పేరు (ఆంగ్లం) | Sonti Srinivasakavi |
పేరు (తెలుగు) | శొంఠి శ్రీనివాసకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | గౌరవాంబ |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పారిజాతాపహరణము యక్ష గానము, చంపకదామ శతకమును, దుర్గా స్తోత్రము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శొంఠి శ్రీనివాసకవి |
సంగ్రహ నమూనా రచన | ఈ కవిగారు పారిజాతాపహరణము యక్ష గానమును, చంపకదామ. శతకమును, దుర్గా స్తోత్రమును రచించినారు. 1918 లో శ్రీ చంపకదామ శతకము యొక్క రెండవకూర్పు మైసూరు కె నరసింహయ్య అండ్ కంపెనీ, ముద్రాక్షరశాలయందు రాజేశ్రీ బి రామకృష్ణారావు ప్రచురించి నారు ఈ ప్రతి మాకు దొరికినది ఈ శతకములో మత్తేభములు, శార్థములు కలసి 102 పద్యములున్నవి మచ్చునకు రెండు పద్యములు చదవండి. |
శొంఠి శ్రీనివాసకవి
ఈ కవిగారు పారిజాతాపహరణము యక్ష గానమును, చంపకదామ. శతకమును, దుర్గా స్తోత్రమును రచించినారు. 1918 లో శ్రీ చంపకదామ శతకము యొక్క రెండవకూర్పు మైసూరు కె నరసింహయ్య అండ్ కంపెనీ, ముద్రాక్షరశాలయందు రాజేశ్రీ బి రామకృష్ణారావు ప్రచురించి నారు ఈ ప్రతి మాకు దొరికినది ఈ శతకములో మత్తేభములు, శార్థములు కలసి 102 పద్యములున్నవి మచ్చునకు రెండు పద్యములు చదవండి.
సంతాపంబును జెంది, దుర్దశలచే. సర్వంబునన్ సోలి
విభ్రాంతిన్ బెక్కులు దేశముల్ తిరిగి, నన్ బాటించి
మన్నించు, భూకాంతుం డెవ్వడు లేమి, నీ సముఖ
మొక్కం గాంచి యున్నాడ, నిశ్చంతన్ జంపకధామ
రామ శుభద శ్రీనామ దేవోత్తమా !
ఈ పద్యమువలన కవిగారు వున్న ఆస్తిని పోగొటుకొని దేశాటన మొనర్చెననియు, మైసూరు ప్రాంతముల కేగెననియు, అచ్చట కూడా తా నాశించిన దాతలను గనలేక నిశ్చింతతో ఆన్యథా శరణంనాస్తి, త్వమేవ శరణం మమ ” అని శ్రీరామచంద్రునే నమ్మి ఈ శతకము వ్రాసినట్లు అర్థమగుచున్నది.
మరియు నీ కవిగారు కాళహస్తికి వెళ్ళి అచటగల “సవర్ణముఖి నదిలో నిత్యము స్నానమొనరించి కాళహస్తేశ్వరుని సేవించినట్లను, ఒకనాడు నది గట్టున ఈతనికి శ్రీరామచంద్రుని విగ్రహము దొరికెననియు, అప్పటినుంచి శ్రీరామమూర్తిని ధ్యానించుచు, ఈ శతకమును వ్రాసిననియు వీరి పద్యముల వలన తెలియుచుస్నది. వీరు శ్రీశైలమునకు కూడా వెళ్ళినారు “ప్రతిధాన వ్రతము” అను ద్విపద కావ్యమును కూడా వీరు మొట్టమొదట వ్రాసినారు ఆ ప్రతి దొరుకుటలేదు.
ఈ కవిగారికి ఆంధ్రమునందెకాక, సంస్కృతములో కూడా చాలినంత జ్ఞానమున్నది. ఈ పద్యము చూడండి.
దురితారణ్య కురార మూర్తశిఖి సందోహంబు
వాహంబు దుర్భర దౌర్భాగ్య లతాలవిత్రము,
భయగ్రావాళి దంభోళి, సత్పరమార్ధంబన
కాలవాలము, భవత్పాదాంబుజ ధ్యానమే
స్థిరమౌ, చంపకథామ రామ రామశుభద శ్రీనామ దేవోత్తమా
ఈ కవిగాను చంపకధామ శతకమును 1882 వ సంవత్సరమునకు , సరియైన చిత్రదాను సంవత్సరము శరదృతువులో వ్రాసి ముగించి నారు అనగా వీరు 1830వ ప్రాంత్యములో జన్మించి యుండవచ్చును.
రాయలసీమ రచయితల నుండి…
———–