పింగళి నాగేంద్రరావు (Pingali Nagendrarao)

Share
పేరు (ఆంగ్లం)Pingali Nagendrarao
పేరు (తెలుగు)పింగళి నాగేంద్రరావు
కలం పేరు
తల్లిపేరుమహాలక్ష్మమ్మ
తండ్రి పేరుగోపాల క్రిష్ణయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/29/1901
మరణం5/6/1971
పుట్టిన ఊరుశ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం
విద్యార్హతలుఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
వృత్తిసినిమా రచయిత
తెలిసిన ఇతర భాషలుఆంగ్లము, సంస్కృతం, బెంగాలి
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెపింగళి
స్వీయ రచనలువింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు
జన్మభూమి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపింగళి నాగేంద్రరావు
సంగ్రహ నమూనా రచనతెలుగు చలనచిత్రసీమలో ఒక్కో నటుడు ఒక్కో సాంకేతిక నిపుణుడు చేసిన తెరవిన్యాసాలతో చిత్రసీమ ఘనచరిత్రను సంత రించుకుంది. రచయితగా, కవిగా బందరుకు చెందిన పింగళి నాగేంద్ర రావు గురించి ఎంతచెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆయన కలం తెరమీద సంచలనాలను సృష్టించింది.
పింగళి నాగేంద్రరావు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు లది బందరు కావడం ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండడం అది పింగళికే రాణించింది.

