పేరు (ఆంగ్లం) | Kalluri Ahobalarao |
పేరు (తెలుగు) | కల్లూరు అహోబలరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | అశ్వత్థమ్మ |
తండ్రి పేరు | గూళూరు కృష్ణప్ప |
జీవిత భాగస్వామి పేరు | సీతమ్మ |
పుట్టినతేదీ | 6/1/1901 |
మరణం | – |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామం |
విద్యార్హతలు | యస్.యస్.ఎల్.సి, తెలుగులో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. |
వృత్తి | ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కుమార శతకము (1923), భరతమాతృ శతకము (1923), భావతరంగములు – ఖండికలు (1931), పూదోట – ఖండికలు (1951), భక్తమందారము – ద్విశతి (1958) ఉగాది స్వర్ణభారతి (1972), రాయలసీమ రచయితల చరిత్ర – 4 సంపుటాలు (1975-1986), శ్రీరామకర్ణామృతము (1980), శ్రీకృష్ణకర్ణామృతము, ఉగాది వజ్రభారతి గృహలక్ష్మి – కందపద్య త్రిశతి, పుష్పబాణ విలాసము, యామినీపూర్ణతిలక శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | హిందూపురంలోని రాయలకళాపరిషత్ పక్షాన శ్రీశారదాపీఠము వారు ‘కవిభూషణ’ బిరుదుతో సత్కరించింది. 1960లో కూడ్లీ శృంగేరీ జగద్గురు సచ్చిదానంద శంకర భారతీస్వామిచే ‘కవితిలక’ బిరుదు ప్రదానం. బరోడా మహారాజుచే బంగారు పతక ప్రదానం ఇంకా కవికోకిల, కవిశేఖర బిరుదులు లభించాయి. |
ఇతర వివరాలు | రాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన కల్లూరు అహోబలరావు స్వయంగా కవి. బహుగ్రంథకర్త. బళ్లారిలో పనిచేస్తున్నపుడు 1931లో ఘూళీకృష్ణమూర్తి, హెచ్.దేవదానముల సహకారంతో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కల్లూరు అహోబలరావు |
సంగ్రహ నమూనా రచన | సి : బంగారు రంగుల-రంగారు జివురుల సింగారముగఁ జెట్లు జేమ లల రె మంద మందంబుగ-మలయానిలంబులు కమ్మ కమ్మగ, వీవగా దొడంగె శుకపిక, శారికల్, మకముగా బాడుచు ప్రియముగా, వీనుల-విందొనర్చె వాసంత మన్మథుల్ – స్వాగత సుమ మాల లర్పింప వేచిరి – యాదరమున |
కల్లూరు అహోబలరావు
శ్రీ పింగళ మూర్తి
ఉగాది కానుక 20 -3 -1977
రచన:- కవిభూషణ కవితిలక కల్లూరు అహోబలరావు
సి : బంగారు రంగుల-రంగారు జివురుల
సింగారముగఁ జెట్లు జేమ లల రె
మంద మందంబుగ-మలయానిలంబులు
కమ్మ కమ్మగ, వీవగా దొడంగె
శుకపిక, శారికల్, మకముగా బాడుచు
ప్రియముగా, వీనుల-విందొనర్చె
వాసంత మన్మథుల్ – స్వాగత సుమ మాల
లర్పింప వేచిరి – యాదరమున
గీ : శ్రీ యుగాది, వేంచేసెను – శ్రీకరముగ
రమ్ము! పింగళమూర్తి ! రారమ్మవేగ
పిండి వంటల భుజియించి – ప్రీతితోడ
మంగళమ్ముల మాకు నొసంగు దేవ :
కం : గళమున, గరళముగల, పిం
గళమూర్తీ : శంకరాఘనా శంకర బె
బ్బులి చర్మాంబర ధారీ :
మలకొమరిత నేలినట్టి – మంగళమూర్తీ :
గీ : తీవ్ర రఘంరీఖూనిలంబును – దెచ్చిపెట్టి
భారతము , నల్లకల్లోల – పరచినావు
శ్రీ ప్రజాస్వామ్య వాదంబు – శ్రేయమంచు
బలికినాపు – పింగళమూరి వర్య! నేడు
ఆ : అలహబాదుకోర్టు – యానతి దప్పి, సు
ప్రీముకోర్టుకేగి – రీతిదప్పి
దప్పిగొంచు. తప్పిదంబుల నొనరించె
అమ్మ! ఇందిరమ్మ – అనువు దప్పె
ఆ : కాలదోషమొకటి – కర్మదోషము రెండు
గ్రహము పాటు మూడు – గల్గెగాక;
నిన్ను గెల్చువారు – నిఖిలలోకంబుల
రారు; లేరు – ఇందిరమ్మ నిజము.
గీ : జనతపార్టీ – యేతెంచెను – సంతసంబు:
శ్రీ మొరార్జి, దేశాయి, విశిష్టగుణుని
దీరవయని. ప్రధాన మంత్రిగ వరించె
లోకసభ, హర్లమొందిరి లోకజనులు.
గీ : జాతి, మత, కుల భేద ఈర్ష్యలు నశించి
దేశమందు హింసాకాండ నాశనంబు.
గాంచి, సోదరత్వము మేళవించి, మంచి
బెంచి, సాధుల రక్షించి, మించు సౌఖ్య
ములను సాధించి, జనతప్రభుత్వమెల్ల
వారి రక్షించి, పింగళ వత్సరమున
యశము జిందేడిగాపత: యహరహంబు.
గీ : బహగుణుండు జగ్ జీవన ప్రతిభ వరుడు
అతిరథులు, మహారథులు నీయండనున్న
వారు: మూరార్థి చేశాయి: మీరు ప్రజల
కిచ్చినట్టి వాగ్దానముల్, హెచ్చరిక తొ
పాలన మొనర్చి కాంగ్రెసువారి కంటె
మిన్నయనిపించు కొనుటయే మేలు: పింగ
శుండు మీబుద్ది కనిపెట్టి యుండు గాన
‘జనత ప్రభుత’ శోభిల్లచు – దనరవలయు
గీ : రాజు రవిగాన, ప్రభులలో – ప్రబలు వైర
ములు; బుధుడు మంత్రి – మరి సై న్యములను నడపు
గాన, పింగళమూర్తి యు – గన్ను విప్ప
చిచ్చుబడి, శత్రుమూక – నశింపకున్న?
చం : నవ, నవధాన్యముల్ వెలసి- నాణేమగా జలదంబు లెల్లడన్
నవిరళభంగిగాఁగురిసి, యుప్పల కూపతటాక జాలముల్
జవు లలరంగ నిండి, పశుజాలము, భూప్రజ సంతసింప, గా
రవమున పింగళాక్షు డపరాయన కీర్తినిఁ బొందగావలెన్
కం : పింగళమూర్తీ! భువిలో
మంగళముల్ గల్గ జేసి – మానితముగ, రా .
జ్యాంగము తిద్ది దీర్చుము
వెంగలివిత్తుగ జరింప – వృథయగు బ్రతుకున్
కం : జిలిబిలి పలుకుల గులుకుచు
తెలుగు కవిత – మంజులముగ – తేట దనమునన్
విలసిల్ల వలయు; శ్రీపిం
గళనామక వత్సరమున గల్గ శుభంబుల్
ఒం-శ్శాంతి-శ్శాంతి
———–