పేరు (ఆంగ్లం) | Ratnakaram Appappa Kavi |
పేరు (తెలుగు) | రత్నాకరం అప్పప్ప కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | శేషమాంబ |
తండ్రి పేరు | ఆంజనేయార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1827 |
మరణం | 1/1899 |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా, పెనుకొండ తా కొత్త చెరువు గ్రామము |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సౌగంధికా ప్రసూన సంగ్రహము, శశిరేఖా పరిణయము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రత్నాకరం అప్పప్పకవి |
సంగ్రహ నమూనా రచన | కవిత్వము చెప్పుటలో భట్రాజులు పేరెన్నికగన్నవారే ఈ భట్రాజులలో రత్నాకరంవారు ప్రసిద్ధులు. వీరనేక సంస్థానాధీశ్వరుల వద్ద కవులుగా మెలగిరి వసుచరిత్ర కర్త, భట్టమూర్తి, ఈ కులజుడే వీరి ఇంటిపేరు. ప్రబంధాంకము వారు భట్టుమూర్తికి పూర్వమే ఒక ” చిత్ర కవిత్వ రచనాచమత్కార రత్నా కరుడుండెనని శ్రీ ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంద్ర సాహిత్యమునందు వ్రాసిరి . |
రత్నాకరం అప్పప్పకవి
కవిత్వము చెప్పుటలో భట్రాజులు పేరెన్నికగన్నవారే ఈ భట్రాజులలో రత్నాకరంవారు ప్రసిద్ధులు. వీరనేక సంస్థానాధీశ్వరుల వద్ద కవులుగా మెలగిరి వసుచరిత్ర కర్త, భట్టమూర్తి, ఈ కులజుడే వీరి ఇంటిపేరు. ప్రబంధాంకము వారు భట్టుమూర్తికి పూర్వమే ఒక ” చిత్ర కవిత్వ రచనాచమత్కార రత్నా కరుడుండెనని శ్రీ ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంద్ర సాహిత్యమునందు వ్రాసిరి . అతని పేరు రత్నాకరం గోపాలరాజు ఇతని తండ్రి కృష్ణమ రాజు ఈతని కాలమునుండియో, అంతకు పూర్వము మండియో ఈ వంశము వారికి ‘రత్నాకరం’ వారను ఇంటి పేరు వచ్చినదవిరి ఈ రత్నాకరం గోపాలరాజును శ్రీ రావెళ్ళ లింగవ్వ నాయకుడు పోషించెను ఈ కవి కాల మిద మిత్తమని నిర్ణయింపబడలేదు.
గోపాలరాజు ప్రౌడకవి ఈతడు భాగవత దశమస్కంధమును సౌగంధికా కుసుమ ప్రసవాపహరణము అను రెండు ద్విపద కావ్యములను రచించిరి అవి ఆముద్రితములు మొదటి దానిని మదన గోపాలస్వామికి రెండవది రావెళ్ళ లింగమనాయకునకు అంకితమిచ్చెను. గోపాలరాజు చక్కని లాక్షణికుడు ” సకల లక్షణసార సంగ్రహము’ అనబడు ఛందో గ్రంథమును గూడా ఈయన రచించెను అది కూడా అముద్రితమే ఈ ప్రతి కాకినాడ ఆంధసాహిత్య పరిషత్తు కార్యాలయమందు కలదని శ్రీ ఆరుద్రగారు వ్రాసిరి 1949 లో శ్రీ వావిళ్ళ కంపెనీనారు వీరి సౌగంధికా కుసుమ ప్రసవాపహరణము’ ను ముద్రించిరి .
పై ద్విపద కావ్యమునే వీరియనంతరము, ఈ రత్నాకర వంశీయుడైన రత్నాకరం అప్పప్పకవి దీనివి సౌగంధికా ప్రసూన సంగ్రహము అనుపేర ప్రబంధ కావ్యముగా మార్చి వ్రాసిరి ఇది అముద్రితము. వ్రాత ప్రతి ఎచ్చటనున్నదో తెలియదు. అప్పప్పకవి గోపాలరాజు తన వంశకర్తగా ఈ కావ్యమునందు చెప్పకొన్నాడు . కాని ఈ విషయ మితర కృతులందు ఎలనో చెప్పకొనలేదు.
అప్పప్పకవిగారి శశిరేఖా పరిణయము (3 ఆశ్వాసములు) సంగమేశ్వర విలాసములు ముద్రితములు. శశిరేఖా పరిణయమును శ్రీ వావిళ్ళ కంపెనీవారు ముద్రించుట ముదావహము రామదాసు చరిత్ర వీరి మరొక అముద్రిత కృతి.
ప్రబంధలక్షణములు సంపూర్ణముగా గల ఈ కావ్యమందు ఇంద్ర ప్రస్థపర వర్ణన ఇట్లన్నది.
శా : ఇంద్ర గ్రావ వితోన్న తామిత మణీ , హేరా ళ సోపాన భా
ర్చంద్ర ప్రస్తర వేదికా వికరమై , సౌధా గ్రభా గ్యో న్న , మ
త్సాంద్ర ద్యోతిక కేత నాంబర , మరుత్పం పీడితాం భోదమై
ఇంద్ర ప్రస్థ పురంబు భాసిలె మహా హేమో జ్వలాగారమై
శరేఖా పరిణయ పట్టమున ఘటోత్కచుడు జరిపిన వీరోచిత భయంకరి కృత్యములకు లక్ష్మణ కుమారుడు ఆదారి పడినాడు . అతని ఆందోళన నిట్లు కవిగారు వర్ణించిరి.
సీ: మది భయంకరమైన వదన గహ్వరమొప్పు
దంష్ట్రాద్వయంబుతో దయ్యమిపుడు
నేలెంచె మీమొగమేమి చూచెదరింక
మాటు కేగెదనన్న మార్గమిడరు
ఇంకెన్నటికి బెండ్లి నేనొల్ల మీయాన
యీ గండ మొకిటి యీ దేర్చరయ్య
నీలాంబరడు మిము నెరనమ్మి నిలువగా
దరమె, దయ్యము వెంట దగివినపుడు.
తే|| పదపదండని మూపులు పట్టి త్రోచి
బెబ్బురింపచు జనులెల్ల భీతి బొంద
దండ్రులందఱు దిగులొంది తత్పరింప
లలన బృందంబులో దూరె లక్ష్మణుండు
వీరి రచన కొన్ని చోట్ల దీర్ఘ సమాసముల చేతను మరికొన్ని చోట్ల లలిత పదముల తోడను సాగినది. వీరి ఇతర ఆముద్రిత రచనలు లభించలేదు. ఈ కవిగారు గోపాలరాజు గారి ద్విపద కావ్యమును పద్య ముగా మార్చెనందురు. ఇతడు 1899 లో దివంగతుడయ్యెను.
రాయలసీమ రచయితల నుండి…
———–