మీసరగండ విశ్వరూపాచారి (Meesaraganda Viswarupachary)

Share
పేరు (ఆంగ్లం)Meesaraganda Viswarupachary
పేరు (తెలుగు)మీసరగండ విశ్వరూపాచారి
కలం పేరువిద్వాన్ విశ్వం
తల్లిపేరు
తండ్రి పేరుమీసరగండ మునిరామాచార్యులు
జీవిత భాగస్వామి పేరుపద్మ
పుట్టినతేదీ10/21/1915
మరణం10/19/1987
పుట్టిన ఊరుతరిమెల, అనంతపురం జిల్లా
విద్యార్హతలుమద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టాపుచ్చుకున్నాడు.
వృత్తిసంపాదకుడు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిరికన్నె (కావ్యం), ఆత్మసాక్షి (కవిత్వం), ప్రేమించేను(నవల), పెన్నేటిపాట (కావ్యం), ఒకనాడు(కావ్యం), నాహృదయం (కావ్యం), పాపం,రాతలూ గీతలూ సమీక్ష, లెనిన్, స్టాలిన్, స్వతంత్రం, మహాశిల్పి, మహాసంకల్పం, అదీ రష్యా, స్వతంత్రం ఏం చేయటం, ఫాసిజం దాని ధ్వంసం, రష్యా యుద్ధకవులు, రానున్న సంక్షోభం, సత్యభామ, ప్రథమ ప్రేమ, ధర్మదుర్గం, పొద్దుతిరిగింది, స్వస్తిశ్రీ, కచదేవయాని, ద్వేషం, దురాక్రమణ, ఇరాన్, ఇండియా,
విక్రమోర్వశీయము (రేడియో నాటకము), నాగానందము (రేడియో నాటకము), యుద్ధం మాకొద్దు (రేడియో నాటకము), ఏమి చెయ్యడం?

అనువాద రచనలు : కథాసరిత్సాగరం కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
కాదంబరి (బాణుడు), కిరాతార్జునీయం (భారవి), దశకుమారచరిత్ర (దండి), మేఘసందేశం (కాళిదాసు), రఘువంశము (కాళిదాసు), కుమార సంభవము (కాళిదాసు), శిశుపాలవధ (మాఘుడు), రాజతరంగిణి (కల్హణుడు), మానవుడు (రోమారోలా నవల), నేటి భారతదేశం (రజనీ పామీదత్), ఫాసిజం, భూమి (ఓప్లే హార్డీ నవల), వీడ్కోలు, కర్ణకుంతి, సతి, ముక్తకములు, చేకోవ్ కథలు : గోర్కీ కథలు, శిశు హృదయము, శిశు రహస్యము, యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు
బిల్హణీయము, తెలుగు అధర్వ వేదసంహిత, పూలచెట్లు, రష్యా యుద్ధకథలు, పేదరాలు (కథాసంకలనం), విలాసిని (కథల సంపుటి), ప్రజావిరోధి (నాటకము
*****************
నిర్వహించిన శీర్షికలు: విశ్వభావన – శ్రీసాధన పత్రిక 1938-1939, తెలుపు-నలుపు – ఆంధ్రప్రభ వారపత్రిక 1952-1959, అవీ-ఇవీ – ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959, ఇవ్వాళ – ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962, టీకా-టిప్పణి – ఆంధ్రజ్యోతి దినపత్రిక, మాణిక్యవీణ – ఆంధ్రప్రభ దినపత్రిక 1962-1966 , ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమీసరగండ విశ్వరూపాచారి
పెన్నేటి పాట
సంగ్రహ నమూనా రచనకలమ పాలకుల యాలల మేలి పాటల
జుమ్మని మ్రోయుని మించుల సితార ;
తెనుగు పెద్దన్నల గోనబు పల్కుల గుబా
ళించిన జాబి మల్లెల గుడారు :
జిలుగు జరీబుతా వలువ సింగారింపు
మెలకువ లూర్చు నిగ్గుల కొఠారు ;
తలకు మించిన సత్యముల లోతులను జీల్చు
చును వోవు తెల్వి యంచుల కఠారు ;

మీసరగండ విశ్వరూపాచారి
పెన్నేటి పాట

కలమ పాలకుల యాలల మేలి పాటల
జుమ్మని మ్రోయుని మించుల సితార ;
తెనుగు పెద్దన్నల గోనబు పల్కుల గుబా
ళించిన జాబి మల్లెల గుడారు :
జిలుగు జరీబుతా వలువ సింగారింపు
మెలకువ లూర్చు నిగ్గుల కొఠారు ;
తలకు మించిన సత్యముల లోతులను జీల్చు
చును వోవు తెల్వి యంచుల కఠారు ;

