పేరు (ఆంగ్లం) | Tumaati Donappa |
పేరు (తెలుగు) | ఆచార్య తూమాటి దోణప్ప |
కలం పేరు | – |
తల్లిపేరు | తిమ్మక్క |
తండ్రి పేరు | సంజీవప్ప |
జీవిత భాగస్వామి పేరు | గోవిందమ్మ |
పుట్టినతేదీ | 7/1/19 26 |
మరణం | 9/6/1996 |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకట్ల గ్రామం |
విద్యార్హతలు | 1965లో ఆంద్ర విశ్వవిద్యాలయం నుంచి వైకృత పద స్వరూప నిరూపణం పై పరిశోధన చేసి పి హెచ్ .డి పట్టా పొందారు . |
వృత్తి | ఉపన్యాసకులుగా అధ్యాపక వృత్తిని ప్రారంభించి రీడర్ గా , ఆచార్యులుగా ఎదిగారు . |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము, భాషాచారిత్రక వ్యాసావళి, తెలుగులో కొత్తవెలుగులు, జానపద కళాసంపద, తెలుగు హరికథాసర్వస్వము, తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట, మన కళాప్రపూర్ణుల కవితారేఖలు, ఆకాశవాణి భాషితాలు, తెలుగు వ్యాకరణ వ్యాసాలు, ఆంధ్రుల అసలు కథ, బాలల శబ్ద రత్నాకరం, తెలుగు మాండలిక శబ్దకోశం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1965,1966లో వరుసగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి రఘుపతి వేంకటరత్నం నాయుడు స్వర్ణపతకాలు. తెలుగు హరికథాసర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి డి.లిట్. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తూమాటి దోణప్ప తెలుగులో కొన్ని జన నిరుక్తులు |
సంగ్రహ నమూనా రచన | లోకంలో మనిషిని పోలిన మనుషులు ఎందరో వుంటారు . ఒకరనుకుని వేరొకరిని పలకరిస్తాం . వారినించి మనం ఆశించిన రెస్పాన్స్ రాకపోతే తెల్లబోతాం . ఈ లోగా కొంత తేరుకుని జరిగిన పొరపాటును సర్దుకుని లాంఛనంగా క్షమాపణలు చెప్పుకుంటాం . దూరంగా వస్తున్న ఒక వ్యక్తి కొన్ని పోలికలను బట్టి మనకు తెలిసినతను అని ఊహించి నమస్కారం చెయ్యటానికి చెయ్యెత్తి , తీరా దగ్గరకు వచ్చే సరికి అతను అపరిచిత వ్యక్తి అని తెలిసి జరిగిన తప్పును సవరించుకోవటానికి నుదురు గోక్కుంటాం. ఇలాగా పరిచితా పరిచిత వ్యక్తులను సమానించటంలోనూ , లేక పూర్వ సంఘటలను జ్ఞప్తికి తెచ్చు కోవటంలోనూ ,వీటి పూర్వా పరాలను సమన్వయించటంలోనూ అనేకం జరుగుతూ వుంటాయి . |
తూమాటి దోణప్ప
తెలుగులో కొన్ని జన నిరుక్తులు
లోకంలో మనిషిని పోలిన మనుషులు ఎందరో వుంటారు . ఒకరనుకుని వేరొకరిని పలకరిస్తాం . వారినించి మనం ఆశించిన రెస్పాన్స్ రాకపోతే తెల్లబోతాం . ఈ లోగా కొంత తేరుకుని జరిగిన పొరపాటును సర్దుకుని లాంఛనంగా క్షమాపణలు చెప్పుకుంటాం . దూరంగా వస్తున్న ఒక వ్యక్తి కొన్ని పోలికలను బట్టి మనకు తెలిసినతను అని ఊహించి నమస్కారం చెయ్యటానికి చెయ్యెత్తి , తీరా దగ్గరకు వచ్చే సరికి అతను అపరిచిత వ్యక్తి అని తెలిసి జరిగిన తప్పును సవరించుకోవటానికి నుదురు గోక్కుంటాం. ఇలాగా పరిచితా పరిచిత వ్యక్తులను సమానించటంలోనూ , లేక పూర్వ సంఘటలను జ్ఞప్తికి తెచ్చు కోవటంలోనూ ,వీటి పూర్వా పరాలను సమన్వయించటంలోనూ అనేకం జరుగుతూ వుంటాయి . అస్పష్ట గ్రహణం , పూర్వ గ్రహణం అన్యమనస్కత వంటి స్మృతి పధంలో కొన్ని పొరపాట్లు వీటికి ముఖ్య కారణాలుగా పేర్కొన వచ్చు . ధారణా శక్తి తరిగినా అనవధానత పెరిగినా యిలాంటి తబ్బి బ్బులు ప్రహసనాలు , తార్మారు తమషాలూ తటస్థ పడుతూనే ఉంటాయి . భ్రాంతి మూలకంగా కలిగే యీ తడబాటు మానవుడి చేష్టలకే పరిమితం కాదు ; భావ ప్రకటనలో ప్రబల సాధనమయిన వాక్కుకు కూడా ప్రవర్తిస్తుంటుంది .