పింగళి నాగేంద్రరావు

తెలుగు చలనచిత్రసీమలో ఒక్కో నటుడు ఒక్కో సాంకేతిక నిపుణుడు చేసిన తెరవిన్యాసాలతో చిత్రసీమ ఘనచరిత్రను సంత రించుకుంది. రచయితగా, కవిగా బందరుకు చెందిన పింగళి నాగేంద్ర రావు గురించి ఎంతచెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆయన కలం తెరమీద సంచలనాలను సృష్టించింది.
పింగళి నాగేంద్రరావు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు లది బందరు కావడం ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండడం అది పింగళికే రాణించింది. అప్పట్లో కె.వి.రెడ్డి సంచలన దర్శకుడు. ఆయన తీసిన యోగి వేమనతో పేరు మారుమ్రోగుతోంది. ఆయనకు రచయిత అవసరం ఏర్పడింది. ఉన్న పండితులు ఆయనకు అను గుణంగా లేరు. తనవద్ద సహాయ దర్శకుడుగా, మరోవైపు ఫిలిమ్‌ జర్నలిజంలో ఉన్న కామేశ్వరరావుకు ఈ విషయం చెప్పకనే చెప్పారు. పింగళి గుర్తుకు రాగా ప్రస్తావించారు.ఆయన్ని తీసుకుని వస్తే మాట్లాడ దామన్నారు. అప్పటికే పింగళి సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. స్టేజి నటుడు డి.వి.సుబ్బారావుతో వింద్యారాణి తీద్దామని ఒక నిర్మాత ముందుకు రావడం దానికి స్క్రిప్టువర్కు చేయడం జరిగింది. దీనికి ముందు భలేపెళ్లి అనే చిత్రానికి రాసారు. ఈ రెండు పెద్దగా పింగళిని చిత్రసీమలో నిలదొక్కుకునేలా చేయలేదు. అప్పట్లో దేశంలో యుద్ద వాతావరణం ఉంది మద్రాసులో చిత్రపరిశ్రమ పూర్తిగా వెలవెలపోయి ఉంది. అప్పుడు కె.వి.రెడ్డికి పింగళిని పరిచయం చేసారు కమలాకర కామేశ్వరరావు. అదో శుభ ముహూర్తం.
తాను గుణసుందరి కథ సినిమా తీస్తున్నాను. దానికి రచన అందించాల్సిందిగా కోరారు. ఆ పని చురుగ్గా చేసి రెడ్డి చెప్పినదాని కంటే కామెడీ పాళ్లను రంగరించి మరీ తయారుచేసి అందించారు. రెడ్డికి ఎంతో నచ్చింది. ఆ చిత్రంకూడా పెద్ద వసూళ్లు చేయడం కాకుండా కె.వి.రెడ్డికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. విజయావారు రెడ్డితో చిత్రం తీయాలనే ఉత్సాహం కనబరిచారు. పాతాళభైరవి చిత్రం కథకోసం అనుకున్నాక పింగళి రచన చేసారు. అదో సూపర్‌హిట్‌ మూవీగా నిలిచింది.ఇక పింగళికి ఎదురు లేదు.ఆయన సృష్టించిన పాత్రలు గుణసుందరికథలో హంమతి, కాలమతి పాత్రలు. ఆ రోజుల్లో తెలుగు జనాల్లో నిలచిపోయాయి. ఇలా ఆయన రాసిన ప్రతిచిత్రంలో ఏదో కొత్తపాత్రలు తెలుగువారిని అలరించేవి. అంజి, డింగరీ, ధూమకేతు, ఎంతచెబితే అంతేగాళ్లు, నిక్షేపరాయుడు. కాగా ఆయనపాటలు కూడా వెరైటీగా ఉండేవి.మాటలు చాలావరకు విననివే. ఏరుహలా,బుల్‌బుల్‌ శింగారం శాయవే,వంటి పదాలు చాలా వాడారు.
పింగళి నాగేంద్రరావు అప్పట్లో ఆంధ్రజాతీయ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరు చదివారు. ఖరగ్‌పూర్‌లో రైల్వేఉద్యోగంలో ఉండగా ఆ వాతావరణం నచ్చనందున వెనుదిరిగారు.అన్న అప్పటికే ఆస్ట్రేలి యాలో పంచదార ఎగుమతులు, దిగుమతులు వ్యాపారంలో ఉన్నందున అక్కడికి వచ్చేయ్యమన్నారు. అటు కాంగ్రెస్‌ ఆర్గనైజర్‌గా ఉద్యోగంలో చేరారు. శబర్మతీ ఆశ్రమంలో పదిహేను రోజులున్నాక చాలావిషయాలు అవగతమయ్యాయి. ఒకసారి మిత్రులు పట్టాభి సీతారామయ్య సూచన మేరకు కాంగ్రెస్‌లో జీతానికి పనిచేయడం సంస్థకు భారమని చెప్పడం తో రాజీనామా ఇచ్చేసి తిరిగి బందరు చేరారు.అక్కడ పత్రికారంగంలో ప్రవేశించి శారద అనే పత్రిక నడిపారు. అందులో కొన్ని నాటకాలు అనువాదాలు చేసి వేసారు. మేవాడు పతనం, పాషాణిలతో బాటు తన స్వంత నాటకాలు కూడా అచ్చేసారు. ప్రఖ్యాత నాటకనటుడు డి.వి.సుబ్బారావు నాటక సంస్థలో పనిచేసారు. ఇలా పింగళి రచనల్లో నిరంతర శ్రామికుడుగానే సాగారు. ఆయనకు ఇష్టమైనది పుస్తకపఠనం. రోజూ యాభై పేజీ లకు తగ్గ కుండా ఏదో ఒకటి చది వేవారు. రచయిత కవికి పుస్తకపఠనం వలన అనేక విషయాలు తెలు స్తాయి అని నమ్మే కవి ఆయన. ఎమ్‌ వి యస్‌ సంస్థ ప్రచు రించిన ప్రసాద్‌ రాసిన చారి త్రక నవల అప్పాజీ చిత్రంగా తీద్దామ ను కున్నారు పుండరీ కాక్షయ్య. ఆ నవల ఆయన ప్రయాణంలో చదివి ఎన్‌టిఆర్‌ గుమ్మడితో అయితే పండు తుందను కున్నారు. ఆ నవల పింగళికి ఇచ్చి దీనికి మాటలు పాటలు రాయమని కోరారు.ఆ నవల చదవకుండానే పింగళి తన స్వంతానికి అప్పాజీ కథను తయారు చేయగలరు.కానీ, ఆనవలనే కథగా తీసుకుని స్క్రిప్ట్ చేసారు. అదో హిట్‌ చిత్రంగా నిలిచింది. పౌరాణికాలు తీద్దామనేవారికి చప్పున గుర్తుకు వచ్చేది పింగళి నాగేంద్రరావే. ఆయన శ్రీకాకుళం జిల్లా రాజాంవద్ద యార్లగడ్డ గ్రామంలో 29 డిశంబర్‌ 1901లో జన్మించారు. ఆయన తండ్రి కరణంగా అక్కడ పనిచేసేవారు.వారు తర్వాత బందరు వలస వెళ్లిపోయారు.పింగళి బ్రహ్మచారిగానే ఉండిపోయారు. పత్రికా సంపాదకుడుగా ‘జర్నలిస్టుగా’ ‘రచయితగా’కవిగా ఆయన పలుపాత్రలు నిర్వహించారు.

