వేంకటరాయ కవి (Venkataraya Kavi)

Share
పేరు (ఆంగ్లం)Venkataraya Kavi
పేరు (తెలుగు)వేంకటరాయ కవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరువేంకట రమణయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1830
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురామాయణమనేగాక, లేపాక్షి కృష్ణ నాటకము జలక్రీడలు, శివనాటకము, నాట్య ప్రదీపనము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేంకటరాయ కవి
లేపాక్షి కవులు
సంగ్రహ నమూనా రచనతెనుగు సాహిత్యమునందు యక్షగానములకొక విశిష్ట స్థానము కలదు . ఇయ్యది పండిత పామర మనోరంజకమగు దృశ్య ప్రదర్శనము. కవులు సహితము “కావ్యేషు నాటకం రమ్యం” ఆని తలచి ప్రదర్శనా యోగ్యమగు యక్షగానములను వ్రాసిరి. ఉత్తర రామాయణకర్త కంకంటి పాపరాజు సహితము ‘విష్ణమాయా విలాస” మను యక్షగానమును, వ్రాసినట్లు తెలియు మన్నది.

వేంకటరాయ కవి
లేపాక్షి కవులు

తెనుగు సాహిత్యమునందు యక్షగానములకొక విశిష్ట స్థానము కలదు .  ఇయ్యది పండిత పామర మనోరంజకమగు దృశ్య ప్రదర్శనము. కవులు సహితము “కావ్యేషు నాటకం రమ్యం” ఆని తలచి ప్రదర్శనా యోగ్యమగు యక్షగానములను వ్రాసిరి. ఉత్తర రామాయణకర్త కంకంటి పాపరాజు సహితము విష్ణమాయా విలాస”  మను యక్షగానమును, వ్రాసినట్లు తెలియు మన్నది.

                       యక్షగానములన్నియూ 18వ శతాబ్దమందే పుట్టినవి వీటిని గ్రామ

గ్రామములందును వినోదార్ధమై ప్రజలు మూడు, నాలుగు రాత్రులు ప్రదర్శిం చెడి వారు బ్రహ్మోత్సవ సమయములందు వీటిని ప్రదర్శించుటకై కొంద రికి భూములను ఇనాములుగా రాజరొసంగినారు .

                                రాయలసీమ యందలి యక్షగానములలో, చుక్కలూరు రామాయణము, మోక్షగుండ రామాయణము, లేపాక్షి రామాయణములు ప్రసిద్ధి కెక్కినవి. లేపాక్షి శిల్ప కళా ఖండముల కేగాక, యక్షగాన కవులకు నిలయమై, తత్క వ్యాప్తికి కేంద్రమై వెలిగినది. ఈ కుగ్రామమున శ్రీ లేపాక్షి  వెంకట రాయ కవి. లేపాక్షి రామచంద్రప్ప.లేపాక్షి వేంకట నారాయణప్ప.లేపాక్షీ శొంఠి శ్రీనివాస కవులు యక్షగాన కపులుగా పేరు బడసినారు.

                   

శ్రీ కవిగారు లేపాక్షి రామాయణమనేగాక, లేపాక్షి కృష్ణ నాటకము జలక్రీడలు, శివనాటకము, నాట్య ప్రదీపనము, ఆను ఇతర కృతులను కూడా రంచించిరీ తమ లేపాక్షి  కృష్ణ నాటకమందు కవిగారిట్ల వ్రాసుకొన్నారు.

ద్విపద : వగగుల్కు లేపాక్షి.వాసుఁడై వెలయు

        నగ ధరుండ గు కృష్ట-నాటక పూర్వ

        భాగంబు  ధరణిపై-ప్రబలి యలరగ

       రాగుడై హరిదయా-రాశిచే వెలసి

        కొమరొప్ప శీర్నాట.కలవార్డి కుముద

       రాముఁడౌ  వేంకట రమణార్యునకును

        సుతుఁడ వేంకటరాయ-సుకవి యనువాఁడ

        నతి ప్రీతి పరమేశు.నాజ్ఞదే చెప్పి

        నాడను, యీకృష్ణ-నాటకం బిర్వి

        నాడిన, పాడిన.నతి నిష్టతోడ

       బాడిన, వినినను బహుళ సంపదలు

       గూడి వేడుకతోడ గుల్కుదు రెపరు

       యెండాక కులగురు లేందాక ధరణి

      యెండాక రవిచంద్రు.లెందాక గలరు

      నందాక ఈ కృతి-నలరుచు సుజన

        బృందాను మోదమై చెంపొందు చుండు,

 

                పై పద్యమును బట్టి కవిగారి తండ్రిగారు, శ్రీ వేంకట రమణయ్య గార నియు, శీర్నాడు కులమనియు, విదితమగు చున్నది. వీరు విశ్వామిత్ర గోత్రులు కవిగారి భార్య పేరు పుట్టమ్మ వీరి కుమారుడు నంజుండ రాయడ.