సమీపోచ్చారణమో , సదృశార్ద మో గల మాటల జంటలు ప్రతి భాషలోనూ ఉంటాయి . ఒకదానికొకటి తబ్బి బ్బుగా వాడటమూ , ఒకదాని వ్యుత్పత్తిని మరో డానికి అంట గట్టడమూ కొత్త కాదు . ఏదైనా ఒక భాషా రూపానికి కృత్రిమంగా కల్పించబడ్డ వ్యుత్పత్తి ననుసరించి సిద్ధించే రూపాంతర కరణాన్ని జన నిరుక్తి లేక లోక నిరుక్తి “ఫోక్ ఎటిమాలజీ “ అని శాస్త్రకారులు నిర్వహించారు . శాబ్దికంగా జరిగే తికమకలు కృతక హేతువులవుతాయి . వెరసి యీ రెండు రీతులను ప్రకృత పరిశీలనలో జన నిరుక్తి – ఫోక్ ఎటిమాలజీ – అని పేర్కొనటం జరిగింది . సవ్యమయిన చారిత్రక దృక్పధం కరవైతే , ధృడమైన శాస్త్ర జన్య పరిజ్ఞానం లోపిస్తే , పారం పరీణమైన సంప్రదాయం విచ్చిన మయితే భాషాపరంగా జరిగే రకరకాల భ్రమ ప్రమాదాలు అసందర్భపు ఉత్పత్తి నిర్ణయానికేలా దారి తీస్తాయో అవలోకిద్దాం .
ఉదాహరణకి ఇంగ్లీషులోని వోవర్హాల్ అన్న పదాన్ని తీసుకోండి . యంత్రాలను గానీ , యంత్ర భాగాలను గాని వోవర్హాల్ చేసేటప్పుడు ఆయిల్ ను పైపూతగానో , ప్రక్షాళన ద్రవంగానో వాడతారు . కాబట్టి వోవర్హాల్ పదం యొక్క వర్ణ క్రమంగాని , మౌలికార్ధం గాని తెలీని మెకానిక్కుల నోటిలో వోవరాయిల్ అనే పద బంధం వాడుకలోకి వచ్చింది . అలాగే శిక్షణా కాలంలో అభ్యర్ధుల కిచ్చే సాహాయ్యక భ్రుతి స్టయ్ పెండ్ ని స్టేఫండ్ గా భ్రమ పడి వ్యవహరించటం వృత్తి విద్యా సంస్థల అభ్యర్ధుల వ్యవహారంలో తరచు గమనించవచ్చు . అట్లే డెట్టాల్ ను డేట్టాయిల్ అనే వాడుక కూడా ఉంది .