కడిది మొనగాని
ఎడద చిక్కనకు పేరు ;
కటిక ఱాలను కవ్వించి ,
గజ్జకట్టి ,
చిందు ద్రొక్కించు
మాయల జిలుగు తేరు
కలదు
రాయలసీమ పచ్చల బజారు
అచట నొకనాడు పండె
ముత్యాల చాలు ;
అట నొకప్పుడు నిండె
కావ్యాల జాలు ;
అచ్చట నొకప్డు కురిసె
భాష్యాల జల్లు ;
విరిసె నట నాడు
వేయించు విచ్చుకత్తి .
ఇది గతించిన కథ ;
వినిపింతు నింక
నేటి రాయలసీమ
కన్నీటి పాట
కోటి గొంతుల
కిన్నెర మీటుకొనుచు
కోటి గుండెల
కంజరి కొట్టుకొనుచు.
అదే పెన్న ! అదే పెన్న
నిదానించి నడు !
విదారించు నెదన్ , వట్టి
ఎడారి తమ్ముడు !
ఎదీ పెన్న ? ఎదీ పెన్న ?
ఎదీ పినాకినీ ?
ఇదే పెన్న ! ఇదే పెన్న ?
ఇదే పినాకిని !
ఎదీ నీరు ? ఎదీ హోరు ?
ఎదీ నీటి జాలు ?
ఇదే నీరు ! ఇదే హోరు !
ఇదే ఇసుక వాలు !
అదే పెన్న ! అదే పెన్న
నిదానించి నాడు !
విదారించు నెదన్ , వట్టి
ఎడారి తమ్ముడు !
పార చేబట్టుకొని
వంగి చీరు దనుక ,
ఇసుక పాతర లోతుల
కేగు దనుక ,
నీకు కన్పించదీయేటి
నీటి చుక్క !
కుండపోతల వానలు
గుఱియ నేమి ?
పట్టుమని పదినాళ్ళలో
పారబోసి ,
ఇసుక బొక్కసమున
మిగులెల్ల దాచి ,
పెన్న పడుకొను
నీ నేల దిన్నె మీద !

చిటపట వానలకే ,ఒ
క్కట నోరుం దెఱచి, నురుగు గ్రక్కుకొనుచు , ను
త్కటమై , దరు లొఱసి, రటత్
కటు ప్రవాహముల నింగికై పరువెత్తున్

జఠర లుఠ ఝ్ఝషమై ,క
ర్మ టులై దరి జేరు జీవరాశుల మ్రింగున్ ,
హఠ మెంతని ! ఇది చేయని
హఠాత్ కఠోర క్రియా విహారము కలదా !

కాని , ఈ ఏటి నీటిలో
కమ్మదనము లూరచుండును ,
దోసిట నొక్కమారు
పుక్కిలించిన జాలు
ణీ పుట్టువునకు ,
సార్ధకత్వమ్ము
నిష్కల్మషత్వ మబ్బు !

గుండె జలదరింపజేయు ;
రండతనము డుల్చివేయు .
ఖండిత వాడినిజేయును
దండి తల్లి సుమ్మీ నది !

కండలేక ఎండిపోయి
బెండు వారినా సరే !
తిండి లేక , తుండు లేక
పండవారినా సరే !
నిండు మనసు , నిజాయితీ,
పండు వయసు , పట్టుదలా ,
దండి చేయి , ధర్మ దీక్ష
పండించును గుండెలలో
రండు రండు ! చేతు లెత్తి
దండము తల్లీ యని , కై
దండల దండలతో , నీ
రెండ నిలిచి కొలిచి పొండు !

ఇంత మంచి పెన్న తల్లి
ఎందు కెండి పోయెనో ?
ఇంత మంచి కన్న తల్లి
ఎందు కిట్లు మారెనో ?

వంతలతో , చింతలతో
కంతలువడి పోయెనో !
సంతుకోస మేడ్చి ఏడ్చి ,
గొంతు కారిపోయేనో !
ఇంత మంచి పెన్న తల్లి
ఎందు కిట్లు మారెనో ?
ఇంత మంచి కన్నతల్లి
ఎందు కెండి పోయెనో ?

———–

You may also like...