మహామంత్రి తిమ్మరుసు:

కృష్ణదేవరాయలు అదృశ్యంపై ప్రజలు చింతాక్రాంతులు కావడం మారువేషంలో రాయలు గమనించాడు. తిమ్మరుసు రాయల్ని రక్షించి పట్టాభిషిక్తుని చేస్తాడు. సంగీత విద్వాంసునిగా నటించి నాట్యకత్తె చిన్నమ ను ఆకర్షిస్తాడు. తిమ్మరుసు అనుమతి లేకుండా ఆమెను వివాహమాడతాడు. తిమ్మరుసు రాజనీతి కారణంగా పొరుగుదేశపు రాకుమారిని పెళ్ళాడతాడు. ఇరువురి రాణులతో ఉన్నపుడు తమను దాసీపుత్రులని హేళన చేశిన గజపతుల ప్రస్తావన వచ్చి ఆవేశపరుడై తిమ్మరుసును సంప్రదించకుండా గజపతుల పైకి దండయాత్రకు కటకానికి బయలు దేరతాడు. మధ్యలో కొండవీడు, కొండపల్లి ని జయిస్తాడు. గజపతి కుమారుడు రాయలను ముట్టడించగా సేనతో వచ్చి తిమ్మరుసు రక్షిస్తాడు. గజపతి రాకుమార్తె మారువేషంలో రాయలను గమనిస్తుంది. వేగుల ద్వారా రాకుమార్తె తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న రాయలు మారువేషంలో కటకానికి వెళతాడు. రాకుమార్తెను కలిసి ఆమె మనోగతాన్ని తెలుసుకుంటాడు. తన ఆచూకీ గమనించిన గజపతి సోదరుని నుండి యుక్తిగా తప్పించుకుంటాడు. రాయల్ని అష్టదిగ్బంధం చేయటానికి పదహారు మంది పాత్రుల సహకారం కోరతాడు గజపతి. ఆ వ్యూహం ఫలిస్తే గజపతి ది పైచేయి ఔతుందని తెలిసి తిమ్మరుసు ప్రతివ్యూహంతో గజపతికి పాత్రులపట్ల అనుమానం కలిగించి వారిని గజపతి చేతిలో మట్టుపెట్టిస్తాడు. తప్పనిసరై గజపతి రాయల్ని అల్లుడుగా అంగీకరిస్తాడు. రాయల్ని హత్యచేయమని కుమార్తెను ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న అన్నపూర్ణను తిమ్మరుసు కాపాడుతాడు. రాయలతో రాజధానికి వచ్చిన రాణి దగ్గరకు ఆమె చిన్నాన్న కుటిల మనసుతో చేరతాడు. రాయలకు తిమ్మరుసు కు మధ్య అగాధం సృష్టించే అనేక ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని సార్లు సఫలీకృతుడౌతాడు. రాయలకు అన్నపూర్ణకు పుట్టిన కుమారుడు తిమ్మరుసుకు మాలిమి ఔతాడు. అతడి పట్టాభిషేకానికి ముహూర్తం కుదరనందున రాయల ప్రతిపాదనను తిమ్మరుసు అన్యమనస్కంగా అంగీకరిస్తాడు. రాయలు నగరంలో లేని సమయం లో రాకుమారుడు విషప్రయోగం వల్ల మరణిస్తాడు. ఆ నేరం తిమ్మరుసు మీద మోపబడుతుంది. రాయలు తిమ్మరుసు ను విచారించి కనుగుడ్లు కాల్పించే శిక్ష విధిస్తాడు. తిమ్మరుసు కనుచూపు పోయాక రాయలకు నిజం తెలుస్తుంది.