దేశమంతటా కథగా చెప్పుకునే చెన్న పట్నంలోని బార్బర్సు బ్రిడ్జి నే చూడండి . క్ర్రస్తూ శకం పద్దెనిమిదో శతాబ్ది మధ్యలో ఇంగ్లిషు కుంఫిని వారి కొలువులో మిలటరీ ఇంజనీరుగా పని చేసిన యెన్సయిన్ జేమ్సు హామిల్టన్ దోర గారి పేర చెన్నపట్నం రాయ పేటలో యీ వారావది నిర్మించ బడ్డదని కర్ణా కర్ణిగా వింటున్నాం . హామిల్టన్ దోర గారి పేరు మద్రాసీయుల ఉచ్చారణలో ఆ మిల్టన్ గా మారింది . హామిల్టన్ బ్రిడ్జి వాడుకలో ఆమిల్టన్ బ్రిడ్జి అయింది . ఆ మిల్టన్ కు సమీపోచ్చారణ గల అమ్మట్టన్ లేక అంబట్టన్ పద సాదృశ్యంతో అంబట్టన్ బ్రిడ్జి గా తయారుయింది . అంబట్టన్ అంటే తమిళంలో క్షౌరకుడు అని అర్ధం . ప్రాకృతంలో అంబాట్ట – దీనికి సమీప మాతృక . సంస్కృతం లో ఇదే అర్ధం గల అంబష్ట శబ్దం వీటికి మూల మాతృక . అంబట్టన్ పదాన్ని ఆంగ్లీకరించి బ్రిడ్జి తో కలపగా బార్బర్స్ బ్రిడ్జి అని జనరుక్తి మూలంగా కొత్త అవతార మెత్తింది . పొద్ద స్తమానూ క్షౌరకు లక్కడ కూచుని క్షురకర్మ చేస్తూ వుండడం వల్ల దీనికీ పేరు సంక్రమించిందని ఒక విచిత్ర చరిత్రను దీని చుట్టూ అల్లటం చాలా తేలిక . ఈ బ్రిడ్జి మీదుగా పోయే రోడ్డును బార్బర్సు బ్రిడ్జి రోడ్డు అనీ , దీనిని సంక్షిప్తీ కరించి బి . బి . రోడ్డు అనీ వ్యవహరించే వారు . మొన్నటి దాకా చెన్నపట్నం సిటీ బస్సుల సైను బోర్డులపై బి .బి .రోడ్డు అని వుండేది . జరిగిన పొరబాటును పసికట్టిన తెలివిగల యీనాటి రవాణా శాఖాధికారులు బార్బర్స్ బ్రిడ్జి అనే వ్యవహారాన్ని తొలగించటానికి ప్రయత్నిస్తున్నారు .
తెలుగు లో ఈ మోస్తారుగా తయారయిన కొన్నింటి కథా కమామీషును అకారాద్యను క్రమంలో పరిశీలిద్దాం .
1 .అత్తెసరు :
అత్తలేని కోడలు ఉత్తమురాలు : కోడల్లేని అత్త గుణవంతురాలు , అత్తా కోడళ్ళ ఆరళ్ళు యీనాటివి కావు గదా 1 కొత్తగా అత్తింట కాలు పెట్టిన కోడలు పిల్ల భక్తి వల్లనో , భయం వల్లనో జాగర్తగా వండి వారుస్తుంది . కోడలు పిల్లకి యేదయినా యిబ్బందీ సబ్బండీ వస్తేనో , పురిటికో లేక పుణ్యానికో పుట్టింటికి వేం చేస్తేనో అత్తగారికి పొయ్యి మీద పడెయ్యక తప్పదు . సాధారణంగా కోడళ్ళు గడప తొక్కగానే అత్తగార్లు కొమ్మెక్కి కూచుంటారంటారు . ఇరుగమ్మలతో పోరుగమ్మలతో చేసే పెత్తనాలతో అత్తగారికి పురసత్తు ఉండదు . ఇక , పూజలూ పురాణ కాలక్షేపాలూ సరేసరి . పెద్దతనం మూలంగా వార్చడానికి ఓపిక కూడా ఉండదు . బద్దకానికి అలవాటు పడ్డ ప్రాణి గనక అత్త గారికి ఒళ్లు వంగదు . అలాగని ఆనాల్గుల మెతుకులూ కుతకుత మనిపించకా తప్పదు . ఆ మాత్రానికే అత్త గారికి అలసటా ఆపసోపాలూ , వార్చకుండా వండటానికి అత్తగారు పోసే యెసరు అత్త – ఎసరు = అత్తెసరు అయిందని జననిరుక్తి . కాని , వేసిన బియ్యానికీ , పోసిన నీటికీ సమ్మ సరిగ్గా అత్తిపోయేతట్లు పోసిన యెసరు అత్తెసరు . అత్తు – ఎసరు అని దీని సరైన విరుపు . అంతేగాని అత్త – ఎసరు అన్నట్లు అత్తగారు పెట్టె ఎసరు మట్టుకు కాదు . ఇప్పుడు అత్తగారేం ఖర్మ అందరూ అత్తెసళ్ళే పడేస్తున్నారు .
