పాలపాటి సరస చిదంబరరాయకవి (Paalapati Sarasa Chidambararaya Kavi)

Share
పేరు (ఆంగ్లం)Paalapati Sarasa Chidambararaya Kavi
పేరు (తెలుగు)పాలపాటి సరస చిదంబరరాయకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1860
మరణం1/1/1942
పుట్టిన ఊరుతలిమెర్ల , చేబ్రాల గ్రామము
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువాసవీ విలాసము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపాలపాటి సరస చిదంబరరాయకవి
సంగ్రహ నమూనా రచనపొలికి గ్రామము, గుంతకల్ల జంక్షన్ కు 10 మైళ్ళ దూరములో
వున్నది . ఈ కవి రాయల చెరువు కృష్ణ పాడు , తలిమెర్ల , చేబ్రాల గ్రామము లందు విశేష కాలము వాసము చేసియున్నాడు.
ఈ కవి అనంతపుర మండలముననే కాక కర్నూలు, బళ్ళారి మండల ము లందంతటను సంచరించినాడు గడే హోతూరు నివాసులగు శ్రీనివృత్తి వేంకటరామశాస్త్రులు గారును, వారి తమ్ములు శ్రీ లక్ష్మణ శాస్తులు గారును ఈ కవివర్యుని విద్యాగురువులైనట్లు తెలియుచున్నది.

పాలపాటి సరసచిదంబరరాయకవి

పొలికి గ్రామము, గుంతకల్ల జంక్షన్ కు 10 మైళ్ళ దూరములో
వున్నది . ఈ కవి రాయల చెరువు కృష్ణ పాడు , తలిమెర్ల , చేబ్రాల గ్రామము లందు విశేష కాలము వాసము చేసియున్నాడు.
ఈ కవి అనంతపుర మండలముననే కాక కర్నూలు, బళ్ళారి మండల ము లందంతటను సంచరించినాడు గడే హోతూరు నివాసులగు శ్రీనివృత్తి వేంకటరామశాస్త్రులు గారును, వారి తమ్ములు శ్రీ లక్ష్మణ శాస్తులు గారును ఈ కవివర్యుని విద్యాగురువులైనట్లు తెలియుచున్నది.
ఈ కవిగారు “వాసవీ విలాసము’ అను పద్యకావ్యమును వ్రాసినారు ఇందులో తొమ్మిది ఉల్లాసములు గలవు వైశ్య కులావతంసుల కులదేవత యగ కన్యకాపరమెశ్వరీ దేవి చరిత్ర ఇయ్యది.
గీ: తలతు సతతంబు నాదు హృన్ననమందు
ధరణీ నిర్వృత్తికుల, సముద్భువులు నైన
ఘనుఁడు వేంకటరామ సత్కవిని, మరియు
లలిత సాహితీ గురుఁడగు లక్ష్మణార్యు
“ వాసవీ విలాసము” 1896 వ సంవత్సరమునందు బళ్ళారి శారదా మద్రాక్షరశాలయందు ముద్రింప బడినది ఈ కవి అనేకములగు శతకములు దండకములు, స్తోత్రములు, చాటువులు గూడ రచించియున్నాడు. వీటిలో కొన్ని ముద్రితములు మరికొన్ని అముద్రితములు ఏవియు గూడ ఇపుడు లభింపవు.
వీరి కృతులలో వాసవీ విలాసమే ప్రధాన మైనది కీ.శే గార్ల దిన్నె సుబ్బరాయ కవిగారి ప్రతినొండు సంపాదించి చూడవలసినదిగా శ్రీ రోగ చ్చెటి భాస్కర శాస్త్రిగారికి (ఆదోని ) ఇచ్చినట్లున్నది శాస్త్రిగారు భారతీ మాసపత్రిక విక్రమ సంవత్సర జ్యేష్ఠమాస సంచికలో వ్రాసిన విషయము లాధారముగా తెలియుచున్నవి.
ఈ కవికి సంస్కృతము నందును గూడ కవితా శక్తి గలననుటకు నచ్చటచ్చట ద నగ్రంధమునందలి తాను రచించిన కశ్లోకములే సాక్షీ. .
వీరి వంశీయులుకూడ చక్కనీ పాండిత్యము కల్గి వాక్నుద్ది తపశ్శక్తి గల్గియున్నట్లు తన వంశాభి వర్ణమున వర్ణించి యున్నాడు .
వీరి వంశీకులైన వేంకటపతిరాయలు పెద్ద చింతామణప్పలను గూర్చి
ఈ క్రింది పద్యములద్వారా తెలియుచున్నది.
సి : తిట్టు పద్యముఁ జెప్పి. తెరలించె. రిపు గడే
హోతూరు మట్టడై-యున్నవేశ
విత్తిన చేలెండ-విడపన కల్చరిం
బర్జన్య శతకము బరగఁ జెప్పి
కురిపించెను, సువృష్టి, గుత్చిలో జేరిన
యరగాద్రి పరగణ.పుంని వేలు
ముడ్డు మల్లపదొర.ముఖ్యపట్టపు , కవీ
శ్వరుఁడన ధీర ప్రశస్తి గాంచె
గీ : వడపె గొనకొండ్ల మొదిలగు పత్తనముల
మాన్యములు పెక్కు-లితడు .సామాన్యుఁడవునే ?
దీవిజిత, గీష్పతి నితాంత ధృతీ గిరిపతి
పాలపాటి వేంకటాపతి ? వసుమతి
సీ : తన మహా వైద్యశాస్త్ర, ప్రౌ డిమకు, నభి
వ్యంజకంబుగ, మణి వలయమొప్ప
దన యష్టభాషా పద గ్రంథి కవితకు
డాకాల, గండపెండార మొప్పఁ
తన గురుత్వమునకుఁ దగగఁ దిండెయ దొర
బంపిన ప ల్లకి ప్రభ దనర్ప
తన సువిద్యా విధిత్వమునకు నానాటి
శిష్య ప్రశిష్యులు-చేరి యొప్ప
గీ : ధరణి శ్రీ గడేహోతూరు ధామమందు
సకల పండిత మండలి,సన్నుతింప
యాచకా? చింతామణి యనగ చిరగి
పెద్ద చింతామణప్ప. దాఁ బెంప(జెందె

” శ్రీ యలమేలుమంగ” అను గ్రంథాది పద్యమును బట్టి ఈ కవి కిష్ట దైవము శ్రీ తిరుపతి వేంకటేశ్వరులని తెలియుచున్నది మరియు
కం. ఆసహాయ సరస కవితా
రసికుఁడ వేంకట ధరాధర ప్రభు కరుణా
రస పరిపోషిత మృదువా
క్ప్ర సవ మరండాప్త సకల కవి బంభరుడన్ “
అను పద్యమువలనగూడా దెలియుచున్నది ఆశ్వాసాంక్య గద్యము నందు “సప్త కవిమిత్ర’ ఆను విశేషణమును దన కన్వయించుకొన్నవాడు. దాని యభిప్రాయమేమో తెలియకున్నది.
(భారతి వికము సంవత్సర జ్యేష్టమాస సంచికనుండి)

ఇట్టి కవుల చరిత్రలన్నియూ అజ్ఞాతముగా నిలిచిపోయినవి వారి విషయము లింత మాత్రమైనను మనకు లభించుట మన పుణ్య విశేషమే రాయలసీమ కవులను గూర్చిన విపులమైన పరిశోధన గావించు ఉద్దేశ్యము మన విశ్వవిద్యాలయము లెప్పుడు చేబట్ట గలవో వేచిచూతము .

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...