కల్లూరు అహోబలరావు (Kalluri Ahobalarao)

Share
పేరు (ఆంగ్లం)Kalluri Ahobalarao
పేరు (తెలుగు)కల్లూరు అహోబలరావు
కలం పేరు
తల్లిపేరుఅశ్వత్థమ్మ
తండ్రి పేరుగూళూరు కృష్ణప్ప
జీవిత భాగస్వామి పేరుసీతమ్మ
పుట్టినతేదీ6/1/1901
మరణం
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామం
విద్యార్హతలుయస్.యస్.ఎల్.సి, తెలుగులో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు.
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకుమార శతకము (1923), భరతమాతృ శతకము (1923), భావతరంగములు – ఖండికలు (1931), పూదోట – ఖండికలు (1951), భక్తమందారము – ద్విశతి (1958)
ఉగాది స్వర్ణభారతి (1972), రాయలసీమ రచయితల చరిత్ర – 4 సంపుటాలు (1975-1986), శ్రీరామకర్ణామృతము (1980), శ్రీకృష్ణకర్ణామృతము, ఉగాది వజ్రభారతి
గృహలక్ష్మి – కందపద్య త్రిశతి, పుష్పబాణ విలాసము, యామినీపూర్ణతిలక
శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుహిందూపురంలోని రాయలకళాపరిషత్ పక్షాన శ్రీశారదాపీఠము వారు ‘కవిభూషణ’ బిరుదుతో సత్కరించింది.
1960లో కూడ్లీ శృంగేరీ జగద్గురు సచ్చిదానంద శంకర భారతీస్వామిచే ‘కవితిలక’ బిరుదు ప్రదానం.
బరోడా మహారాజుచే బంగారు పతక ప్రదానం
ఇంకా కవికోకిల, కవిశేఖర బిరుదులు లభించాయి.
ఇతర వివరాలురాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన కల్లూరు అహోబలరావు స్వయంగా కవి. బహుగ్రంథకర్త. బళ్లారిలో పనిచేస్తున్నపుడు 1931లో ఘూళీకృష్ణమూర్తి, హెచ్.దేవదానముల సహకారంతో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకల్లూరు అహోబలరావు
సంగ్రహ నమూనా రచనసి : బంగారు రంగుల-రంగారు జివురుల
సింగారముగఁ జెట్లు జేమ లల రె
మంద మందంబుగ-మలయానిలంబులు
కమ్మ కమ్మగ, వీవగా దొడంగె
శుకపిక, శారికల్, మకముగా బాడుచు
ప్రియముగా, వీనుల-విందొనర్చె
వాసంత మన్మథుల్ – స్వాగత సుమ మాల
లర్పింప వేచిరి – యాదరమున

 

కల్లూరు అహోబలరావు

శ్రీ పింగళ మూర్తి
ఉగాది కానుక 20 -3 -1977
రచన:- కవిభూషణ కవితిలక కల్లూరు అహోబలరావు

సి : బంగారు రంగుల-రంగారు జివురుల
సింగారముగఁ జెట్లు జేమ లల రె
మంద మందంబుగ-మలయానిలంబులు
కమ్మ కమ్మగ, వీవగా దొడంగె
శుకపిక, శారికల్, మకముగా బాడుచు
ప్రియముగా, వీనుల-విందొనర్చె
వాసంత మన్మథుల్ – స్వాగత సుమ మాల
లర్పింప వేచిరి – యాదరమున
గీ : శ్రీ యుగాది, వేంచేసెను – శ్రీకరముగ
రమ్ము! పింగళమూర్తి ! రారమ్మవేగ
పిండి వంటల భుజియించి – ప్రీతితోడ
మంగళమ్ముల మాకు నొసంగు దేవ :
కం : గళమున, గరళముగల, పిం
గళమూర్తీ : శంకరాఘనా శంకర బె
బ్బులి చర్మాంబర ధారీ :
మలకొమరిత నేలినట్టి – మంగళమూర్తీ :

గీ : తీవ్ర రఘంరీఖూనిలంబును – దెచ్చిపెట్టి
భారతము , నల్లకల్లోల – పరచినావు
శ్రీ ప్రజాస్వామ్య వాదంబు – శ్రేయమంచు
బలికినాపు – పింగళమూరి వర్య! నేడు

ఆ : అలహబాదుకోర్టు – యానతి దప్పి, సు
ప్రీముకోర్టుకేగి – రీతిదప్పి
దప్పిగొంచు. తప్పిదంబుల నొనరించె
అమ్మ! ఇందిరమ్మ – అనువు దప్పె

ఆ : కాలదోషమొకటి – కర్మదోషము రెండు
గ్రహము పాటు మూడు – గల్గెగాక;
నిన్ను గెల్చువారు – నిఖిలలోకంబుల
రారు; లేరు – ఇందిరమ్మ నిజము.

గీ : జనతపార్టీ – యేతెంచెను – సంతసంబు:
శ్రీ మొరార్జి, దేశాయి, విశిష్టగుణుని
దీరవయని. ప్రధాన మంత్రిగ వరించె
లోకసభ, హర్లమొందిరి లోకజనులు.

గీ : జాతి, మత, కుల భేద ఈర్ష్యలు నశించి
దేశమందు హింసాకాండ నాశనంబు.
గాంచి, సోదరత్వము మేళవించి, మంచి
బెంచి, సాధుల రక్షించి, మించు సౌఖ్య
ములను సాధించి, జనతప్రభుత్వమెల్ల
వారి రక్షించి, పింగళ వత్సరమున
యశము జిందేడిగాపత: యహరహంబు.

గీ : బహగుణుండు జగ్ జీవన ప్రతిభ వరుడు
అతిరథులు, మహారథులు నీయండనున్న
వారు: మూరార్థి చేశాయి: మీరు ప్రజల
కిచ్చినట్టి వాగ్దానముల్, హెచ్చరిక తొ
పాలన మొనర్చి కాంగ్రెసువారి కంటె
మిన్నయనిపించు కొనుటయే మేలు: పింగ
శుండు మీబుద్ది కనిపెట్టి యుండు గాన
‘జనత ప్రభుత’ శోభిల్లచు – దనరవలయు

గీ : రాజు రవిగాన, ప్రభులలో – ప్రబలు వైర
ములు; బుధుడు మంత్రి – మరి సై న్యములను నడపు
గాన, పింగళమూర్తి యు – గన్ను విప్ప
చిచ్చుబడి, శత్రుమూక – నశింపకున్న?

చం : నవ, నవధాన్యముల్ వెలసి- నాణేమగా జలదంబు లెల్లడన్
నవిరళభంగిగాఁగురిసి, యుప్పల కూపతటాక జాలముల్
జవు లలరంగ నిండి, పశుజాలము, భూప్రజ సంతసింప, గా
రవమున పింగళాక్షు డపరాయన కీర్తినిఁ బొందగావలెన్

కం : పింగళమూర్తీ! భువిలో
మంగళముల్ గల్గ జేసి – మానితముగ, రా .
జ్యాంగము తిద్ది దీర్చుము
వెంగలివిత్తుగ జరింప – వృథయగు బ్రతుకున్

కం : జిలిబిలి పలుకుల గులుకుచు
తెలుగు కవిత – మంజులముగ – తేట దనమునన్
విలసిల్ల వలయు; శ్రీపిం
గళనామక వత్సరమున గల్గ శుభంబుల్

ఒం-శ్శాంతి-శ్శాంతి

———–

You may also like...