2 .అరవచాకిరి :
జీతం నాతం లేకుండా చేసే గొడ్డు చాకిరీని “ అరవ చాకీరి “ అని అంటూంటారు . అరవలు అంటే తమిళులు . కష్టపడి పని చెయ్యడానికి అరవ వాళ్లు ఎప్పుడూ ముందుంటారు . పోచికోలు కబుర్లుతో పొద్దు బుచ్చటానికి మరి కొందరు ముందుంటారు . అరవలంటే హేళనగా చూసేవారు దీనికి అరవ వాళ్ల చాకీరి అని అర్ధం చెప్తారు . వాస్తవంగా ఇది అరువు చాకీరి . అంటే వెట్టి చాకీరి లేక యెప్పుడో జీతం ఇచ్చే షరతు మీద చేసే సేవ అని అర్ధం . అరువు శుద్ధ దేశ్య పదం . సేవ అనే అర్ధం గల ‘ చాకర్ ‘ అనే అన్య దేశ్యం నించి ‘చాకీరి ‘ వచ్చింది . కొంత కాలం గడిస్తే అరవకుండా , నోరెత్తకుండా చేసే చాకీరి అనే వ్యుత్పత్తి కూడా కల్పిస్తారేమో !.
3 . ఆకాశ రామన్న :
అజ్ఞాత వ్యక్తి కృతాలయిన రాతలను ఆకాశ రామన్న అర్జీలు , ఆకాశరామన్న ఉత్తరాలూ అని అనటం అందరికీ తెలిసిందే . అనంత రామ , అభిరామ , అయోధ్యారామ , ఇక్ష్వాకు రామ , కళ్యాణ రామ , కాకుత్థ్స రామ , కాశీరామ , కోదండరామ , కోసల రామ , గంగారామ , జయ రామ , జానకీ రామ , దశరధ రామ , పట్టాభిరామ , బుచ్చిరామ , భద్రాద్రి రామ , రఘురామ , రాఘవ రామ , వెంకట రామ , శివ రామ , శ్రీరామ , సాకేత రాం , సీతా రామ , సుందర రామ , సుబ్బ రామ , సేతు రామ , హరేరామ ప్రభ్రుతి వ్యక్తి నామాల్లోని రామ శబ్దం ప్రాచుర్యం వల్ల ఈ ఆకాశరామన్న అవతరించాడు . అయితే ఆకాశరామన్న యందలి రాం ఆ శబ్దానికీ రఘుకుల స్వామి అయిన శ్రీరామునకూ ఎలాంటి సాటువా లేదు . ఆకాశ రామ్న – అన్న పద బంధమే జననిరుక్తి మూలంగా ఆకాశ రామన్నగా మారిపోయింది . ఆకాశ రామ్న అంటే ఆకాశం పేరుత వాడు అని భావం . ఆకాశ సుమం , ఆకాశ పంచాంగం మొదలగు సమస్త పదాల్లో ఆకాశ శబ్దానికి అభావమని అర్ధం . “ ఆకాశం గగనం శూన్యం “ అని కడ పేర్కొంటూ వుంటారు . శూన్య వ్యక్తి కాబట్టి అనామకుడూ , ఆకాశమానకుడూ అని మౌలికార్ధం .
