పేరు (ఆంగ్లం) | Venkata Narayana Kavi |
పేరు (తెలుగు) | వెంకట నారాయణ కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమ్మ |
తండ్రి పేరు | కృష్ణప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1831 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సంపూర్ణ లేపాక్షి భారతమను నాలుగు రాత్రుల కథను యక్షగానముగా రచించిరి. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వెంకట నారాయణ కవి |
సంగ్రహ నమూనా రచన | శ్రీ వెంకట రాయ కవి గారి బావ గారైన శ్రీ వెంకట నారాయణ కవి కూడా యక్షగాన కవులుగా వీరు శీర్నాడు బ్రాహ్మణులు వారి తన గోత్రులు వీరి వంశావళి ఇట్లు న్నది . |
వెంకట నారాయణ కవి
శ్రీ వెంకట రాయ కవి గారి బావ గారైన శ్రీ వెంకట నారాయణ కవి కూడా యక్షగాన కవులుగా వీరు శీర్నాడు బ్రాహ్మణులు వారి తన గోత్రులు వీరి వంశావళి ఇట్లు న్నది .
కృష్ణప్ప వెంకమ్మ పుణ్య దంపతులకు నలుగురు కుమారులు
1 .రామచంద్రప్ప , 2 . వెంకట నారాయణప్ప , 3 . సుబ్బరాయప్ప , 4 . నంజుం డప్ప
1 . రామచంద్రప్ప :- వీరు దమయంతీ పరిణయము యక్షగాన కర్తలు . వీరు దైవ భక్తి పరాయణులు తండ్రి నిర్మించిన ఆలయమున సీతా రాములు విగ్రహములను ప్రతిష్టింప జేసిరి . వీరి సంగీత , సాహిత్య జ్ఞానములను కలిగి కవి పండితులను , కళాకారులను నాదరించెడి మహనీయులు చదరంగ నిపుణులు చిన్న సంస్థానాధిపతుల హోదాను కలిగి , మేనాలో ప్రయాణము చేసెడి వారు . మేనా ప్రయానమునందే దమయంతీ స్వయంవర ‘ మను యక్షగానమును వ్రాసిన ఘటికులు . వంశ పారంపర్యముగా వచ్చుచున్న కరణీకమును తన తమ్మడైన వెంకటనారాయణప్పకే వదలెను ఈ దమయంతీ స్వయం మర యక్షగానము కూడ దొరుకుట లేదు.
2 . శ్రీ వెంకటనారాయణ కవి – వీరిని లేపాక్షి వెంకటనారాయణప్ప గారని కూడా వ్యవహరించెడి వారు . వీరు లేపాక్షి గ్రామ కరణీకముతోబాటు కవిత్వమును కూడా చేబట్టిరి . వీరి బావగారైన శ్రీ వేంకటరాయకవిగారి రామాయణ యక్షగానము ప్రసిద్ధి పొంది, బహుళ ప్రచారములోకి వచ్చుటచే, తానును “సంపూర్ణ లేపాక్షి భారతమను నాలుగు రాత్రుల కథను యక్షగానముగా రచించిరి. ఉత్సాహవంతులైన యవక బృందమునకు శిక్షణ నిచ్చి ప్రదర్శింప జేయుచుండిరి. ఈయన సంగీత నృత్యములందు పాండిత్యము పొంది ‘తాళ లయబ్రహ్మ” అని పేరుగాంచెను లయతాళములను ప్రతి పని యందును పాటించుట అతనికి పరిపాటి వీరి లేపాక్షి భారతము (యక్ష గానము) నుండి మొదటి రాత్రి కధలో ఒక సంహారము (తప్ప కుండ వ్రాతప్రతిమూలము ననుసరించి వ్రాయబడినది)
‘కుంతి అయ్యా యిదియేమి యింత ఆయన పడుతూ వున్నారు ఆ సంగతి వివిరింపవలెను స్వామి”
బ్రాహ్మడు బకునకు యాహారంబు గొన యిలు వరుస మాక, వచ్చి
యన్నది ఆందుకు ఈ రీతిగా వగచెద మమ్మా”
కుంతి అయ్యా నీ కుమారుడు బాలుడు, గొనిపోవ జాలడు . నాకు యేవురు తనయులు, అందులోవకని బంచెద నయ్యా విప్రోత్తమా .
వొరీ భీమా యీ బ్రాహ్మణుని వుపకారాగముగా బకుని జంపిరారా ఓరీ :
భీముడు అట్లే అయేనమ్మా తల్లీ “
కం: కడుపుకు కూరును లేకను
బడలికచే డశ్శినాను.బలహీనుండై
గడుపుగ బెట్టు సమృద్దిగ
బడవై తను బకుని యిపుడు పౌరుల మెచ్చన్
వ : అయ్యా అన్నములేక చాలా ఆకలి గొన్నాను స్వామీ.