కథ, గీత రచన, సంభాషణలు : పింగళి నాగేంద్రరావు


శివశంకరీ…శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత పింగళి నాగేంద్రరావు.

రాజకోట రహస్యం (1971) గీతరచన
అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
సి.ఐ.డి (1965) (రచయిత)
శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
జగదేకవీరుని కథ (1961) (రచయిత)
మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
మిస్సమ్మ (1955) (రచయిత)
చంద్రహారం (1954) (రచయిత)
పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
భలే పెళ్లి (1941) (గీతరచన)
శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).

విజయా సంస్థలో
వింధ్యరాణి తయారవుతున్న సమయంలో నాగేంద్రరావుకు వాహినీ నిర్మాతా, దర్శకుడూ ఐన కె.వి.రెడ్డితో పరిచయం లభించింది. వాహినీ సంస్థ ప్రారంభం నుంచీ ఆ సంస్థలో పని చేస్తూయోగి వేమనలో కె.వి.రెడ్డికి సహాయదర్శకుడుగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావు కూడా బందరు వాసే కావడంతో నాగేంద్రరావును కె.వి.రెడ్డికి పరిచయం చేసాడు. ఈ పరిచయం ఫలితంగా కె. వి. రెడ్డి తాను తీయబోతున్న గుణసుందరికథ సినిమాకి పాటలు మాటలు రాయటానికి నాగేంద్రరావును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు కె. వి.రెడ్డికీ, నాగేంద్రరావుకూ, ఆంధ్రా సినిమా ప్రేక్షకులకుకూడా లాభించిందని చెప్పాలి. కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు. దర్శకుడు కె. వి. రెడ్డి కానట్టయితే నాగేంద్రరావు సినిమా రచన భలేపెళ్ళి, వింధ్యరాణికి మించి ఎంతో పైకి వెళ్ళలేక పోయివుండవచ్చు. ఈ ఇద్దరి సమ్మేళంతో తయారైన గుణసుందరి కథ అంతకు పూర్వం ఏ తెలుగుచిత్రమూ ఎరగనంత గొప్పవిజయాన్ని సాధించింది.
గుణసుందరి కథ నిర్మాణం నాటికి వాహినీ స్టూడియో తయారై, విజయావారి నిర్వహణ కిందికి వచ్చింది. వాహినీలో మొట్టమొదటి కాల్షీట్ కూడా గుణసుందరి కథదే. గుణసుందరి కథ పూర్తి అయేలోగా విజయా వారు భవిష్యత్తు చిత్రనిర్మాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్ల ప్రకారం నాగేంద్రరావు, కామేశ్వరరావుగారు మొదలైనవారు విజయాసంస్థలోకి తీసుకోబడ్డారు.
అయితే కె.వి.రెడ్డి విజయావారి ద్వితీయచిత్రం “పాతాళభైరవి” దర్శకత్వం చేయటానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కె.వి.రెడ్డితో కలిసి పనిచెయ్యటానికి మరొక అవకాశం లభించింది. దీని ఫలితమే పాతాళభైరవి. ఈ సినిమా చాలా విజయవంతంగా నడవటమేగాక చిత్రనిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకనే దీనిని ఇండియాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రదర్శించటానికి ఎన్నుకున్నారు. పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.
ఆ తర్వాత నాగేంద్రరావు తనను సినిమాలోకి తీసుకురావటానికి తోడ్పడిన కామేశ్వరరావుతో కలిసి విజయవారి నాలుగో చిత్రం చంద్రహారంకు పనిచేశాడు. ఈ చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, “ఎంతచెబితే అంతేగాళ్ళు”, బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు. ఇవి ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని ఇవ్వగలవు.
పింగళి నాగేంద్రరావు 1971 మే 6న కన్నుమూశారు.

———–

You may also like...