4 . ఆరుబత్తుల కంపెని :
సమష్టి కృషీ , సమన్వయ దృష్టీ లేని సంస్థనూ , దివాళాకోరూ వ్యాపారాలను ఆరు బత్తుల కంపెనీ అని అనటం సాగరాంధ్రంలో సాధారణమైన పలుకుబడి . కమసాలి బత్తుడు , కరణ బత్తుడు , కాసీ బత్తుడు , గాజుల బత్తుడు , చర్మ బత్తుడు వడ బత్తుడు – హస్త కళలలో పేరు పొందిన ఈ ఆరు తెగల వారిని ఆరు బత్తులని కొందరు పేర్కొంటారు . పండితుణ్ణి చూస్తే పండితుడికి గీర , శిల్పిని చూస్తే శిల్పికి గుర్రు . అందువల్ల వీరిలోవీరికి బొత్తిగా పడదనీ , వీరు కలిసి తల పెట్టిన పనియేదీ సవ్యంగా కొనసాగక నడమంత్రంగా ఆగిపోతుందనీ లోకంలో ఒక అపప్రధ . కాని ఆర్బత్ నాట్ కంపెనీ పందొమ్మిదో శతాబ్ది మొదట్లో మద్రాసు కోస్తాలో వెలసిన గొప్ప వ్యాపార సంస్థ . దీని అధిపతి జార్జి అర్బత్ నాట్ . ఈ సంస్థ కోస్తా ప్రాంతంలో నీలి మందు వ్యాపారం , ప్రొప్రయిటరీ ఎస్టేట్లు నిర్వహణం వంటి గొప్ప పథకాల్ని భారీ పెట్టుబడులతో చేపట్టి , కోట్ల కలదిగా వ్యాపారం చేసి , నిర్వాహకుల అసమర్ధత వల్లనూ , ఆర్ధిక సంక్షోభం వల్లనూ , దిక్కూ దివాణం లేకుండా దివాలా తీసింది . ఈ కంపెనీ నాటి వృత్తాంతాలను వింతలుగా పాటలు కట్టి పాడుకోవటం కోస్తా జిల్లాల్లో ఇటీవల దాకా ఉండేది . కళింగాంధ్ర లోని శత వృద్ధులకి వింతలు నేటికీ లీలగా గుర్తున్నాయి . ఈ శృతి స్మృతులే ఆరు బత్తుల కంపెనీకి రూపకల్పన చేశాయి . అంతే గాని ఆరుగురు బత్తులు కలిసి కంపెనీ ఏదీ పెట్టనూ లేదు , అది దివాళా తియ్యనూ లేదు .
5. చక్రకేళీ :
చక్రంగా గుండ్రంగా ఉండే అరటి పండు అని వ్యుత్పత్తి చెప్తారు . కేలా , కేళీ అంటే నవీనౌత్తరహ భాషలలో అరటి పండు అని అర్ధం . ప్రాకృతాలలోని కయలీ వీటికి సమీప మాతృక , సంస్కృతంలోని కదళీ శబ్దం వీటన్నిటికీ అసలు మూలం . శర్కర వంటి తీపి గల అరటి పండు శర్కరాకదల్ . ప్రాకృతంలో సక్కరా కయలీ , తెలుగులో చక్కెర కేళీ కావాలి . వర్ణ వ్యత్యయం వల్ల చక్కెర కేళీ చక్ర కేళీ అయి చక్ర సంబంధాన్ని సూచించే భ్రమకు మూలమయింది .
6 . చక్రాలు :
ఇలాగే చక్కిలాలను కొందరు చక్రాలు , పాంచక్రాలు అని అంటారు . గుండ్రంగా ఉంటాయే తప్ప ఇవి చక్ర సంబంధులు కావు . చక్కిలములు అనే పూర్వ రూపం చక్కిలాలు అయింది . ప్రాకృతంలోని సక్కుల , సంస్కృతం లోని శష్కుల – దీనికి మాతృకలు .
———–