపీడా దూరుడగుటకు మాత్రమే కవి దీనిని వ్రాసిరి ఇందు కూడా నాటకీయత పూర్తిగా సంతరించు కొన్నది నలదమయంతుల మధ్య జరిగిన సంభాషణ యిట్లన్నది
దమయంతి – కుక్కుట రూపధారియయి కొక్కొకోకో యని చిట్టగూపి , ము
న్నక్కట తిక్కబాపని వియద్దని కంపి, యహల్య తోడఁ, దా
మక్కువ గూడి కాపురము మాపివ దర్వీటు డింద్రు డిప్డు తా
నిక్కడికేల వచ్చె దనయింతి యభాగ్యపు మాచకమ్మయే”
నలరు . తరుణి నాతో వితండవాదమ్ము మాని
వజ్రపాణిని గాని పావకుని గాని
కాలనిన్ గాని వరుణునిఁగాని పెండ్లి
యాడి దివాంగనామణి వగుము నీవు
ప్రతి సంఘటనలోని పాత్రలన్నింటి చేతను కవిగారిట్లే సంభాషణలు పరికించిరి వర్ణనలు కానరావు.

కవిగారి “హరిహరానందలహరి”కి సంస్కృతభాష యందలి హరిహర స్తవము . ఆధారము ఇది సంస్కృతభాష యందుండుటవలన సామాన్యుల కిందుబాటులో నుండునట్లు తెనుగు సేసిరి. ఈ పనిని సాహిత్య శిరోమణి శ్రీ రామికోటి శాస్త్రిగారు చేయించి, ఆ కావ్యకన్యకు కృతిభర్తలైరి శాస్త్రీగారి గ్రంధములన్నియు వివిధ కృతి పతులకు అంకితము చేయబడుట కొక ప్రధాని కారణమున్నది.
అవని తిలమున గావ్యమున్నంత వరకు
కావ్యరయు భర్త, నాకమున దివ్య
భోగముల పొందుచున్ సుర పూజ్యు లగుచు
కనుచు దొల్లిట వచియించి రాది మునులు
——–

(రాయలసీమ రచయితల నుండి…..)

———–

You may also like...