వేంకటరాయు కవిగారి వంశావళి ఇట్లన్నది

1) శ్రీ వేంకట రమణయ్యకుమారుడు. వేంకటరాయ కవి (రామాయణ యక్షగాన కర్త )

2) వేంకటరాయకవి.కుమారుడు. నంజుండరాయడు.

3) నంజండరాయని.కుమారుడు. వేంకటరాయప్ప. (మద్రారాక్షస కథాన్విత సాహస రత్నాకరమును 2 వెల పద్య గ్రంథకర్త)

4) వేంకటరాయప్పకుమారుడు శంకరరావుగారు.(కవిగారి మునిమనుమడు).

 వీరి వంశీకుల ప్రస్తుత మెక్కడున్నారొ తెలియుటలేదు .

                  లేపాక్షి రామాయణ యక్షగానమును సి. వి. కృష్ణ బుక్ డిపో.1991 అమ్మర్ కోవిల్ వీడి వాల్ టాక్సు  రోడ్డు, మద్రాసు . వారచ్చు  వేసినారు ప్రస్తుతము లభించుట దుర్లభము, యక్షగానమును గూర్చి కీ.శే కవిత్వవేది కల్లూరు నారాయణరాపగారు తమ వీరేశలింగయుగమున యిట్లు వ్రాసినారు.

               లేపాక్షీ రామాయణము మూడురాత్రుల నాటకమున కనుకూలించు నట్లు రచితమై ఆడబడుట నేను కన్నులారా జూచియున్నాను ఆహా’ అందలి రసస్ఫోరక, పాత్రోక్తి, వచన రామణీయకత, నల్వది యేండ్ల దాచినను నాకు మరపునకు రాకున్నవి లేపాక్షి కి దగ్గర మా మాతామహుడగు నానెప్ప  గారి యూరైన శిరివరములో పిల్లలతో కలసి ఈ రామాయణము ఆడినాను. నాది రావణపాత్ర . ప్రాచీన యక్షగానములలో నుత్త మోత్తమమని, ఖండ వల్లి ఆచార్యులంతటి విమర్శకాగేశ్వరులచే సన్నుతి నందు కొన్నది  . లేపాక్షి  హరి సంకీర్తన ప్రతిదరువు కొనను గల్లి ఈ యక్షగానము, పాదుకా దానము, లంకా దండయాత్ర , రావణ సంహారము, ఆంత్యముగాగల మూడు రాగములతో మూడు దినములకు సరిపోవునట్లు రచితమైనది.

                     వర్ణనము తక్కువగను, ముఖ్యకధ  విశషముగను, ప్రేక్షకులకు కర్ధమగు  వచనము లెక్కువగను దరువులు శబ్దాలంకారొచిత పదజాల ప్రపూర్ణముగను వెలసినవి. వీర కరుణాదృత రసములు విపులముగ నున్నవి శృంగారరసము సముచితముగా నున్నది హాస్యమరుదు ప్రదర్శన యోగ్య మగ ప్రశంసనీయ కౌశలము గలదిగ నున్నది. రంగ విభజన మొకటి దరువు లేమి, తగిన వృత్త కల్పనమును తర్వాతివారు యోచించి ఈ యక్ష  గానమును నాటకములుగ జేసిరన్న సత్యదూరము కాదు నేను రావణ పాత్రలో చెప్పచుండి యానందించుచుండిన దరవు  యిచట పారకుల కందించుచున్నాను.