బ్రాహ్మడు ! యిగో బోజనం చాయవయ్యా-యీ శకటం మీద ఆహారం తీసుకొని పోవయ్యా భీమా!
భీముడు: కం: శకటము నెక్కియు భీముడు
బికుని విధించియును యిచటి పౌరులకెల్లన్
సుకరంబు చాయ నెంచియు
ప్రకట పరాక్రమము తోడ భాశీల వొచ్చెన్
||దరవు ఆదితాళము.
వీరారసము పుప్పాతిల్లా పెూరా కూపుడై భీముడూ
మీరీనా పోతూలగట్టిగం పీరుడై –శకటామునెక్కి
పటపాటా-పౌండ్లనూ కొరికీ బకునీ యిపుడే
ద్రుంతూననియా-ర్భటమూతో దిక్తటమూ
లదృవ-పటు వేగ-ప్రారంభూడయ్య “-“
సురులూ జూచి వెరగందా నా. సురులుజూఛీ
తత్సరమొందాధర లేపాక్షీ పురీ వరునీ
మెయార రభసమునా వోరి బకా
నీకై తెచ్చిన యాహారంబు నేను గుడుచు చున్నాను
నీవు వీరుండ వైతే యద్ధానికి రారా వోరీ
బకుని వేషము.
చం : పటపట పండ్ల నూరుచును.బాహువులెత్తి, బకుండు రో
షుడై-చెటులతర విస్ఫులింగములు.చచ్చర కన్నుల వ్రాలు
చుండగా, తటతట పాదఘాతకును ధారుణి తత్తర
మొందు చుండ, యార్భటమున భీమువింగని శబాసని
మెచ్చును ఘోరరూపుడై
**దరువు ఏకతాళము’
పట రవార్చాటము తోడనూ బకుడు నంక చటల రోష మొప్ప వెడలెనూ దడదడ యటంచు నడవగా-పుడమి యపుడు గడడడా యటంచు నడుగగా మీసమపడు దీదు కొనుచునూ శ్రీ లేపాకీ వాసుడదర
భాసురముగనూ |3 | ఆహాహాహా యెవ్వడురా. యెవ్వడురా.నాకు తెచ్చిన బలి తినేవాడెవ్వడురా యగో నిన్ను మ్రింగివేసెద చూడరా
భీముడు అయితే రారా బకా,
తాం.తతధణ | బకుడు బడుటా|
భీముడు ఓతల్లీ బకుని వధించి కళేబరంబు వాకిట నీడ్చినాను. ద్రుపదుడు తన పుత్రికకు స్వయంవరంబు చాటించినాడని మన గృహస్తులు బ్రాహ్మలు పోతూవున్నారు, గనుక మనము పోదాము పదండి తధి తాథాం.
ఇట్లీ కధ నడచినది.
ఆ కాలములో వున్న వాడుక భాషనే కవిగారు వాడినారు, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని కొలువు కూటమునకు వెళ్ళి తన విశ్వరూపమును చూపటలో ఈ భారతము ముగిసినది .
(ఈ లేపాక్షి భారతమును ముద్రించి వెలుగులోనికి తీసుకొని రావలసిన అవసర మెంతేని కలదు. ఈ వ్రాత ప్రతి శిధిలావన్లలోనున్నది , భాషా భిమానులు, వదాన్యులు ముద్రిం పదలచిన ఈ గ్రంధమాల మేనేజింగ్ ఎడిటరు గారితో సంప్రదించండి. ఈ వాతప్రతి వీరి వంశీకులైన శ్రీ ఎన్ ఏ నారాయ.రావు, ప్రిన్సి పాల్ , ఓరియంటల్ కళాశాల, లేపాక్షి వారి వద్ద ఉన్నది )
ఈ కవిగారు రుక్మిణి పరిణయ నాటకమును మాకం తిమ్మయ్య శెట్టి యక్ష గానమును కూడా రచించెను,
రామచంద్రప్ప , వేంకట నారాయణప్పగార్లకు మగ సంతానము లేదు . దానితో మూడవ తమ్ముని కుమారుడైన రామకృష్ణప్ప , నాగభూషణ ప్పలను వరుసగా దత్తత చేసుకొనిరి వెంటక నారణ ప్ప కుమారుడు నాగ భూషణప్ప కె కిరిణికము పని వచ్చినది నాగభూషణప్ప కుమారుడే ప్రస్తుత లేపాక్షి సర్పంచ్ వేంకట నారాయణప్పగారు.
రాయలసీమ రచయితల నుండి….
———–