‘ఆహహహా చూడమే..అతివ నా పదితలల్

 బహుబలోన్నతి నొప్ప-బాహువులను

స్పుటకోటి నవరత్నఖచిత మకుటంబులన్

చబల దీధితులోప్పు -కటకములను

సుర, గరుడ, గంధర్వ, గరుడోల గామరులు

సరిలెరు నాకు.ఎవ్వరును ధరలోన

జలజాక్షి లేపాక్షి. నిలయు డెదిరిన విడువ

బలిమి తోడనె నిన్నుబట్టుకొని పోదూ”

                  లేపాక్షి  రామాయణమును గూర్చి కొద్ది పరిచయమున్న వారెవరిని ప్రశ్నించినా పై దరువునే యదాహరించుట పరిపాటైనది, మరియే యితర దరువుగాని, వచనముగాని, పద్యములాగాని స్ఫురించుట లేదు ఇందు వచనములు, కందములు, అధికముగా గలవు  కొన్ని గీతపద్యము లచ్చటచ్చట కలవు. ఇందలి వచన రామణీయకత, రసస్పోరక పాత్రోక్తి, విమర్శకాగ్రే సరులచే సన్నతి నందు కొన్నది.

                    వేంకటరాయకవిగారి కృష్ణ  నాటకము నందు కూడ అట్టి రామణీయకతయే మనకు గోచరించును, అందు కంస దేవకీదేవుల సంవాదమును కవి గారిట్ల వ్రాసిరి.

దర్వ-ఆదితాళం-సావేరీ రాగం

దేవకీ : ఓరన్నా నీకిది కోడలురా! మన్నన శాయరా,

        మన్నుగన్న యాచిన్న బాలలవలె నెన్నగ తగదో . Iఓరన్న|

       పున్నమ చంద్రుని బోలు.నీ  కన్నుల పండువు గాను జూడరో |ఓరన్న |      మచ్చరించగా వచ్చునేరా.ఈ ముచ్చట జూచి మద్ద వచ్చునో |ఓరన్న |     

నాపణ్యమునను, లేపాక్షిపండీ. పాపను దయ దోపగాను యిచ్చెనో |ఓరన్న |       

 

కంసుడు ,:  కం:  వినవమ్మా దేవకి యిటు

                  వనితను నీజాల ననుచు.వగచెద వెంతో

                  మును యిచ్చినట్టి బాసలు

                 దనరగ విడనాడ నీకు-ధర్మమె? అమ్మా”

దేవకి :  అన్నా యెన్నటికైనను మున్నాడిన మాట బొంక, ముదిమొదపిగ నా విన్నపము వినుము దయతో కన్నియ బట్టిన యియ్యగా మాట లేదు. ఊరకే క్రోధమెన్నగరాదు. చిన్ని కుమారుల సేత్తమన్న యనుచు మేమన్నమాటలు కాని, కన్యక నిటు నియ్యగా మాటలేదు.

కంసుడు : మాటికి మాటికి నీవీ  మాటలు పల్కేదవు . దీన మమత  కల్గునా నాటికి యిచ్చిన మాటలు, నేటికి లేదనిన, యింక నే బో విడువా రేపాక్షిశునికైన వెరవా, బోటీ నిక జంపెదను. విను ముమ్మాటికి ఈమాట నిజంబిది. నే బోవా.

           (ఈ నాటకము 1810వ సం|| జూన్ నెలలో చెన్నపట్టణ వాస్తవ్య రైన శ్రీ వంకాయల కృష్ణస్వామి శెట్టి  అండ్ సన్సు వారి స్వకీయ, శ్రీరంగ విలాస ముద్రాక్షర శాలయందు ముద్రింపించి ప్రచురింప బడినది. ఈ ప్రతి ప్రస్తుతము శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల పుస్తక భాండాగారమున కలదు .

                ఈ యక్షగానములనే పామరులు బయలు నాటకములని వ్యవహరించిరి.   లేపాక్షి చుట్టుముట్ట గ్రామము లందప్పడప్పడు వీటిని నేడుకూడా యువకులు  ప్రదర్శించుచున్నారు.

             లేపాక్షికి దగ్గరగా గల కల్లారు గ్రామమందలి కీ శే. కాశీ రామప్పగారి భార్య కీ శే శ్రీమతి నంజమ్మగారు ఈ లేపాకీ రామాయణమును గ్రామస్థులకు అభినయాదులతో నేర్పుచుండిరి. ఆమె పేరిట నాటకమున పొగడ్తలు (హేళికే) కూడా చెప్పెడివారట. ఆమె స్వయముగా కొన్ని పాటలను కట్టిన దట. ఈమె లేపాక్షి  శొంఠి శ్రీనివాసకవి (చంపకదామ శతక కర్త)  గారి పుత్రిక వారి తండ్రిగారు కూడా యక్షగానములను వ్రాసినవారే.

 రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...